2, నవంబర్ 2016, బుధవారం

Interent telugu magazine for month of 11/2016/41

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

సర్వేజనా సుఖినోభవంతు


*ఈ  నాటి నా పాట "ఈ కళ్ళు"

ఈ కళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి
అనుభూతి స్పర్సకై ఎలా వేచి ఉండాలి

నిశబ్ద విశ్రాంతి ఇంకా ఎన్నాళ్ళు  
చీకటిని తరిమి వెలుగును చూసే
ఈ ఆనందభాష్పాలు ఇంకా ఎన్నాళ్ళు

నా మౌనమే నాకు నేస్తమై
నా హృదయ వేదనకు నాదమై
నా ఆక్రందనకు శబ్దమై 
నా ఆలోచనకు విషాదమే నాకు తోడై

ఈ కళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి
అనుభూతి స్పర్సకై ఎలా వేచి ఉండాలి

నిరాశ నిస్పృహల మద్య
నలిగి, మరువలేని జ్ఞాపకాల మధ్య
ఓటమిని భరించలేని క్షణాల మధ్య
అలుపెరగని నింగి నేల మధ్య

చీకటిలో మెరిసి మిణుగురు పురుగులా
దేవుడి  గుడిలో కొడికట్టే దీపంలా
వయసు ఉడికిన ప్రాణిలా
క్షణమొక యుగముగా కాలా
తీతముగా వేచిఉన్నా నీకోసం

ఈ కళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి
అనుభూతి స్పర్సకై ఎలా వేచి ఉండాలి

గతాన్నిమరువలేక
గుండెలో కోరిక ఎవరికీ చెప్పుకోలేక
ఇక వెలుగును చూడ లేక
ఈ కళ్లు శాశ్వితముగా మూత బడ లేక
చీకటిలో వెతుకు తున్న ఈ  కళ్ళు 

ఈ కళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి
అనుభూతి స్పర్సకై ఎలా వేచి ఉండాలి
  --((*))--

 ఓం శ్రీ రామ్   -  శ్రీ మాత్రేనమ:

 సర్వే జానా సుఖినోభవంతు

సత్య పలుకు ధీమ - పున్నమీ వెన్నెలే 
నిత్య మలుపు - వలపు విరహ మేగ
పత్యము వలదే - నిదానమే  సన్నిదే
వ్యత్యాసమును చూపకే 

రాజు వలచినాడు - రాజనీతీ ఇదీ 
రాజి అనక - తనువు తపన సేవ 
జాజి మగువ నవ్వు - ఆర్పనే తప్పదే 
భాజ మోతలు సందడీ  

ముద్దు నళిని దేహ - మాధురీ గంధమే 
వద్దు అనక  సద్దు -చేయుటే కోమలం 
హద్దు సబబు కాదు - చల్లగా  మెల్లగా 
సద్దు కొనుట జీవితం 

కళ్ళు తెరిచినాను -  పాటలే మాటలే 
వళ్ళు మరచి నాను - సందడే సందడే 
కుళ్ళు తరిమి నాను - అప్పుడే అప్పుడే
పళ్ళ రుచిని పొందటం   

 సందె వెలుగులోనే - జిల్లాగా మెల్లగా 
మంద పవన - మందు మనసు నిండా
కుండా కుసుమరాశి - కోమల్ గంధమే 
ముందు యోగము తమ్మి జూపు 

రేయి కడుపు చీకటీ - మొహాన్ని సుధా 
మయి మధుర వలపు- తలపు రేయి
రేయి పగలు రాగ -రంజనీ రాగిణీ    
 స్థాయి మనసు సంతసం  
    
 

ఉత్పలమాల (తనువు )

చల్లని గాలికే మనసు విచ్చి సువాసన పంచి రాగమే
మెల్లగ మత్తుగా వలపుగా మదిలో రసజల్లు ఊరినే
తాళము తీయగా తనువు నిప్పుగ ఆకలి సంతసం కదా
మాలను వెయ్యటం మనసు విప్పిన పుష్పము కోరె ప్రేమతో        

ఒక్కటి కాదులే పరుగులాంటి వసంతము వచ్చెఇప్పుడే
చిక్కటి చీకటి తెరచి చూసినా కళ్ళకు వెల్గులే కదా
మక్కువ కొద్దిగా ప్రకృతి నీ సమతుల్యముగానె ఉంచునే
ఎక్కస చూపకా ప్రేమలు పంచుకొ నీ మనసైన వానితో          

భర్తకు  ప్రేమలో మనుగడె పరువం అణువంత పంచునే 
భార్యకు సంతసం వనములో సుముఖం మధురం ససేవయే
ప్రేరణ ఇద్దరూ మనసుతో అనురాగ మయంగ ఉండునే 
 తరణి హత్తుకొ సుఖమయం నవరాగముగానె ప్రేమలూ                 
2. ఆద్యాత్మికం 

విశ్వము నందునే చరిత గాంచిన భారతి ముద్దు బిడ్డడే 
 భార్యను కాళిగా పరమహంసయు కొల్చిన కర్మ భూమియే 
భావము రాగమై మనసు మందిరమై నవపారి జాతమే 
 వాసి కెక్కిన మేరునగరం పులకించగ కంజలింతునా 

హైందవ సంకృతి విభవ వైభవ గూర్చిన వేద విశ్వమై
నిశ్చల యోగమై సమయ భావము తేజము నిష్ఠయున్ సుమా 
విద్యయు ప్రాణమై వినయ తల్లిని వేడుకొనే అనంతుడై 
లోకము కోసమే చరిత్ర చెప్పిన మానవ నేత్రుడే కదా 

పుట్టుక సత్యమే కనికరం దయ జూపుట సర్వ ప్రజ్ఞయే 
బుద్ధియే   సర్వమై శరణు కోరిన వారిని ఆదు కోవటం 
 శాంతము ఉండుటే మనసు  నిబ్బరమే మమతానురాగమే
స్పర్శల ప్రేమలే మనకు ఆశలు మార్గము తెల్పలేవులే 

పచ్చని పంటలే మనకు సంపద పుత్తడి ప్రాణమే కదా 
దేహము శ్రమకే లయను భాష్యము భాద్యత తెల్పునే కదా 
వర్షపు జల్లులే నదుల నీటిని త్రాగుట సత్యమే కదా
        అంతట నిండిన ప్రధమ గాలులు ప్రాణుల జీవితం కదా 

ఇది నా మొదటి ప్రయత్నము తప్పులు తెలుపగలరు 


నన్నెచోడుని పద్యశిల్పం.!..
(శ్రీ.కామేశ్వర రావు భైరవభట్ల )
నన్నెచోడుడు అనే రాజకవి వ్రాసిన "కుమారసంభవం"ఈ కావ్యంలో
నన్ను బాగా ఆకట్టుకొన్న ఒక మంచి పద్యాన్ని గురించి యిప్పుడు ముచ్చటించుకుందాం.
.
"పవడంపులతమీద ప్రాలేయపటలంబు
బర్వెనా మెయినిండ భస్మమలది
లాలితంబగు కల్పలత పల్లవించెనా
గమనీయ ధాతువస్త్రములు గట్టి
మాధవీలత కళిమాలికల్ ముసరెనా
రమణ రుద్రాక్షహారములు వెట్టి
వర హేమలతికపై బురినెమ్మి యూగెనా
సన్నుతమగు నెఱిజడలు బూని"
.
తపస్సు చేస్తున్న పార్వతీదేవి వర్ణన యిది. ప్రాలేయము అంటే మంచు. మంచు బిందువులతో మెరిసే పగడపుతీగవలె ఉన్నదామె. ఎందుకు?
ఆమె మేను సహజమైన కెంపుదనంతో పగడపుతీగలా ఉంది. దానిమీద తెల్లని బూడిద పూసుకుంది. అందుకు. అలాగే లలితమైన కల్పలత
(పారిజాతపు తీగ) చిగురించినట్లుగా ఉంది
, ఆమె అందమైన కాషాయి వస్త్రాలను కట్టుకొంటే. మాధవీలత చుట్టూ నల్లని తేనెటీగలు మూగినట్లుగా ఉన్నాయామె ఒంటిపై చుట్టుకున్న రుద్రాక్షహారాలు.
జడలుగట్టిన ఆమె నెఱికుఱులను చూస్తే అందమైన బంగారు సంపెంగ తీగపై, విప్పారిన నెమలి పురి ఊగుతున్నట్లుంది. మామూలుగా అయితే జడ నల్లని కాంతులతో నిగనిగలాడుతూ ఉంటుంది. కాని తపోదీక్షలో, సంరక్షణ లేక ఆమె కురులు బిరుసెక్కి ఎఱ్ఱెఱ్ఱని రంగులోకి మారాయి. అందుకూ నెమలి పురితో పోలిక. ఇవన్నీ చాలా అందమైన పోలికలు. అన్నీ ప్రకృతినుంచి తీసుకున్నవే. పార్వతి ప్రకృతి స్వరూపమే కదా మరి!
పైగా నాలుగుపోలికలలోనూ మనకి కనిపించేది తీగే. ఆమె శరీరం తపస్సుకి ఎంతగా కృశించిపోయిందో, అయినా తన సహజ సౌందర్యంతో ఎలా శోభిస్తోందో, ఈ పోలిక వల్ల చాలా చక్కగా ధ్వనిస్తోంది. ఇంతటితో ఆగిపోతే ఇదేమంత పెద్ద గోప్ప వర్ణన అని చెప్పలేం.
ఎత్తుగీతితో యీ వర్ణన స్థాయిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళాడు నన్నెచోడుడు.
--((*))--

"శివానంద లహరి" లో అంకోలం / అయస్కాంత చెట్టు ప్రస్తావన ;-

అంకోలం తరువు ను తెలుగులో ఊడుగ చెట్టు అని పిలుస్తున్నారు.
అంకోల పాదపం గురించిన ప్రస్తావన "శివానంద లహరి" లో వక్కాణం ఐనది.

అంకోలం నిజ బీజ సంతతిః – అయస్కాంతో ఫలం సూచికా |
సాధ్వీ నైజ విభుం, లతాక్షతిరూహం, సింధుస్సరి ద్వల్లభమ్|
ప్రాప్నోతీహ యధా తధా పశుపతేః పాదారవిందద్వయమ్|
చేతోవృత్తిః రూప్యేత్యతిష్ఠతి సదా సా భక్తిరుచ్యతే||
;
అమోఘ ప్రతిభాశాలి శ్రీ ఆది శంకరాచార్య రచించిన “శివానంద లహరి” లోని
61 వ శ్లోకం ఇది. అంకోలం విత్తనములు తన మాతృ వృక్షమునకు అతుక్కుంటాయి.
ఆ వృక్షమునకు గల ఇనుము వంటి గుణము కల
ఆ చెట్టు ముళ్ళకు అయస్కాంతము పట్ల ఆకర్షిత గుణమును కలిగి ఉన్నాయి
లతలు/ తీగ- పాదపము యొక్క మ్రాను చుట్టూతా పెనవేసుకుంటుంది.
నది సముద్రములో కలుస్తుంది.
పశుపతి నాధుని, మహేశుని చరణ పద్మములకు
భక్తి భావనలు లీనమౌతాయి.” అంటూ
శ్రీ కంచి పీఠాధిపతి ఈ మహత్తర శ్లోకానికి వివరణను ఇచ్చారు.
--((*))--

ఇది ఒక భోజుడి కలం లో జరిగిన పాతకధ చదవండి (ఈ కధ సేకరణ అంతర్ జాలం )
ఒకనాడు భోజుడి ఆస్థానానికి కవిశేఖరుడు అనే కవి వచ్చాడు.రాజు కవిజన పక్షపాతి అయినా,ద్వారపాలకులు
కావాలని లేదు గదా! రాజ దర్శనం చెయ్యటానికి వీల్లేదు పొమ్మని గెంటి వేశారు. కొంతసేపు ఘర్షణ
జరిగిన తర్వాత,రాజసభలోకి వెళుతున్న మరో పండితుడి సహాయంతో రాజాస్థానం లోకి చేరుకోగలిగాడు.
అందుకే వస్తూనే నవ్వుతూ యిలా అన్నాడు.
రాజన్! దౌవారికా దేవ ప్రాప్తవానస్మి వారణం
మదవారణం మిచ్చామి త్వత్తోహం జగతీ పతే

దౌవారికాత్ ఏవ = రాజా! నీ ద్వారపాలకుడి చేత, ప్రాప్తవానస్మి వారణం = గెంటివేయబడి వున్నాను.
వారణం(వారింప బడటం ) అంటే గెంటివేత,ఏనుగు అనే రెండు అర్థాలున్నాయి.త్వత్తః అహం =నీ వల్ల నేను మదవారణం =మదించిన ఏనుగు ను బహుమతిగా కోరుతున్నాను.జగత్పతీ!రెండర్థాలు వచ్చేలా చెప్పాడు.
ఈ చక్కని శ్లోకం విని రాజు అతనికి తన రాజ్యం లో తూర్పుభాగం యివ్వటానికి నిశ్చయించాడు.అది
సూచించడానికి,సింహాసనం మీదే తూర్పుముఖంగా కూర్చున్నవాడు కాస్త దక్షిణం వైపుకు తిరిగి కూర్చున్నాడు.కవి శేఖరుడికి రాజుగారి భావం అర్థం కాలేదు.
రాజును పొగుడుతూ యింకో చక్కని శ్లేషతో శ్లోకం చెప్పాడు.
.
అపూర్వేయం ధనుర్విద్యా శిక్షితా కథమ్?
మార్గణౌఘః సమాయాతి గుణో యాతి దిగంతరం

ఈ అపూర్వమైన ధనుర్విద్య నీ చేత ఎలా నేర్చుకో బడింది?అందరి విలుకాళ్ళకూ బాణం వేసేటప్పుడు
అల్లెత్రాడు వాళ్ళ వైపు వస్తుంది,బాణాలు దూరంగా ఎక్కడో పడతాయి.నీకయితే మార్గణ-ఓఘం=(బాణాల
సమూహం అని ఒక అర్థం), సంచార యాచకుల సమూహం అని యింకో అర్థం నీ దగ్గరకు వస్తున్నది.
గుణం =(అల్లెత్రాడు అని ఒక అర్థం),నీ సుగుణాల గురించిన సమాచారం అని మరో అర్థం. నీ కీర్తి దేశ దేశాంతరాలకు పాకుతున్నది.
ఈ అద్భుత శ్లేషను మెచ్చి రాజు తాన దక్షిణభాగం కూడా ఆయనకు యివ్వాలని నిర్ణయించుకున్నాడు.పడమరదిక్కుకు తిరిగి కూర్చున్నాడు.శ్లోకాలు విని రాజు దిక్కులు మార్చి ఎందుకు
కూర్చుంటూ ఉన్నాడో ఎవరికీ అర్థ కాలేదు.ఆయనకు తన కవిత్వం నచ్చలేదేమో నని కవి శేఖరుడు మరో
మంచి శ్లోకం చెప్పాడు.
సర్వజ్ఞః - ఇతి లోకోయం భవంతం భాషతే మృషా
పదమేకం న జానీషే,వక్తుం నాస్తీతి యాచకే

రాజా! ఈ లోకం తమరిని సర్వజ్ఞుడు అని అసత్యం చెప్తున్నది.మీకు తెలియని మాట ఒకటున్నది 'లేదు'
అని యాచకుడికి చెప్పటం.మరి మీరు సర్వజ్ఞు లెలా అవుతారు?
కవి చమత్కారానికి మెచ్చుకొని రాజు ఆయనకు తనరాజ్య పడమర భాగాన్ని కూడా యిచ్చేయాలని
నిశ్చయించి ఉత్తరానికి తిరిగి కూర్చున్నాడు.

కవి శేఖరుడు యింకో శ్లోకం చెప్పాడు.
సర్వదా సర్వ దోసీతి మిథ్యా త్వం కథ్యసే బుధై:
నారయో లేఖిరే పృష్టం న వక్షః పర యోషితః 

సర్వదా,సర్వమూ దానం చేస్తావని పండితుల చేత నీవు అసత్యంగా వర్ణించ బడు తుంటావు.నీ శత్రువులకు
నీ వీపు లభించదు,(యుద్ధం లో వెన్ను తిప్పవు కాబట్టి) నీ వక్షస్థలం,పర స్త్రీలకూ లభించదు.(వాళ్ళని నీవు దగ్గరకు చేర్చవు కాబట్టి)
ఇది విన్న తర్వాత రాజు తన రాజ్యం అంతా కవికి ధారబోసినట్లు భావించి సింహాసనం వదిలి లేచాడు.కవికి
రాజు భావం అర్థం కాలేదు.ఆయన్ని మెప్పించేందుకు మరొక ప్రయత్నంగా యింకో శ్లోకం చెప్పాడు.
రాజన్ ! కనక దారాభి: త్వయి సర్వత్ర వర్షతి
అభాగ్య ఛత్ర సంఛన్నే మయి నాయాంతి బిందవః

రాజా!నువ్వు సర్వత్రా కనకధారలతొ వర్షిస్తుండగా,అభాగ్యమనే గొడుగు కప్పుకున్న నా మీద కొన్నిచుక్కలు కూడా పడడం లేదు..
రాజు సభ వదిలి అంతః పురానికి వెళ్లి,భార్య లీలావతి తో చెప్పాడు.రాజ్యం అంతా దానం చేసేశాను.పద మనం అడవులకు పోదాం అన్నాడు.
అదే సమయం లో ప్రధానమంత్రి బుద్ధిసాగరుడు రాజసభ నుంచి వెళ్ళిపోతున్న కవి శేఖరుడిని ఆపి రాజుగారు నీకేమి దానం చేశాడు?అని అడిగాడు.బుద్ధిగల, రాజు గారి మనసు తెలిసిన మంత్రి కనుక ఆయనకు రాజు గారి భావం అర్థమైంది.ఏమీ యివ్వలేదు అన్నాడు కవి నిరుత్సాహంగా. అయితే ఒక పని చెయ్యి నీకు కోటి బంగారు నాణాలు యిస్తాను రాజు ఏమిచ్చినా నువ్వు ఈ కోటి నాణాలకు అమ్మేయ్యాలి.అని అతనికి ఒక కోటి బంగారు నాణాలు యిచ్చి పంపేసి రాజు దగ్గరికి వెళ్ళాడు.
బుద్ధి సాగరా!నేను రాజ్యమంతా కవి శేఖరుడికి ఇచ్చేశాను.సకుటుంబంగా అడవులకు పోతున్నాను.
రాదలుచుకుంటే నువ్వూ వచ్చేయ వచ్చు.అన్నాడు రాజు.మంత్రి తో
రాజా! అక్కరలేదు.మీరు కవి శేఖరుడికి యిచ్చిన రాజ్యం అంతా తిరిగి అతని దగ్గరనుంచి నీ ధనం తోనే కొనేశాను.ఈ రాజ్యం యింక నీదే హాయిగా పాలించుకో.అన్నాడు.రాజు మరీ గద్దె నెక్కాడు..అలా కోటి బంగారు నాణాలు కవి శేఖరుడికి దక్కాయి.రాజ్యం భోజరాజుకే దక్కింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి