16, అక్టోబర్ 2014, గురువారం

184. Fastival Story -87 (DEPAVALI)

...........................  ఓం శ్రీ రాం .................. ........... ఓం శ్రీ రాం .................. ...........ఓం శ్రీ రాం .................. .....
           దీపావళి                                                   
ఏమిటా కుప్పి గంతులు, ఎవరన్నా చూస్తె నాటకాల కొంప అని అనుకుంటారు, కాస్త  శబ్దం తగ్గించుకొని  డా న్సుచేయుర మనవడా  అన్నాడు" తాత " తాతా రావు. కాఫీ అందిస్తూ అప్పుడే మీ మనవడ్ని అనటం మొదలు పెట్టారు, ఎమీ అనందే  మీకు నిద్ర పట్టదు కదా అన్నాది  "భార్య" తారా దేవి.
మనవడంటే ఎంతైనా ప్రేమ నీకు,  ఈగ  కూడా వాలనీవు వాడి మీద, అబ్బో అంటూ మీకు ప్రేమ లేనట్టు ముసి ముసి నవ్వులతో ముందుకు నడిచింది, ఇదిగో మర్చి పోయా, దీపావళి పండుగ దగ్గర పడుతున్నది, దీపావళి ట పాసులతో పాటు, కుంకుడి  కాయలు తేవటం మరవకండి, ఏవో సామ్పోలు  తెచ్చి, పోసుకోమంటే,  పోసుకొను అన్నది తార. 
అవునే కుంకుడి కాయ రసం కళ్ళల్లో   పోసుకుంటుంటే ఉంటుంది  మజా,  గుర్తుకొస్తాయినాకు   చాల్లెండి మీ సరసం అక్కడ మనవడున్నాడు, ఇంన్నేల్లువచ్చినా,  ఏమి మాట్లాడాలో,  ఏమి మాట్లాడ కూడదొ ఇప్పటికి మీకు తెలియదు, అన్నినేను పూస గుచ్చినట్లుచేపితే, పద్యం అప్పచెప్పినట్లు చెపుతారు మీరు,  కావలసినవి తీసుకురండి అన్నది తార. 
కాస్త శబ్దం ఆపరా,  దీపావళి సామాను   తీసు కొద్దామువస్తావా,  అన్న తడువుగా ఇదిగో వచ్చా తాతయ్య అన్నాడు, నేను ఆటం బాంబులు, డైనమేట్ బాంబులు, కాల్చుతాను,  మీరు నెల టపాకాయలు కాల్చండి తాత గారు అన్నాడు. నీకు ఏవి కావాలో అవే కొనుకుందానివి  అన్నాడు, ఇదిగో సంచి కుడా చేతిలో ఉన్నాది పదా తాతయ్య అన్నడు మనవడు మనోహర్ . 
తాతయ్య మన నడుస్తూ ఉండేటప్పుడు నీవు కధలుచేపుతవుకదా,  ఈరోజు నాకు దీపావళి  కధేమిటో చెప్పు  తాతయ్య , సరే చెపుతాను విను . 
శ్రీ మహాలక్ష్మీ దేవికి ప్రత్యెక పూజలు పండుగ, ఈరొజు మహాలక్ష్మీదెవిని దీపం తొరణాలతొ స్వాగతం పలకాలి. దీపాలు వెలిగించిన ఇంటికి లక్ష్మీ దేవి ఖచ్చితంగా వస్తుంది. కొందరు దీపావళి రోజున అర్ధ రాత్రి సమయాన లక్ష్మీ దేవిని పూజిస్తారు. అంటే మంచినీరు త్రాగ కుండా కుడా పూజ చేస్తారు,  నిర్జల వ్రతం అంటారు, పూజ తర్వాత పాలు పలహారం తీసుకుంటారు. ఈనాడు తులారాసిలోనికి సూర్యుడు  ప్రవేసిస్తాడు, కావున ఈ అమావాస్య విశిష్ట దినంగా భావించి, లక్ష్మీదేవికి బంగారు నగలు పెట్టి, వెండి, బంగారు  నాణాలతో పూజిస్తారు.  మా మనసులో ఉన్న అజ్ఞాన అంధ కారాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని వేడుకుంటారు, ఇంటి వాకిలి  మొత్తం, తులసి చెట్టు వద్ద,  ఆవునేయి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్ఫానిస్తారు. దీపావళి రోజున వ్యాపారస్తులు కొత్త పద్దు పుస్తకాలను ప్రారంభించి ధన, కనక, వస్తు, వాహనాలను పూజించి, జాతకఫలితాల్ని చెప్పించుకొని దానికి అనుగుణంగా వ్యాపారం చెస్తారు.  దీప మహిమ  కూడా  చెపుతాను విను 
దీపమహిమ:                                                                                

‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ                                                                  దీపంజ్యోతి జనార్ధన
దీపేన హారతే పాపం                                                                   

దీపలక్ష్మి నమోస్తుతే’’


                                                                                             
           హిందూ సంస్కృతిలో దైవ కార్యాన్ని ప్రారంభించే ముందు దీపం వెలగించి దీపారాధన చేసి ప్రారంభిస్తాము. గృహణ మంగళం దీపం అన్నారు. ఇంట్లో దీపం పెట్టడం ఇంటికి మంగళప్రదం. దీపం ముల్లోకాలలోని చీకట్లను పారద్రోలుతుంది. నరకబాధలను నివారిస్తుంది. దీపంజ్యోతికొక దివ్యశక్తి ఉంది. అందుకే పరమాత్మను జ్యోతిర్మయ స్వరూపుడని అంటారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన దీమును ప్రతి ఇంట ఉదయము, సాయంకాలం తప్పక వెలిగించి మానసికానందం, శరీరారోగ్యమును పొందడం ఎంతైనా అవసరం. స్త్రీలకు ఈ దీపారాధన సౌభాగ్యకరం.   దీపావలి కధను ఆడియో, వీడియో చూడు బాగా అర్ధం అవుతుంది  అన్నాడు తాత్తయ్య,అట్లాగే తాతయ్య అన్నాడు మనోహర్   
                                                
భారత దేశ మంతట ప్రజలు మతాబులువెలుగు జిలుగులలాంటి  జీవన సౌఖ్యాలను, చిచ్చుబుడ్ల  వేలుగుల లాంటి  జీవనాభివృద్ధిగమనాన్ని సాగించాలనీ, అజ్ఞానమ్ లోను , కష్ట ములలోను  ఉన్న ప్రజలకు  ఈ దీపావళి  తెలివిని తెప్పించి, వారి జీవితాలు సుఖవంతంకావాలని కొరుకుంటు ఈ దీపావళి  పండుగను జరుపుకుందాం

దీపమ్   జ్ఞాన చిహ్నం
దీపమ్   జ్యోతి పరబ్రహ్మం
దీపమ్ వేలుగు పాపనాశనం
దీపమ్ వెలుగుతో చేస్తారునిర్జల వ్రతం

గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి,  ఇల్లంతా   దీపాలతొ  కళ కళ 
తలంటి పోసుకొని, తెల్లని పట్టు వస్త్రములతొ ఇంట్లో అందరు కళ కళ
స్పెషల్ వంటలతో, భందువులతో కలసి సంబరం చేసుకొనే  కళ కళ
పండుగనాడు తారా జువ్వల వెలుగుల్లో   బాంబుల శబ్దాలతో గలగల

ప్రతిఒక్కరు ఆనంద పారవశ్యం లో మునిగి తేలాని, సుఖ సంతోషాలతో జీవించాలని లక్ష్మి దేవి కృప కటాక్షము అందరికి ఉండాలని దీపావలి సందర్భముగా అంతర్జాల ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న వారిని పేరుపేరునా శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నాను. నాకు సహకరిస్తున్న గూగుల్,ఫేస్ బుక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు ఇందు మూలముగా తెలియపరుస్తున్నాను 

ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

                            ‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ                                   దీపంజ్యోతి జనార్ధన
            దీపేన హారతే పాపం                                                                   

దీపలక్ష్మి నమోస్తుతే’’



నింగినుండి భువికి దిగిన తారావళి
నింగిలో చీకట్లో తారాజువ్వల లోగిలి
ఆనందంతో అందరు కలుసుకొనె కౌగిలి
ఇంటింటా లక్ష్మి దేవిని పూజించె దీపావళి       

అంధకారాన్ని   దీపపు  వెలుగులతో తరమాలి
మనం దీపారాధన చేసి దేవుణ్ణి ప్రార్ధన చేయాలి
దీపకాన్తి ఊర్ధమ్, మన దృష్టి ఊర్ధ్వమ్గా ఉండాలి
మనస్సు ప్రశాంతత కల్పించాలని దేవుణ్ణి కోరాలి

అజ్ఞానంతో  ఉన్న  నరకున్ని తల్లే సంహరించిన నాడు
రావణున్నివధించి రాముడు అయోధ్యకు వచ్చిననాడు
అజ్ఞాతవాసం నుండి  పాండవులు తిరిగి  వచ్చిన నాడు
అందరు  కలసి దీపాలు పెట్టి టపాసులు కాల్చిన  నాడు      


ఆడపడుచుల   కేరింతలతో    దీపావళి  శోభ
స్త్రిలు ముత్యాల  ముగ్గులు వేసి  తెస్తారు శోభ
అందరూ   కలసి  టపాసులు కాల్చుతూ శోభ
ప్రపంచ సొదర,సొదరీమనులుచేసే పండుగ శోభ


నా వాక్కు  మనస్సు  లో    ప్రతిష్టితం   గాక
మనస్సు   వాక్కులో    ప్రతిష్టితం  అగు గాక
దేవత అంతరాత్మ ఐ నాలో ప్రకాశిమ్చు  గాక
నేను నేర్చుకున్నది, విన్నది, వీడకుండు గాక

నేర్చుకున్న మంచిని సదా మననం చేస్తాను గాక
నేను   ఎప్పుడు సత్యాన్ని,  పలుకుతాను   గాక
నేనుచీకటిని తరిమే దీపాన్నిరోజూ వెలిగించు గాక
ప్రతి ఒక్కరిని లక్ష్మి దేవి అందర్నీ రక్షించు గాక
                                             
                        శ్రీ కృష్ణ పరమాత్ముని కరుణాకటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరిమ్చాలనీ, అందరికి  ఆ దేవదేవుడు ఆయ్యురా రోగ్యఐశ్వర్యాలు ప్రసాదించాలనీ ఆకాంక్షిస్తూ  .......

జ్యోతిషామపి తజ్జ్యోతి: తమన: పరముచ్యతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య  విష్టితం: (భగవత్ గీత -13.17)

"జ్యోతులకు
జ్యోతి ఐ, తమస్సునకు పరమై, జ్ఞానమూర్తి  ఐ, జ్ఞేయశ్వరూపమై,  ప్రతి ప్రాణి హృదయ కోసములొ  విరాజిల్లేది ఆత్మ జ్యోతి "
ఆ ఆత్మ జ్యోతిని తెలుసుకొనేందుకు ప్రయత్నం చేసినవాడే వాస్త
వానికి దీపావళి పండుగకు పరమార్ధం చెకూరగలదు.
భాహ్యంగా దీపాలు వెలిగిస్తూ అంతరంగ దుష్టకార్యాలను చేయకండి, సత్ ప్రవర్తనతో, ధర్మమార్గంలో  నడిచిన నాడు 
ఆన్తరింగిక జ్యోతి ని మనం చూడగలము,       
                                                 


భారతదేశ ప్రజలందరికి, మరియు ప్రపంచ దేశాలలో నివసించు ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలతో ......... 
మీ  మల్లాప్రగడ రామకృష్ణ , ఎ.టి. ఓ , డిస్ట్రిక్ట్ ట్రెజరీ ,నిజామాబాద్ ,తెలంగాణ,ఇండియా  .  

1 కామెంట్‌: