25, నవంబర్ 2020, బుధవారం

నిరంతర సాధన తెలుగు "ఛందస్సు"







Co

మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

నేటి ఛందస్సు ....మహిళా

UI UUII UUU UUI (ర ...భ ... మ ... త ) పద్యాలు *

స్త్రీ లొ ఆలోచన చిన్నాదే కావచ్చు - కాని ఏదో కళ ఉన్నాదే  అవ్వచ్చు

ఆచ రిస్తే సుభ మన్నాదే రావచ్చు - జీవితం లో వెలుగన్నా దే అవ్వచ్చు 

 నీడ ఇచ్చే గొడుగై ప్రేమా పొందచ్చు - మాట వల్లే మనసై సేవా పొందొచ్చు

మన్షి గా నీవుయె మారొచ్చూ పొందొచ్చు - సామరస్యం సహజం గానే పొందొచ్చు


ధైర్య మంతా వినయం గానే పొందొచ్చు - ధైర్యముంటే సమరా నైనా గెల్వొచ్చు

ధైర్యమే స్త్రీ పురుషాంకారం గెల్వొచ్చు ధైర్య భావం భయమే తర్మీ వెయ్యోచ్చు

ఆ పదా వెంట మనో నేత్రం తిప్పొచ్చు = ఆకలే తీర్చి సహాయమ్మే చెయ్యోచ్చు

ఎణ్నొ వేషాలు వేశాకే మార్చొచ్చు    - స్త్రీ గ జీవించి కాలాన్నే మార్చొచ్చు


జీవి ఆకర్షణే ప్రాణం పొందొచ్చు  - అద్భుతాలే సకాలమ్మూ జర్గొచ్చు

గెల్పు ఓటమ్మె పోరాటం చెయ్యాచ్చు -  గమ్య మంతాను ఆనందం పొందొచ్చు


మ.కో
సందడెట్టుల నీవు బల్కక చక్కనైనది నవ్వుతో
నందజేయుచు నల్లినట్టిది హారమొక్కటి ప్రీతిగా
‌వందనమ్ములఁ జేతు వేలుగ, పట్టు వీడవె వెంటనే


వందితాఖిల లోకపావని భక్తపాలిని మాలినీ

చెప్పవచ్చును దల్లి నీవికఁ జెప్పఁదల్చిన దేమిటో

విప్పనా ముఖపుస్తకమ్మును వేడ్కనొందియుఁ జూడఁగా
తప్పుఁ జేసితి నిన్నుఁ గొంచెము తాళమంచును బల్కుచున్‌
తప్పలేదట పల్కులాడక తన్వి తోడను గూటమిన్‌

మార్గదర్శిని యంచు వ్రాయఁగ మాటలాడితిఁ బద్యమున్‌
వర్గమందున సఖ్యముండుటఁ బల్కితాగతి, నైననున్‌
దుర్గమాంబిక గూర్చియే కద తోషమొప్పఁగఁ బల్కితిన్‌
నిర్గమించిన వెంటనే తను నిన్నుఁ జేరఁగ వచ్చితిన్‌

ऊँ! శ్రీ రాం.... శ్రీ మాత్రే నమః..

ఇది రోజువారీ ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

-----

మత్తకోకిల..(పంచపాది)

మాటమంత్రము తెల్పినంతనె మోత్త మంతయు వీడునే

మోహమంతయు తేటతెల్లము మాయ మవ్వునె ఇప్పుడే

మారు పల్కులు తొల్గి పోవును మాయ ముండుట లోకమే

మానసంబున రామనామము మేలు చేయును నిత్యమూ

ఆంజనేయుడు ధైర్య మిచ్చును అల్ప సౌఖ్యము పొందుటే

****(((*)))****

ఆశ పెర్గియు వచ్చు భయ్యము అంతు చూడును ఆదియే

గెల్పు ఓటమి వచ్చు లక్ష్యము‌ గాళ మల్లెను ఉండునే 

బత్కు బాధలు  నోట పాలకులు బంధం మల్లెను చుట్టునే  

సంతసమ్మును పొందు చున్నను సామ రశ్యము తక్కువే

ధైర్య ముంచియు వేయు అడ్గులు ధర్మమార్గము చూపునే

ధరణి యందు

"మత్తకోకిల ( పంచపాది )..

-----

కాలకంఠునిఁదల్చినంతనెగౌ రవంబనుభావమున్

కీలనేత్రునిఁగొల్చినంతనెకీడుపోవునునంద్రుగా

వ్యాళభూషికిసేవఁజేయగవంతలుండవు యూహకున్

శూలపాణినినమ్మినంతనెశోభఁగల్గుట తథ్యమౌ

బాలచంద్రునిరేఖఁగల్గుకపాలిఁ గోరెద శ్రేయముల్ !!! "

--


ప్రాంజలి ప్రభ ఓం శ్రీ రాం

నేటి ఛందస్సు పద్యాలు

U UI UII IUI IUI UU *

సాహిత్య పాఠము నిరంతర సాధనమ్మే

కారుణ్య లక్ష్యము సహాయము సకాలమ్మే

ధీనార్తి బావముతొ అర్ధ సహాయతమ్మే

ఆచార్య బోధలతొ విశ్వము పాలితమ్మే

 ప్రేమామృతం సహనమే సహజమ్ము కాదా

భావామృతం విషయమే పలికే ను కాదా

జీవామృతం బ్రతుకుయే చరితమ్ము కాదా

మాధుర్యమే కధలతత్వము మాటకాదా

వాదించు టే మనిషి బుద్ధి వినోద భావం

వేధించు నే మనిషి ఒప్పును తప్పు భావం

ఛేదించు టే మనిషి కాలపు కర్మ భావం

ప్రేమించు టే మనిషి బావము ధర్మ భావం

----

"కారుణ్య వీక్షణ సుదివ్య ఫలాప్తి దత్తం ,

దీనార్తిభక్తభవదుఃఖఫలప్రలుప్తమ్ !

శ్రీభూమివల్లభరమేశముపేంద్రదేవం ,

శ్రీపక్షివాహనమహంశరణంప్రపద్యే !!!

-

నేటి ఛందస్సు 

UUU  UIII IIU UIU UIUU 

సర్వాగన్ సుందరుడవు మనో నిర్మలుఁడైన దైవం 

సర్వార్థా రమ్యమును సకలార్ధమ్ముగా సాత్వి భావం 

శ్రీ రమ్యా ధార్మికగుణములో ప్రేమయే పంచుదైవం 

సూర్యా వంశా బ్ధి లొ వెలుగులే పంచుటంలోను భావం 


శాంతాకారం సుభగ నయణం పద్మనాభం శురేషం

శ్రీ లక్ష్మీ శ్రీ కరశుభకరా సర్వ శోభాయమానం

శ్రీ వత్సాం హృద్య శిరి కమలం సర్వ విజ్ఞాన దైవమ్

శ్రీ రంగాశ్రీ రమణ రమణీ పర్వ పీఠాభిదైవం


సర్వార్ధమ్మే సమయ సమరోత్పన్న సంతోష భావం 

సమ్మోహమ్మే వినయము విధేయమ్ము సంభావ భాష్యం 

ధర్మార్ధమ్మే సకల జన శీగ్రమ్ముగా  స్నేహా రాజ్యం 

విశ్వసంమ్మే కరణ చరితం దివ్యభావమ్ము దీపం  

    

"మందాక్రాంతః..

----

శ్రీవాణ్యంబాం వనజధవళస్థప్రపీఠాధిదేవీం ,

గైర్వాణీం తాంవిధిరసనవైరాజినీం శారదాభామ్ !

కావ్యాలంకారసువిదితభాషానువిజ్ఞానదాత్రీం ,

వాక్సౌందర్యప్రవిలసితవాణీంప్రవందేऽనునిత్యమ్ !!! "

--UIIUI - UIII - (3) - UIIUI - UIIU

మల్లాప్రగడ ఛందస్సు కవిత (1 )


కృష్ణుడు ఆడు ఆటలను - గోపిక పాడు పాటలను   

దూడల చెంగు  దూకుడును - కొల్లలు గోల గోపికలే 


వేణువు ఊది హాయిగను  - కాలపు మాయ ఉందియును 

ఆశలు తీర్చు కాలమును  - మౌనము వీడి ఆటలులే 


ఆదిగ ఆత్మ ఉండెనులె   - జీవిగ బ్రాంతి వచ్చునులె 

మానస కాంతి పెర్గుణులె  - ఆకలి ఉండి తీరునులే   


సాధన చేయు  సాధ్యముయు - శోధన సాధ్య  సాధ్యముగ 

సత్వర సేవ  సత్వర హాయి - కాలము నిర్ణ యమ్ముయులే 


అన్నము తింటె శక్తియును - పప్పును తింటె పుష్టియును 

అల్లము తింటె పైత్యమును - ఆకలి తీర్చు హాయిగనే 

 

భార్యకు భర్త శక్తిగను - భర్తకు భార్య  యుక్తిగను   

బిడ్డకు పాలు శక్తిగను - కార్యము తీర్చు హాయిగనే


వంటకు మంట తోడుగను  - పిండి తొ రొట్టె తీపిగను 

కంటికి రెప్ప తోడుగను - వంటకు ఓర్పు  హాయిగనే


కాలము నాది ఆకలియె - ఆశయ మేది లేనిదియు    

చీకటి వెల్గు కానిదియు  -  కష్టము నష్ట పోనిదియే   


ప్రేమయు నాది బోధలులె - - ప్రేరణ నాది కామకుని 

వాదము నాది సామములె  - సాధన అంత తప్పఁదులే 


సాధ్యము నాది సాధువుని  - ఆశపరంగ ఆయువని  ... ... ...

తామర కన్న తోడువులె   - మల్లెల కన్న వాసనలే       


జాబిలి కన్న వెన్నెలలె  - మాటల కన్న మన్ననలె    

తండ్రికి బిడ్డ సేవకుడె   ...  ... సర్వసుఖాల సారముయే    


సర్వభయాల భారముయు  -- సర్వమదీయ సాధనయు    

సర్వవిధాల సోధనయు  - తల్లికి బిడ్డ పోషణయే  ...  ...  ... 


పుత్తడి పంచు సౌమ్యముగ  - పృథ్వి ప్రెమించుఆశలుగ            

విద్యను నేర్పు పాఠ్యముగ - అగ్ని నిల్చును ఊర్ధముగా      


తల్లియుతండ్రి భాద్యతయె  ... ... భార్య కు భర్త  సంపదయె  

భర్త కు భార్య తోడునులె  - బిడ్డలు ఆశ దీపములే 


--(())--




ప్రాంజలి ప్రభ వారి 

నేటి ఛందస్సు కవిత ..నవ్వింది 

II UI    II UI   UUI  UUUI *

అటుచూసి ఇటుచూసి నవ్వింది  నవ్వించింది 

కలలన్ని కధలన్ని చెప్పింది చెప్పాలంది 

మనసంత విధియంత చెప్పాలి విప్పాలంది 

సమభావ సమశక్తి తెల్పేను తెల్పాలంది  


కనుగీటి కనువిప్పు  కవ్వింపు కావ్యమైంది 

సొగసంత చిరుహాస మయ్యి0ది సౌమ్యమైంది 

తనువంత తడిపించి తన్మాయ తత్వమైంది 

చినుకల్లె విధిరాత సద్భోద కామ్యమైంది 


నను వత్తు నను చిత్తు నమ్మించి నాట్యమైంది 

నను తట్టు నను తిట్టు ఏడ్పించి  గోప్యమైంది 

నువు పువ్వు అని నవ్వు నవ్వించి ఏడ్పించింది 

విను నంత కనువింత  భావించి భవ్యమైంది 

--(())--


నేటి కవిత్వం -  మత్త - 2

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

UU  U UII IIUU*

ఈశ్వరా ప్రీతి యనున దేదీ

ఈశ్వరీ ప్రేమ అనునదియేదీ 

ఈశ్వరా తృప్తి  యనున దేదీ

ఈశ్వరీ దాహ  అనునదియేదీ  

 

లోకంలో ప్రీతి యనున దేదీ

లేకుండే కాని మన సనేదే

ఏకంగా ప్రేమ కలలు కాలం 

ఈ కొద్దీ స్నేహ మధుర మయ్యే


లోకంలో ప్రాంత కళల వృధ్ధే

సౌఖ్యంగా సేవ సమయ బుధ్ధే

చక్రంలా తిర్గు వినయ శుధ్ధే

శ్రీ కారం తెల్పె మనిషి శక్తే


లోకంలో ప్రేమ పరుగు నిప్పే

సక్యత్వం వల్ల చలువ ఒప్ఫే

వక్కానిచ్చే తరుణము మెప్పే

చుక్కానిచ్చే మలుపుల యుక్తే


లోకంలో ప్రేయసి కళ ఓర్పే

చీకూచింతా కళ నిజ మార్పే

చీకట్లే మార్చు వెలగు నేర్పే

వాకిట్లో కల్సి బతుకు తీర్పే


మాత్రా బద్దము (2)

IIU IIUII UI

నేటి కవిత్వము -  లోకంలో పోట్లు -పాట్లు


మనిషీ అనురాగము పంచి   

మతి లేకయు తిర్గిన  వాడు  

విధి మా యకు రోగము  పంచి   

గతి లేకయు చిక్కిన వాడు   


కుల మంతయు గోలను చేసి

కను మాయకు చిక్కున  వాడు  

విధి బోధయు అంతయు తెల్పి

తనువంతయు పంచిన వాడు 


మది మాయను వేలము వేసి

 మది తప్పియు  శీలము తూట్లు

విధి లేకయు  గాలము వేసి

 కల కాలము రోగము పోట్లు


చిరు దీపము చీకటి చీల్చె

 చిరు నవ్వులు మాయకు తూట్లు

శిఖ పింఛము అందము పెంచె

శిఖ పట్టులు తన్నుల పోట్లు


గురు సేవయు చేసిన మంచి

 గురు పాదము పట్టిన పాట్లు 

గురు పత్నిని కోరిన తప్పు

 గురు పత్నిని తిట్టిన పోట్లు 


సమభావము పెంచిన మంచి

 సమ యోచన తెల్పినపట్లు

సమరాగము  పల్కిన మంచి

 సమ సేవలు చేసిన పట్లు


గిరిగీచుక కూర్చొనఁ బోకు

 సరి లేరని నాకెవరెట్లు

మరి యాదగ నుండుట మేలు

ధరనెచ్చట నున్నను పాట్లు


--(())--


నేటి కవిత్వం - రుగ్మవతి -1

మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ


మానవ సమ్మోహం కరమాలిం

గా సుఖ సౌక్యమ్మే విధి వైద్యం 

మృత్యువు సౌందర్యం నిధి ఆక

ర్షామృత సద్భావం సహవాసం


వేదన ఉద్వేగం విను మాటా

చేతల కర్తవ్యం మది వాటా

కాలపు కాఠిన్యం కళ వేటా

ప్రేరణ విశ్వాసం విధి ఆటా


చక్రము తిర్గాలీ వినయంగా

ఆకృతి మారాలీ తరుణాణా

దుష్టుల నేమార్చే సమరంగా

సక్రమ మార్గమ్మే చరితార్ధం


తప్పదు సంసారం ప్రతి నిత్యం

చెప్పదు యవ్వారం ప్రతి సత్యం

ఒప్పదు ఆహార్యం ప్రతి పత్యం

దప్పిక శృంగారం. ప్రతి తత్వం


భాద్యత భావాలే కరుణమ్మే

దక్షత దీపాలే శరళమ్మే

ఆకృతి ఆనందం మనసమ్మే

ఇంటిలొ ఉంటే రాదు కరోనా


--(())--


నేటి పద్య పుష్పాలు ( అమ్మా - ఆదిపరాశక్తి )

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


శా    ఆద్యంతం భవ బంధ ముక్తి కలిగే ఆరాధ్య సర్వోన్నతీ

       ఆదర్శ్యం శివ సోమ భక్తి  వచణం ఆదర్శ జీవన్ముఖీ   

       సద్బోదా సతతం  అమృత్వ చరితం సామర్ధ్య సద్భోధినీ  

       తద్భావం సమతుల్యమే స్వరమయం తన్మాయ సంధాయినీ


\శా  నీ సంకల్ప బలం సునంద భరితం ఈప్సిత్వ సంభాషిణీ

      నీ సామర్ధ్య జపం మరంద విదితం  ఈశ్వర సంధాయినీ

      నీ సామ్రాజ్య తపం విధాత వినయం ఈతత్వ సంభోధినీ  

      నీ సాత్వీక గుణం సమర్ధ చరితం  ఈమాయ విద్వంసినీ  


శా. నీకై యేను దపంబు చేసితి మహా-నిష్ఠా గరిష్ఠస్థితిన్

      నీకై సంస్తుతి సేయుదుం గడఁగి నా - నేర్పొప్పఁగా నెంతయున్

      నీకై పూజయొనర్తుఁ గొంత విరులన్ - నిత్యంబు సద్భక్తితో

      నీకై సేవ యహర్నిశం బొనరుతున్ - వేదండచర్మాంబరీ


శా. సర్వార్ధ సహనం సమన్వయ మయం సామర్ధ్య సర్వోన్నతీ

. . .  కర్యార్ధీ తరుణం మహాను భవునీ కారుణ్య కార్యోన్ముఖీ

. . . . ఆరాధ్యా యుతమే సుమంగళ కరే ఆదిత్య ఆనందినీ 

. . .  ధర్మార్ధా లయమే సహాయ చరితం దుర్నీతి భస్మాహినీ


                    --))((--



8.Krishna Avatar-Krishna is recognized as the complete and eighth avatar of the God Vishnu or as the Supreme God in own right. Krishna is often described and portrayed as an infant eating butter, a young boy playing a flute as in the Bhagavata Purana, a young man along with Radha or as an elder giving direction and guidance as in the Bhagavad Gita. The principal scriptures discussing Krishna's story are the Mahabharata, the Harivamsa, the Bhagavata Purana, and the Vishnu Purana.


నేటి కవిత్వం ప్రియకాంత 

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

III  IUU  III  IUU  IIUU     

సకల చరిత్రే సమము సకామం సమబుద్ధే 

వినయ వినమ్రం విమల చరిత్రం విదితత్వం 

మనిషి మనోవేదనలు కవిత్వం సహజత్వం 

ప్రమద గణాలే పలుకు శివోహం అనునిత్యం   


లలన విలాపం వలన  లలాటం నిను చేరే 

కలువ సరాగం మనకు కలాపం విని నంతే

మలుపు సకాలం మనసు  మయూరం వెలిగించే 

వలపు  సమానం జరుపు వలే మాయలు గావే


చిలక ల చిన్నాటలకు  చిముగ్గే పరిచేగా 

కులుకు లు చూసే వినయ  కుమారం విరజాజై 

చిలికి  తరించే మదన చినో నేత్రము పెర్గే 

గలగల పెంచే విషయ గమానం దరి చేరే    


కలయిక కాలం కలల కలాపం  పురి విప్పే

నిలకడ వేగం వలపు  నిదానం  వరి చేనై 

విలువల వేషం తలకకి తాపం ఉసిగొల్పే  

తొలకరి చిన్కే తడిపె తలత్వం విడమర్చే 

  

అలకల వైనం ఎదురగ సాగే చిరుహాసం 

మలి ముసుగై చామరము మాపే మరుమల్లే

భలి భలె సంతోష నగభ చూపే దరహాసా 

మలి కల నైజం సరియమ పాఠం దరిచేర్చే


--(())--             




ప్రాంజలి ప్రభ కవిత ..  లొళ్లి గోల ప్రేమ (4)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :


మెరుపు లా  మెరవకు - హృదయ దీపం లా వెలుగు
బరువు లా  తడవకు  -  వలపు  దీపం లా  వెలుగు
దరువు లా ఉతకకు  -  తపన దీపం లా వెలుగు
కరువు లా  బతకకు  -  భజన దీపం లా వెలుగు

చురు జల్లు లా కురవకు - దాహం తీర్చె లా కురువు
మరు మల్లె లా ముడవకు  -  కోపం తగ్గే లా తెరువు
విర జాజి లా మెరవకు   - మొనం వీడే  లా  మెరియు
కార మాల లా కుదుపకు  -  వేషం వీడే లా కుదుపు  

మొండిమాట లా బ్రతకకు - నిజం వళ్ళ వేదన కలుగు
గట్టి పల్కు లా పలుకకు  -  భయం వల్ల భాదలు కలుగు
తొట్టి  గాంగి లా తిరుగకు  -  కోపం వల్ల  పోరులు  కలుగు
పండు టాకు లా ఎగరకు  -  పాపం వల్ల  శోభలు తరుగు

అబ్బా అబ్బో  బలే చెప్పా వే  --  నన్ను దరి రానీ యక
తప్పో ఒప్పో  బలే అన్నా వే   -   కన్ను దరి చేర నీక  
ఉప్పు పప్పు  కల్పి ఉన్నావే  -     మంచు వలె  కర్గ వేమి
తప్పు చెప్ప లేక ఉన్నానే    -   ఓర్పు  వలె నీకోసమున్న

                                                               "రేపు " నీ మీద నా  ప్రేమ
--(())--


నేటి కవిత ..  లొళ్లి గోల ప్రేమ (3)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :

ఎటు వేల్లోవో బావా  - ఎటు చూసిన కాన రావా
కల  కల్లలే  బావా   -  నయనాలను  తెర్చి చూసా
ఎంత మరిచావో బావా - ఎద చూసి ఇటు రావా
పంత మోదిలే సై బావా -  కధ కాదు  పని చూడూ

ఏరు దాటలేదు కదా బావా -  పొంగులో ఉన్నది బావ
పెరుమారలేదు కదా బావా  -  ఇంపుగా ఉన్నాను రావా
ఎంత తప్పు చేసావు బావా - వచ్చి ముద్ద తిని పో బావా
వింత చూపు  మానేసి రావా  -  అచ్చి బుచ్చి ఆడుకో బావా

కపట మెరుగని దాన్ని బావ - కళ్ళు చూసి మోసపోకు బావా
చిటపటల  కాకరొత్తి  బావ  -  వాళ్ళు చూసి  వెళ్లబోకు బావా
కసి ఉంటె మనసార తిట్టు బావా - కల్లబొల్లి మాటలకు లొంగను బావా
మసి బూసి మనువాడి కొట్టు బావా -  వళ్ళు గుల్ల చేసి పొందాలి బావా  

కళ్ళు త్రాగిన ఊరుకుంటాను కదా బావా - కసి తీర తిట్టు బావా  
ముళ్లకంపల తిరుక్క ఉండు బావా  -  పస చూపి బత్కు బావా
నన్ను విడిచి పోకు బావా - నా అంతరాత్మను క్షోభ పెట్టకు బావా    
నిన్ను విడిచి  పోను లేవే  -  నా అంతరాత్మ  కూడా  క్షోబ కదా

--(())--                                    
                                                                "రేపు " నీ మీద నా  ప్రేమ



నేటి కవిత ..  లొళ్లి గోల ప్రేమ (1 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :

నీ కోసం వేచి ఉండి  ఇలా మారా
నీ ప్రేమ పొందటానికి ఇలా తిరిగా
నా కోసం తయారయ్యవు ఇలా ఎలా
నా కోసం నీవు ఎలా చేస్తావు లొళ్లి గోల    

 నా పరుష పదాలు పెదవి దాటించకు
  నా మంచి మాటలు మనసులో ఉంచుకో
  మంచి చెడుల మద్య నాకోసం  నలుగకు
  ఇద్దరం కలిస్తే మనకు నిజమైన  బ్రతుకు

 నీవు లావ్వున్న నేను సన్నగా ఉన్న
 అనక మన ప్రేమ నిండు సున్న
 నీ సొగసు నాకే నని చెప్పుతున్న
 నా మనసు నీకెనని వక్కానిస్తున్న

నెమ్మదిగా పాలు త్రాగు పిల్లి
ఏడుపు ఆపు ముద్దుల చెల్లి
చదువు కోవాలి  మల్లి  మల్లి
పూర్తి చేయాలి వచ్చేలోపు తల్లి  

                            "రేపు " నీ మీద నా  ప్రేమ ...
--((***))--


నేటి కవిత ..  లొళ్లి గోల ప్రేమ (2 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :


నీ మువ్వలో కదలికలు  నా గుండెలో సరిగమలు
నీ నవ్వులో చురకలు   నా మనసులో వేదనలు
నీ కొప్పులో మల్లికలు  నా వయసుకు పరుగులు
నీ నృత్య లో హావభావాలు  తన్మయపరుచే పవనాలు

నీ చిరుహాసపు చూపులు   నా జేబుకు చిల్లులు
నీ  పరిహాసపు  మాటలు     నా  నమ్మక బీటలు
నీ  జడమాలల వాసన       నా  నాసిక  తుమ్ములు
నీ సత్య  హావభావాలు  తన్మయ పరుచే పవనాలు

నీ కలగూర  ఆశలు  నా  హృదయముపై దాడులు
నీ  మనసైన ఊహలు  నా పెదవులపై దాడులు
నీ   కలలోని కోర్కలు    నా  పదవులపై దాడులు  
నీ ప్రేమ  హావ భావాలు   తన్మయ పరుచే పవనాలు

నీ  వలువల  అందాలు  నా గుండెలో గుభగుభలు
నీ  నడుమున  ఒంపులు  నా  ధైర్యంలో  భగభగలు
నీ  కరముల  గాజులు      నా  మౌనంలో  పకపకలు  
నీ   పెదవి  హావ భావాలు   తన్మయ పరుచే పవనాలు

                                    --(())--                     
                                                      "రేపు " నీ మీద నా  ప్రేమ
--(())--

 నేటి కవిత్వం - - - జగమెల్లా.. 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

ఏకమైమమేకమై నర్తించే జగమెల్లా
రాగమై మనో మయం చిందించే జగమెల్లా
వేదమై మదీ మయం ఘుంభించే జగమెల్లా
ప్రేమయే విధీ తరం సృష్టించే జగమెల్లా

పరవసించి విహరించి విహరించి జగమెల్లా
జలదరించి మనసిచ్చి మనసిచ్చి జగమెల్లా
పులకరించి పురివిప్పె పురివిప్పె జగమెల్లా
పలకరించి సుఖమంత దు:ఖమంత జగమెల్లా

అనురాగ లహరిలో ప్రేమారాధనతో జగమెల్లా
జపమాల మహిమలో స్వేదానందముతో జగమెల్లా
మధుమాయ కలువలో ఆధ్యంతంరమతో జగమెల్లా
జడివాన తరుణమే సంతోషం వినయం జగమెల్లా

రాధాకృష్ణాంత రంగములే విస్తరించే జగమెల్లా
రామాసీతాంత శాంతములే ప్రాభవించే జగమెల్లా
కారుణ్యంలోని సత్యము లే గౌరవించే జగమెల్లా
సారధ్యంలోని విత్తములే జీవితంగా జగమెల్లా

--())) - - 





నేటి కవిత్వం - సుభద్రకు 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సు:: చక్కని చుక్కకై పరుగు పెంచెనే మనస్సు చేష్టలే 
        చిక్కులు  తెచ్చెనే భయము పెంచెనే వయస్సు కోర్కెల్లో 
       మక్కువ పెర్గెనే కోపము కమ్మియు యశస్సు తగ్గెనే 
       చుక్కల చీరలో మగువ ముచ్చిక ఉషస్సు సోకినే     

 సు: వేషము మారెనే మగణి రోషమే సమత్వ బుద్ధితో 
        శేషము పెంచెనే అవని  పాశమే సమత్వ భందమై 
        ఇష్టపు  మార్పులో వనిత వేషమే సమత్వ  శక్తిగా
        కష్టము నుండియే  వినయ చేష్టలే  ప్రెమత్వ ముక్తిగా 
   
సు:: దీపపు వెల్గులో  సుఖము ఏదెదో  చరిత్ర సృష్టికై 
       మాపని  ముస్గులో  జయము కమ్మగా ధరిత్రి నవ్వెనే
       కోపము చల్లగా  జఱిగి  ఏకమై  పవిత్ర పొందులో 
       లోపము లేదులే  వలపు లోలకం సునంద సంతసమ్

సు:: రోగము చెప్పఁకే తొలగి మార్పుకై  చిరాకు చేరుటే  
       భోగము పూర్తిగా మరిగి  మగ్గుటే  మనస్సు మారుటే 
        యోగము మారెనే తపము వేగమే జగాన చేరుటే
        యోగ్యత చెప్పఁకే  కలిగి  చెంగున మదీయ  మార్పులే 

                             --(())--


Natalie Marie sur Instagram : 👆I found this, no idea who the author is. If you happen to know please share because I love it and want to buy it. Gracias 🙄 oh p.s.…

 న న న న స జ జ ga  - 14 turaga  
  III  III III III  IIU  IUI  IUI  U                  :  
నేటి కవిత్వం - తురగ 
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ  

అణువణువు వికసపు లతలు సరసాలకే సుమ మాలికా 
లుకలుకలు పకపకలు చినుకుల చేయి సాయముగా సుతా 
రము తరుణము తకధిముల వరుస ఏక మానముగా మనో 
మయము కళల నిజము కలవలతొ మోహరింపు సరాగమే 
             
చిరునగవు తొలకరి వణుకు సమయో చనం మరుమల్లియే
విరుపుల తలపులు కులుకులు ఒకటేమిటీ పరువాలనే 
పదిలముగ సరిగమలు సరియగు సామరస్య ముగా మదీ
య పెదవుల సుకుమములు కురులలొ జాజి సుమాలు పొందుకే 

కళల తలపులు వలలు ఉసిగొలిపే సదా మధురం వరం 
గలగలలు మకసికలు కదలిక లే ఉహాజని తాలయం 
అనుకువన అలసటల అరమరికే సమానముగా విశే 
షములు వికసితములు ఒకరికొక రే తపోధనమే  జయం   



షడధికాక్షరా అని జానాశ్రయిలో సూత్రము. 

ఇక్కడ అక్షరము అంటే గణము, ఒక అక్షరము కాదు. 

అధికాక్షరమునకు ఆఱు గణములు; గణము అనగా చతుర్మాత్రా గణము.  

సరి గణములు జ-గణముగా నుండరాదు. 

మూడవ గణము జ-గణముగా నుండవలయును.

చివరి గణము న/గ లేక ర-గణము. 

కొన్ని ప్రయోగములలో మొదటి గణముగ న/గ లేక ర-గణము అంగీకృతము. 

==

కల్లలు మఱిమఱి వచించఁ - గావవి ఋతముల మేడగా   

చిల్లులు గనబడు నొకింత - శీఘ్రము దైవము చూడఁగా 

నుల్లపు టద్దము చెలంగు - నొప్పులఁ దప్పులఁ జూపఁగా 

మెల్లఁగ నిజముల వెలుంగు - మేదిని విలసిలు నోపఁగా 

==

ఆకులు మెల్లఁగను రాలు - నందము చిందిడు రంగులై 

మ్రాఁకుల రూపమగు మ్రోడు - మౌనుల తపముల హంగులై 

చీఁకటి ఘడియ లిఁక హెచ్చు - శీతల పవనము రేఁగఁగా  

రాకలు పోక లిఁక తగ్గు - రమ్యము గీతులు మ్రోఁగఁగా 

==

ఎందుకు నీవిటుల నన్ను - నీభువిని వీడి చనితివో 

ముందుగ నాకేల చెప్పి - పోకుంటి వీవు కుపితవో 

కుందుట నాకర్మ యేమొ - గోవిందు లీల నెఱుఁగనే 

బంధపు సూత్రమును ద్రెంచ - బరువైన చిత్త మఱిగెనే 

==

UUU  UUi  UUi  UU    

నేటి కవిత్వం - శాలిని .....  ప్రాంజలి ప్రభ 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ప్రావిణ్యం విద్యా ప్రమాణాలు కావా 
సాహిత్యం కావ్యాల భావాలు కావా 

సందేహమ్ సామాన్య భావమ్ము కాదా 

ప్రాధాన్యం సేవా సహాయమ్ము కదా   .  

హే హే హే నీలాల ఆకాశమే రం
గే రంగే చిమ్మింది తారళ్లు వెల్గే
వెల్తుర్లో ఈతార విచ్చింది ఆనం 
దం పొంగే ఆదర్శ భావమ్ము కాదా

హే హే హే ఈరోజు ఆనంద మవ్వా
లంటే ఆ ఆశల్ని మర్వాలి ఆకా 
శం అందాలంటే మనో నిబ్బరమ్మే  
ఉండాలీ ధర్మాన్ని నమ్మాలి కాదా
   
హే హే హే నిత్యమ్ము భాగ్యమ్ము పొందే 
కార్యమ్మే దానమ్ము చేసేటి లక్ష్యం 
పై విశ్వాసమ్మే కళా విద్య బాంధ   
వ్యం ప్రేమమ్  నిత్యం సుఖాలిచ్చు టేగా 
    
కాదన్నా నమ్మాను అంటేను సంతో 
షం కోసం, నేనే ని చుట్టూ ను తిర్గే
యంత్రం వళ్ళేనూ,  సహాయమ్ము చేస్తా                           
కాలాన్నీ నమ్మాను నీకోస మున్నా  

సందేహమ్ సామాన్య భావమ్ము కాదా 
ప్రాధాన్యం సేవా సహాయమ్ము కదా 

--(())--


 నేటి కవిత 
ప్రాంజలి ప్రభ - ఎలా 
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మస్తకంలో ఉన్న మహత్తు విషయమును 
మహిమాన్వితమైన జగత్ విషయాలను 
వ్రాసి మందమతులను, ఉత్తెజులుగాను 
ఉద్దండ పండితులుగా మార్చాలి ఎలా ?

అలా ఇలా అనుకోవటం అవసరము 
కంటితో చూసి బుద్ధికి పదునుపెట్టుము         
బుద్ధితో విద్యాదానం చెయ్యటమే కవిత్వం  
కవిత్వం వ్రాత అర్ధం కానివరికి ఎలా ? 

కళ్ళతో అమాయకుల ఆక్రందన చూడు 
శక్తి  చూపి ప్రోస్చాహంతో విద్య పంచి చూడు  
ఆశయతో విద్యను  వ్యర్థం కాకుండా చూడు 
పకృతి సౌందర్యాన్ని మంచిని పంచాలి ఎలా? 

హృద యాంతర భావాన్నీ తెల్పు ఉప్పెనలా 
సందర్భోచిత మైన పరిష్కార౦  తుఫానులా 
దుష్టలందర్నీ  ఎదుర్కో ప్రభంజనం లా 
సమాజానికి కవిగా చేయూత నివ్వాలి ఎలా ?

--((*))--

నేటి ఛందస్సు ..కొత్త వృత్తము 

IIII UII IIIU --IIII UII I IIIU --  

రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


జడి జడి వానకు తడిసియే - పొడి పొడి వేడికి జత పడుటే  

చిరు చిరు నవ్వుకు మనసుయే - కొర కొర చూపుకు జత పడుటే

 

మడి మడి మాటకు జరుగుటే - చలి చలి ఆటకు జత పడుటే 

థళ థళ మెరుపు మొరుగుటే  - టప టప రెప్పలు జత లగుటే  


కలలు కలసి కనికరమే   - పెరిగి కధలు కదిలి కదులే  

కనులు సెగలు ధలథలమే - తరిమిన బదులు కదులులే

 

కురులు ఫెళ ఫెళ మనటే  - పవనున ముసుగులు  కదలికే 

కళలు కలయిక అడుగులే  - తడబడిన ఒక టొకటగుటే  


సరి సరి అని మది తెలిపే  - మధురపు  కులుకు పలుకులులే 

సిరి గల మగువకు జతలే  - మగసిరి గల మగని కలలే

 

పరి పరి విధముల సొగసే  - ఒరవడి కదలికకి మరిగే 

మరి మరి వడి వడి కులుకే - తలబడి కనివిని ఎరుగకే

  

మమత పెరిగి ఘుమ ఘుమలే  - తలపడి ఒక రొకరు కలిసే  

పద పద యని సరిగమలే  - పదనిసల పదములు పలుకే 

 

పలుకగ చిరు నగవు దరే  - తెలిపి జత కలిపిన చెదిరే  

అణువణువు అరమరికలే  - తెలపక జత కలిసి బతుకే  


--(()) - -

నేటి కవిత 

జన్మ భూమి చరితార్ధమే  - 
ధర్మ కర్మ సమరత్వముగా  
న్యాయ భూమి చరితార్ధమే 
సర్వ శ్రద్ధ కలయత్వముగా 

నిత్య మంగళ శుభో దయమే 
సత్య పల్కుల నవో దయముగా  
నవ్య శోభల శుభో దయమే
భవ్య వెల్గుల నవో దయముగా

కర్మ భూమి వాత్సల్య మగుటే   
విశ్వ ఆరోగ్య శుభోద యముగా 
బందు కోటి వాత్సల్య మగుటే
సర్వ సమ్మోహ శుభోద యముగా   

ధర్మ రక్షణ సేవ ధీరుడై
సత్య పల్కు సేవ వీరుడుగా 
న్యాయ మార్గము సేవ నేతడై  
సర్వ విద్య సంఘ దక్షుడుగా 

దేశ రక్షణ ప్రజ రక్షనే  
సర్వ నిర్మల ప్రజ దక్షుడుగా   
పౌర శక్తిగ ప్రజ శిక్షణే 
సర్వ శాంతి ప్రజ ధీరుడుగా  

తల్లి తండ్రి గురువు క్షమయే
విద్య వ్యాప్తి కరుణ ప్రేమలుగా  
కృషితో నాస్తి దుర్భిక్షముయే 
వ్యక్తులే వ్యాప్తి శ్రమ శక్తులుగా 
    
--(())--

షడధికాక్షరా అని జానాశ్రయిలో సూత్రము. 
ఇక్కడ అక్షరము అంటే గణము, ఒక అక్షరము కాదు. 
అధికాక్షరమునకు ఆఱు గణములు; గణము అనగా చతుర్మాత్రా గణము.  
సరి గణములు జ-గణముగా నుండరాదు. 
మూడవ గణము జ-గణముగా నుండవలయును.
చివరి గణము న/గ లేక ర-గణము. 
కొన్ని ప్రయోగములలో మొదటి గణముగ న/గ లేక ర-గణము అంగీకృతము. 
==
కల్లలు మఱిమఱి వచించఁ - గావవి ఋతముల మేడగా   
చిల్లులు గనబడు నొకింత - శీఘ్రము దైవము చూడఁగా 
నుల్లపు టద్దము చెలంగు - నొప్పులఁ దప్పులఁ జూపఁగా 
మెల్లఁగ నిజముల వెలుంగు - మేదిని విలసిలు నోపఁగా 
==
ఆకులు మెల్లఁగను రాలు - నందము చిందిడు రంగులై 
మ్రాఁకుల రూపమగు మ్రోడు - మౌనుల తపముల హంగులై 
చీఁకటి ఘడియ లిఁక హెచ్చు - శీతల పవనము రేఁగఁగా  
రాకలు పోక లిఁక తగ్గు - రమ్యము గీతులు మ్రోఁగఁగా 
==
ఎందుకు నీవిటుల నన్ను - నీభువిని వీడి చనితివో 
ముందుగ నాకేల చెప్పి - పోకుంటి వీవు కుపితవో 
కుందుట నాకర్మ యేమొ - గోవిందు లీల నెఱుఁగనే 
బంధపు సూత్రమును ద్రెంచ - బరువైన చిత్త మఱిగెనే 
==

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి