26, నవంబర్ 2020, గురువారం


 ప్రక్రియ 🌺 అంత్యప్రాస పద్య  మాలిక 🌺 బాల కృష్ణ లీల 
రచయత? మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .. 

గోకులం లో కళకళ 
ఆడపడుచులు కళకళ 
పుణ్యమూర్తులు కళకళ 
కృష్ణుని ఆట కళకళ 

బాలకృష్ణునికి పూజ 
పెట్టే బాలురు కాజ 
తెలిపేను భరద్వాజ
వేడుకొనె గోల్ల  ప్రజ 
 
పక్షుల కూతలు మధ్య 
ఆటల పాటల మధ్య  
సంగీత మ్ముల మధ్య 
కృష్ణుడు చూపే విద్య 
 
కీచుమంటు పల్లె పాట 
కుహు అంటు కోయిల పాట 
కీచులాడె పక్షి పాట  
కృష్ణుడు నవ్వులతొ ఆట 

చేతులూపుచూనె చెలియా
నవ్వులతో చేయు మాయా 
స్త్రీలహృదయాలు మెరియా 
కలలు తీర్చు కృష్ణ మాయా 

చిర్రు బుర్రు మటల మదనా 
మనసు చేరి ఆడు ఇకనా     
చూపుకు చిక్కక కదులునా
గోపికతొ కృష్ణ  లీలనా 
  
పెరుగు చిలుకగా చప్పుడు 
వెన్నముట్టిన చప్పుడు 
వెన్న దోచగ చప్పుడు 
కృష్ణుడే అని ఒప్పుడు 

కర కంకణమ్ములూ కదిలె 
మొలగంట గలగలా కదిలె 
వెన్న తింటు నవ్వులు కదిలె 
స్త్రీలు దొంగా అంటు కదిలె 

కీచుమనే పిట్టలు
పకృతి చేసే ధ్వనులు
భార ధ్వాజ పక్షులు
మేల్కొనే గోపికలు

ఉషోదయకిరణాలు
తట్టు తాళి సుత్రాలు
కుహ్హూ పక్షి కూతలు
పలువిధపు సవ్వడులు

తలలో ఉన్నపువ్వులు
పుష్పాలపరిమళాలు
స్త్రీలలొ ఆర్భాటాలు
నారాయణుని లీలలు

జనులందరికి కనబడు
పామరలకు కనబడు
అంతటా ఉన్నవాడు
ఆందరి లోనీ వాడు

బ్రాహ్మణ వేద పఠనము
గాయకుల తోను గానము 
శ్రోత్రియుల సుప్రభాతము
ధర్మ సంస్థాప మార్గము

--(())--

అంత్యానుప్రాస పద్యాలు....  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


దేవకీ మాత బిడ్డ 
యశోదమ్మకు బిడ్డ 
ఆది శక్తికి బిడ్డ 
లోక రక్షణ బిడ్డ 

దేవ దేవుడుగాను 
అష్ట గర్భము గాను 
ఆది దేవుడు గాను 
అందరి రక్ష గాను 

మధురా నగరంబున    
మధుర మై  తరుణాన
మనిషిగ ఉదయించిన  
మాధవుడుగ మారెనె

మంగళ మగు దివ్వెగ 
అందరికీ  దీప్తిగ 
అప్పులకు బందీగ 
మాయ మహిమ జూపెగ 
  
ద్వాపరము నందుననె  
దాయాదుల కొరకునె 
దాతృత్వము చూపెనె 
దామోదర సౌరినె   

పూర్వ కర్మల బాపి 
మోక్షమార్గము చూపి 
మగువ ఆశలు నాపి 
మహిమలెన్నో చుపె

పూజ చేయు వారికి 
నిత్య సత్య పలుకుకి 
ధర్మపు సంసారికి  
ఆదర్శ పిలుపులకె
  
వాక్కుతో కీర్తించి 
వనమాలి పూజించి 
వేణువుతొ లాలించి 
సాధన సహకరించె      

విరులతో కొలిచె 
అనువణువును తుడిచె 
ఆధారముగా పిలిచె 
లీలా కృష్ణుఁని కలిచె 

విజయ మిచ్చును మనకు 
మనసు తీర్చును మనకు 
కళలు చూపును మనకు 
ఆశలు తీర్చు మనకు 

మోక్ష ధాముడు మనకు 
గీత తెల్పెను మనకు 
జన్మ కారక మనకు 
సర్వ రక్షణ  కొరకె  

--(())--


అంత్యానుప్రాస పద్యాలు.... పాశురం 5 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

యమునా నది విహారి 
మమతలతొ సంచారి 
పుట్టం గానే శౌరి 
యదునాయక మురారె  

యమునా నదీ జలాలు
ఆశ్చర్య కర చేష్టలు
మధురలొ ఆడబడుచులు 
మురారి కోసం కలలె   

యశోదమ్మ పలకరింపు 
గోపకల  మోహరింపు   
ప్రకాశంతొ  మై మెఱుపు  
మురారి తో మతిమరుపె  

కాళిందీ తీరాన
గోపికల మనసు లోన 
కేళీ వినోదాన
మురారి నాట్యతపనె  

నోరారా కీర్తించి
భక్తితోడ పూజించి
మనసారా ధ్యానించి
మురారీని ఆడించె  

మనసారా ధ్యానించి
పుష్పాలతొ పూజించి 
పదాలతో కీర్తించి 
మురారీను అర్ధించె     

జ్ఞాన మిచ్చు నాచార్య
దారిచూపు నాచార్య
విశ్వ సించు నాచార్య  
నిను కొలిచే నాచార్యె 

నిత్య మహింస పువ్వుతొ   
శాంతి నిచ్చే  మాటతొ 
సద్భక్తి అను పూలతొ 
మురారీతోను మమతె 
   
రాజకులముననె పుట్టి   
గొల్లవాడిగా మెట్టి  
శిక్షణగాను చేపట్టి  
రక్షణగాను చేపట్టె 

మురారిని పూజిద్దాము 
నిర్మలంగా ఉందాము 
వ్రతా లన్నీ చేద్దాము 
మోక్షాన్ని పొందుదాము 

యమున జలము పవిత్రము
స్నానము వలన మోక్షము 
పుణ్య దాయకము జలము
మురారికి అభిషేకము 

--(())--

లోక సూక్తులు (ఛందస్సు)

UUII - UIUI - UIIU - IIUU


విజ్ఞానము వింత శోభ అర్ధముచే కనుగోటం 
అజ్ఞానము తన్ను తాను అల్పుడనే అనుకోటం
సామర్ధ్యము నాది నాకే తెల్సుననే దియుగర్వం
వాచాలత తోడు నీడ గా కలవా లని సత్యం

సంకల్పము ఉంటె ఎంతొ దివ్య బలం మనవెంటే
ఆకర్ష ణ ఉంటె ఏం తొ     ప్రేమ బలం మనసంతా
సంఘర్షణ ఉంటె కల్లోలం మమతే మనచుట్టూ
వికర్షణ ఉంటె శాంతి లేక ఉండే భ్రమ సృష్టే   

దివ్యత్వము సామ దాన భేదములే నవజీవం
సాకారము  ప్రేమ శక్తి కామములే  నవరూపం
ప్రామాణిక సేవా భావ తత్వములే నవదీపం
జ్ఞానం మన ప్రేమ తత్వ నిర్మలమే నవదీక్ష

సందేహము ఎప్పుడూ మనస్సు వేధించుట కాదా
ఆనందము ఎప్పుడూ మనస్సు కేశాంతము కాదా
దేవాలయ ప్రాంగణం మనస్సుకే వేదము కాదా
సాహిత్యము ప్రాణ భాష ప్రేరణగా కధ  కాదా 

--((*))--



 *అక్షర  గీతి (కవిత ) 

మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు
వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ

తక్కువ చేయనురా - తాపము చూడుమురా - తమకం విడుమురా 
భాధలు ఎందుకురా - భద్యత నాదియురా - భారము నాదియురా

ఆకలి అణకురా - అసలు నీకేనురా - అంతయు పొందుమురా
దాహము తీర్చుకోరా  - దాపరికం వద్దురా  - దావాలనం తగ్గునురా       

సుఖాలు మనవిరా  - సంతోషాలు మనవిరా  - సంబరం మనదిరా 
కోపాలు మరువురా - కోలాట ఆదుమురా  - కోరిక తీరునురా

మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు
వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ

పక్క చూపు నీకేలరా - పరువం నేనిత్తు - వలపు అందిస్థా
లేదని అనుకోకురా - లోకాన్ని చూడరా - లోకులను గమనించారా   

కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా - కనువిందు చేస్తుండగా
పలకరింపు చూపరా - పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా 

పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ - బొదరింటిలోన
నాగవేషణ యెల్ల - నన్ను కన్గొనుట - నగుచు నే మనుట

సాన పట్టుమురా - సతతము కలవరా - సరిగమ అనరా
వేషము వద్దురా - వేగిర రమ్మురా - వెతలు తీరునురా

రాగవీణను మీటె - రమణి రంజిల్ల - రవము రాజిల్ల
యోగ మేమిటొ నాది - యురికి యొప్పారె - నురము విప్పారె

రామకీర్తన పాడే - రవళి రంగరించి - రసము శోభిల్లే
వేగము మరిచా - వేకువ చేరితి - వేదన తీర్చితి

--((***))--


య  మ  న  స  ర్   గ  
IUU  UUU  III  IIU  UIU  U  
నేటి కవిత్వం - చంద్రశ్రీ -11  
మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ

వినోదం సంతోషాల మగసిరి తో  సాహచర్యం 
ప్రమాదం అన్యాయాకృతి వలపు విశ్వాసభావం 
విషాదం  నిర్వీర్యం  సమయ తావి యే నష్టభారం   
సమానం  కారుణ్యం కళల పసయే సత్యమార్గం 

విలీనం ఆశాపాశములు చవి చూసే టి తత్త్వం   
వియోగం విద్రోహం వినిమయ వరం సంఘసత్యం 
విధానం  సామాణ్యం బతికి వినుటే నిర్మలత్వం  
వికాసం  విశ్వాసం విషయ వివరం  విస్మయత్వం 

కుమారం  సాహిత్యా పరము సకు టుంబా లయత్వం   
సుతారం   సౌజన్యం  విదిత వశుదైకా సమత్వం  
సుహాసం  ప్రేమత్వా సుఖము యశమే జీవతత్వం 
సునామీ  నిత్యాసత్య సమర సుధా మానవత్వం   
     
వినాలే చెప్పేమా టలను సవిదానా పరత్వం        
కనాలే  నచ్చే చూపులను విక సించే ప్రపుష్పం 
అనాలే అన్యాయం విధి అనక ధర్మాన్ని చెప్పై
పదాలే  సర్వార్ధం సతతము పరాసౌఖ్య తత్త్వం 

--(())--       
 ధవళ - (న)6/గ IIIII IIIII - IIIII IIIU
19 అతిధృతి ౨౬౨౧౪౪
పద్యాలు విశ్వాసం (3 )
 రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

తరుణ మిదియు సిరు లొలుకు శుభకర మనసుగా 
విషయము వలన విదిత మగును మది పులకితే     
కనుల కలవరము కధ కనికరము సెగలుగా 
చిరునగవు చిటపటలు సరిగమ పదనిసలే 

జలమున చిగురు కలువల కదలికలు మొదలే 
కలముతొ కధలు కవితలు లిఖితములు సబబే 
హృదయ తపనతొ పని కలిగె కళలు కనుమరిగే     
చినుకులు జలజల పడి జలవనరులు పెరిగే 

కనఁగ నిను హృదయ మిటఁ - గడు ముదము మురియుఁగా
ననలు బలు హృదయవని - నయముగను విరియుఁగా
కనకమయ వసనమునఁ - గరములను మురళితో
స్వనములను వినఁగ నిల - భవ మలరు విరళితో

ధవళమగు వలువముల - దరిసెనము నొసఁగుమా
నవములగు రచనలను - నవనిధిగ నొసఁగుమా
భువనమున బుధజనుల - ముదమనుచు గొలుతు నిన్
భవజలధి తరణమునఁ - దరణి యని తలఁతు నిన్

కువలయము మురిసెఁ బలు - కువలయము లలరఁగా
రవణముల నడుమ నట - రజని శశి వెలిఁగెఁగా
భవనమునఁ బ్రభ లిడుచుఁ - బలు దివెలు వెలుఁగఁగా
నవముగను నెద ముదము - నగుచు నను బిలిచెఁగా

సరసమగు పదములను - స్వర మలరఁ బ్రియముగా
మురిపెముల గళమునను - బులకలిడ నొసఁగఁగా
వరమనుచు మునిగెదను - స్వరసరసి సుధలలో
మఱిమఱియు నిలుచు నిది - మధురముగ మనసులో

--(())--

   


తనను తాను చుట్టెటి చీర మల్లె ఉంట 
విషయ వాంఛల బొంగర మ్ముగను ఉంట 
ప్రకృతి భయముకు తలవంచి ఉంట 
మనసు చెప్పియు చెప్పక బతుకు తుంట 



 
ప్రేమామృతం - (కొత్తది ) ఛందస్సు
రచన :మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ 

UIIUI - UIII - (3) - UIIUI - UIIU

ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక 
శ్రీ కృష్ణ...  మనోహరం (2 )
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


జాబిలి కన్న గొప్పదియు -    మల్లెల కన్న తెల్లదియు
మీగడ  కన్న  మించినది -  వెన్నెల కన్న చల్లనిది 
కృష్ణ పై రాధ  ప్రేమయెరా    

తేనెలొ మాగీ తీయన గ - మామిడి పండు ప్రేమయును
స్వత్సము గానె ఉండుటను -  మామిడి కన్న తీయగును 
కృష్ణ  ప్రేమ రాధ మయంరా  

ఈ నిశి రాత్రి పువ్వులను - నవ్వుల కాంతి వెల్గులను
రమ్య ముగా సరాగమును - తెల్పి సమాన ప్రేమలను
కృష్ణ సమంగ రాధకు లేరా  .          

కళ్ళతొ నన్ను అర్ధించియు - శోకము తీర్చి  వెన్నంటియు
హృదయ తాప తగ్గించియు - శాంతము నాకు కల్గించియు 
రాధ నే కృష్ణ  కౌగిలించేనురా . 

--(())--


శ్రీ కృష్ణ...  మనోహరం (1 )
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

బంధించితిని నిన్ను వలపు బంధము వేసి
వాటముగ చిక్కితివి వదల బోనిక కృష్ణ!
మనసు భావము తెలిపి కలనైన నిను పట్ట
ప్రేమించి పెళ్లాడ వైతి  నేను నిన్నెటుల?

మురళి గానపు మత్తు హొయలన్ని పొందాలని 
మోహముతొ తరుణులు మాధవుని దరి చెర!
వెన్న దొంగవె కాదు వలువ లను దాచిన
మగువ మానస చోర మురళీ ధరా కృష్ణ!

ప్రేమ తో లాలించి సేవించి పూజించ
బంధనము పనియేమి భక్తి భావమె బంధించ!

సేవించితిని నిన్ను  మనసు బట్టియు నేను 
హాస్యముగ పల్కితిని కలలు తీర్చుము కృష్ణ 
వనిత లందరు వలచి వలవేసి నిను పట్ట
వేయిండ్ల పూజారి వైతి కేది నిన్నెటుల?

మరులు గొల్పిన మోము కళలన్ని చూడాలని 
ఆశలతొ మహిళలు  మాధవుని దరి చెర
ప్రేమించితిని నిన్ను హృదయ మిచ్చితి నేను 
కామినిగ తెల్పితిని అలుక తీర్చుము కృష్ణ 

ఆశ తో పోషించి కామించి పూజించ
శోధనతొ కలయేమి భక్తి భావమె బంధించ!

అన్న మాటగ చెప్పి మనసులను దోచిన 
తరుణి తాపస చోర  మురళీ ధరా కృష్ణ!
విషయ వాంఛలు సహన సహవాస మును పట్ట 
ఆలస్య మైనాది ఐతె మైత్రి  నిన్నెటుల?

నడక అందము నాట్య సెగలన్ని చూడాలని 
ఆకలితొ  మగువలు  మాధవుని దరి చెర
ఆశించితిని నిన్ను కళలు పంచెద నేను 
ఆశయము చెప్పితిని మనసు కూర్చుము కృష్ణ 

ప్రేమయే పాలించి బంధంగ ప్రేమించి 
ఆశ్రమము ఇది అన్న భక్తి భావమె బంధించ!

కన్న వారిని మెచ్చి మమతలను పంచిన 
ప్రకృతి కాలపు చోర మురళీ ధరా కృష్ణ!  
సహజ కారణములను తెలిపాను నిను పట్ట 
సాహిత్య సౌందర్య నైతి నేను నిన్నెటుల?
 
పలుకు పుత్తడి మెర్పు కధలన్ని పొందాలని 
వేగముతొ  పడచులు మాధవుని దరి చెర
విన్న వించెద మాట విలువలను దాచిన 
మహిళ కోపపు చోర మురళీ ధరా కృష్ణ!

స్నేహ మే బోధించి వెంటుండి ఆశించ 
సాధనము ఇది అన్న భక్తి భావమె బంధించ!

--(())--


 లోక సూక్తులు (ఛందస్సు)
UUII - UIUI - UIIU - IIUU
నేటి పద్యాలు ... విశ్వాసం 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

విజ్ఞానము వింత శోభ అర్ధముచే కనుగోటం  
అజ్ఞానము తన్ను తాను అల్పుడనే అనుకోటం
సామర్ధ్యము నాది నాకే తెల్సుననేదియు గర్వం
వాచాలత తోడు నీడగా కలవా లని సత్యం

సంకల్పము ఉంటె ఎంతొ దివ్య బలం మనవెంటే
ఆకర్ష ణ ఉంటె ఏం తొ  ప్రేమ బలం మనసంతా
సంఘర్షణ ఉంటె కల్లోలం మమతే మనచుట్టూ
వికర్షణ ఉంటె శాంతి లేక ఉండే భ్రమ సృష్టే   

దివ్యత్వము సామ దాన భేదములే నవజీవం
సాకారము  ప్రేమ శక్తి కామములే  నవరూపం
ప్రామాణిక సేవా భావ తత్వములే నవదీపం
జ్ఞానం మన ప్రేమ తత్వ నిర్మలమే నవదీక్ష

సందేహము ఎప్పుడూ మనస్సు వేధించుట కాదా
ఆనందము ఎప్పుడూ మనస్సు కేశాంతము కాదా
దేవాలయ ప్రాంగణం మనస్సుకే వేదము కాదా
సాహిత్యము ప్రాణ భాష ప్రేరణగా కధ  కాదా   

అమ్మా అని పిల్పు శాంతి నిచ్చునులే మనసంతా 
నాన్నా అని పిల్పు ధైర్య మిచ్చునులే మనసంతా 
తాతా అని పిల్పు భాగ్య మిచ్చునులే  పలుకంతా 
బామ్మా అనిపిల్పు హాయి గొల్పునులే తరుణమ్మే 

మేధస్సుయు లెనినట్టి మానవుడే బతికేనే 
మేథా బల ముండి లేనివానివలే బతికేనే
కాలం మన సొంత దవ్వటానికియే బతికేనే
విశ్వాసము చూపి ఖర్చుచేయుటయే బతుకంతా     

ఐశ్వర్యమ ధా౦దు డిష్ట వాక్యములే వినకుండే 
కారుణ్యముతో మనోబలాన్ని సకార్యముగ ఉండే 
దేహమ్మున ఆశపాశ మంతయులే కలిగుండే 
రూపాన్ని గుణాన్ని సమాజ సేవలుగా ఉపయోగం 
    
--((*))-- 
ఛందస్సు .... ప్రాంజలి ప్రభ 
IU II UUI III UUI  
ఛందస్సు .... ప్రాంజలి ప్రభ 
 విశ్వాసము (2 )

భయమ్మెది లేకుండఁ బనులఁ జేయించి
జయమ్ముల నీవమ్మ సకలకార్యాల
రయమ్ముగ నిమ్మట్లె లలిత! సద్భక్తిఁ
బ్రియమ్ముగ నేఁ బాడి కృతుల మెప్పింతు

విమోహమునున్‌ బాపి విమల, వాగ్దేవి
ప్రమాణముగానుండు పలుకులే రాల్చ
రమాసతితోఁ గూడ రమణనిప్పించు
ప్రమోదముగాఁ గొన్ని పసిడి నాణేలు

ఎడందను నున్నట్టి యెలమితో నీకుఁ
గడంకను నేఁజేయఁ గలిమితో సేవ
గడించఁగ లేదమ్మ ఘనముగా డబ్బు
కడిన్‌ దినఁగా నేదొ కలదు కొంచెమ్ము

విశేషముగా నేది విధియు నీకున్న
ప్రసాదముగాఁ దల్చి బ్రతుకు సాగింతు
నసాధ్యము గాకుండ నడుగు నీ సేవ
ప్రసిద్ధిగ నాకిమ్ము వలయు ధీశక్తి /ధైర్యమ్ము

హతాశను గాకుండ నడుగువందించి
సతమ్మును దీవించి జతగ నీవున్న
వితానముగా గూర్చి విమల వాక్యాల/వృత్తాల
స్తుతించెదనేనాఁడు శుభదగా నిన్ను

సమర్ధత చూపాలి వినయ వాదమ్ము 
విమర్శల మోహమ్ము సమయ కాలమ్ము 
విశేషము చూపాలి కలల తీరమ్ము  
చిరస్మరణీయమ్ము కళల వైనమ్ము 

సకాలము సామర్ధత లను చూపాలి 
అనేకము ఏకమ్ము గలిగి ఉండాలి 
గళం తెలిపేముందు మనసు చూపాలి 
విధానము తెల్పాలి మనసు పొందాలి  

--(())--

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩  
    

గానం. శ్రీబాలకృష్ణప్రదాద్. గారు


నరసింహ రామకృష్ణ నమో శ్రీ వేంకటేశ
సరుగ నా శత్రులసంహరించవే!!


బావ తిట్లకు శిశుపాలుని జంపిన
యేవ కోపకాఁడవు నే డెందు వోతివి
నీవాడనని నన్ను నిందించే శత్రువును
చావగొట్టి వానినిట్టే సంహరించవే!!




దాసుని భంగించేటి తరికస్యపు జంపిన
ఈశు కోపకాడ విపు డెందువోతివి
మేసుల నీలాంఛనాలుమించి నన్ను దూషించే
శాసించి శత్రువును సంహరింపవే!!


కల్లలాడి గూబయిల్లుగైకొన్న గద్ద జంపిన
యెల్లగాగ కోపకాడ వెందువోతివి... 
యిల్లిదె శ్రీ వేంకటేశ ఈ నీ మీదిపాటలు
జల్లన దూషించు శత్రుల సంహరింపవే!!

🕉🌞🌏🌙🌟🚩

Bengali Tune 2 by artist Sekhar Roy | ArtZolo.com

నేటి కవిత్వం
UII  UIU   UU  (3)   -  UII  UIU   I U

తామర పూవులే, మనో  భావము చెప్పుటే, మనస్
మౌహము విప్పుటే, సమా  ధానము తెల్పుటే కదా

సాగర వేగమే, నదీ తాపము ఏకమే, మనో
శోకము తీరికే, సహా వాసము కానుకే కదా

ఆకలి తీర్చుటే, మరో మానస తీర్పులే, తనో
మన్నన ఓర్పులే, సుఖా లిచ్చుట మార్పులే కదా

దారియు లేకయే, దరీ  చేరియు వేషమే, వెసే
కాదని ఔననే, సఖీ వప్పుట సౌఖ్యమే కదా

మానస పూజలే, తపా న్వితము సేవలే, వినో
దాయక ప్రేమలే, సవా లక్ష్యము దివ్యమే కదా

మోనము వీడియే, మనో భావము తెల్పియే, ప్రెమా
ఊపిరి కల్పియే, సదా  శ్రీ కర కాలమే కదా

క్షేమము కోరియే ఉండే క్షామము మాపియే ఉండే 
  
--((*))--
  గురు శిష్యులు -4


2 of my favorite things....eyes and butterflEYES

నేను కెరటము అయిన  పొంగించెదన్ 
మనసు అవసర మయి  పండించేదన్      
మనవు  నరకము  నడుమ తప్పించెదన్ 
తనువు తనువు కలిపి  మెప్పించెదన్ 

మగువ మనసు వెన్న ముద్దగా మారున్   
తెగువ వలదు  కన్నె  మంచిగా కోరున్    
చిగురు పొగరు ఉన్న పంచు వయస్సున్ 
వగరు చూపులు  ఎన్ని ఉన్న సర్దుకోమున్     

మహిళ పై దాడులు ఎప్పుడూ చేయకున్ 
మహిత పై  ప్రేరణ  తప్పాకా చూడుమున్ 
సహన మే పెంచియు  ఓర్పుతో  ఉండుమున్  
మోహము పై  ప్రేమయు పెంచియే  జీవమున్ 

ఆభరణమే మాకు ఓర్పు అని చెప్పుమున్ 
నిబ్బరమే , నమ్మకమ్ము  అని తెల్పుమున్  
శోభనమే  జీవితమ్ము  అని  మార్పుకున్      
శుభము లే  ప్రేమసొమ్ము అని  పల్కుచున్ 

నేటి పద్య పుష్పాలు ( అమ్మా - ఆదిపరాశక్తి )

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


శా    ఆద్యంతం భవ బంధ ముక్తి కలిగే ఆరాధ్య సర్వోన్నతీ

       ఆదర్శ్యం శివ సోమ భక్తి  వచణం ఆదర్శ జీవన్ముఖీ   

       సద్బోదా సతతం  అమృత్వ చరితం సామర్ధ్య సద్భోధినీ  

       తద్భావం సమతుల్యమే స్వరమయం తన్మాయ సంధాయినీ


\శా  నీ సంకల్ప బలం సునంద భరితం ఈప్సిత్వ సంభాషిణీ

      నీ సామర్ధ్య జపం మరంద విదితం  ఈశ్వర సంధాయినీ

      నీ సామ్రాజ్య తపం విధాత వినయం ఈతత్వ సంభోధినీ  

      నీ సాత్వీక గుణం సమర్ధ చరితం  ఈమాయ విద్వంసినీ  


శా. నీకై యేను దపంబు చేసితి మహా-నిష్ఠా గరిష్ఠస్థితిన్

      నీకై సంస్తుతి సేయుదుం గడఁగి నా - నేర్పొప్పఁగా నెంతయున్

      నీకై పూజయొనర్తుఁ గొంత విరులన్ - నిత్యంబు సద్భక్తితో

      నీకై సేవ యహర్నిశం బొనరుతున్ - వేదండచర్మాంబరీ


శా. సర్వార్ధ సహనం సమన్వయ మయం సామర్ధ్య సర్వోన్నతీ

. . .  కర్యార్ధీ తరుణం మహాను భవునీ కారుణ్య కార్యోన్ముఖీ

. . . . ఆరాధ్యా యుతమే సుమంగళ కరే ఆదిత్య ఆనందినీ 

. . .  ధర్మార్ధా లయమే సహాయ చరితం దుర్నీతి భస్మాహినీ


                    --))((--




UUU  UII  UUI  IU


నేటి కవిత్వం - అధరం మధురం

మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ


జడి జడి వానకు పొడి పొడి వేడికి జత

చిరు చిరు నవ్వుకు కొర కొర చూపుకు జత

మడి మడి మాటకు చలి చలి ఆటకు జత

థళుకు థల మెరుపు టప టప రప్పలు జత


కలలు కలసి కనికరము పెరిగి కధలు కదిలి

కనులు సెగలు ధలథల తరిమిన బదులు కదిలి

కురులు ఫెళ ఫెళ మని పవనునకు ముసుగు కదలి

కళలు కలయిక అడుగులు తడబడిన ఒకటిగ


సరి సరి అని మది తెలిపి మధుర పలుకు పలికి

సిరి గల మగువకు జత మగసిరి గల మగనికి

పరి పరి విధముల సొగసు ఒరవడి కదలికకి

మరి మరి వడి వడి తలబడి కనవిని ఎరుగక


మమత పెరిగి ఘుమ ఘుమలు తలపడి ఒకరొకరు

పద పద యని సరిగమ పదనిస ల పదములను

పలుకగ చిరు నగవు దరి తెలిపి జత కలిపిన

అణువణువు అరమరికలు తెలపక జత కలిసె


--(()) - - 


UUU  UII  UUI  IU  - UUU  UII  UUI  IU  
నేటి కవిత్వం - వాతార్మి  
రచయత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ  

సంఘం సంతోషముగా ఉండవలే - దివ్యజ్ఞానం  విధిగా పొందవలే
ద్రవ్యజ్ఞానం మదియే మార్చుటయే - ద్రవ్యా దివ్యా లయమే జీవితమే      

ఈ దాహమ్మే  సతిగా తీర్చుటయే -ఈ మౌనమ్మే పతిగా మెప్పించుటే
ఈ దేహమ్మే  గతిగా గుర్తులులే  - ఈ ప్రాణమ్మే  విధిగా  తీర్పులులే       

చూపుల్తోనే సమయా నందముగా -  చేతల్తోనే ఫలితా నందముగా 
మాటల్తోనే వినయా నందముగా  - ఆటల్తోనే  మది ఆనందముగా  

ఆనందంమ్మే సహజా ప్రాణములే - ప్రత్సాహమ్మే  వినయా దీవెనులే 
సామర్ధ్యమ్మే  సహనం సేవలులే - సాహిత్యమ్మే  మనసా సంతసమే 

శృంగారమ్మే ప్రతిభా ఫాఠములే - బంగారమ్మే మరిచే బ్రాంతియులే 
శ్రీ కారమ్మే  చరితం చూపెనులే - విశ్వాసమ్మే  సహన0 చూపెనులే        

ప్రారబ్ధం స్వీకర ముంటేను శుభం  - సందర్భం బట్టియు జీవిచుటయే 
విశ్వాసం చూపుట సంతోషములే  -      సామర్ధ్యం బట్టియు బత్కి0చుటయే

   --(())-- 

నేటి ఛందస్సు కవిత 

లయాలయ - స/జ/భ/ర/జ/జ/ర/స/య, రెండేసి పాదములకు ప్రాసయతి

IIUI UIU - IIUI UIU - IIUI UIU - IIUI UU


తరుణాలతత్వమై తమకాన్ని చూపవే 

తపనంత తీర్చవే తరుణీవి నీవే    

మనువాడి మార్చవే మనసంత నీదిగా 

మమతల్ని చూపవే మధుశాలినువ్వే 


చిరుహాస మెందుకే చిరుజల్లు చాలునే 

చినుకల్లె తడ్పవే చిన రాధ నువ్వే 

కలలన్ని కావులే కనుసైగ చాలులే 

కనువిందు కామినీ కళ చూపు నువ్వే 


కలవాలి కోర్కతో  నడవాలి ఆశతో 

తడవాలి తృప్తిగా  చిరు హాస్యమల్లే  

పరువంలొ పండగే  తరుణంలొ దప్పికే

ప్రణయంలొ సేవలే  వినయం లొ నువ్వే  


విధిరాత వింతలే  వినయాన మోతలే

మదిలోన మాటలే  కదలల్లె మళ్ళీ  

జతకూడి జాతరే  జపతాప తగ్గుటే

సమయాన ఇష్టమే  సమజోడి చిందే 


--(())--


నేటి ఛందస్సు కవిత 

 II UI U I U - II UI U I U 

రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


కల కల్పనే కధా చిరు హాసమే మరో 

మలుపే మదీయ మానస మనో 

 లలితాన్వితమ్ముగా  సుఖ లోల సౌఖ్యమే 

సమ పోషణా లయం సమతృప్తి కారణం   


మరుమల్లె నీవుగా విరజాజి పువ్వుగా 

సుమఘంధ పూతగా సరి ఊగ తావిగా

మధనమ్ము చూపవే మానసిచ్చి చూడవే 

మధురాతిమానసం మనువాడ పొందుకే


కల కాదు విద్యయే కలలన్ని పండునే    

తరుణాన తత్వమే తమ కాన్ని పంచవే 

పరవళ్లు తొక్కకే వరమైన నీవుగా 

కురులన్ని విప్పవే సుమ కుంద నమ్మువే


నగ నాకు చూపవే నటనాల నందినీ 

నగు మోము ముద్దులే నవరాగ మాయగా 

నవ తేజ మంతయూ నను కమ్మి పంచవే 

కల కాదు నీతియే కదు ధ బుద్ధియే 


నను నమ్మవే సతీ - నను చూడవే గతీ

- నను కావవే  మతీ - నను తాకవే రతీ       

చిరునామ చెప్పఁవే - చిరునవ్వు చూపవే

-చిరుహాస పంచవే - మురిపాలు ఇవ్వవే


కలకాదులే వతీ - నిజమాయలే జతా

- మన మాయలే పతీ - మనతాపమే రతీ

మన సంఘమే గతీ - మన కామమే యతీ

కళ కాదులే  పతీ - ప్రకృ తీ కలే ఇదీ


వయసే కదా మడీ - మనసే కదా బడీ

వలపే కదా వడీ  - సొగసే కదా సడీ

తలపే కదా జడీ - పరువే కదా తడీ

చిగురు కదా చడీ - చమటే కదా పడీ


మనసుందిలే ప్రియా - మమతుందిలే ప్రియా                 

భయమెందుకే ప్రియా - దడుపెందుకే ప్రియా

చనువుందిలే ప్రియా -  మది పంచుతా ప్రియా

నవనవ్వులే ప్రియా -  పవళింపులే  ప్రియా

--((***))--


Media Tweets by Sarika Gangwal (@SarikaGangwal) | Twitter

III  III  II  UUU  -6 
నేటి కవిత్వం - వృత్త -౬
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కలలొ నలక కను చూపుల్లో         
చిరు నగవ చినుకు కళ్ళల్లో 
మది తెలుపు మసక వేళల్లో 
పలు కలువపు లత విచ్చుళ్లే 

వరుస పరువపు జత సేవల్లో 
లలన లయ లత జత మాటల్లో 
సరిగమల సరి యుగ  వేదాల్లో 
కళ నిజము కళల ఆటల్లో 

చరిత మరచి ఒక ఊహల్లో
మనసు చెలిమి చారు హాసల్లో 
సొగసు వరుస కళ ఊఫుల్లో 
తరుణ మమత కథ తోపుల్లో        

రతి లొ మధుర మది వేవిళ్లే 
చరణ చరిచి విధి వాకిట్లో 
కరుణ చిలక వల లోగిల్లో 
పెదవి రుచి పిలుపు పొంగుల్లో  

--(())--



*ధరణీ దిశ

నల్లని మేఘముల్ - తెల్లని మేఘముల్
ఎర్రని మేఘముల్  - నింగి ఆవహించెన్
ఎనిమిది దిక్కుల్  - పెళ్ళని గర్జనల్
తలుక్ మెరుపుల్ - పిడుగు శబ్దముల్
విస్త  రించెన్     - ప్రపంచమునందున్   

పుడమి తల్లి పురివిప్పేన్ 
మయూరం పింఛము విప్పేన్
నాట్య మాడి పరవశించెన్        
చల్లని గాలి తనువు తాకెన్
పృద్వి వర్షపుజళ్లుకు పులకించెన్
పుడమి భామిని వెచ్చని చీర దాల్చెన్ 
జల ప్రేమతో శోభనందించి సంతసించెన్

నింగి మరుడు నీటి బాణములతో కొట్టెన్
నెల మగువ కేమో నెలలు నిండెన్
కడుపు పండి తాను కంకులం ప్రసవించెన్ 
వర్ష ఋతువు యందు వసుధ సంతశించెన్

విరామము ఎరుగని గాలి చేతన్    
స్వేశ్చ కిరణముల చేతన్
భేదము చూపని వసంతుని చేతన్
ధరణీ దిశ ప్రసారిత వృద్ధి చెందెన్  
--((*))--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి