11, డిసెంబర్ 2020, శుక్రవారం

కవితలు


నేటి కవిత == పేగు తెంచుకోలేని*****
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

రక్తసిక్తముగా మారుతున్నది ఈ  కర్మ భూమి 
ఎవ్వరూ చేయని పుణ్యమా, ఎవరో చేసిన పాపమా 
విధివంచనకు గురై నడక సాగుతుంది ఈ భూమి 
తిండి లేక పనిలేక  ఆశ చంపుకొని ఎందుకు నడకా   

అమ్మ ఆర్తనాదం జీవర్తించలేని ఇదా ధర్మ భూమి
పేగుబంధము కూడా తెంచు కోలేని స్థితి ఖండమా 
ధరిత్రిని ముట్టడించి యముఁడాజ్ఞగా మారిన భూమి 
జన్మస్థానం కోసం మర్మస్థానం మరిచే యుగమా   

జాలి చూపని  ఇదేమి పాశం, బతుకెందుకా ఈ భూమి 
తీర్పులో ఓర్పు లేదు, కన్నీరుకు లేని హృదయమా 
జంతువులకున్న స్వేశ్చ  మనుష్యులకు లేని భూమి 
ఎంతఉన్నా దైవం సొమ్ము తినాలనే కాంక్ష ప్రేమమా 

ఏదో భావమునే మదీయ తలపే తెల్పేందుకే నా వయ
స్సేదో తెల్పకయే వినీల మలుపే మల్లించుటే యీ సమ
స్సేదో కల్పనగా తపస్సు జపమే సత్యాలుగా యీ మన
స్సేదో నీ పరమే ఉషస్సు వెలుగే దైవమ్ము వేదమ్ముగా

కాదో అన్న సరే కధల్ని తెలిపే సత్యాన్ని బత్కేందుకే
చేదో తీపి మనస్సు వెంట పడుటే చేదోడు వాదోడుగా  
పేదో గొప్ప సరే ఉషస్సు వెలుగూ ప్రేమమ్ము పంచేందుకే
లేదో ఉన్నదియో యశస్సు మలుపే హృద్యమ్ము విశ్వాసమే 

అమ్మా నీకు శతకోటి దండాలు మాపై చూపుతున్న కరుణా 
రక్తసిక్తముగా మారినా కన్నబిడ్డకోసం హృదయాంతర్మధనమా
ప్రేమకు సత్యమన్నది లేదు, న్యాయమన్నది కానరాని ఈజగనా    
ఎట్లా ఉన్నా అమ్మ ను ఓదార్చి, మాటను గౌరవించేదే ఈ భూమి  

ఎట్లా ఉన్నా అమ్మ ను ఓదార్చి, మాటను గౌరవించేదే ఈ భూమి
ఎట్లా ఉన్నా అమ్మ ను ఓదార్చి, మాటను గౌరవించేదే ఈ భూమి
--(())--



 


మరపు - రోగం
మైమరపు - భోగం 
పరవశం - యోగం


ధవళ - (న)6/గ IIIII IIIII - IIIII IIIU
19 అతిధృతి ౨౬౨౧౪౪ 11  యతి  

UIIUI - UIII - (3) - UIIUI - UIIU
మల్లాప్రగడ ఛందస్సు కవిత (1 )


 కాంతామణి గోపికమ్మా వచ్చినామమ్మా
మమ్ములను లేపదననే చెప్పితివి గదమ్మా
వేకువ కాలేదని బూకరిస్తివి నీవమ్మా
 మేమే వచ్చినానమ్మా ఇక నీవు లేవమ్మి

మంచి మాట కారివి నీవు గడుసు దానివమ్మా
నాలుకుందని మాట్లాడి సిగ్గును తెలపకమ్మా
కన్నులు తెరచి చూడు మేమసత్యమాడవమ్మా
అభిమానవతివమ్మా ఇక లేచి రావమ్మా

నీవు వేళ్ళే మార్గములో తోట బావుందమ్మా
కళ్ళుమూసి నడిచిన నిన్ను హరించి వేయునమ్మా
కలువలు వికసించె కలువలు మకులించేనమ్మా. 
భక్తితో పూజచేయు పరిపూర్ణ జ్ణానివమ్మా

శంఖచక్రములతో ఉన్న కృష్ణుని చూడమ్మా
దీర్ఘబాహువులున్నట్టి కృష్ణుని ప్రేమించమ్మా
పంకజనేత్రుని సేవకు భక్తితో కీర్తించుటకమ్మా
నిత్యకైంకర్యాలకై అనునిత్యం సేవలకమ్మా

మార్గశి నెలలోన మగువల వ్రతముతో గోపికలమ్మా 
పుణ్య వతులు చేయు పూజ నేడు చేసి చుండిరామ్మా   
గోదదేవి తెలిపి గోవిందు మహిమను ఈ తరుణమమ్మా  
భక్తి తోడ నిన్ను భజన చేయు సత్య మార్గమమ్మా   

సఖియ లంత జేయ  సౌభాగ్య వ్రతము ఇది యమ్మా  
పూల మాలలన్ని పూజ కొరకు ఏర్పాటు చేసిరామ్మా  
ముక్తి కోరు వారు భక్తితో చేయగ సంతోషపడితిరమ్మా  
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు నిజాయితీలమ్మా 

అంధకార బంధురంలో ఓ వెలుగురేఖ కృష్ణ 
భూనభోంతరాల నడుమ నల్లనయ్య కృష్ణ 
పీతాంబరధారి పిల్లనగ్రోవి గమక గీతాల కృష్ణ 
గోపికామణుల కింకిణీ శింజిణీ ఝరుల కృష్ణ 

కాళిందు దర్పమణిచిన కరుణామయ కృష్ణ 
ధృఖః కరణే దుఃఖ నివారణించెదనని కృష్ణ 
నిన్నటిలో నెరవేరని ఆశలు నేడు తీర్చు కృష్ణ 
నివురు గప్పి నిప్పులా ఉన్న వాణ్ని మార్చు కృష్ణ 

పర స్వరూప జ్ణానము మానవాభ్యదయము కృష్ణ 
స్వర స్వరూప గానము భావా అభ్యుదయము కృష్ణ 
పరమాత్ముండు తెల్పెను ధర్మ మార్గమయం కృష్ణ 
దివ్వ సందేశ విశ్వ ప్రాణ జిహ్వమయం ము కృష్ణ 

రాక్షసుల్ని సంహారణ బాలమేధావి కృష్ణ
పరస్వరూప జ్ఞానము గోప్యం మన్నావు కృష్ణ 
పక్షి నోరు చీల్చీ బకాసుర సంహారకా కృష్ణ  
జనులను రక్షకునిగా శ్రీకృష్ణుడు పరమాత్ముడు

యువతులంత అందరూ కలసి కీర్తించే కృష్ణ     
పక్షులన్ని కూస్తు కొలువు ధీరు సూర్యుడై కృష్ణ
తామరలో తుమ్మెదల దోబూచు కన్నుల కృష్ణ
 
మనిషి మనస్సులనే దోచేటి నేత్రాల కృష్ణ  
శీతల జలము ప్రవాహము వల్లే ఉన్న కృష్ణ
దుర్మార్గుల్ని శిక్షించి లోకాల్ని చూచు కృష్ణ
మంచి దినములలోను సుఖాల్ని లందించే కృష్ణ 

జ్ఞానమందించేటి గురువుగా బోదించేటి కృష్ణ
పవిత్ర పుణ్య జలధామములో ఉండేటి కృష్ణ
తొలిగించు మనిషి విరహ తాపము నిత్యమూ కృష్ణ 
తొలగి గించె దంభము, అహంకారము తొలఁచె కృష్ణ     
--(())-- 


21. తెలుగు భాష నేర్చుకుందాం 
ఛందస్సు (4 ) 
IIUII  UUI  -   IIUII  UI U
 
సమభాగము పంచేను 
నిముషమ్ముగ చూచేను 
 విముఖముగా  పల్కెను 


చరణమ్ముల నీపద్మ
చరణమ్ములఁ గొల్తురా
హరియంచిల నేనెప్డు
హరుసమ్మున దల్తురా

తరుణమ్ములు నీవంతు
తరుణమ్ములు చూపరా 
మదితెల్పెద నేనెప్డు
మనసమ్మున దల్తురా
    
సరసమ్ముగ నాడవా
సరసీరుహ నేత్రుఁడా
వరమీయఁగ రారామ్ము
వరదా పరమాత్ముఁడా

సమయమ్ముగ ఆడగా
సమయాసమ నేత్రుడా   
మనసీయగ రావమ్ము 
సమయా పరమాత్ముడా  

--((**))--


20. తెలుగు భాష నేర్చుకుందాం 
UUIU IUUI  ఛందస్సు (6 ) 

సమ్మోహనా సదావాణి 
విశ్వాసమే వినోదమ్ము 
సద్భావమే సకాలమ్ము 
బ్రహ్మాండమే సజీవమ్ము 

మౌనమ్ము నే  మిదే  గమ్య 
భావమ్ము యే  దివ్య దీపమై
ప్రేమమ్ముతో  సదా నాకు 
ధర్మమ్ము యే  నీతి  మార్గమే 
  
రావేలకో ప్రియా రమ్య
రావల మై రత్నదీపమై
జీవమ్ముతో సదా నాకుఁ
జేవన యై నవ్య తేజమై

దేవీ మనస్సులోఁ బూల
తీవెల గాఁ బాలపుంతగా
నావైపు చూడవా తేలు
నావల గాఁ బిల్చు త్రోవగా

--((***))--

telugu భాష నేర్చుకుందాం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
  
19. రవి (కామినీ, భామినీ, తరంగవతీ)- ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171

కాల మాయ వెంట ఉంటినే 
విశ్వ వాణి వల్ల వేకువే 
ధర్మ సాక్షి నీకు తోడులే 
చిన్న పెద్ద చెప్పా లేనులే 

వేచి ఉండి వాడి చూపులే 
కొంప కూడు ఆమ్మే ఆటలే  
నమ్మి వమ్ము చేసె మాటలే 
చెప్పు చేత వల్ల  భాదలే 

వద్దు సద్దు పొందు ఆనకే 
ఓర్పు నేర్పు చూపు ఆనకే 
తప్పు కాదు తీర్పు  ఆనకే
ఆట పాట సంత ఆనకే

వంక డొంక సాగి చేరుటే 
విప్పి కప్పి కల్సి పోవుటే    
మత్తు చిత్తు చేయ ఉండుటే
నీవు నేను కల్సి ఆడుటే 

--((**))--


18. నేటి పద్య పుష్పాలు
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కంటి చుక్క కన్న తీపి...... కడలి ఉందెక్కడ..!
కుంటి సాకు కన్న ఓర్పు .... మడమ ఉందెక్కడ 
ఒంటి మోజు పైన తీపి ........ ఫలము ఉందెక్కడ
చంటి పాప పైన ముద్దు ...... జగతి ఉందెక్కడ 
  
అమ్మ ఒడిని మించి......ప్రేమ నగరి ఉందెక్కడ..!
నాన్న కలిమి మించి ... స్నేహా నగరి ఉందెక్కడ 
అన్న చెలిమి మించి .....శాంతి నగరి ఉందెక్కడ 
కన్న బలిమి మించి ..... కాంతి నగరి ఉందెక్కడ 
.
మనసు లోతు లెక్కగట్టు..... సూత్ర మొకటి ఉందెక్కడ..!
సొగసు మోజు కానిదంటు .... మాత్ర మొకటి ఉందెక్కడ ..
వయసు పోరు లేని దంటు .... ఆత్ర మొకటి  ఉందెక్కడ 
తనువు ఆశ లేని దంటు ........ గాత్ర మోకటి ఉందెక్కడ   

అమ్మ భుజం పైన గాక... . మధురాపురి ఉందెక్కడ..!
నాన్న మౌనం పైన గాక .... సమయాపురి ఉందెక్కడ 
కన్న ప్రేమమ్ పైన గాక ..... తపమాపురి ఉందెక్కడ 
అన్న మాటే పైన గాక ...... వినయాపురి ఉందెక్కడ   

నాన్న శ్రమకు అభినందన..చందనమది ఉందెక్కడ..!
అమ్మ ప్రేమకు అభినందన ... సంతస మది ఉందెక్కడ  
--(())--

17. నేటి కవిత ... తప్పదా  

రోగ మన్నది,  ఓర్వలేనిది,  
ఎక్కడైనను తప్పదా
నీతి యన్నది, మర్వలేనిది, 
తక్కువైనను ఒప్పదా

జాతి అన్నది, పిల్వ లేనిది, 
మక్కువైనను తప్పదా
ప్రేమ అన్నది, కొల్వ లేనిది, 
నిండి ఉన్నను తప్పదా

అద్ద మన్నది, స్వార్ధ మైనది, 
ఎక్కడైనను తప్పదా
నీడ అన్నది, ఆశ యైనది, 
తక్కువైనను ఒప్పదా

తాడు అన్నది, పాము యైనది, 
మక్కువైనను తప్పదా
దేహ మన్నది  దాహ మైనది  
నిండి ఉన్నను తప్పదా

శక్తి కన్నను, శ్వాస మిన్నను, 
ఎక్కడైనను తప్పదా
మేను కన్నను, మాను మిన్నను, 
తక్కువైనను ఒప్పదా

యోగి కన్నను, రోగి మిన్నను, 
మక్కువైనను తప్పదా
జాతి కన్నను, నీతి మిన్నను,  
నిండి ఉన్నను తప్పదా

--(())--



16. నేటి కవిత నన్నా వహించే 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ప్రేమలేఖ అందుకున్నా ..
అందెల సడి నన్నావహించే .!
ఆకలంత తీరాకున్నా  ....
మద్దెల సడి నన్నా వహించే

శోకమంత పోకయున్నా ....
సవ్వడి దడి నన్నా వహించే
దేహమంత దాహమున్నా  ....
తప్పు చె యక నన్నా వహించే

నీ మెఱుపుల ఆ తోటకు..
కంచెన్నది అడ్డు నన్నా వహించే
నీ తలపుల ఆ ఆటకు ...
వద్దన్నది అడ్డు నన్నా వహించే

నీ వలపుల ఆ మాటకు ...
రమ్మన్నది అడ్డు నన్నా వహించే
నీ మలుపుల ఆ కోర్కకు ....
ఆశన్నది అడ్డు నన్నా వహించే

బడిగంటకు గుడిమెట్లకు..
స్నేహమెలా కుదిరిందో నన్నా వహించే
తపమన్నది జపమన్నది ....
దాహమెలా జత యిందో నన్నా వహించే

జల మన్నది గళమన్నది .....
వేగమెలా క దిలిందో నన్నా వహించే
కల అన్నది కళ అన్నది .......
కోపమెలా ముదిరిందో నన్నా వహించే

--(())--

****
15. నేటి ఛందస్సు కవిత ... ఆశల మొగ్గ 
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఆశల మొగ్గలు విచ్చవు 
కోరిక తీర్చక ఉండవు 
జాగృతి అనియు చిక్కావు
చీకటి వెలుగు అన్నావు 

బతుకుకు బాట చూపావు 
నడకకు నాట్య మైనావు 
నవతకు ధర్మ మైనావు 
పలక లేని మొగ్గైనావు 

చిరుహాస చిందు మొగ్గవు 
ధరిత్రి  మొగ్గ వైనావు 
చరిత్ర సృష్టిస్థి న్నావు 
వెన్నెల మదిలొ నున్నావు 

ఇలలో పంట అయినావు 
కళలుగ మారిపోయావు  
తరువుకు భార మైనావు 
బతుకు ఆశ మొగ్గైనావు 

మనసులో మమతైనావు
వయసులో ఉడుకైనావు
సొగసులో చురుకైనావు
కదలికలొ గాలై నావు   
 
--(())--


14. ఈనాటి ఛందస్సు కవిత 
అమాయకుని భార్య స్థితి 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కళ్ళలొ కన్నీరు తుడిచి
మనసుకు హాయి అందించి
చిరునవ్వులే చూపించి
రోగం నుండి బతికించె ఈశ్వరా 

నిశ్శబ్దాన్ని భరిస్తూ
నిజము ను తెలియపరుస్తూ
చీకటిలొ వెలుగునిస్తూ
కళలను బట్టి   నడిచే ఈశ్వరా 
  
కలసి ఉంటె కలదు సుఖము
కలసి ఉంటె కలుగు జయము
కలసి బతుకే జీవనము   
వెలుగు నీడలు సౌఖ్యమే ఈశ్వరా 

సతి హితమే కోరు గుణము
సతి మనసుతో సమ్మతము
సతి సేవ నిత్యతరుణము 
సతి లక్ష్యము పోరాటమె ఈశ్వరా 

ముద్దులొలికే మోముతో 
మోము పున్నమి జాముతో 
జాము రాతిరి సుఖముతో 
ఉన్న మాకు కష్టమేను ఈశ్వరా 

సయ్యంటె సయ్యనేదీ 
మనసంతా పంచేదీ  
రోగమేదొ వచ్చిందీ 
సేవ నాకు వద్దందీ ఈశ్వరా 

బంధంతో బతుకైనది
బతుకే స్వర్గం అన్నది
హృదయాన్నిదోచేసింది  
దోచిన హృదయం బాదది  ఈశ్వరా 
 
ఓపి కొస్తె చాలు కదిలే 
పనిలో ఆరాటములే  
నాతో పోరాటములే
ఇప్పడు కాల మాయలే ఈశ్వరా 
    
నీకు చెప్ప దలచ లేదు   
దైవ పూజ వదల లేదు 
కాల మాయ మరవ లేదు 
వేద పఠన వదల లేదు ఈశ్వరా 

--(())--  


13. ప్రాంజలి ప్రభ .... 1004 
నేటి కవిత్వం - సృష్టిలో  " స్త్రీ " 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సంసారంలో దించే ఆకర్షణ 
 సుఖాలు పంచే శరీర పోషణ
సెగలు చల్ల బరిచే వ్యామోహం  
చూవుల్లో మైమరిపించే సౌందర్యం
  
సంతోషంతో పంచే ఆకర్షణ 
వినోద భావం సకాల పోషణ 
కధలు చెప్పి పలుకే వ్యామోహం
మొహంతో మాయనుపెంచే సౌందర్యం  
  
 ఆరోగ్యంతో చూసే  ఆకర్షణ
మనస్సు మార్చే విశేష పోషణ 
నగలు పిచ్చి  కులుకే వ్యామోహం  
 దాహంతో దప్పిక తీర్చే సౌందర్యం

ఆనందంతో ముంచే ఆకర్షణ 
వయస్సు పెంచే మదీయ పోషణ 
 వగల మారి పిలుపే వ్యామోహం 
 కాలంతో సర్దుకుపోయే సౌందర్యం 

మనసుతో వ్యక్త  పరిచే ప్రేమ మాధుర్యం 
వయసుతో స్వేశ్చ తెలిపే ప్రేమ మాధుర్యం 
సొగసుతో  గాయ పరిచే ప్రేమ మాధుర్యం  
కళలతో యుక్తి  తెలిపే ప్రేమ మాధుర్యం
   
ఒకరికి ఒకరు కలుసుకొనే స్నేహాపర్వం 
మనసుకి మనసు మలచుకొనే స్నేహపర్వం 
వయసుకి వయసు కలుపుకొనే  స్నేహపర్వం 
మగనికి మగువ తలచుకొనే స్నేహపర్వం 

చల్లని వాతావరణంలో కల్పించే సంతోషం  
వెచ్చని ఆనందరణంలో పోషించే సంతోషం 
నవ్వుల సేవాతరుణంలో కల్పించే సంతోషం 
మంచిని పెంచేటి రణంలో పోషించే సంతోషం  

ప్రేమను పంచే కళ నైపుణ్యం  
వాత్సల్యమనే తీపి దనం 
సరాగాలతో వలపుల మయం
చీకటిలో వేడిసెగలు చల్లార్చే వయనం

తపస్సును భగ్నం చేసే సాంగత్యం 
శుఘంధ పుష్పాల సుమధుర పరిమళం 
తనువును అందించే సుఖ సౌఖ్యం     
మనసులో ఉన్న మాయను తొలగించే మర్మం 

విద్యా విషయంలో సహాయం 
విశ్రాంతి విషయంలో కల్పుకోలుతనం 
శ్రమకు చేదోడుగా నిలబడటం 
ఆలోచనపరంగా మనస్సుకు నిర్మలం 

కళ్ళ చూపుల్లో  కరుణ తత్త్వం 
శ్రేయస్సు కొరకు పలుకు సత్యం  
సిరులను పెంచే సున్నిత తత్త్వం 
పలకరింపులో మధురాతి మాధుర్యం  
బిడ్డలను ఉన్నతులుగా మార్చే వ్యక్తిత్వం 

ఇక చెప్పాలంటే 
స్త్రీ యే సత్యం - స్త్రీ యే నేస్తం - స్త్రీ యే నిత్యం 
స్త్రీ యే శక్తి - స్త్రీ యే ముక్తి - స్త్రీ యే యుక్తి  
స్త్రీయే  మైనం - స్త్రీ యే మౌనం - స్త్రీ యే మైకం 
స్త్రీ యే  వైరం - స్త్రీ యే వేదం - స్త్రీ యే కాలం 

స్త్రీలు వర్ణించాలంటే  నా శక్తి కవిత్వం చాలదు 
మిరే చెప్పండి ఇంకా స్త్రీల విషయాలు 
స్త్రీ  లేందే  మనం లేము - మనం లేందే స్త్రీ ఉండ లేదు 
ఇదే లోకం - ఇదే గమ్యం - ఇదే మర్మం 
  
--(())--



12. నేటి కవిత .....ఓకరోనా  ... 1003  

రచయత: మల్లాప్రగడ  శ్రీదేవి  రామకృష్ణ 


పొట్ట చేతను బట్టి బిడ్డల కోసమై 
పొరుగు ఊరుకు  చేరి పని చేసి  
పనికి మూణ్ణెల్ల ఊరు చలవ దోసిళ్ళతో 
చక చక  ఆ ఊరు వదలి వచ్చితి   

పూల కంచాలలో తిందామంటే 
రోగమన్నారు  ఒకరు,  
తిరగొద్దన్నారు మరొకరు, 
తెలవాఱకుండ మొగ్గలలోన జొరబడి, 
వింత వింతల రంగు వేసి  మాయ చేసి, 
ఇంటిల్ల పాటితో  కలసి ఉన్నా,     
అప్పుడే తెలిసింది నా కు కరోనా అని. 

చూసే  వారు లేరు, 
దగ్గరికొచ్చేవారు లేరు, 
మం దనేది ఇచ్చేవారు లేరు,   

తీరికే లేని విశ్వ సంసారమందు, 
దగ్గర గున్నా చూసే దిక్కు లేదు,
బిడ్డలు  దరి చేర లేదు, 
భార్య చూద్దామని కూడా రాలేదు,
అంటూ  రోగిగా మూలా పడేసారు, 
ఇదేమి లోకమో అని అనలేను, అసలు  వస్తేను కదా 

అలసిపోయితివి మీ సమాధాన మాకువద్దు 

నువ్వే మాకు వద్దు నీ రోగం మాకు అంటు కుంటుంది,   
నీవు పరదేశంలో ఉన్నావని చెప్పు కుంటాము లే 
నీ ఆరోగ్యం కుదుటపడేదాక జాగర్త తప్పదు 


అందుకే  దేశంలో  బ్రతకండి, ఏదైనా సహాయము సహాయం చేసే వారుంటారు      
ఇతర దేశాలకు పోయి బాధ పడ వద్దండి,  
మాతృ భాషను గౌరవించండి,   
ఇది కరోనా రోగముతో  ఉన్న  ఒక తల్లి  ఆవేదన,     
ఒక తండ్రి ఎదురుగా ఉన్న గుర్తించలేని, 
స్థితి ఎవ్వరకూ రాకూడదని ఆ దేవదేవుని 
వేడుకుంటూ ఆక్రన్దన. 

దయచేసి రోగాన్ని దాచకండి 
ప్రభుత్వ సూచనలు పాటించండి 
--(())--

10. నేటి కవిత .....ఓ స్త్రీ నావెంట పడతావు ... 1002  
రచయత: మల్లాప్రగడ  శ్రీదేవి  రామకృష్ణ 

ఎందుకే నావెంట పడతావ్   
ప్రకృతి వరాలు నీకు తోడుండగా 
మేనిలో గంధాలు పూసావు  
మెరుపు తీగలా మెరిసిపోతున్నావు 

చిగురాకు ఆధారాలు చూపుతున్నావు 
సింధూర వర్ణాల వలువలు ధరించావు 
తరుణీ సుమ పరిమళాలతో ఉన్నావు  
ఆలోచనతో భ్రమింపచేస్తున్నావు 

ఎందుకే నావెంట పడతావు    
ప్రకృతి వరాలు నీకు తోడుండగా 
నీలి కన్నులతో, నిండైన రూపముతో, 
చిరునవ్వు మంద హాసముతో, 
కస్తూరి పరిమళాలతో, 
కరిగించు రస ధారతో, 
కనువిందు చేస్తూ, మత్తెక్కిస్తున్నావు
 
ఎందుకే నావెంట పడతావు    
ప్రకృతి వరాలు నీకు తోడుండగా
నల్ల శిరోజాలతో మైమరిపిస్తూ 
సింధూరపు ఆధరాలతో పిలుస్తూ
మేని ముసుగులో చూపక చూపిస్తూ 
ముక్కెర అందంతో మురిపిస్తూ 
వక్షోజాలను వయ్యారంగా వలకబోస్తూ 
ఎందుకే నావెంట పడతావు    
ప్రకృతి వరాలు నీకు తోడుండగా  
--((**))--


9. ప్రాంజలి ప్రభ - నేటి కవిత ... 1001
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రక్కకు ఉండు అన్న మాట 

ఆధి పత్యం కోసమన్నట్లు 
గుడికి పోదాం అన్న మాట 
అన్యూన్య దాపత్య మన్నట్లు

ఆకర్షించుతూ అన్నమాట 
స్త్రీలలో పెట్టకు ఇక్కట్లు 
పాచికాడుతు అన్నమాట 
మూర్ఖులతో  స్త్రీ వద్దన్నట్లు  

చేతిపై చెయ్యేస్తు అన్న మాట 
నాపై సానుభూతి చూపాలన్నట్లు 
మాటకు మాట పలుకుతూ అన్నమాట 
అహంకారం వదలి కష్టం చూడాలన్నట్లు 

కళ్ళ చూపులతో పలికే మాట
నేను నోరు విప్పని జీవి అన్నట్లు 
నోటితో గట్టిగా పలికే మాట
తప్పు చేస్తే వస్తాయి ఇక్కట్లు 

కన్నీరు తో పలికే మాట 
హృదయాన్ని అర్ధం చేసుకోమన్నట్లు  
నవ్వుతూ పలకరించే మాట 
నీ శక్యతే నాకు సుఖ మన్నట్లు 

సంపాదనతో పలికే మాట 
సమానత్వం కావాలన్నట్లు 
భాధ పెంచే వానితో పలికేమాట 
మృగత్వం వదులు కోమన్నట్లు 

ప్రేమతో పలికే మాట 
మనస్సును అర్ధం చేసుకోవాలన్నట్లు 
కోపంతో అనే మాట 
మాటవిని మాట్లాడ మన్నట్లు 

--((**))--
 

8. కాకతాళీయమయ్యె ఏమి చెప్ప వలయు 
సీత రామా కధయ్యె ఏల తెల్ప  
మంచి మాటే కలయ్యె దాచ వల్దు కలయు
చెప్పుచున్నట్టిదయ్యె బాధ తెల్ప వలయు 
  
కాకతాళీయమది ఇక చెప్పు 
ఆశ మార్పులమది ఇకచెప్పు 
దాపరీకం స్థిమిత మిది చెప్పు 
ప్రేమపాశమ్ము మర ఇక చెప్పు  

చంద్రుడు చంద్రునివలె కాంతిమంతుడు 
రాముడు రాముని వలె ధైర్యవంతుడు 
దేవుడు దైవమ్మువలె పూజ్యవంతుడు
కాలుడు కాలమ్మువలె కార్యవంతుడు  

అర్ధము ధర్మమువలె ధర్మము అర్ధము వలె 
నీయందు లక్ష్మీ సమన్వితము 
న్యాయము సత్యమువలె సత్యము న్యాయమువలె 
నీయందు త్రాసు సమన్వితము  
ప్రేమయు భక్తియువలె భక్తియు ప్రేమయువలె 
నీయందు కాల సమన్వితము
కోపము తాపము వలె తాపము కోపము వలె 
నీయందు భావ సమన్వితము

--(())--


7. కొత్త వృత్తములు - అలంకారములు    
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చంచలాగిరి కాంత చంచల గౌర వర్ణము 
మన్మధావిధి కాంతి మన్మధ పృద్వి వర్ణము 
విశ్వధానిధి  కాంతవిశ్వము నింగి వర్ణము         
జన్మతాబుద్ధి కాంతి జన్మము అమ్మ వర్ణము .....  

ఆమె చంద్రునితో సమాన మైన ముఖము 
కాల మాయలతో  సమాధి యైన సుఖము  
దేశ సేవలతో పునాది యైన నఖము 
ప్రేమ పంచుటతో  విశాల మైన నగము  .......

కాక తాళీయము అయ్యేన క్కాంత మేలనము 
తీపి మాధుర్యము అయ్యేనక్కొంత లాలనము 
ఆశ బంధుత్వము అయ్యేన ల్లొభ పాలనము 
కాల వైపర్యము అయ్యేన ప్రేమ భావనము     

చూడగా కాంత కర్పూరా కృతి 
పల్కగా పల్కు వేదాల కృతి 
ప్రేమగా పిల్వ  మాధుర్య కృతి 
స్నేహమే నిత్య భావాత్మ కృతి  

--(())--

6. పాహిమాం....  పాహిమాం

లోకాలు ఏలు మహాలక్ష్మి పాదమే కద్లి దే
శాల్కే ప్రమాదము యెర్పూటు కాలమే తీర్పుగా
మాకేన కష్టములే వచ్చు వాదనే నేర్పుగా
దైవాన్ని కోరుటయే నిత్య సత్యమే ఓర్పుగా
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

పాపాలు పెర్గియు వేదాన్ని తప్పుగా పట్టుటే
మోసాలు చేసియు మోదాన్ని చూపుటే ఆశగా
పాఠాలు నేర్చియు కాలాన్ని నమ్మకే లక్ష్మి కే
ఆరాట పోరును కష్టాల్ని పెంచుటే ఎందుకో
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

రాజ్యాల్ని ఏలు నిధి వ్రాత దేహి గా దాహమై
మోహమ్ము తోను మది జ్ణాన మంతయూ  సూణ్యమై
కాలంతొ వేగక విజ్ణాన మేమియూ తెల్పకే
దేహాన్ని బాధకు దించీ మనో సహా యమ్ముగా
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

కన్నీళ్లు ఎందుకు వస్తాయి అర్ధమే తెల్పవా  
సామ్రాజ్య సంపద మీ సొంత మవ్వడం న్యాయమా  
విశ్వాస సంపద పొందేందుకు స్వరం తప్పదా  
ఆరోగ్య సంపద ఇబ్బంది పొందుటే మార్చుమా  
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

దుక్ఖాల సంతసమే దైవపెన్నిదే మేలుగా  
సర్వత్ర సేవల భావాన్ని మానసం పంచెనే 
ప్రాధాన్య మిచ్చెటి దైవాన్ని కోరడం తక్షణం 
ఏకైక రక్షణ  సత్యాన్ని పల్కడం నీకృప  
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

--(())--

5. నేటి చైతన్య గీతం రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ నీ ప్రక్కన నడుస్తూ ఉంటే - నాలో జిల్ జిల్ అంటూ ఉంది నీవు నాతో నడుస్తూ ఉంటే - నాలో గుబుల్ గుబుల్ గా ఉంది నీ పైట అలా అలా కదుల్తుంటే నా గుండె దడ దడ పెరుగుతూ ఉంది నీ కొంటె చూపులు చూస్తూ ఉంటే నా మనసు ఉరకలు వేస్తూ ఉంది నీ వాల్ జడ తిప్పి గుటకలువేస్తుంటే నా శక్తి నీ చుట్టు తిరుగుతూ ఉంది నీ పెదవుల ఎరుపుదనం చూస్తూఉంటే నా విశ్వ రూపం చూపాలని ఉంది నీ ముఖారవిందం చూస్తూఉంటే నాకు ముద్దుల్లో ముంచేయ్యాలనిపిస్తూ ఉంది నీ చిర్రు బిర్రు మాటలు వింటూవుంటే నాకు నిన్ను కొరికెయ్యాలనిపిస్తూ ఉంది అంతొద్దులే అందుకో అధరామృతం జుర్రుకో వయసామృతం, దిన్చుకో విర్యామృతం పంచుకుందాం రా స్వర్గామృతం ఆ ఆ పంచుకుందాం రా స్వర్గామృతం ఆ ఆ పంచుకుందాం రా స్వర్గామృతం నీ ప్రక్కన నడుస్తూ ఉంటే - నాలో జిల్ జిల్ అంటూ ఉంది నీవు నాతో నడుస్తూ ఉంటే - నాలో గుబుల్ గుబుల్ గా ఉంది --((***))--
కొత్త వృత్తములు    
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కాకతాళీయమయ్యో నక్కాంత సౌందర్యం 
జీవితాంతంకధయ్యో బత్క౦త బాంధవ్యం 
రాగతాల౦ మతియ్యో ఆరోగ్య  ఆదర్శం 
విస్వభావం కదయ్యో ప్రారబ్ధ సౌలభ్యం     



4. కొత్త వృత్తములు - అలంకారములు    
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శ్రీ మతి పతి దేవుడు తెలుపు కల నిజము
లోక మంతట ఒక్కటే మంత్ర మాయె
ఇంటి యందున ఉంటేనే ప్రాణ రక్ష
గృహమె కాశ్మీరు తలపుల స్వర్గ సీమ

ఊహ కందని ప్రేమకు మనసు బాధ
హృదయ వేదన కలయక గుర్తు ఏది
ముసుగు కన్నీరు చిరునవ్వు చూపు తుంది
బతుకు చీకటి మిణుగురు పురుగు వెలుగు

కనక లేకున్న మానవ ఆశ చిగురు
వినన దు:ఖపు మాటలు చెప్ప లేను
ఉనికి వాసన వచ్చిన తెలప కున్న 
చావు బతుకుల మధ్య రాజి మరక

కదల కుండగ ఉండుట చేత కాదు
నన్ను గుర్తించి విశ్రాంతి పొందు చుండు
కలసి ముగ్గురు కాలము చూపు చుండు
ముళ్లు కదలి యు తాకుతూ మోక్ష మిచ్చు
--(())--

3. కొత్త వృత్తములు - అలంకారములు    
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మూసివున్న కుంపటి 
తీర్చి ఉన్న దుప్పటి 
మాట మాయ గుప్పిటి 
తీరు మారు తప్పెటి 

మనస్సుకు మంచో చెడో తెలియదు 
వయస్సుకు లాభ౦ నష్టం తెలియదు 
యశస్సుకు సౌక్యం లోక్య౦ తెలియదు 
ఉషస్సుకు దాహం అహ్హమ్ తెలియదు   
నేను నాది కాదు మనము మనది
కాల మేది కాదు కళలు మనవి 
వేడి చల్ల కాదు వెతలు మనవి 
నువ్వు నేను కాదు నడక మనది 
   
ప్రోత్సాహం కన్నా ఉత్సాహం మేలు 
తాత్త్పర్యం కన్నా తన్మంత్రం మేలు 
బంధుత్వం కన్నా స్నేహత్వం మేలు  
తాపత్వం కన్నా ప్రేమత్వం మేలు 

ధనం తృప్తి స్వయం కృషి సంతృప్తి 
జపం తృప్తి  స్వరం కృషి సంతృప్తి 
స్వప్నం తృప్తి  స్వల్పం కృషి సంతృప్తి        
దానం తృప్తి  ధర్మం కృషి సంతృప్తి 
కలిసుంటే బలం కలబడితే బలహీనం 
ధనం ఉంటే బలం అతిధనమే బలహీనం 
కులం ఉంటే బలం కులభయమే బలహీనం 
సుఖం ఉంటే బలం సుఖభయమే బలహీనం 

--(())--
Digital Painting Artwork | Artist: Raviraj Kumbhar

2. కొత్త వృత్తములు - అలంకారములు    
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

తాళాలకు తాళం సమస్యలకు పరిష్కారం 
మోసాలకు మోసం మనుష్యులకు పరిష్కారం 
వేషాలకు వేషం  వినయాలకు పరిష్కారం
వాదాలకు వాదం ప్రణయాలకు పరిష్కారం 

గమ్యాన్ని చేరాలి నడకా, పరుగా అని ఆలోచించకు 
పాఠాన్ని నేర్వాలి  పగలా  నళినా అని ఆలోచించకు 
ప్రేమల్నీ గెల్వాలి  తరమా పరమా అని ఆలోచించకు 
కాలాన్ని  నమ్మాలి  ఇపుడా ఇపుడా అని ఆలోచించకు 

గెలుపు గర్వాన్నిస్తుంది ఓటమి ధైర్యాన్నిస్తుంది 
ఒకటి గర్భాన్నిస్తుంది  ఓర్పుయు మౌనానిస్తుంది 
పడచు సర్వానిస్తుంది  కాలము గమ్యాన్నిస్తుంది 
బతుకు భారాన్నిస్తుంది  భారము భాగ్యాన్నిస్తుంది
 
మృగనాభి లోపలి మేలికస్తూరి నందించి
ఆవునాభి లోపలి మేలిగోరోజ నందించి
పట్టుపుర్గు లోపలి పట్టుపుట్టించి నందించి
ఆశనేర్పి ఆకలి దాహ మందించె తల్లీవి

పంచభూతమ్ములు స్వేఛ్చ నందించి
పంచకర్మమ్ములు ప్రేమ  నందించి
పంచజ్ణానమ్ములు స్నేహ  మందించు 
పంచ ఇంద్రియాలు పంచు తల్లీవి

వాయువు బలం తెలియదు ప్రాణం పొయ్యేవరకు
జలము బలం తెలియదు దప్పిక‌ తీర్చే వరకు
విత్తనం బలం తెలియదు మెక్కగా ఎద్గే వరకు
తల్లికి బలం తెలియదు తల్లిగా అయ్యే వరకు

సాదు సజ్జనులకే సంకటంబులు తీర్చి
ప్రేమ భావములకే నిత్యసత్యాలు తెల్పి
విద్య పాఠములకే భోదతత్వాలు తెల్పి
ధర్మ మార్గముననే నడ్పించెటి తల్లివి

--(())--

తస్మాత్ జాగ్రత్త

అవును ఇది ఒక చేదు నిజం.!!

వాళ్ళు....

రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు.!
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.!
నడక అలవాటు ఉన్నవాళ్ళు.!_
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.!

వాళ్ళు.....

ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !

వాళ్ళు....

పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు!
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు!
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!

వాళ్ళు..

అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు..!
స్నేహంగా మెలిగే వాళ్ళు...!
తోచిన సాయం చేసేవాళ్ళు..!
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు...!

వాళ్ళు...

ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు..!
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు...!
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు...!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు....!

వాళ్ళు..

పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ....!

వాళ్ళు ...

తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!
ఆచారాలు పాటించే వాళ్ళు..!
తిధి,వారం ,నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు.!
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు..!

వాళ్ళు ..

చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!
లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు...!
చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!

వాళ్ళు ..

తలకు నూనె రాసుకునే వాళ్ళు .!జడగంటలు పెట్టుకున్నవాళ్ళు..!కాళ్ళకు పసుపు రాసుకునే వాళ్ళు...!
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.... !

ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువులతో స్నేహం కాకుండా...
వస్తువులను వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం.....

ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు

==))((--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి