15, జూన్ 2014, ఆదివారం

144.Thief story -48 ( రైల్లో మాయగాళ్ళు )

                                    ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                    

రైల్లో మాయగాళ్ళు
 
పూర్వపు భాగ్యనగరం ఈనాడు  హైదరాబాద్ మరియు సికింద్రాబాద్,  జంట నగరాలుగా వృద్ధి చెందింది.  మొన్నటి దాకా ఆంద్రప్రదేశ్ కు   రాజదానిగా ఉన్న ప్రాంతము.  ఇప్పుడు రెండు రాష్ట్రాలగా (తెలంగాణ  మరియు ఆంద్రప్రదేశ్ ) విడి పోయింది,  ఇరువురికి ప్రత్యక ఏర్పాటులు చేస్తున్నట్లు గవర్నర్ తెలియ పరిచారు. ఎందు కంటే ఇరు రాష్ట్రాలకు ఒక్కరే గవర్నర్. (ఇంకా విభజన ఏర్పాట్లు చేస్తున్నారు)

ఈ నగరంలో అతి పురాతనమైన రైల్యే స్టేషన్ కచిగూడ, ఇక్కడ అనేక ఎక్ష్ప్రెస్స్  రైళ్ళు వస్తూ పోతుంటాయి. ఇక్కడ ప్రయాణీకుల  రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం  7.30 గంటలకు బయలుదేరే  ఇంటర్ సిటి ఎక్ష్ప్రె ప్రెస్   టికెట్టుకోసం "క్యు " లో నిలబడ్డాడు అమాయక చక్రవర్తి రామచద్రం.  శ్రీ పురుషులుకు ఒకే లైన్లో టికెట్టు ఇవ్వటం వళ్ళ కొంత ఆలస్యము అవుతున్నది. అందులో ప్లాట్ ఫోరం టికెట్టు కూడా  అక్కడే ఇవ్వటం వళ్ళ ఆలస్యమవుతుంది. ఆఖరికి నిజామాబాద్ కు టికెటు తీసుకున్నాడు.    
ఆ లైన్లోనే నా పర్సు కొట్టేశారు అనే ఒకతను బీద పలుకులు పలుకగానే మానవ ద్రుక్పధముగా  ఆలోచించి అతనికి కూడా  టికెట్టు తీసుకొని కొంత పైకము కర్చులకు ఇచ్చి ఆదుకున్నాడు రామ చంద్రం. రైలు మూ డో  ప్లాట్ ఫారం మీద ఉండటం వళ్ళ వంతెన ఎక్కి పైకి వెళ్ళాడు రామ చంద్రం,  రైల్వే కూలి ద్వారా తన సూట్  కేసును రైల్లో పెట్టించాడు. మోసినందుకు చిల్లరలేక వంద రూపాయల నో టు ఇచ్చాడు, ఒకరికొకరు తొసు కుంటు,  నెట్టు కుంటు రైలు ఎక్కుతున్నారు, రైల్లోకి తినుబండారాలు అమ్మేవారు ఎక్కుతున్నారు.  సీత్లు ఖాలిలేక నుమ్చున్నవారు ఎక్కువయ్యారు. ఇందుకంటే ఇది పగలు ప్రయాణము అన్ని సీట్లే  ఉంటాయి.      

ఒక్క సారి స్టేషన్  వాతావరణం వేడెక్కింది.   రైలు బయలు దేరింది. నెమ్మదిగా కదిలింది. కొద్ది దూరమ్ వేల్లగాని ఆగింది.  ఎందు కంటే ఎవరో మినిష్టర్ ఎక్కాలని ఆపినట్లు తెలిసింది.   బయట చిన్న చిన్న జల్లుల వర్షం పడుతుంది.  ప్రయాణీకులు పరిగెత్తుతూ ఎక్కలేక వెనుక పడుతున్నారు, యాక్సలేటర్ వచ్చినా అందుకోలేక పోతున్నారు.
ప్రయాణీకులమ్దరు సామానులు సర్దుకుంటు, లేక్కవేసు కుంటు వాటికి గొలుసులు కట్టు కుంటు, పిల్లలను ఉన్న ఖాలీ స్తలములో  పడుకోబెట్టి వాదన దిగేవారుమ్దురు,  సీట్లు  లేక నుంచొని ప్రయాణము చేస్తున్నారు కొందరు, బయట నుండి సీతల పవనాలు, లోపల నుండి  వేడి నిట్టుర్పులు,  ఫాన్ శబ్దాలు,  వేగం పరిగింది కాకి అరుపు కన్నా,  అరుపు పెరిగింది.  కొద్ది సేపటికే మూసీనది పరిమళం ప్రయాణీకులకు ఆహ్లాదము కలిగిమ్చుటలేదు, ఆవేదన కలిగి స్తుంది.       
రామ చంద్రంకు గుండెలో సన్నగా నెప్పి మొదలైంది. ప్రక్క సీటులొ ఉన్న ఒక యువకుడు పెద్దాయన పరిస్తితిని గమనించి చేతితో గుండెను వ్రాస్తూ, నెమ్మదిగా నీల్లు త్రాగించాడు. ఒళ్లంతా నీరు కారుతున్నట్లు చెమటలు, గుండె నెప్పితొ గిలగిల లాడి  పొతున్నారుఅయన,  చటుక్కున గుర్తు కొచ్చింది ఆ యనకు మాత్రలు... అయ్యో మాత్రలు లేవే చీటి  ఉంది అని నిరుచ్చాహ పడ్డాడు, అలాగే ఈ రైల్లో  అనాదిగా చనిపోతానని భయము ఏర్పడింది. 
యువకుడు ఇక్కడ ఎవరైనా డాక్టర్ రున్నార అని అన్ని బొగీలలొ వెతకటం  మొదలపెట్టాడు. అప్పుడే ఒక డాక్టర్ వచ్చి రామ చంద్రంను పరీక్ష చేసి కొన్ని మందులు, ఇంజక్షన్ చేసి  కాస్త విశ్రాంతి తీసుకుంటే  తగ్గుతుంది అన్నాడు. యువకుడు ఆయన ప్రక్క నే ఉండి  సేవలు చేసాడు. నెమ్మదిగా రామ చంద్రం నిద్రలోకి జారుకున్నాడు.
యువకుడు రామచంద్రం బ్యాగ్ తీసి అడ్రస్ కార్డు తీసుకొని ఒక ఉత్తరము పెట్టి నెమ్మదిగా తరువాత స్టేషన్లో దిగిపోయాడు యువకుడు, రాలు వేగములో ఎవరిదారి వారు ఉన్నారు, కొందరు తెచ్చిన టిఫేన్లు తింటున్నారు, కొందరు పనికిరాని మాటలు మాట్లాడుకుంటున్నారు, కొందరు రాజకీయము గురించు మాట్లాడు కుంటున్నారు.   

ఒక పెద్ద ముత్తైదువ తనకున్నా అనుభవాలను తనచుట్టూ ఉన్నా వారికి హిత భోధ చేస్తుంది, ఆవిడ చెప్పే మాటలు వింటున్నారు కొందరు. గుహల యందున్న, కోవెల యందున్న, సహధర్మ చారి ప్రక్క నున్న దుష్ట గుణం మారదువెర్రి కుక్కల వలే, కంటశోషతో పలికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఎవరికి ప్రయోజనం లేదుజాతి,కులం,వర్ణం,గోత్రం, భాషా రూపాలన్ని ప్రకృతిలోబ్రతుకుటకు మార్గాలు తప్పా వేరుకాదు నీటిలొగాని, గాలిలోగాని, భూమి మీదగాని" స్త్రీ "  మీద ఉన్న ఆకర్షణ, ప్రేమ భావం  మారదువెంటనే  ఒక కొంటే కుర్రోడు  తిండి ఎందుకు, వస్త్రా లెందుకు, తీర్ధ యాత్రలెందుకు అని అడిగాడు, భలే అడిగావు బాబు  అన్నది.మిడి మిడి జ్ఞానమున్నవారికి,  సక్రమ మార్గమున నడి పించాలని, వారికి జ్ఞాన భోధ చేయాలని  కొందరు సంచారము చేస్తారు, వస్త్రము   వేసుకోకపోతే మనం మృగాలతో  సమానమవుతాము, తిండి తిని కామ, క్రోధ, లోభ, మద, మాత్చార్యాలు అదుపులో పెట్టుకుంటూ సాగేదే జీవితము. ముఖ్య ముగా విద్యార్ధులు మాత్రము విద్యే  దైవముగా, విద్యే సర్వస్వముగా భావించి చదువుకోవాలి, తెలియనివి తెలుసుకొని ఉన్నతులుగా మారాలి. పెద్దలను గురువులను, తల్లి తండ్రులను  గౌరవించాలి. 
తిండి ఉంటే  మనిషికి కండ పెరుగుతుంది
కండ ఉంటే భుద్ది, గుణం, శక్తి పెరుగుతుంది
మేధస్సు పెరిగేతే ధర్మ మార్గం నడవటం జరుగుతుంది
సత్యం, ధర్మ, న్యాయం  ఉన్నచోటే దేశం బాగు పడుతుంది

ఆశక్తిగా వింటున్నవారికి భోధ చేస్తూ మేము ఆశ్రమము నడుపుతున్నాము, అందు అన్నదానమునకు, వృద్ధుల సంరక్షణకు కొంత పై కము  సేకరిస్తున్నాము, మీకు తోచినంత సహాయము చేయమని అడిగింది పెద్ద ముత్తడువు, ఒక రసీదు పుస్తకము తీసి చూపిమ్చి సహాయము అడిగింది. రైల్లో ఉన్నవారు ఎవరికీ తోచినంత వారు అందించారు. 
ఆవిడ  ధర్మ మార్గము గురించి ఉపన్యాసము చెపుతున్నది, రైలు కదులుతున్నది.  

అప్పుడే కొందరు పొలీసులు రైలు ఎక్కారు, వారు చెపుతున్నారు మీ సామానులు భద్రతా మీరె చూసుకొవాలి, కొందరు తిరుగుతున్నారు వారిని వారిని పట్టు కోవాలని మేము వచ్చాము అన్నారు. అప్పటిదాకా  చెపుతున్న పెద్దావిడ ఒక్కసారి ఆపింది. కారణం తెలియలేదు. పొలీసులను చూసి వెంటనే స్టేషన్లో దిగి పోయింది.
టి. సి . వచ్చి టికెట్లు అడుగుతున్నాడు. కొందరు చూపిస్తున్నారు.  టికెట్టు తీసుకోలేదు అని ఒకతను అన్నప్పుడు పెనాల్టితో సహా పైకమ కట్టించుకొని రశీదు ఇస్తున్నాడు. టిక్కెట్  పైకము కట్టలేని వారిని పొలీసు వాల్లకు అప్ప చెపుతున్నాడు.
ఆ రైల్లోనే లంగా ఒనీ వేసుకొని రెండు జల్ల సీతలాగా అమాయక మోహము తో ఉన్న ఒక అమ్మాయిని టికెట్టు అడిగాడు టి.సి., అమ్మాయి టికెట్టు కోసం వెతుకుతున్నది.
చదువుకున్నవారు టికెట్టుకోనరు, గట్టిగా అడిగితె అడవాల్లైతే ఏడుస్తారు, మొగవాల్లయితే దబా ఇస్తారు అని అన్నడు టి.సి
ఆ అమ్మాయిని చూస్తు అదేపనిగా ఓ కొంటే కుర్రోడు టి. సి. తో వాదన దిగాడు,  టికెట్టు కొనక పొతే డబ్బులు కడతారు మీరు నోరు జారకండి  అన్నాడు.  అయితే నీవు కట్టావయ్య అన్నాడు, ఆ కడతామండి, ఎందుకు కట్టం అన్నాడు రోషంతో కట్టాడు .
అక్కడే ఉన్న అమ్మాయి  మీ ఋణం ఉమ్చుకోలెండి మీ అడ్రస్ నాకివ్వండి మీకు  పైకము పంపుతా అన్నది. సరే ఇదిగో అని ఒక కార్డు ఇచ్చి నేను దిగిపోతున్నాను అని తిగి పోయాడు ఆ యువకుడు.
అయ్యో నా బ్యాగు పోయింది ఎవరో తీసుకెల్లరు. ఆ స్టేషన్లో దిగిన వారెవరొ అన్నది. బ్యాగు పోయిందని ఒక్కటే ఏడుపు మొదలు పెట్టింది చుట్టు  ప్రక్కలవారు  ఓదార్చటానికి ప్రయత్నించారు.  అందులో నా సర్తిఫికె ట్సు ఉన్నాయి అవి లేకపోతె నా జీవితమే  నాసన మయి పొతుమ్ది,  నాకు ఉద్యోగము రాదు,  నా చదువు వ్వ్యర్ధ మై పొతుమ్ది. అని గట్టిగా ఎడుస్తున్నాది.     ప్రక్కవారు జాలిపడి నీవు  ఎక్కడ దిగాలి అని అడిగారు   ఏడుపు తప్ప వేరే మాట చెప్పదు.
రైల్లో ఒకాయన చేతిలో డబ్బులేమైనా ఉన్నాయా అన్నప్పుడు ఒక్కటే ఏడుపు,
చేతిలో డబ్బులు కూడా  లేవేమో అంటు వంద రూపయల నోటుఇచ్చాడు. ఊరికినె అల్లా చూస్తారె మీరు కూడా  ఏమైనా  ఇవ్వండి అన్నాడు అ వచ్చిన పెద్ద మనిషి.
ఎవ్వరి డబ్బులు నా కక్కరలేదు, నేను అడుక్కొనే దానిని కాదు అని ఏడుపు మెదలు పెటింది. ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొని జాకెట్లో పెట్టు కొని పక్కగా కూర్చొమ్ది
అప్పుడే పొలీసులు రావటం, కేసు బుక్  చేయటం, సాక్షులు సంతకం పెట్టటం వెంటనే జరిగి పోయాయి. 
                   
స్టేషన్ చేరగానే కొందరు నా బ్యాగు కనబడుట లేదు, నా బ్యాగు కనబడుటలేదు అని అంటున్నారు.
రామ చంద్రానికి స్పృహ వచ్చింది.  నన్ను రక్షిమ్చినవానికి ధన్యవాదాలు అని మనసులో అనుకున్నాడు. వెంటనే బ్యాగ్ తీసి  డైరి చూస్తె దానిలో ఒక లెటర్ ఉంది.
దానిలో నేను మాయగాన్ని కాదు,  నా అవసరానికి నేను మీదగ్గర ఉన్న మీ ఉమ్గరము, మీ మేడలో గొలుసు, మీ బ్యాగులో ఉన్న కొంత డబ్బును తీసుకొని వెళ్తున్నాను,  భవిషత్తులో కలుసుకుంటే మీ డబ్బులు మీకు అంద   చేయగలను అన్యధా భావించద్దు, ఆ సమయాన మీ ప్రాణాల్ని కాపాడాలని  అని పించింది.  అప్పుడే అనుకున్న ఇంటిలో ఉన్న మరోప్రాణా న్ని రక్షించుటకు మీ డబ్బులు వాడలనుకొన్న, నన్ను మన్నించండి, నన్ను మాయగాడు అన్న, దొంగ  అన్న  నేను భాద పడను, నా పరిస్తితి ఈ విధముగా చేయిం చింది.
పోలిస్ స్టేషన్లో  కంప్లైంట్ చేయుట తప్ప  బ్యాగులు పోయిన  ప్రయాణీకులకు వేరే మార్గం లేదు.
వాల్లముందే  రెండు జల్ల యువతి, యువకుడు  పోవటం చూసి నోరు విప్పలేక పోయారు, ఎమ్డుకంటే వారిదగ్గర ఏమీలేవు, దోచుకున్నవి దాచుకోవాటానికి దారులెన్నో.
పెద్ద ముత్తఇదువును పొలీసులు పట్టు కెల్లటం చూసారు ప్రయాణికులు, పొలీసులు చెప్పారు మాయమాటలు చెప్పి ఆడపిల్లలను మాయం చేసే మాయలేడి అన్నారు
మన జాగార్తలో ఉంటే ఎమీ పోవు అన్నారు ఒక సన్యాసి, అప్పుడే ప్రక్కన ఉన్న అబ్బాయి మీ జోలి కూడా  పోయిందని ఇందాక ఏడ్చారు కదండి అన్నాడు.
అవును చెప్పటానికే నీతులు ఆచరణకు పనికిరావు అన్నాడు