12, జూన్ 2014, గురువారం

143. Romantic Story-47 (Love is Life)

ప్రేమే జీవితంప్రతిఒక్కరి మనస్సు ప్రశాంతముగా ఉండా లంటె  ప్రేమ ఉండాలి,   ఇరువురి మద్య  ఉండేదే ప్రేమ,   ప్రేమ  రెండక్షరాలు   ఆయినప్పటికి ప్రతిఒక్కరి జీవితములొ  వివిధ  దశలలో  ప్రేమ  ఏర్పడు  తున్నది.    ప్రేమకు సంభందించిన కొన్ని భావాలను ఇందు పొందు పరచాలని ఒక చిన్న కధని కధగా వ్రాస్తున్నాను. పెద్దలు ఏదన్న తప్పు ఉంటే క్షమించమని కోరుచున్నాను.

భూమిపై నివసించే ప్రాణులలో ముఖ్యమైన వారు మానవులు,  మానవులలో ప్రేమ పెరుగుటకు మూల కారకుడు మన్మధుడు అని మన పురాణాలు  చెపుతున్నాయి.   సకల ప్రాణులను,  మన్మధుని సృ ష్టించిన బ్రహ్మ దేవునకు,  లయ కారకుడైన శివునకు, స్థితి కారకుడైన విష్ణువునకు,  ప్రకృతిని సృష్టించి సకల ప్రాణులను ఆదుకొని స్త్రీల యొక్క విశిష్టత తెలియ పరిచిన ఆదిపరాశక్తికి, సకల దేవతలుకు, నా హ్రుదయపూర్వక వందనములు, అభివందనములు.

ఆకాశములోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసు కుంటూ,  విడి పోతున్నట్లు, భూమి,   సూర్య చంద్రులు పరిబ్రమనకు అడ్డు లేకుండా జరుగుతూ తిరుగుతూ ఉంటుంది .  అదే విధముగా ప్రపంచములో ఉన్న సకల ప్రాణి కోటి కలుసుకుమ్టు విడిపోతూ కాల చక్రములో కదులుతూ ఉంటారు.   కాలం విచిత్రమైనది మానవులను కొంతకాలము  సుఖముతోను, సంతోషముతోను, సాగించి దుఖములో ఉన్న ప్రేమ అనేది ఉన్నది,  ఆ ప్రేమ సర్వస్వమని,  ఆ ప్రేమ  వల్లనే సకలము బ్రతుకుతున్నారని తెలుసుకోలేక పోతున్నారు. కొందరు ద్వె ష ముతొ ఉన్నా వారిని ప్రేమతో జయించ వచ్చని ప్రేమే జీవితమని వ్రాస్తున్నాను.              

బావా నీ చుట్టూ తిరిగే ఎ ఆడది నిన్ను ప్రేమిమ్చాలేదా,  ఈ  వేదాంత ధోరణి  ఈ వయసులో ఎందుకు,  హాయిగా చెట్ట పట్టాలు వేసుకొని చేరువు గట్ల వెంబడి , చేల గట్ల వెంబడి  తిరిగి వద్దాము,  రా బావా అని అడిగింది. సిగ్గు విడిచి,  అడుగు తున్నమ్దుకు కోపమా , లేదా నీకు ఆడదంటే నే  కోపమా,   అని నెమ్మదిగా అడిగింది.   బావా గులాబి పువ్వు పెట్టు కున్నాను చేసావా.
    
నేను ఎప్పుడు అంతులేని గమనాన్ని,   అవధిలేని కాలాన్ని ప్రేమిస్తున్నాను.  కాలాను గుణంగా,  మనుష్యుల మనస్సు,  గుణమును బట్టి ప్రేమిస్తున్నాను.   గులాబి పూవు అందమైనది  దానిని  నాప్రేమకు  తగిన విధముగా ఉప యోగించు కుంటున్నాను.
వీటి కన్న అంతులేని విశ్వాసం నీ ప్రేమ పై ఉన్నది,   అందుకే నిన్ను మరిమరీ ప్రేమిస్తున్నాను, నాప్రేమ మెరిసే మిణుగురు పురుగు కాదు,   నీపై నాప్రేమ మెరిసే నక్షత్ర కాంతిని మించినది.

ఎం బావా  ఎదురుగ్గా అందమైన చుక్కను  పెట్టుకొని ఎవరైనా ఊరు కుంటారా ,  ఒక  ముద్దివ్వ మని వెంట పడరూ,  నీ వేమొ కనీసమ్ మీద చేయి కీడా వేయవు,  లేదా  భయమా  నీకు  బావా,   ఎది నీ చేయి అంటూ లాక్కొని తన హృదయానికి హద్దుకున్నది, అబ్బ ఎంత వేడిగా ఉన్నది అన్నది.  

ప్రేమ  ప్రేమ అంటూ ఎవరి గురించే మాట్లాడుతున్నావు,  నీ ప్రక్కన అందమైన ఈ రెండు జల్ల సరోజ పెట్టు కొని  పర ద్యానంలో ఉన్న బావను చూసి.

నాప్రేమ వర్షాకాలంలో తాత్కాలికంగా రంగులు విరజిమ్మి అందముగా ఏర్పడే   ఇంద్ర ధనుస్సు కాదు,   భయాన్ని సృష్టించి , మేఘ గర్జనలు చేస్తూ మెరసె మెరుపు కాదు,   నా ప్రేమ సూర్య తెజస్సుకన్న తీక్షనమైనది.   చంద్రుని వెన్నెల కన్నా,   పున్నమి జాబిలి కన్నా చల్లనిది.

బావా నేను పోతున్నా నీవు,  తీరుబాటుగా కూర్చొని కవిత్వాలు వ్రాసుకో,  ఎ గొ ట్టం వాడు వచ్చి నన్ను తన్నుకు పోతాడు అప్పుడు కూర్చొని ఎడుద్దానివి అన్నది సరోజ.

అప్రయత్నంగా బయట ప్రపంచముపై  నాదృష్టి లాగుట లేదు.  నా దృష్టి ఎప్పుడు నీ చుట్టూ  తిరుగు తుమ్టుంది. విశాల సృష్టి నిలువు టద్దముగా నాకు కనబడుతుంది.  అందులో నీ వోక్కదానివే నా ప్రేమ కోసం తపిస్తున్నావు, నీ ప్రేమ కోసం నేను తపిస్తున్నాను.  నా ప్రేమ వేసవిలో అందించే చల్లటి  నీరు లాంటిది.  వెన్నెల కాంతిలో, పుష్పపరిమలాల  మద్యలో, మనసును ఆహ్లాద పరిచి ఆనంద పరిచేది నా ప్రేమ.  మన ఇద్దరి మద్య జన్మ జన్మల భంధం ఉంది,  నా మనసు నీదని, నీ మనసు నాదని, అద్దంలో ప్రతిబింబముగా సాస్వితముగా నిలిచిపోతుంది.         

సరోజ ఉమ్డబట్టలేక ఒక్కసారిగా బావాను గట్టిగా చేతులతో  కౌగలిమ్చు కుంది (భందిమ్చిమ్ది).

అంతే  బావలో ఎక్కడలేని ఆవేశము పెరిగిగింది, తనచేతులతో వళ్ళంతా నిమిరాడు. ఇంత సుఖము నేనెప్పుడు చూడలేదే, నీ ప్రేమ నా సొంతమే కదా అన్నాడు బావా.

ఆ ఇప్పడి దాకా సొంతము,  ఇటువంటి వెర్రి బాగోలోడ్ని నేను ఎందుకు చేసుకొంటా.  ఏదో టచ్ ఎలా ఉంటుందో  చూసా అంతే అంటూ ఒక్క తోపు తోసి వెనక్కు వెళ్ళింది సరోజ.
   
వసంతములో వికసించే పుష్పాలకన్నా, దేవతా కణ్యలకన్నా,  బంగారు కాంతులతో వెలసి యున్న పుత్తడి బొమ్మ కన్నా, హేమంతంలో చల్లదనం పెంచే మంచు కన్నా,  మొగలిరేకులు, సంపెంగ పూలు, పారిజాత పూల వాసన కన్నా,  పాలల్లో కరిగే పంచదార బొమ్మ కన్నా,  సముద్రములో కలసి పోయే సకల ప్రాణుల కన్నా,  నీ ప్రేమ  నాకేంతోమిన్న.  నీ స్పర్స నాలో ఆ శ లు రేపుతున్నది.

అబ్బో ఒక్క స్పర్సకే  ఇంత కవిత్వమా,  నా మొత్తం శరీరం చూపించా ననుకొ ఇంకా ఎంత కవిత్వం రాస్తావు బావా.

జీవితమ్ బొంగరంలా తిరగటానికి, కట్టు బాటులో కట్టడి ఉండటానికి, బానిస బ్రతుకు నుండి  బయట పడటానికి, వర్తమానంలో పుణ్య  కార్యాలు చేయటానికి, పెద్దలను, గురువులను ఆదరించ టానికి, నీ ప్రేమ నాకు ముఖ్యం.నీ శరీరం  కాదు.

బావా  నా ప్రేమ అంతా  నీమెదె ఉన్నది,  ఇందా ఈ ముద్దుకు నీ దాహం తీర్చుకొ అని పెదవులు అందించింది.

తన్మయత్వంలో సుఖం అనుభవించి మరలా ఇట్లా అన్నడు బావా

గంగ నీటిలో తీయదన్నాన్ని మించిన దాహార్తిని తీరుస్తావు,  భూమాతను మించిన సహనంతో నన్ను ఆదు కుంటావు,  ఆశల వలయములొ చిక్కకుండా తృప్తిగా సహకరిస్తావు,  అవసరానికి సరి ఐన సలహా ఇచ్చి ఆదు కుంటావు,  ఆదమరచి నిద్రించిన తట్టి లేపి సక్రమ మార్గమున నడిపించే దానవు నీవు,  అందుకే నీ ప్రేమ నాకే సొంతం. నీ ముద్దులతోనన్ను కవ్వించకే మదన సుందరి.

బావా నీ ప్రేమకో దండం, నీకో దండం నా దారిన నేను పోతున్నాను తీరు బాటుగా కూర్చొని వ్రాసుకో,  ప్రేమ దోమ అంటూ తిరుగు, ఏదో తలక మాసింది దొరికుతుంది దానిని కట్టుకో,  వెల్లోస్తా అని బావను వెనక్కి  తోసి  వెళ్ళింది.

ఎందుకే  అలా   తోస్తావే నీ ప్రేమను  నేను  కాదన్నానా,

ఆ కాదనలేదు, అలా ఆని అవునను లేదు, పిట పిటలాడే  పిట్టను ప్రక్కను పెట్టుకొని ఈ కవిత్వ మెమ్దుకు బావా     
సిగ్గు విడిచి సిగ్గును చూపిమ్చిన ఈతనిలొ మార్పు  రాదు,   ఏదో ప్రేమ పిచ్చి,  ఎవరో ప్రేమించి వదిలేసారు,  ఆమె ప్రేమ కోసమే వ్రాస్తున్నాడు ప్రేమా ప్రేమా అంటూ ఏదో పిచ్చి కవితలు.

సరోజ అక్కడ ఏమ్చేస్తున్నావు అ పిచ్చి వాడితో అన్నాడు  కన్న తండ్రి  ఒక్క ఆరుపుతో
అంతే ఒక్క గంతున పరుగెత్తిమ్ది.

అగ్ని జ్వాలలు జీవితములొ తారస  పడినా, భయము చెందక చల్లటి అమృతమును అందిస్తావు. రా ప్రేయసి నీ వెక్కడున్న నాప్రేమ చావదు , నీ చుట్టూ తిరుగు తుంటుంది అంటూ చెరువు గట్టు వెంబడి నడుస్తున్నాడు రాము.

గట్టు మీద పోతున్న ఒక పల్లె పడుచును చూసి " నా సీత "  అని బ్రమిమ్చి ఈ విధముగా అన్నాడు.

నీ  అందెల  సవ్వడి  నా  గుండెల పై చేస్తుంది అలజడి,  నీ ముగ్ధ మోహన రూపానికి అందాల పాపిడి,  నీ కనురెప్పల సైగలు,  నీ పెదవి విరుపులు నా హృదయాన్ని తోలచి వేస్తున్న ప్రేమ  జలపాత  ఉరవడి,   నీ వంటిపై పావడా కదలికకు నాలో రేకెత్తిస్తుంది, తెలియని కలల సవ్వడి,  నీ కర్ణములు ఆనుకొని మెలికలు తిరిగిన కేశములు  'రా రా  '  నా కురులు సరిచేసి,  కురులలలో ఉన్న సంపెంగ, మల్లి,  విరజాజి, గులాభి,  సౌరభాలను ఆస్వాదించి,  వలపును పెంచి,  వయ్యరాలలో ముంచి, వయసును ఊరడిమ్చి,  వేణునాదంతో మనసును కరగించి,  ఆనంద డోలికల్లో ముంచి తనువూ తనువూ తన్మయ పరిచేదే ప్రేమంటె  ప్రేమ.
అంటూ ఆమెను   దగ్గరకు లాగ  బోయాడు,  అమ్మో  పిచ్చోడు అంటూ,  కుండను ప్రక్కన పడేసి వెనక్కు పరుగెత్తిమ్ది పల్లె పడచు,

రాము ఏమిటి అలా  వున్నావు అని అడిగాడు స్నేహితుడు గోపి, నా ప్రియురాలు నాకు పరీక్ష పెట్టింది. నేను గెలిస్తేనే నన్ను వివాహము చేసు కుంటా నంటుంది అన్నడు.  నీ  ప్రియురాలు ఏది.
ఉంది నేను గెలిచిం తర్వాత  వస్తానంది అన్నడు.

నెల సాక్షిగా, నింగి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, దేవతలసాక్షిగా, నాప్రేమ నీ కేనని  ప్రమాణము చేస్తున్నాను, నా ప్రేమను నిజం చేసుకోవాలంటే  నీవు ఎటువంటి పరిక్షలు పెట్టినా, నేను జయించి నీ ప్రేమను పొందుతాను, నా ప్రేమలో ఎటువంటి కల్మషము లేదు,
స్వచ్చమైన తేట నీరులాగా తీయదనాన్ని  నీకు అందిస్తా,  అరికాలి నుండి శిరస్సు దాకా ఎగబాకే రక్తంలా నీపై నాకు ఉంది విశ్వాసమైన ప్రేమ.
మరి గెలువ లేదా నీ ప్రేమ అన్నడు.  నా ప్రేమ గెలిచింది, నేను గెలిచాను,  కాని నా మాట,  నారూపం,  ఆమెకు నచ్చి,  నచ్చలేదు అని చెపింది,  అందుకే నేను పనికిరానని నా ప్రేమను  తిరస్కరించింది 

చిట్లిపొయిన చిగురు టాకులు, ఎండి పొయి  రాలిపోయిన ఆకులు,  నాలో రేకెత్తు  తున్న వింత కోర్కలు, నా మనసులో ఉన్న నిన్ను మాత్రం కదిలించలేవు,  కొమ్మ కొమ్మా రాచుకొని రాలిపోయిన పూల రేకులు, మత్తును పెంచి  మైమరిపించే గాలికి రాలే పారిజాతాలు నీ పై ఉన్న ప్రేమను వేరుచేయలేవు. అంటూ గట్టిగా ఆమెను అడిగాను, నా ప్రేమను పొందితే నీవు సుఖ పడతావు అన్నాను, కాని నా   'సీత  '  ఒప్పు కోలేదు,  నన్ను పోషించి స్తోమత నీకున్దా, నీకు   ఆస్తి ఎంత అని అడిగింది. నేను నా ప్రేమను మాత్రమె తెలియపరచ గలిగాను, ఆస్తి గురించి  చెప్పలేక పోయాను అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను   

నాలో పెరిగే రుణ భారాలు, నీ ప్రేమకు అంతరాయము కలిగించవు,  ఆర్ధికంగా మార్పులు వచ్చినా, అనర్ధాలు నన్ను వేమ్బదిమ్చినా, నీపై ఉన్న ప్రేమ మాత్రము చెక్కు చెదరదు,  తూర్పున ఉదయించే  సూర్యుడు  పడమర  ఉదఇమ్చ వచ్చు,  అగ్నిజ్వాల నీరుగా మారినా మారవచ్చు,  మూర్ఖుడు  బుద్ధిమంతుడుగా మారినా మారవచ్చు, కాని నాప్రేమ నీ పై తరగనిది, విడి పోనిది, సాస్వితమైనది.
అని గట్టిగా చెప్పను. నన్ను ఒక పనికి రాని  విత్తనముగా భావించి బయటకు నేటి వేసింది నా ప్రియురాలు.

విత్తనం చేతిలో పట్టుకుంటే ఫలితము ఉండదు,   దానిని నేలలో పాతితే గాలి నీరు తోడై చీకటిలొ నుండి వెలుగులోకి మొక్కగా  వస్తుంది.   అంటే  ప్రేమ అనే బీజమ్ చీకటిలో మానవులలో ఏర్పడుతుంది.  ఆ ప్రేమ ఎన్ని సునామీలు వచ్చినను, ఎన్ని భూకమ్పములు వచ్చినను మారదు.  ఎందు కంటే ఆ పరమాత్ముడు వయసుకు తగ్గ ప్రేమను మానవులలో కల్పించాడు.
ఇంట్లోవాల్లను  కూడా  గట్టిగా అడిగించాను, నేను మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని సుఖ పెడతాను అని ఒట్టు పెట్టి చెప్పినా వినలేదు, నా తల్లి తండ్రులను అవమానించి పంపించారు గోపి, మరి నా ప్రేమ గెలిచేదేప్పుడు అని అడిగాడు రాము. 

రాము ప్రేమించినవరందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు,  ప్రేమను సద్వినియోగము చేసుకొని సుఖపడుతున్నవారు కొందరు,  సద్వినియోగము చేసుకోలేక,  అటు ప్రేమను పొందలేక,   కుడితిలో పడ్డ ఎలుక లాగా భాద పడుతూ ఉన్నారు మరికొందరు, వేరొకరికి చెప్పుకోలేరు,   ధైర్యము  చేయలేరు,  పిరికి వారుగా బ్రతుకు తుంటారు కొందరు.  మరికొందరు ప్రేమను చంపుకొని జీవితము గడుపుతున్నారు. కొందరు మాత్రమే చేసుకున్నారు. మరికొందరు ప్రేమను త్యాగం చేస్తున్నారు,    నీవు భాద పడుటలో అర్ధం లేదు అన్నాడు గోపి
ఇప్పుడు నీకు ఒక తోడూ కావాలి
ప్రకృతిలో అవయవాలకు తోబుట్టువులుగా వ్యాధులు   కూడా   వస్తాయి,   చేతికి,  కాళ్ళకు గాయాలు అవుతాయి,  జలుబు, దగ్గు , ఆయాసము పెరుగుతాయి, పన్నుపోటు, వెన్నుపోటు పెరుగుతుంది.  ఇన్ని ఉన్న మనిషిలో ప్రేమ మారదు,  హృదయములో ఉన్న ప్రేమకు ఎటువంటి రోగములు రావు, ఎప్పుడు నేను నీ వెంట  ఉన్నాను అని శబ్దం చేస్తూ వుంటుంది ప్రేమ. ఆ ప్రేమను నీవు చేసుకొనే  అమ్మాయిలో   చూసు కో  రాము అన్నాడు   గోపి 
ప్రేమ అనేది అనేక రకాలు, తల్లిపై, చెల్లి, ఇల్లాలుపే, స్నేహిడుపై ఉంటుంది. అందరిపై ప్రేమ ప్రేమ అని వెంబడిస్తూ ఉన్దగూడదు,
అన్నడు గోపి 
ఫోటోను వెలుగులో తీస్తారు, దానిని చీకటి గదిలో డెవలప్ చేస్తారు, అదేవిధముగా దేవుని సృష్టి చీకటిలొ ప్రారంభమై వెలుగులో బ్రతకమని, ప్రేమను నలుగురికి పంచుటకు భూలోకమునకు చేరారు,  ప్రేమ అనేది మనసును దోచిన వారిపై అధికముగా  ఉంటుంది, మిగిలిన వారిపై సూర్య చంద్రుల ప్రయాణములా ఉంటుంది ప్రేమ.
నీ ప్రియురాలు ఉండే అడ్రస్సు నాకు చెప్పు,  ఇప్పడే నాకు తోచిన సహాయము చేస్తాను అన్నాడు గోపి రాముతో.
తనజేబులో ఉన్న కాగితము ఫోటో చూపించాడు రాము.

అంతే  ఆ ఫోటోను చూసి మూర్చ పోయాడు గోపి. ఎందు కంటే రాము ప్రేమించినది,  తను చేసుకో పొయ్యేది  ఆమే అని తెలుసుకొని 
గోపి, రాము  ప్రేమలు గురించి ఆలోచిస్తూ స్త్రీల గురించి ఈ విధముగా నుకున్తున్నాడు. (నేను పెళ్లిని త్యాగం చేయాలి రాముడు  సీతను కలపాలి అదే నా ద్యేయం  అని అనుకున్నాడు గోపి )

" కొందరు ప్రేమను పంచుకోలేక విధిని ఎదిరించలేక ప్రాణ త్యాగం చేస్తున్నారు.
కొందరు ప్రేమను జయించ కోలేక పెద్దలుచేప్పినవారిని వివాహము చేసుకొని,  ప్రేమను పంచలేక జీవఛవములాగా బ్రతుకుతున్నారు, మరికొందరు దైర్యము చేసి, విడాకులు తీసుకొని ప్రేమిమ్చినవారిని వివాహము చేసుకొని సుఖపడుతున్నారు.
కొందరు ఆచారాలను, ఎదిరించి ప్రేమే సర్వస్వమని భావించి పెళ్లి చేసుకొని జీవితాన్ని నందనవనంగా మార్చుకుంటున్నారు.
కొందరు సంసార సుఖము లేక నిత్యమూ తగాదాలతో, అనుమానాలతో, ప్రేమను పంచుకోలేక ద్వేషంతో విడిపోతున్నారు.
కొందరు అత్తమామలు, భర్త పెట్టె హింసను భరించలేక, తల్లి తండ్రులకు చెప్పుకోలేక స్వతంత్రంగా బ్రతుకు తున్నారు.
కొందరు బ్రతుకు తెరువుకోసం శరీరాని అమ్ముకొని జీవిస్తున్నారు.
ఎక్కువమంది సంప్రదాయముగా వివాహము చేసుకొని సంసారమే సుఖ దాయకమని భావించి, పెద్దలు, గురువులు, దీవెనలు పొమ్దుతూ కుటుంబ మంతకు  ప్రేమను పమ్చుతూ జీవిస్తు ఉంటారు ".

విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపమ్,  కులం, ఇవి మంచివారికి సుగుణాలు, అవి మానవులకు ప్రేమను పెంచుటకు ఉపయోగ  పడును. ఈ సుగుణాలే  కొందరని  అహంకారులకు, దోషాలుగా మార్చును,   అటువంటి  వారిలో  ప్రేమ అనేది ఒక కక్షగా మారుతుంది. అటువంటివారు మాటలతో, చేతలతో, కిమ్చ పరుస్తూ  పైసాచికముగా ఆనందాన్ని పొందుతారు. ఆది పత్యాన్ని ప్రదర్సించడానికి తహ తహ లాడుతారు, ఇటు వంటి వారిని ప్రేమతోనే జయించాలి  అనుకున్నాడు గోపి.
వెంటనే గోపి సీత వద్దకు పోయి నేను చెప్పిన చోటుకు నీవు రావాలి, నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు.

దూరదర్సినిలొ దృశ్య, శబ్ద తరంగాలు విద్యుత్ తో కలసి మన కంటి చూపుకు ఆనందము కలిగించే దృశ్యాలు  మానవ మేధస్సుకు ప్రతిరూపముగా మన మనస్సును చెరుతాయి,  మన ఆలోచనలను పెమ్చుతాయి,  అనుకోని విధముగా దూరదర్సినిపై ప్రేమ పెరిగి,  దృశ్యాలాపే లీనమై పోతారు, కన్నవారిని, తోడు ఉన్నవారిని ప్రేమించిన వారిని గుర్తు పట్టలేరు అన్నాడు గోపి.

రాము సీతను చూసాడు, తనలోని ప్రేమ అంత ఆమె వద్ద క్రుమ్మరించాడు.
సీత రామును ఘాడంగా కౌగలించుకొని  నీవు వేరేపెల్లి చేసుకున్నవని,  నేను నచ్చ లేదని చెప్పారని  మానాన్నగారు చెప్పారు, గత్యంతరం లేక నేను ఈ పేల్లికి ఒప్పుకున్నాను అన్నది.  మన ఇద్దరినీ ఎవ్వరువిదదీయలెరు అన్నది "సీత "
ప్రేమపై భావ కవితలు

ప్రేమ అనేది ప్రళయము కాదు, కాని ప్రణయ మవుతుంది
ప్రేమ అనేది ఆకర్షణ కాదు,  హృదయ స్పందన మవుతుంది
ప్రేమ అంటే భోగం కాదు,  హృదయ త్యాగం అవుతుంది
ప్రేమ ప్రేమను ప్రెమిస్తూ  అందరిని ప్రాణం పోసి బ్రతికిస్తుంది.
         
ప్రేమకు మరణం లేదు, వయస్సుతో పనిలేదు
ప్రేమ ఒక కావ్యం కాదు, యావ్వనంతో పనిలేదు
ప్రేమ పాషానం కాదు, మనస్సును వదలలేదు
ప్రేమ తప్పస్సు కాదు, ఎవ్వరికి కనిపించ లేదు

ప్రేమ మంచులా కరగదు, పాషానంగా మారదు
ప్రేమ ప్రాణం పోయుట మరువదు, ప్రాణాలు తీయదు
ప్రేమ స్వార్ధానికి తావివ్వదు, ప్రేమ ప్రలోభాలకు లొంగదు
ప్రేమ చీకటిని చేరనివ్వదు, ప్రేమ తెజస్సు నివ్వగలదు

ప్రేమ అనేది ఇష్టపడి పని చేస్తే సంతుప్తి పెంచుతుంది
ప్రేమ కాలాన్ని బట్టి పనిచేస్తే మేధాశక్తిని పెంచుతుంది
ప్రేమ వళ్ళ మానవుల్లో, దైర్యము, వ్యక్తిత్వము పెరుగుతుంది
ప్రేమతో దేవుణ్ణి  ప్రార్ధిస్తే అందరికి మనశాంతి పెరుగుతుంది

ప్రేమ చద్రుని చల్లదన్నాని, శంఖం లా కాంతిని ఇస్తుంది
ప్రేమ పాలలాగ తీయదన్నాని, వజ్రము లా వెలుగు నిస్తుంది
ప్రేమ కంటి పాపలాగా కాపాడుతుందని, పాపలా నవ్వుతుంది
ప్రేమ వలపును పెంచి, ఆరోగ్యానిచ్చి, సుఖ నిద్ర పంచుతుంది.

మన ఇద్దరం పెళ్ళిచేసుకుందాం, మన ప్రేమను నిజం చేద్దాం అన్నది సీత, రాము అన్నాడు గోపితో
నీవు మా ఇద్దరినీ కలిపి గొప్ప పని చేసావు,  మా ప్రేమ సాస్వితముగా నిలబడి పోతుంది.  నేను ప్రేమ పిచ్చి వాడును  కాను  అన్నా డు.
అంతలో బావా అంటూ సరోజ వచ్చింది.
గోపి నీవెమను కోకుండా ఉంటె   నా మరదలను నీవు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు రాము ప్రేమతో

సీతారాములు, గోపి సరోజల పెళ్లి గొప్పగా జరిగింది.                                                                                                     

ప్రేమ వళ్ళ సుఖం
ప్రేమ వళ్ళ ఆనందం
ప్రేమ వళ్ళ అనుభందం
ప్రేమ వళ్ళ మోక్షం           

ప్రేమించినవాడు పిచ్చివాడు కాకూడదు, ప్రేమను  జయించాలి
అదే నిజమైన  ప్రేమ  జీవితమ్  

1 కామెంట్‌: