29, మే 2014, గురువారం

142. Family story- 46 (Auto driver)

ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                                                 
    
నల్లని తారు రోడ్డు మీద పరిగెడుతూ  ప్రయాణీకులను గమ్యానికి చేరుస్తుంది మూదు చేక్రాల ఆటో.   హైదరా బాద్  మహా నగరంలో  ఉన్న  ఆటోలు,   కార్లతో, బస్సులతో, వ్యాన్లతో  పొటీ పడకుండా తనకున్న శక్తి చూపించి,  సందులు,  గొందులు,  తిరుగుతూ త్వరగా అందరిని తీసుకొని  వెళుతుంది. దానిని కన్న తల్లిలాగా సాకుతున్నాడు డ్రైవర్ అశొక్.
అశొక్ కు తగ్గ భార్య,  పేరు అరుణ , భర్తకు సహకరిస్తూ అవసమైతే అటో కూడా  నడుపుతుంది, వీరికి  ముద్దులొలికె ఇద్దరు పిల్లలు,   అరుణ  మెఖానికల్ ఇమ్జ నీరిమ్గ్  చదివింది,  తన   చదువుని సద్వినియోగము చేస్తూ,  ఒక ఆటో షేడ్డు నదుపుతూ  దానిలో అందరు ఆడవారినే పనివారుగా చేర్చు కుంది, ఈక్కడ  ఆటో రిపెరు కోసం మల్ల రాకూడదని కండిషన్,  ఒక వేల వచ్చిన ఉచితముగా రిపేరు చేసి పంపిమ్చుతూ ఉంటుంది, ఇక్కడ గాలి ఉచితముగా కొట్టు కోవచ్చు అని బోర్డు పెట్టింది,  ఆర్ధికంగా వెనుక బడ్డ వారికి  తనవంతుగా సహాయం చేస్తుంటుంది.   ఇదే షెడ్డులో కుట్టు మిషన్లు ద్వారా స్త్రీలు స్కూల్ డ్రస్సులు కుట్టడం, ప్యాంటులు ,షర్ట్స్, జాకెట్లు కుట్టడం,  నిత్యావసర వస్తువులను సుబ్రం చేయుట వాటిని కాలనీలొ అమ్ముట  అనేవి తన శక్తి కొద్ది అందరికి సహాయము చేస్తుంది.
పిల్లలను కాన్వెంటు లో చదివిస్తూన్నది.
పొద్దున్నే లేచి  ఆటో సుబ్రం చేసి దేవునికి నమస్కరిమ్చి భార్య ఎదురు రాగా బాడుగకు బయలు దేరుతాడు అశొక్
అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఏనుగంత ఉన్నారు  త్వరగా  పొనీయ్యాలి  నీకు  కావలసినంత  డబ్బు ఇస్తాము అన్నారు. మీరు ఎక్కడకు పోవాలి అని అడిగారు. స్టేషన్ కు పోవాలి అని చెప్పారు.
ఈ ట్రాప్ఫిక్  లో కనీసము గంట పడుతుంది. అంతగా ఇష్టమైతేనే కూర్చోమ్డి అన్నాడు.
అది మాకు తెలుసు నీవేమి చెప్ప నక్కరలేదు,  టైం మాకు తెలుసు ముందు పొనీ, అట్లా ఐతే మీరు నాకు మీటరు మీద రేటు మాత్రమే నాకు ఇవ్వాలి ఎక్కువ మాత్రము వద్దు అన్నాడు అశోక్
నేను పద్దతి ప్రకారముగా రూల్సు ప్రకారముగా నడుపుకొని బ్రతుతున్నాను,   మీరు తొందర చేసినా నా పద్దతిలో నేను నడుపు తానూ అన్నడు.
స్టేషన్కు బయలు దేరాడు అశోక్, కొంత దూరము పోగానే పొలీసులు  అటో ఆపారు,  ఎందుకు అపారు అని అడిగాడు.   ఈ నగరములో తీవ్ర వాదులు తిరుగుతున్నట్లు మాకు తెలిసింది  వారిని పట్టు కోవటానికి వెతుకు తున్నాము అన్నాడు.  అంతే ఆటోలో ఉన్న వారిని కూడా  వెతికారు,  బ్యాగులను వెతికారు. సరే బయలు దేరు అన్నరు పొలీసులు.
త్వరగా వెళ్ళాలి,  బస్సు వెళ్లి పోతుంది. అన్నారు కూర్చున్నవారు.
నేను  ముందే చెప్పా నా పద్దతిలో నేను పోతాను అన్నాడు

భయ్యా  నీవు ఎక్కడకు పోతున్నావు,  నేను స్టేషన్కు  పోతున్నాను అని అశోక్ తోటి అటో డ్రైవర్ తో చెప్పాడు, ఆతను మీరు   ఆ మెయిన్ రోడ్డు నుండి పోవద్దు,   అక్కడ ఎవరో రజకీయ వ్యక్తిని అరెష్టు చెసారుట,  ఆరోడ్డు అంతా బందు  చేస్తున్నారు.  ఇంకో అరగంటలో మొత్తం బందు  చేసినా చేయవచ్చు నీవు అడ్డ దారిన వెళ్లి స్టేషన్ కు వీల్లను చేర్చు  అన్నాడు.
అచ్చా భయ్యా దేవుడిలా నాకు చెప్పావు,  అసలే వీల్లు తొందర పడుతున్నారు.  ఇక చూసుకొ ఈ అంజన పుత్రుడు ఎలా పరిగెడుతాడో  అంటు గేర్ మార్చి వేగం పెంచాడు  వేరే దారిన,   ఆ వేగము చూసి నీ బండి ఏమైనా అవుతుందా,  మా లాంటి పెద్ద స్వరూపాలు లాక్కేల్లు తున్నావు   అన్నారు.   మీరు కదలకుండా కూర్చొండి. మద్యలో ఎవరు ఆపిన నా భాద్యత కాదు, అట్లైతే నీకు డబ్బులు ఇవ్వము అన్నారు. మీ డబ్బులు మీదె బ్రతక  మండి, మా రెక్కల కష్టాన్ని నమ్ము కుంటాము అన్నాడు.
ఆ వేగానికి లొపలకూర్చున్నవారికి కల్లు తిరిగినాయి, అటో  ఇంత వేగం పోవటం ఇప్పుడే చూసారు. మొత్తం మీద అనుకున్న టైం కన్నా ముందు గానే చేర్చాడు స్టేషన్.
నీవు కష్టపడి నావు  ఈ డబ్బులు ఉంచుకొ అన్నరు. వద్దు నాకు మీటరు డబ్బులు చాలు నమస్కారమండి. అని చెప్పి  వెను తిరిగాడు అటో స్టాండు వైపు.
ఆటోలో ఇద్దరు అమ్మాయిలు ఎక్కారు ఎక్కడికి పోవాలని అడిగితె   కూకట్ పల్లికి వెళ్ళాలి అన్నారు వారు,  సరే ఎక్కండి , అంటు  మీటరు తిప్పాడు,  లోపల కూర్చున్న ఆడపిల్లలు మాట్లాడుకుంటున్నారు.
ఈ ఆటో  వాల్లను అసలు నమ్మ కూడదు, అమ్మాయిలు కనిపిస్తే చాలు, చాటుకు తీసుకెల్లి ఏదో చేస్తారు అన్నారు .
షడన్ బ్రేక్ కొట్టాడు, వెంటనే తన బ్యాగ్ తీసి, లైసంసు, బండి లైసంసు, మరియు ముఖ్యమంత్రిద్వారా తీసుకున్న ప్రత్యెక ప్రశంసా పత్రము,  బహుమతి  ఫోటో చూపిమ్చాడు. పాపర్లో కటింగ్ కూడా  చూపిమ్చాడు, ప్రకాశం బ్యారేజ్ వద్ద,  కృష్ణా నదిలో పడ్డ తల్లి బిడ్డను క్షేమంగా పైకి తీసుకొఛిన ఆటో డ్రైవర్ అని ఉన్న షీట్ చూపిమ్చాడు.   
ఇవి మాకెందుకు చూపిస్తావు అన్నారు .
మీరు ఇప్పుడే కదమ్మా ఆటో వాల్లను గురించి తప్పుగా  మాట్లాడారు.
ఏదో మాట వరుసకు అన్నాము అంతే, తెలియని విషయాలు మాట వరుసకు కూడా  అనకూడదు దాని వళ్ళ కొన్ని కుటుంబాలు నాశన మవుతాయి అన్నాడు.
నీ ఆటోలో పాటలు ఉంటే పెట్టు అన్నారు. రాములవారి పాటలు, హనుమంతుని పాటలు తప్ప వేరేవి ఉండవు.
అవి పెట్టమంటే పెడుతా అన్నడు. అవి అయితే వద్దులే అన్నారు కూర్చున్నవారు
కనీసమ్ వేగంగా పోనిచ్చ గలవా అన్నారు.
పాపలు ఇది అటో,  విమానం కాదు రివ్వున ఎగరటానికి అన్నాడు.
ఈ అటో వాల్లందరూ తెగ తాగుతారు ఆన్నారు,  కూర్చున్నవారు.
చూడమ్మాయిలు కొందరు త్రాగుతారు,  అది ఎందుకంటే ప్రొద్దున నుండి  ఆటోలు తోలి తోలి అలసి పోయి (అందులో నడుము, చేతులు, నెప్పి పుడతాయి).  కాస్త నిద్ర పట్టుటకు కొంత త్రాగుతారు. కొందరు.
మరి నీవు త్రాగుతావా అని అడిగారు, నేను త్రాగాను,   త్రాగేవారిని త్రాగోద్దని చెపుతాను అన్నాడు.
మాటల్లో కూకట్ పల్లి చేర్చాడు అశోక్.
అటో వాలల్లో నిజాయితీవారున్నరు. అన్నారు , ఇదిగో నా విజిటిగ్ కార్డు అని  ఇచ్చాడు.
దానిమీద అశోక్,   బీటెక్,  ఎం. బి. ఎ. ఆటో డ్రైవర్,
మీరు ఆటో నడుపుతున్నారా  అని అడిగారు, వంశ  పారంపరంగా మేము అటో మీదె బ్రతుకు తున్నాము, ఏదో చదువుకున్నామని కుల వృత్తి వదులు కోలేము అన్నాడు. చదువుకున్నవాల్లందరకు ఉద్యోగము కావాలంటే ఎ ప్రభుత్వమూ ఇవ్వలేదు  అందుకని నేను ఇది నడుపుతున్నాను.
అందుకనే రాత్రి పాటశాల పెట్టి మా కాలనీలొ విద్యార్దులకు ఉచిత ట్యూషన్లు చెపుతాను అన్నడు అశోక్.
భయ్యా మేము తప్పు మాట్లాడితే క్షమించు  అన్నారు అమ్మాయిలు.
ఎవరిని తక్కువ అంచనావేసి, చులకన చేయకండి, ధర్మం తప్పి నడవకండి అన్నడు. ఆడవారు ఆడవారిగా ప్రవర్తిస్తే మంచిది.
భోజనం టైం అవటం వళ్ళ వెను తిరిగాడు అశోక్, దారిలో బసు స్టాప్ వద్ద తను దిల్షుక్ నగర్ పోతున్నాను అని ఎక్కడ దిగిన 10 రూపాయలని వసూలు చేసుకొని ఎక్కిమ్చు కుంటు ఉంటాడు తను పోయే దారిలో ఎక్కే వారికి మాత్రమే.
ఆటో స్టాండులో రహీమ్ భాయి కనబడక పోవుట వలన ఇంటికి పోయాడు. త్రాగుడు వళ్ళ శరీరము అంతా పాడై పొయినదని డాక్టర్ చెప్పారు. మంచి మందులు వాడితే గాని కోలుకోడని చెప్పారు. వెంటనే తన దగ్గర ఉన్న కొంత  పైకము, మరియు ఇంటిలో ఉన్న  కొంత పైకముతో డాక్టర్ వద్దకు తీసుకెల్లి రహీమ్ భాయి బ్రతకాలి,  మీరు ఏమందు వాడినా మాకు అబ్యంతరము లేదు, మా తల తాకట్టు పెట్టయన డబ్బు తెస్తాము అన్నాడు  ఆటో అశోక్.
వెంటనే పరిక్ష చేసి సమయానికి తెచ్చారు, వారం రోజుల్లో కోలుకుంటాడు, పేషెంటు వద్ద ఒకరు ఉండాలి అన్నాడు డాక్టర్, భార్య ముంతాజ్ బేగం ఉంటుంది.
పిల్లలు మేము తిరుగుతాము అన్నడు ఆశోక్.
అశోక్ భాయ్ సమయానికి మా ఆయనను హాస్పటల్లో చేరిపిమ్చావు ,  నీకు ఏమిచ్చిన ఋణము తీరదు అన్నది.
చూడమ్మ కంటికి రెప్పలాగా భర్తను కాపాడుకో,  మందులు సరిగావాడు,  ఆల్లా  ఉన్నాడు మిమ్మల్ని రక్షిస్తాడు, భయము వలదు, ఖురాన్     చదువు అని చెప్పి డాక్టర్ వద్ద సెలవు తీసుకొని వెళ్ళాడు.
రహీమ్ భాయ్ కు ఆడపిల్లలు  అవటము వల్ల వాళ్లకు పెద్దగా చదువు చేపిమ్చలేదు. అశోక్ పెద్దమ్మాయికి  రహీమ్ భాయి  అటో ఇప్పించి నడపమన్నాడు, రెండో  అమ్మాఇకి తన షెడ్డులో పని ఇప్పించాడు, మొత్తం మీద అందరిని  కాపాడటానికి ప్రయత్నించాడు అశోక్.

అశోక్ భాయి మన కాలనీలో వారి కొందరి ఆటో మీద తీసుకున్న అప్పు  కట్టలేదని   బ్యాంకు  వారు  ఆటోలను  తీసుకెల్తున్నారు   అన్నారు, వెంటనే అశోక్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి అన్ని ఆటోల డబ్బులు నేను కడతాను అని హామీ పత్రము వ్రాసి విడిపించు కొచ్చాడు. మీ రందరూ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని బ్యాన్కికి కట్టాల్సిన పైకము   ముందు కట్టండి,  మీకు ఇంటికి కావలసిన వస్తువులు నా  దగ్గర నుండి తీసుకెల్లండి.  మీ ఇంటి ఆడవారు కూడా ఒక్క సారి  వచ్చి అరుణక్కను కల్సి చెప్పుకొని ఆటోలు తీసుకొని వెళ్ళమని చెప్పండి అన్నాడు అశోక్.

నాన్న ఆటో మీద కవిత వ్రాసాను అని చూపించాడు, చాలా బావుంది చదివి నీ కిస్తా అన్నాడు అశోక్ కొడుకుతో

ఇంధనం పడితే,  గేరు  మారిస్తే,  పరుగేడుతావు
గల్లి గల్లి తిరిగి శ్రమలేకుండా ప్రజలను చేరుస్తావు
వళ్ళు  గుల్లయినా కోడిపిల్ల  లా   పరిగేడుతావు
స్కూల్  పిల్లలను  వేళ  తప్పకుండా  చేరుస్తావు

మతి ఉన్న వారిని, మత్తెక్కిన వారిని సమయానికి చేరుస్తావు
మసక  చీకటిలొ మిణుగురు పురుగులా  సంచరిస్తు  ఉంటావు
బురద ఉన్న  టైరుల్లో గాలి ఉన్నంత వరకు తిరుగు తుమ్టావు
పందిలా ఉన్న,  ఏనుగంత  బరువును మొసి కెల్తూ  ఉంటావు

పక్షుల కిల కిల రావాలతో శుభోదయం  అని పలరిస్తావు
ఉషోదయ కిరణాలు తగలక ముందే బయలు తేరుతావు
అనారోగ్యులైన  వారిని  తొందరగా ఆసుపత్రికి  చేరుస్తావు
నిద్రనుజయించి దరిదృడి ఆకలి తీర్చుటకు ఆధారమైనావు

మూడు కాంతులతో ముక్కంటి లాగా వెలిగి పోతావు
నరకంలా ఉండే రోడ్లమీద పరుగెత్తి స్వర్గం చూపిస్తావు
నడమంత్రపు సిరివద్దు మీటర్ డబ్బులు చాలంటావు
రాక్షభటులకు మామూలిస్తు ప్రజలను గమ్యం చేరుస్తావు

రెక్కలు లేకుండా విశిష్ట విన్యాసాలు చేస్తుంటావు
జల్లులు పడిన జలదరిమ్చక  చక  చక పోతావు
వేగంగాపోతూ ముగ్దమొహనంగా సవ్వడి చేస్తావు
సీతాకొకచిలకలా, ఘంటసాల పాటలా నచ్చుతావు
  
 అశోక్ భాయి నిన్ను  కలవాలని పోలీస్ ఇన్ స్పెక్టర్ వచ్చాడు.

సర్దార్ సింగ్ నమస్కారమ్ అన్నాడు అశోక్,  చెప్పండి నేను మీకు ఏమి సహయము చేయాలి అన్నాడు.  మీ ఆటోలలో ఈ రోజు ఉదయం ఎవరో ఇద్దరు లావు పాటివారు ఎక్కరుట,   ఇతర దేశాలకు ఎజమ్టుగా పనిచేస్తున్నట్లు మాకు ఇన్వరమెషన్ వచ్చింది. మేము కొందరిని పట్టు కున్నాము. వారిలో అసలైన  వారు   ఎవరో  మీ ఆటోలో తిసికేల్లిన డ్రైవర్  గుర్తు పట్టగలరని వచ్చాను  అన్నాడు.
ఎప్పుడు రావాలి అని అడిగాడు, ఈరొజు 11 గంటలకు వస్తే చాలు, వాళ్ళ ఫోటోలు  ఇచ్చినా చాలా అని అడిగాడు, ఫోటో గీసి ఇస్తే చాలు  మంచిది అన్నాడు. అట్లయితే ఈరొజు 10 గంటలకు వచ్చి ఫోటో తిసికేల్లండి,
స్టేషన్ కు  వద్దమంటె,  ఈరోజు ఈ కాలనీ పెద్ద చని పోయారు, వారిని స్మసానములో ఖననం చేస్తారు మేమందరం వెళ్ళాలి అని చెప్పాడు.    
నేనే ఫోటో వేసి ఇస్తాను ఆవ్యక్తులు నా ఆటోనే ఎక్కారు ప్రొద్దున అన్నాడు.
మీరు మర్చి పోకుండా 10 గంటలకు ఫోటోలు   వచ్చి తిసుకేల్లండి  అన్నాడు.
నమస్తే అశోక్ భాయి, నమస్కారం అని వీది దాక సాగ నంపి బ్రెష్ తో ఆటోలో ఎక్కిన వారి చిత్రములు గీసాడు ఒక అరగంటలో
భయ్యా ఆటో తీయవా ఆసుపత్రి దాక పోవాలి అమ్మాయి, ఓంకర్లు  తిరిగి పోతుంది, ఒకటే కడుపు నెప్పి అని అరుస్తుంది అని వేడు కుంది ప్రక్క ఇంటిలో ఉన్న  పార్వతమ్మగారు.
ఆప్పుడే లోపలకు వస్తూ మీరు నఫషల్సు కు వెళ్ళండి,  నేను ఆటో తీసుకొని వీల్లమ్మాయిని ఆసుపత్రిలో చేరుస్తాను అన్నది అరుణ.
రండంమ్మగారు మీ అమ్మాయిని ఆటోలో తీసుకెల్దాము అంటు ఎక్కించుకొని వేగంగా ఆసుపత్రిలో చేర్చింది. వెంటనే ఆసుపత్రిలో ఆపరేషన్ చేయాలనీ డబ్బు కట్టమని అన్నారు ఆసుపత్రి డాక్టర్.
పార్వతమ్మగారు మీదగ్గర డబ్బులున్నాయ అని అడిగింది  అరుణ, లేవమ్మ వీల్ల నాన్నగారు క్యాంపు అని వెళ్ళినారు, ఫోన్ కుడా అందటం లేదు నాకు కాళ్లు చేతులు ఆడటము లేదు అన్నది.
సరే మీరు  ధైర్యముగా ఉండండి ఆ హనుమంతుడు మీ పిల్లని రక్షిస్తాడు అన్నది అరుణ.
డబ్బు విషయము మీరు మర్చి పొండి,  అన్ని నేను చూసు కుంటాను అన్నది అరుణ.
వెంటనే ఎవరికో ఫోన్ చేసిందివాళ్ళు డబ్బు తీసుకొచ్చి కట్టి వెళ్లారు.
అప్పుడే డాక్టర్ బయటకు వస్తూ సమయానికి తీసుకొని వచ్చారు,  లేకపోతె  ప్రాణానికి ప్రమాదము వచ్చేది, మూడు  రోజుల్లో రికవరీ అవుతుంది ఇంటికి తీసుకెల్లవచ్చు అన్నాడు.
చూడమ్మ నీవు ఎవ్వరికి నమస్కారాలు పెట్టనవసము లేదు, ఎవరి పని వారు చేసారు.
మీ వారికి ఫోన్ చేసి రమ్మనమని చెప్పండి,  మీ అమ్మాయిని జాగర్తగా ఇక్కడ ఉండి  చూసుకొండి, మీరు డబ్బులు ఏమి కట్ట నక్కరలేదు, అన్ని నేను కట్టాను అన్నది.
మీ అమ్మాయికి అయిన కర్చు ప్రతి పైసా మీరు వ్రాసుకోండి, మీ అమ్మాయి ఆరోగ్య వంతురాలైన తర్వాత  డబ్బులు తిరిగి ఇవ్వండి అన్నది.
మరి నాకు వేరే పని ఉన్నది, డాక్టర్ని అన్ని మాట్లాడినాను, నా ఫోన్ నెమ్బరున్నది కదా ఇంకా ఎమన్నా డబ్బులు కట్టాలంటే నాకు ఫోన్ చేయండి. మీ అమ్మాయి ఆరోగ్యంగా తిరుగుటే నాకు కావలసినది డబ్బు కాదు అన్నది అరుణ   

అప్పుడే టివిలో ఎనోన్సుమేంట్ అవుతున్నది ఒక అటో డ్రైవర్  సహాయముతో పొలీసువాల్లు దేశ ద్రోహులను పట్టుకోగలిగారని తెలిపారు.
ఇప్పుడే అందిన వార్తా,  ఎవరో అటో డ్రైవర్ అరుణట ఒక స్కూల్ పిల్లను రక్షిమ్చ పోయి కారు క్రింద  పడిందట, వెంటనే ఆసుపత్రిలో చేర్చారు ఆమె ఆరోగ్య పరిస్తితి  ఏమి చెప్పలేమని చెప్పుతున్నారు డాక్టర్లు, యాక్సిడెంటు కారు సీల్ చేసారు,      
ప్రజలు కొందరు కోపముతో కారుపై దాడి చేసారు,  అరుణ  డ్రైవర్  తప్పులేదు, పాప రక్షించ పోయి,  నేను కారు కు అడ్డం వచ్చాను,. బ్రేకు వేయటం వళ్ళ కొంత దెబ్బులు తగిలాయి అన్నది 
ఇన స్పెక్టర్ సర్దార్ సింగ్ మనిష్టర్ కూతురిని రక్షించ టం వళ్ళ దెబ్బలు తగిలాయని చెప్పింది అరుణ 
ఆసుపత్రికి ఆటోలో అందరు చేరారు అందరు దేవుణ్ణి  ప్రార్దిమ్చుతున్నారు.
ఆసుపత్రికి చేరాడు అశోక్
మీ రమ్దరు శాంతముగా ఉండండి,  అరుణక్క ఆరోగ్యమునకు ఎటువంటి భయము లేదు కోలు కుమ్టున్నది. దయచేసి మీరమ్దరు వెళ్ళండి నేను  ఇక్కడే ఉండి  నా భార్యను చూసు కుంటాను. దయచేసి మీరమ్దరు ఇంటికి వెళ్ళండి, త్వరలో కోలుకొని తిరిగి వస్తుంది మీ అరుణక్క
తప్పు ఎవరిదైనా భాద అనుభవించక తప్పదు, తప్పు చెసిన వారిని శిక్షిమ్చి వారము మనము కాదు. దానికి ప్రభుత్వము ఉంది అది చూసు కుంటుంది.
అప్పుడే కట్టులతో అరునక్క హాస్పటల్ బయటకు వచ్చింది  అందరకు కనిపించింది, నాకు తగ్గి పోతుంది , ఇంకో  నాలుగు రోజుల్లో  మీ వద్దకు వస్తాను అన్నది.
నేను  వక్కటే మినిష్టర్ గారిని కోరేది అసమ్పూర్తిగా ఉన్నా మా సమస్యలను పరిష్కరించాలని ద్రివర్పై పెట్టిన కేసును తీసి వేయాలని అందరి సమక్షమున కోరుతున్నాను అన్నది అరుణ.
అప్పుడే వచ్చిన మినిష్టర్ అటో నడిపేవారి నేడే జరిగే ఎసంబ్లి సమావేశములో మీ సమస్యలను పరిస్కరిస్తాను వీ అందరి ముందు వాగ్దానము చేస్తున్నాను అన్నాడు మినిష్టర్.
అంతలో హాస్పటల్లో అలజడి పెరిగింది. కొందరు తుపాకిలతో హాస్పటల్ ను చుట్టు ము ట్టారు, అశొక్ ను,. అరుణను, మినిస్టర్ ను అదుపులోకి తీసుకోని మా నాయకులను విడుదల చేస్తే కాని మేము వీరిని విడువము అని బెది రించారు.  మేము ఈ హాస్పటల్లో బాంబు పెట్టాము.
వెంటనే పొలీసులు వచ్చి అందరిని, ఆటోలను దూరమ్గా పొమ్మని వార్నింగ్ ఇచ్చారు. మీసమస్యల్ను తీరుస్తాము, మినిస్టర్ ను విడుదల చేయండి అన్నారు పొలీసులు.
ఆరన దైర్యము చేసి కాపలాగా ఉన్న వాని మర్మావయవముపై మొకాలితొ గట్టిగాకోట్టిమ్ది. అతని చేతిలో తుపాకీని తీసుకోని కాళ్ళ మిద కాల్చింది. ఆ శబ్దము వినిమరికోమ్దరు అక్కడకు రాగా కరంటు వైరు లాగి వారిపై విసిరింది కరంటు షాకు తగిలి క్రింద పడ్డారు, వెంటనే వారి వద్ద ఉన్న తుపాకులు అశోక్ అరుణ తీసుకొని ఎదువచ్చిన వారిని మోకాళ్ళపై కాల్ఛటం మొదలు పెట్టారు. అంటే వచ్చినవారు నెలకు వరిగారు. అప్పుడే పొలీసులు వచ్చి అందరిని అదుపులోకి తీసుకున్నారు.
అరుణ చేసిన దైర్యానికి ప్రతిఒక్కరు మెచ్చుకున్నారు.
ఆటోను నడప టమేకాదు, అవసరాniki  తెగించి పోరాడే శక్తి ఉమ్దని నిరూపిమ్చిది అరుణ.
అరుణ అశోక్ కలిపి ప్రత్యెక బహుమతి,  ప్రశంసా పత్రము రాస్త్రపతి  నుండి  పొందారు.  
మాకు వచ్చిన ఈ బహుమతి పైకము మొత్తము అటో నడుపుతూ  చనిపోయిన వారికీ, ఒక సహాయ నిధి ఏర్పాటుచేసి దానికింద మావంతుగా ఇస్తున్నాము.