ఏమండి కాస్త ఇటు వస్తారా, ఆని అడిగింది భార్య అరుణ.
'నా ముక్కుకు సూటిగా రమ్మంటావా ' అట్లాగే రండి అన్నది, కళ్ళు తెరుచుకొని చూసి నడవండి. అసలే మీరు నడుస్తూ ఉంటే క్రింద ఏమి ఉన్నాయో కుడా కనబడవు అన్ని.తన్నుకొని వస్తారు అన్నది.
అంత లేదే భార్య మణి ఇపుడే వస్తున్నాను అంటు గుమ్మం తగిలి బోర్లా బొక్కల పడ్డాడు భర్త అరవింద్ .
ముక్కుకు దెబ్బ తగిలింది రక్తం కారుతుంది. అమ్మోనోప్పి, అయ్యో నొప్పి అని మూలిగాడు
నేను చెపుతున్నా మీరు వినిపిమ్చుకోరు కదా అన్నది.
ఉండండి మందు తీసుకొస్తాను మీరెక్కడ కూర్చొ కండి అట్లాగే నుమ్చొని ఉండండి తొందరగా తీసుకురా అసలే ముక్కు మంట పుడుతుంది. అన్నాడు భర్త అరవింద్
ఎంతసేపు నుంచొని ఉంటాను అంటు కుర్చీలొ కూర్చొబొయాడు దబీమని క్రింద పడ్డాడు.
అమ్మా నొప్పిగా ఉందే నా పీటం బ్రద్ద లైనట్టు ఉందే, " ఇట్లారా " అంటు భార్యను పిలిచాడు.
ఒక్క నిముషము తిన్నగా ఉండరు కదా మీరు, ఇందాక ముక్కు ఇప్పుడు ముడ్డి మందు నేనెట్లా రాసేది. ముందు ముక్కుకు రాస్తున్న మిగతా చోట్ల మీరు వ్రాసుకోండి.
ఏమిటే నీవు నా భార్యవు కధా కాస్త మందు వ్రాయవే.
తప్పు తుందా ఇటు రండి ఈ మంచము మీద పడుకొండి అంటు గట్టిగా పలికింది.
అబ్బా నాకు చెవుడు లేదే అసలే నోప్పితో భాద ఒకవైపు, తర్వాత నీ మాటలతో భాద మరో వైపు
నువ్వేకడ దొరకావె నాకు అన్నాడు అరవింద్
నేనేం నీకు దొరకలా, నిన్ను సంతలో కొనుకున్నాను తెలుసా.
అప్పుడే పౌరుషము వచ్చేసింది నీకు . మా ఆవిడకు కోపం వస్తే ఏమ్చేస్తుమ్దో నాకే తెలియదు అంటు మంచము మీద పడుకున్నాడు. నొప్పితో మూలుగుతు
ఇదిగో మందు తెచ్చా ఒక్క సారి లేవండి మీరు, అసలు దెబ్బ లెక్కడ తగిలాయి తెలుస్తుంది. ఆ లుంగి తీయండి. డ్రాయరు వేసుకున్నారుగా అన్నది.
నీవు నా భార్యవు కదే ఎం పర్వాలేదు, మిమ్మల్నే చూడలేక చస్తున్నా, ఇక అది చూసాననుకొ ఇక్కడే పడిపోతా, మీకు మందు వ్రాసేవారు కూడా ఉండరు, అతి తెలివి పోకుండా లుమ్గీ తీసి బోర్లా పడుకొండి మందువ్రాస్తానన్నది. అట్లాగే అన్నాడు. అబ్బ నొప్పె, పడ్డప్పుడు లేదు కాని నేను వ్రాస్తున్నప్పుడు నొప్పిగా ఉందా.
వెన్నముద్ద వ్రాస్తున్నట్లు ఉన్నది. నీ చెయ్ తగిలేతే ఇక మందుతో పనేమిటి ఇట్లే తగ్గిపోతుంది. ఏమిటండి మరీ వెళ కోలంగా ఆ మాటలు, కాస్త నుంచొండి, కాస్త కూర్చోండి అన్నది.
ఏమిటే ఈ గుంజిళ్ళు, ఇమీ లేదండి, ఇంకా ఎక్కడన్నా దెబ్బలు తగిలాయోనని, చూద్దామని అన్నాను అన్నది, లుమ్గీ తీసుచూపిమ్చనా అన్నాడు. వేద్దులే .
ఇక చూసావుగా బయలు దేరు కాస్త పడుకుంటా అన్నాడు, నేను వెళుతున్నాను అని నడవబోయింది
శ్రీమతి అరుణ, మందు ట్యూబుపై కాలు వేసింది అంతే వెనక్కి పడ బోయింది, అపద్బామ్దవుడులా వెనుక పట్టుకున్నాడు భర్త అరవింద్, కాని బాలన్సు తప్పి ఇద్దరు మంచము మీదకు వెనక్కు పడ్డారు
అబ్బ ముందు పగిలిందే అన్న అరపు, అబ్బ ఎమి అరు పండి. ఎదీ పగళ్ళ, నన్ను కాపాడారు చాల సంతోషము, నన్ను లేవనీయండి ఇట్లా ఉంటే బాగుందే ఉండొచ్చు కదా. అన్నాడు.
ఇదేమి రాత్రికాదు, పగలు మీరు ఆడిమ్చినట్లు ఆడడానికి.
ఉండండి నేను వెళ్లి కాస్త కాఫీ చేసుకొని వస్తా, కాస్తా విశ్రాంతి తీసు కొండి మిమ్మల్నేవరు, కదిలించరు బుద్దిమంతులుగా పడుకొండి అన్నది. శ్రీమతి అరుణ
ఇదిగో టిఫిన్ తినండి, ఇపుడే కాఫీ తేస్తాను. నీవు కూడా టిఫెన్ ఇప్పుడే తినవచ్చుగదా. పూజ కాందే తినని మీకు తెలుసుగదా అన్నది నవ్వుతూ. అయితే నాతోపాటు కాఫీ త్రాగు. అది త్రాగుతా లెండి ఇప్పుడే తీ సుకొస్తా రెండు కప్పుల కాఫీ. అనివెల్లి తెచ్చి ప్రక్కన కూర్చొని మాటలతో కాఫీ త్రాగుతున్నది. మీరు ఓ గంట విశ్రాంతి తీసుకొండి అని చెప్పి లోపలకు నడిచింది. నెమ్మదిగా బట్టలుతికి. కొన్ని బట్టలు బక్కేటులో పెట్టుకొని డాబాపైకి వెళ్తూ ఏమండి మీరు ఒక్కసారి ఇటువచ్చి ఈ బట్టల బక్కెట్ పైకి తీసుకు రండి అన్నది. అట్లాగే నీవె పైకెల్లి అవి అన్నియు అరెయి అప్పటి లోపు నేను తెస్తాను అన్నాడు భర్త అరవింద్.
అతి కష్టం మీద గుడ్డల బక్కెట్ పట్టుకొని పైదాకా పట్టుకొచ్చి ఒక్కసారి బట్టలు ఆరేసే దండే కర్రను పట్టు కున్నాడు. మనిషి బరువుకి కర్ర వంగి గుడ్డల తాడు తెగి దాని మీద ఆరేసిన గుడ్డలన్నీ పక్షులు ఎగిరినట్టు ఎగురుకుంటూ కొన్ని పక్క ఇంట్లో పడ్డాయి, మరికొన్ని పక్క చెట్లపై పడ్డాయి.
ఎ మాయిందండి కడ్డిని పట్టుకొని తూలారు, ఏమిటే బక్కెట్ అంత బరువుంది.
కొందరు మొగాళ్ళు గుండిగను ఒక చేత్తో లాగి ప్రక్కన పెట్టె వారుట మీరెమొ ఈ బక్కేటు కుడా మోయలేరు. ఏమిటండి కళ్ళు తిరుగు తున్నాయ. క్రిందకు పోయి మంచినీల్లు తెస్తా ఉండండి బట్టలు ఎగిరి ప్రక్క ఇంట్లో పడ్డాయే అవి ఏట్లా తెచ్చేది అన్నాడు. అవి పొతేపొయినాయి, కొత్తవి కొను కుందాం లెండి. మీరు బాగుండటం కావాలి.
అమ్మా అని మల్లి మూలిగాడు అరవింద్
ఏమిటి భాదగా ఉందా అన్నది. కాదె భాద కొత్త బట్టలుకోనాలంటె చాల ఖర్చు గుర్తుకొచ్చింది, దాని గురించి భాధపడుతున్నాను అన్నాడు .
ఎమన్నా ఓపిక చేసుకొని పక్క ఇంటికి పొయి గుడ్డలు తెమ్మంటావా అన్నాడు.
ఆ ఇంట్లో కూక్కలు ఉన్నాయి అవి పీకాయంటే కొత్త గుడ్డలకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అన్నది శ్రీ మతి అరుణ.
వద్దండి పొతే పొనీ యండి. మీకు ఇప్పటి దాక దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి.
ఆ ఎగిరి పడ్డవి అన్నినా లమ్గాలు, నీ లుమ్గీలు, నా బాడిలు, నీ చేడ్డిలు, నా జాకెట్లు, నీ షర్ట్స్, నాకు ఇప్పు డు వేసు కోవ టానికి లేవే. ఇప్పుడు వంటి మీద ఉన్నాయిగా అన్నది. ఇప్పటికి కాదె రాత్రికి నా చీర చింపి ఇస్తాను లుమ్గీలాగ చుట్టుకొండి.అన్నది.
రేపటి గురించి ఆలోచించకండి. ఈరొజు హాయిగా ఉండండి. అన్నది.
నీమాటలతొ నాకు తగిలిన దెబ్బలు అన్ని మర్చి పోయానే, నా ముద్దుల రాణివి నీవె అన్నడు అరవింద్
ఇదిగో బోజనాలు ఆయిన తర్వాత గుర్రు పెట్టె నిద్రపోకుండి, మనం బట్టల షాపుకు పోదాము తెలిసిందా అన్నది భార్య అరుణ.
అప్పుడే బయలు దేరుదామా పక్క ఇంటికి పోయి ఒక ప్రయత్నం చేయనా అన్నాడు అరవింద్.
అయితె ఒక పని చేద్దాం ఆ సెల్ ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడి చెప్పుతా, అప్పుడు పోదామా వద్ద అని తెలిసి పోతుంది.
ఏమండి పిన్నిగారు ఇంట్లో మీ ఆయన ఉన్నారా అన్నది, మా ఆయనతో మీకేమి పనండి, అబ్బే మీ ఆయనతో కాదు మీతొనె పనుంది, ఆ చెప్పండి. మా అయన ఫోనులో మాట్లాడితే పెద్ద అనుమాన పక్షి చాల కోపము వస్తుంది. తొందరగా చెప్పండి. మీ పనేమీటో అన్నది. ఏమ్మిలేదు మీ కుక్కలను కట్టేస్తే,
"ఆ కట్టేస్తే " ఎవరి నన్న దొంగలను పంపిస్తావమ్మ, అసలు నీ వెవరు, నా సమయము అంత వ్యర్ధము చేస్తున్నావు అన్నది. కోపంగా. అంత కోపం ఏమ్డుకండి పిన్నిగారు మీ గోడ ప్రక్క ఇల్లు మాది మీ కుక్కలను కట్టివేస్తే మా ఉతికిన బట్టలు ఎగిరి మీ ఇంట్లో పడ్డాయి అవి తీసుకొని వెళ్లేందుకు ఫోన్ చేసాను.
సరే మీ ఆయనను మాత్రం పంపిమ్చ కండి, మీరె రండి అసలే మా అయన అనుమాన పక్షి, గోడ ప్రక్క ఎ మొగోడు పోయిన వాడు నీమీద కన్నేసాడని పిచ్చి అనుమానము. ఈ అనుమానంతో సగం చస్తున్నాను, కుక్కలకుసేవ చేయలేక మిగత సగం చస్తున్నాను.
మీరు మాత్రం చావకండి నేనే వస్తున్నాను, బట్టలు తీసుకొవటానికి అన్నది అరుణ.
అమ్మయ్య కొత్త బట్టలు కొనక్క ర్లేదు అన్నాడు అరవింద్
టెలిగ్రాం అని అరుపు విన్నాడు.
ఉమ్డవే ఆ టెలిగ్రాం చూస్తూనె నా కాళ్ళు వనుకుతున్నాయి.
వక్కసారి చదివి వేల్లిన తర్వాత బట్టలు తీసుకూరా అన్నాడు భర్త అరవింద్.
పండుగకు పిల్లలతోపాటు వస్తున్నాము కొత్త బట్టలు కొని పెడతారు కదూ
ఆమాటలకు ఒక్కసారి కల్లవేమ్బడి చెమ్మ దిగింది
ఏమిటండి పిల్లలొస్తున్నాఅరని సంతోషము ఉండక, ఆ కన్నీరు ఏమిటి.
కాదె నా కాళ్ళ వెంబడి వస్తున్నా ఆనందభాస్పాలు
అవునండి మన పిల్లలు వస్తే నవ్వలే నవ్వులు, నాకు మాత్రం పస్తులే పస్తులు
అమాటలు విని పక్కింటి అంటి శుభాకాంక్షలు ఎమ్డుకంటే మీరు మాట్లాడుకున్న మాట్లువిన్నానునేను ఇందుకంటే సెల్ ఫోన్ మీరు కట్టేయ్యలా
ఆ ఆ ....................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి