మకరంద మాల
మన్నించి మము బ్రోవుము మంగళాకరా
మదినిమార్చి మనసులు కలుపు మురా
మరమనుషులము మేముఆడించుమురా
మన్నించుము మాతప్పులను వేంకటేశ్వరా
మంకెన పువ్వు ఎరుపు, మాణిక్యం ఎరుపు
మందారం ఎరుపు, మావి చిగురు ఎరుపు
మంగళ హరతి మెరుపు, ఘమ్ధం పసుపు
శ్రీ వెంకటేశ్వరా నీ రూపం మాకు మరుపు
మరచి పోలేదు, నీకు కానుకలు అర్పిమ్చినాను
మనస్సుప్రశాంతముగా ఉంచుతావని తలచాను
మరువలేని మమతను పంచుతావని తలచాను
మాలలుధరించి పొందావు వకుళమాత దీవెనను
మాలో ఉన్న అజ్ఞానమును తొలగించే గురువులా
అహంకారమును తొలగించి ప్రేమనుపంచే తల్లిలా
అసంతృప్తిని తొలగించి సంతృప్తిని ఇచ్చేదేవుడిలా
మాలో సఖ్యత కల్పిమ్చి నావు పద్మావతి భర్తలా
మారణ హోమం సృష్టిమ్చేవారిని మట్టు పెట్టు తున్నావు
మానవులను దుఖాలుతొలగించి సుఖాలు కల్పిస్తున్నావు
మాపటికి మనస్సును కల్లోలము నుండి తప్పిస్తున్నావు
మామచేత పాదాలు కడిగిమ్చుకొని పద్మావతిని చేపట్టినావు
మనో నేత్రాలతో మా కందరికి సన్మార్గము చూపినావు
మరు జన్మ లేకుండా మాకు మోక్షము కల్పిమ్చినావు
మరల మరల కురులు తీసీసుకొని శిరులు లిచ్చినావు
మమ్ము మాయనుండి కాపాడు" గోవింద" అన్న కాపాడినావు
మంచి గంధము పూసి, లలాటమున కస్తూరి తిలకము దిద్ది,
మకుటము పెట్టి, తులసి మాలతో అలంకారము దిద్ది,
మంజిష్టారాగాముతో ప్రార్ధన చేసి, మంత్రామ్గమును దిద్ది.
మండే గుండెలను చల్లార్చె వెంకటేశ్వవరుడవు నీవె నయ్యా
మందహాసపు పెదవులతో, మందాకినిని పాదాలవద్ద ఉంచుకొని
మల్లెల మకరమ్దములతొ, హృదయమున లక్ష్మిని పదిలపరుచుకొని
మక్కువతో, మకురతనముతో ఉన్నా పద్మావతిని త్రుప్తిపరుచుకొని
మామచ్చికను తొలగింఛి, సఖ్యతనుకాపాడే లోకరక్షకుడవు నీవెనయ్య
మటమటలాడు,మటుమాయలాడులనుమట్టుపెట్టి మతమ్గజముపై దేవాలయం మాడుగు వీదులలో తిరుగునట్టి మణిప్రవాళముతోను,మధురస్వరాలతోమాలనుచుట్టి మత్యభమ్ధమువలె మనసును మభ్యపెట్టి వేంకటేశ్వరుడవు నీవెనయ్య
మందార మంకరంద మాలను ధరించిన వాడవు
మన్మధ లీలలను వశ పరుచు కున్న వాడవు
మణినిధరించి జగతికివెలుగును చూపిన వాడవు
మనవారికి సన్మార్గము చూపిన వేంకటేశ్వరుడవు నీవెనయ్య
మరిగి మరిగి ఇగిరి పోయే జీవితాలు మావి
మరల మరల బ్రతకలేని బ్రతుకులు మావి
మరకలతో మరలాకదిలే కాళ్ళుచేతులు మావి
మా మోర వినిపిస్తున్నాము రక్షించు వేంకటేశ్వరుడవు నీవెనయ్య
మనులున్నా మాణిక్యాలున్నా మనసుండా లన్నావు
మర్మం తెలుసుకో లేని ప్రాణులకు రాక్షకుడన్నావు
మసిబూసి రంగుమార్చిన ఎవ్వరి గుణం మారదన్నావు
మా పల్లెలో ఊరెగి మమ్ము కాపాడే మువ్వ గోపాలుడవు నీవెనయ్య
మన్నెంలో పెరిగినవాడకు నమ్మకం పెమ్చిన వాడవు
మచ్చ అనేది లేకుండా ధర్మాన్ని నిల బెట్టిన వాడవు
మన మనిషిలా చూస్తు నిలబడి కాపాడిన వాడవు
మా మంకు పట్టును మార్చిన వేంకటేశ్వరుడవు నీవెనయ్య
మర మరాలు లాగా గాలిలో తేలే జీవితాలన్నావు
మరలా మరలా ఆశలతో తిరిగే మనష్యులన్నావు
మరకత మనుల కోసం వేటాడే మానవులన్నావు
మొక్కిన మొక్కును తీర్చిన వారికి రక్షకుడవు నీవెనయ్య
మనోహర రూపమె కాదు, తన్మయత్వంలో ఉంచే రూపమ్
మల్లి, జాజి పూల మాలలే కాదు, పసిడి హారం ఉన్న రూపమ్
మరువంతో ఉన్నా మాల కాదు, వజ్రాల హారం ఉన్న రూపమ్
మరచిపోలేని నామనసులో ఉన్నది, శ్రీ వెంకటేశ్వరా నీరూపమెనయ్య
మంగళ వాద్యాలతో, మధుర కీర్తనలతో, ప్రేమతో,
మధుర రసాలతో, మధురాతి మధుర ప్రసాదాలతో,
మేము నైవైద్యములు పెట్టినాము సంతోషముతో,
మనసును దోచిన పద్మావతి వల్లభుడవు నీవెనయ్య .
మన్నింపు, మన్నింపు మనుష్యులు చేసే ప్రార్ధనలను
మమత్వము పెంచి తొలగిమ్పుము మన్మధ మాయను
మాలో పెరుగు తున్న కోపాన్ని తొలగించి పంచుము ప్రేమను
మల్లాలప్రగడ వారి కవితలో తప్పులను క్షమించి కాపాడుము వెంకటేశ్వరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి