22, మే 2014, గురువారం

139. Love Story -43 (పెళ్లిచూపులు )


                                                                       

పెళ్లిచూపులు

నీకు చెప్పేంత వారము కాక పోయినా మావంతు  మేము చెప్పాలి,    స్త్రీ అన్న తర్వాత ఒదిగి ఉండాలి,   చిరు నవ్వు నవ్వుత్తూ ఉండాలి,   నిన్ను చూడటానికి పెళ్లి కొడుకు వారి భంధువులు,  ఈరొజు వస్తారుట,   రోజుటి కన్న ఒక్కరవు  ముందు రావాలమ్మ.
సరే వాళ్ళు  "ఎన్నింటికి" వస్తారు.
సాయంత్రము వస్తారుట ప్రత్యేకముగా టైం చెప్పలేదు .
పర్వాలేదు టైం తో నాకేం పని,  ఎందు కైనా మంచిది వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి నాకు  ఫోన్ చేయండి,  అని తల్లి తండ్రులకు  తెలియ పరిచింది డాక్టర్  సుహాసిని.(పిల్లల స్పెషలిస్ట్).
ఈ  సంభధం అన్న కుదరాలని ఆరాధ్య  దైవాన్ని  ప్రార్దిమ్చారు. తల్లి తండ్రులు.

అనుకున్న ప్రకారం పిల్లను చూడటానికి " పెళ్లి కొడుకు,  భంధువులు " వచ్చారు.
పిల్లను చూసి వెళతాం,  మాకు సమయము లేదు అని అన్నారు.
ఈరొజు వెరే ఎవరికైనా పిల్లని చూడటానికి  వస్తామని చెప్పరా  అని అడిగారు సుహాసిని తండ్రి.
అవునండి మేము,  మొగ పెల్లివారము,  నాలుగు సంభందాలు చూసిన  పిల్ల మా అబ్బాయి నచ్చటలేదు, మీ అమ్మాయి ఫోటో లో బాగానే ఉన్నది,  అమ్మాయిని పిలిపించండి అన్నారు,  వచ్చిన భంధువులు.దర్పంగా .
మీరు కాస్తా అల్పాహారము తీసు కొండి,  అంత లోకి అమ్మాయి వచ్చేస్తుంది,
ఇప్పుడే బయలు దేరానని ఫోన్ వచ్చింది.
ఎక్కడనుంచి రావాలి "కూకట్ పల్లి  నుంచి"
నాన్న ఈ సంభంధం కుదిరేటట్టు లేదు అన్నడు పెళ్ళికొడుకు.
తొందర పడొద్దు అమ్మాయి వస్తున్నది అన్నారుగా.
ఏమిటండి చాదస్తముగా కూకట్ పల్లి నుంచి దిల్షుక్ నగర్కు వచ్చేటప్పటి కల్ల కనీసము 2 గంటలు పట్టవచ్చు అసలే ట్రాఫిక్ జామ్ అన్నారు ఒకరు.
అయితే ఇప్పుడే ఎం చేద్దాం అన్నారు కూడ బలుక్కొని.
వచ్చిన వారిలో ఒకావిడ లేచి అన్నయ్యగారు మిమ్మల్ని శ్రమపెట్టాము,  అమ్మాయిని చూసి వెళ్దామంటే దారిలో ఉన్నది అన్నారు
మీరె చెప్పండి ఎం చేద్దాం. కాసేపు మాట్లాడుకుందాం, అబ్బాయి విషయాలు చెప్పండి అన్నాడు పిల్ల తండ్రి.
మావాదికేమంది మొగవాడు బీతెక్ చదివాడు, ఇమ్జనీర్గా చేస్తున్నాడు , తవరలో ఇతర దేశాలుకు పోతున్నాడు, మీ సంభంధం కుదిరితే పెళ్ళిచేసుకొని పొదామను కుంటున్నాడు.
మా అమ్మాయి డాక్టర్ మీ అబ్బాయి ఇమ్జనీర్ ఇద్దరికీ ముడి
దానిదేముం దండి  పిల్లలు ఇష్టపడితే పెళ్లి చేయటమే మనవంతు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి      
ఎవరో  అన్నారు కదండి  "మనుష్యులకు ఓపిక ఓర్పు ఉం టుందని "
నిజమే అయినా పిల్ల మాకు నచ్చింది ఫోటో చూసాముగా అన్నారు. కట్నం విషయాలు మాట్లాడుకుందామా అండి అన్నారు 
అదేమి టండి  ముందు  పిల్లను చూడ  కుండా ఫోటో నచ్చిందంటే ఏట్లా కుదురు తుంది  అన్నాడు పిల్ల తండ్రి.
అది నిజమే అను కోండి పెళ్ళంటే  నూరెల్ల పంట అటు ఏడు తరాలు ఇటు ఏడూ తరాలు చూడా లంటారు కాని
ఇపుడు అవి అన్ని ఎవరు పట్టిమ్చు కుంటున్నారండి.
ఏదో పూర్వం వాల్లు అవి అన్ని చూసెవారు.
ఇప్పుడుకేవలము కట్నం అడగకుండా లాంచనాలు అడిగుతున్నారు, ఘనంగా పెళ్లి చేయ  మంటున్నారు  అన్నది.
మీ అభిప్రాయము చెప్పండి అట్లయితే  మేము కట్నం ఇవ్వనక్కరలేదు కదా అన్నారు పిల్ల తండ్రి.
అప్పుడే పెళ్ళికొడుకు తల్లి లేచి మా అక్కయ్యగారు ఏదో మాట్లాడారు అవేమి మనసులో పెట్టుకోకండి
మేము ఇంకా పిల్లను చూడందే, చూసిమ్తర్వాత మాకు నచ్చితే అన్ని విషయాలు  తర్వాత మాట్లాడు కుందాం అన్నాది

సరే మీరు అన్యదా భావించకండి,  ఇప్పుడే ఫోన్ వచ్చింది కనీసము ఒక గంట పడుతుందట అన్నాడు పిల్ల తండ్రి.
వచ్చినవారిలో ఒకాయన లేచి నాకు పని ఉంది,  నేను వెళ్తున్నాను,  మీరు ఉండి పిల్లను చూసి రండి అని లేచాడు, నెనుకూడా  వస్తానండి  నన్ను వదిలివేల్తే ఏట్లా  అని అన్నది లేచిన వాని భార్యా.
అప్పటిదాకా కూర్చోని,  వీల్ల మాటలు వింటున్న  పెళ్ళికొడుకు లేచి అందరం కలసి వెళ్దాం అని లేచాడు,
అన్నయ్యగారు మేము మల్లి వచ్చి  చూస్తామ్, మీరు ఈసారి అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు కబురుచేయండి అనిచెప్పి లెచారుఅమ్దరూ
అందరిని సాగ నంపారు పిల్ల తండ్రి.
లోపలే ఉన్న సుహాసిని ఎం నాన్న, మీకు భాధగా ఉందా, పెల్లిసంభంధం చెడి పోయిందని,  నా కస్సలు భాదలేదమ్మ పెళ్ళికొడుకు నాకు నచ్చలేదు,   అందులో అతనికి పల్లెత్తు పగలు చూస్తె రాత్రి కలలోకి వచ్చేటట్టున్నాడు ఆన్నాడు  తండ్రి.
అంతలోనే తల్లి వస్తూ పెళ్లి కొడుకును చూసి వంకలు పెడితే నీకు పెళ్లెప్పు డయ్యెను అన్నది
నేనైతే మీనాన్న మొఖం పెళ్ళికి ముందు చూడనే  లేదు,  అమ్దరూ పెళ్లి కొడుకు బాగున్నాడు అన్నారు, నన్ను అడిగారు  నీకు నచ్చాడ అని   మీకు నచ్చితే నాకు నచ్చినట్లే  నాన్న అని అన్నట్లు గుర్తు , " మా అమ్మ మంచిది నా పెళ్లి త్వరలో అవుతుంది నీ వే మి గాబరా పడనక్కరలేదు  అన్నది.                        
               
సూర్య ప్రకాశరావు గారున్నారా అంటు లోపలకు ఒకరు వచ్చారు.  నాపేరు సుభాష్ అంటారు,  నేను ధర్మారావుగారి కొడుకుని, మా నాన్నగారు మీకు ఈ జున్ను మరియు ఈ మీగడ పెరుగు ఇమ్మన్నారు.   మీదెవూర్  అన్నావు,  మాది నిజాంబాదు ప్రక్కన సారంగ పురం.  ఇప్పుడక్కడే ఉమ్టున్నాము
 ఏది ఆ కొండ  ప్రక్కన ఇల్లా మీది అవునండి, నీ పేరు సుభాష్  కాడు బాబు ఏదో పాత పేరు ఉండేది ఆ గుర్తుకొచ్చింది నీపెరు  సుబ్బిగాడు కదూ అవునండి  నిజమేనండి.
నా పేరును సుభాష్ గా  నేను మార్చుకున్నాను మీ నాన్నగారు బాగున్నారా, మీ నాన్నగారిని చూసి చాలా సంవచ్చరాలు  అయింది. త్వరలో వచ్చి చూస్తానని చెప్పు బాబు.
ఇమ్తకీ నివేక్కడ పనిచేస్తున్నావు నేను ప్రిజం  లో సీనియర్ అసిస్స్టంట్ గా  పనిచేస్తున్నాను. అయితే  జైల్లో పనిచేస్తున్నావన్న మాట అవునండి.   అంటే నీవు జై ల్ బాబు వి,  కాదండి ధర్మారావుగారి అబ్బాయిని. అవును అదే నేను అన్నది.
మరునాడు ప్రకాశరావుగారు,  ధర్మారావు ఇంటికి బయలుదేరారు,  ఇంటికి పోగా ఇంటిలో సుభా ష్ మాత్రమె ఉన్నారు,  వాళ్ళ అమ్మ నాన్న చుట్టాల పెళ్ళికి వెళ్ళారని చెప్పాడు.
లోపలకేల్లగానే గొడ మీద ఒక చిన్న ఫోటో చూసా డు.  ఆ ఫోటోను చూస్తునె ఈ ఫోటో ఎక్కడిది బాబు అని అడిగాడు ప్రకాశరావుగారు.
ఇది చిన్నప్పుడు మా  పక్క ఇంటి అమ్మాయి ఫోటో అన్నాడు.
ఆ అమ్మాయి నీకు ఇప్పుడు తెలుసా అని అడిగాడు.
నాకుతెలియ దండి ఎప్పుడో నేను చిన్నప్పుడు  తీసిన ఫోటో, అప్పుడే లంగా ఒనీలు వేసుకొని ఉన్నప్పుడు  తీసిన ఫోటో అన్నాడు. 
నీవు తీసావా లేదండి,  అప్పుడు నేనే ఫోటో స్టూడియొ వాని వద్దకు పోయి అడిగి తెచ్చాను ఈ ఫోటో .
ఇప్పుడు గుర్తు పట్టగలవా నీవు
చూస్తె గుర్తు పట్టగాలను అప్పటికి ఇప్పటికి ఎంతో మారిపోయి యుంటుంది.
నీకు పెళ్లి అయిందా లేదండి ఇప్పుడల్లా చేసుకో దలచకో లేదు అన్నాడు.
సరే బాబు నేను వచ్చి వెళ్ళా నని చెప్పు మీ నాన్న గారికి
అట్లాగేనండి  అన్నాడు సుభా ష్                        

ప్రకాశరావు ఇంటికి వచ్చి తన వద్ద ఉన్న ఆల్బంను తీసి తనకూతురి ఫోటో అని నిర్ధారణ చేసుకున్నాడు.
చూడమ్మ సుహాసిని ఈ సారి మాత్రము పెళ్లిచూపులకు వచ్చేవారిని నీవున్నప్పుడే పిలుస్తాను అన్నాడు తండ్రి  ప్రకాశరావు.  సరే   నాన్న కాని పెల్లికోడుకుతో నేను పర్సనల్ గా మాట్లాడుతాను మరెవ్వరితో మాట్లాడను అని చెప్పింది  సుహాసిని (ప్రస్తుత పరిస్తితులలో పిల్లకు నచ్చితేనే పెళ్లి చేస్తున్నారు తల్లి తండ్రులు  అందుకే పిల్ల ఎన్ని ప్రశ్నలు  వేసిన తల ఊ పుతున్నారు ఆడపిల్ల దొరికితే చాలని తొందర పడుతున్నారు కదా పెళ్ళికొడుకులు ).
పెళ్లి చూపులకు డాక్టర్ ఆనంద్  వచ్చారు. రూపు రంగు ఎత్తు బాగున్నారు, కాని అమ్మాయికన్న అబ్బాయి వయసు కొద్దిగా ఎక్కువని పిమ్చిది.
సుహాసిని ఈసారి పెల్లికోడుకుతో పరసనల్ గా  మాట్లాడింది. (మాటలు ఈ విధముగా సాగినాయి)
సుహాసిని : పెళ్లి ఆయిన తర్వాత మనం చేయ వలసిన పనేమిటి ?
ఆనంద్ : హనీమూన్ వెళ్ళటం,  కాపురం చేయటం.
సుహాసిని: పెళ్లి అయిన  తర్వాత  నేను ఉద్యోగము చేయాలా, ప్రవేట్ ప్రాక్తీస్  పెట్టు కోవాలా ?      .       
ఆనంద్ : నేనే నర్సింగ్ హొమ్ పెడుతున్నా దానిలో నే ఉండాలి,  వేరే ఎక్కడా పనిచేయకూడదు.
సుహాసిని : పెళ్లి అయిన తర్వాత మానాన్న అమ్మను నా దగ్గరకు తెచ్చుకుంటాను మీకెమైనా అభ్యంతరమా?
ఆనంద్ : మా కుటుంబమే పెద్దది, మనకు పిల్లలు పుట్టిన తర్వాత వస్తే మన పిల్లలను చూడటానికి పనికొస్తారు.
సుహాసిని: చివరి ప్రశ్న ఇతర దేశాలకు పొవాలని ఉన్నదా ?
ఆనంద్ : ఇంత చదువు చదివి ఇతర దేశాలకు పోయి  సంపాదించాలి కదా  
సుహాసిని:  ఇమ్తకీ నేను నచ్చానా
ఆనంద్ : పర్వాలేదు అందులో బాగా చదువుకున్నారు.
సుహాసిని: సరే మీరు ఇంటికి వెళ్లి మీ పెద్దలను కలసి మాట్లాడుకొని నేను నచ్చానో తెలుసుకొని నా కబురు పంపండి. అప్పుడు  నా అభిప్రాయము చెప్పుతాను ఐతే  కేవలము సాయంత్రము లోపే అన్నది ఎందుకు అంత గట్టిగా చెపుతున్నారు లేదు  నన్ను చేసుకుంటామని చాలామంది వస్తున్నారు అందుకని అ న్నాను అంతే 
నేను నీకు నచ్చలేదా, ముందు  మీరు చెప్పండి తర్వాత నేను చెప్పుతాను అన్నగా  అన్నది.
ఆనంద్ : నీవు ఒక్కతే  కూతురువు కదా ఆస్తి అంతా నీపేరు మీద ఉన్నదా, ఆస్తిని చూసి వచ్చావా నన్ను చూసి పోదామని వచ్చావా రెండు.
అయితే  ఇంక  సెలవు అని లోపలకు నడిచింది.
నాన్న గారు ఆ వచ్చినవారికి కాఫీ టిఫేన్లు ఇచ్చారా అని  అడిగింది.అమ్దరూ వినె టట్లు.
సరే మేము వెళ్లి మల్లి కబురు పంపుతాము అన్నారు వచ్చినవారు.
వా ళ్ళు వెళ్ళిన తర్వాత తల్లి లోపల నుండి బయటకు వచ్చి ఈ సంభందము కూడా  మగళ హారతి పాడావమ్మ.
వాళ్ళు ఉత్త డబ్బు మనుష్యుల్లా ఉన్నారు అమ్మ . 

                                               
చూడమ్మ రేపు హనుమజ్జయంతి  (23-05-2014) ఈ ప్రక్కన ఉన్న హనుమంతుని గుడిలోకి పోయి దేవునిని దర్సనం చేసుకొని వద్దాము  అందరం  అన్నది తల్లి. అట్లాగే నమ్మ అమ్మదరం వెళ్దాం
గుడిలో సుహాసిని గంట కొట్టుతున్నప్పుడు సుభాష్ చేయ్ తగిలింది.  అనుకోని స్పర్సకు ఆనందం కలిగింది,  ప్రదక్షణం చేస్తున్నాప్పుడు ప్రక్క ప్రక్కన నడుస్తున్నప్పుడు ఏడడుగులు అనుకోకుండా కదిలాయి,   హనుమంతుని బొట్టు పెట్టుకొనేటప్పుడు ఇద్దరు అద్దంలో చూస్తు తలకాయలు తగిలాయి,   క్షమించండి అంటు చేతితో తిలకము సరిచేసాడు సుభాష్ సుహాసినికి.
అప్పుడే ధర్మారావుగారు,  భార్య బారతమ్మ,   ప్రకాశరావును భార్య ప్రబావతిని చూసి బాగున్నారా అని అడిగారు.
అలా దూరంగా  కూర్చొని మాట్లాడు కుందాం రండి అన్నారు.
ఇమ్తకీ మీ  అబ్బాయి రాలేదా అని అడిగారు ప్రకాశరావుగారు వయసులో ఉన్నవాడు  కదండి అట్లాగుడి చుట్టు తిరిగోస్తా నన్నాడు.
మరి మీ అమ్మాయి ఏది. మా అమ్మాయి కూడా  గుడి చుట్టు తిరిగోస్తానంది.
సుబ్బ్గాడ్ని పిలవండి వీలకుకు పరిజ్చయం చేద్దాం అన్నది, వెంటనే  సుబ్బీ  ఇటురా ని కకేసాడు పెద్దగా, ఏమిటండి అట్లా పిలుస్తారు మనబ్బాఇ పేరు సుభాష్ కదా అన్నది అవును మర్చిపోయా ఉండు పిలుస్తా సుభాష్ అని అరిచాడు,  ఆ వస్తున్నా నాన్న అని పలికాడు. 
సుహాసినికి చిన్నప్పుడు  తనతో ఆడుకోన్న సుబ్బిగాడా యితడు,  ఇప్పటిదాకా నా మనసులో ఉన్న నా మన్మధుడా యితడు అని అనుకున్నది.
పిలిచావా నాన్న
అవునురా పిలిచాను చిన్నప్పుడు నీకు గుర్తుందా  మన ఎదురింటిలో సుబ్బ లక్ష్మి ఉండేది,  వీల్ల కూతురెరా అన్నాడు ధర్మారావు.
వాల్లమ్మాయి  రాలేదా నాన్న అని అడిగాడు.
నా మనసును దోచుకున్న నా రాణివి నీవె, నన్నుకలవటానికి వచ్చావా  అని అనుకున్నాడు.
అంతలో ఎదురైంది  ఇద్దరు ఒకరి మొహం కన్నార్పకుండా చూస్తున్నారు. (వెంటనే మనసులో గుర్తుకు తెచ్చుకున్నారు,  ఇద్దరు చిన్నప్పుడు తొక్కుడు బ్బిల్ల  ఆడుకున్నప్పుడు ముచ్చట్లు,  మామిడికాయలు కోస్తున్నపుడు  ముచ్చట్లు, వాగులో ఈత కొట్టిన ముచ్చట్లు అన్నిగుర్తుకుకు వచ్చాయి ఇద్దరికీ).
సుహాసిని తల్లితండ్రులను దూరముగా పిలిచి సుభాష్  సంభంధం ఖాయం చేయండి నాన్న అన్నది.
సుభాష్ తల్లి తండ్రులను పిలిచి నేను సుహాసినిని పెల్లిచేసు కుంటాను  సంభంధం ఖాయం చేయండి నాన్న అన్నాడు
చూడండి మన పిల్లల మనసులు కలిసాయి తామ్బూలాలు పుచ్చు కుమ్దామా  అన్నారు ఇద్దరు ఒక్కసారే
ఆమాటలు ఆయన తర్వాత  ఒక్కసారి అమ్దరూ  ఆదేవాలయము లోకి వెళ్లి నమస్కరించి త్వరలో కల్సుకుమ్తామని చెప్పి వెళ్ళారు.      

మీకు అ భ్యంతరం  లెదుకదా  మా అమ్మాయి డాక్టర్ చదివింది,  మాకేం అబ్యంతరము అది అంతా మా అబ్బాయి అదృష్టం అన్నారు                        
మేము కట్నం తీసుకొదలచలేదు అది మీకు చెప్పు దామను కుంటున్నాము అన్నాడు సుభాష్ తండ్రి , ఇద్దారు ఇష్టపడ్డారు అదే పెదా కట్నం మాకు  అన్నాడు పిల్ల తండ్రి ఒకరికొకరు నవ్వుకున్నారు, అన్ని తర్వాత  మాట్లాడుకుమ్డా ఇప్పుడు తొందరెందుకు అన్నారు ఒకికొకరు. సరే ఇక బయలు దెరుదమా
అరె పి ల్ల ల్లెరి, వాళ్ళు వస్తారు లెండి  నిదానంగా,  మనం బయలుదేరుదాం అన్నారు, అట్లాగే  

మమ్మల్ని ఆశీర్వ దించండి అని సుభాఃష్  సుహాసిని కలసి తాతమ్మ పాదాలకు నమస్కరించారు. మిమ్మల్ని దీవిస్తున్నాను లేవండి.ఇంతకు నేను అడిగే  ప్రశ్నలకు సమాధానము చెపితే మీ ఇద్దరికి  పెళ్లి  అ అయినట్లే మీరు పెద్దవారు మమ్మల్ని దీవిమ్చండి, నా దీవెనలు ఎప్పుదూ మీకు ఉంటాయి అయినా మీ తెలివి చూడాలి కదా అమ్మాయి నీవు ముందు  చెప్పాలి సమాధానము నేను అడిగిన ప్రశ్నకు1. పెళ్లి  ఎందుకు చేసుకుంటారు ?     ఇద్దరు మనసులు కలసి "సుఖ పెట్టి  సుఖిమ్చుటకు "ఇంకా వివరముగా చెప్పు "ఇంద్రియాలను త్రుప్తి పరుచుటకు" 2. అన్నింటికన్నా ముఖ్యమైనది,  అందరిలో ఉండాలి,  ముఖ్య ముగా ఎవరెవరి మద్య ఉండాలి ?అబ్బాయి  నీవు చెప్పాలి,  దీనికి సమాధానము అన్నది.   (పర్వాలేదు ఇద్దరు సంప్రదిమ్చుకొని చెపండి )ఇద్దరు కాసేపు మాట్లాడుకొని అన్నింటికన్నా ముఖ్యమినది "ప్రేమ", అందరిలో ఉమ్డాల్సిమ్ది "ప్రేమ"ముక్యముగా ఉమ్డాల్ల్సినది భార్య భర్తల మ ద్య  " ప్రేమ, సంతృప్తి "నేను ఒక్కటే చెప్పేది అందరికి ఆరాధ్య దైవాన్ని  ఆరాధిస్తూ ధర్మమార్గమున నడుస్తూ , మనో నిగ్రహ శక్తితో నలుగురికి సహాయము చేయటమే.   ఇద్దరు కల్సి సంతోషముగా జీవిమ్చుటకు, మనసులు కలిసేందుకు ఏర్పాటు చేస్తారు పెళ్లి చూపులు