16, మే 2014, శుక్రవారం

137. Family story -41 (అత్తగారి పెత్తనం)


అత్తగారి పెత్తనం
చూడు  శారదా మీ అమ్మ చెప్పే మాటలు నీకు  నచ్చినా నచ్చక పోయినా చెప్పింది విని,  తరువాత నీ అభిప్రాయాలు చెప్పు " అమ్మ ఎం చదువుకున్నది,  ఏమి తెలుసు, అని నీవు అనుకోవచ్చు, మాకాలంలో మాకు నేర్పిన చదువు,  మేము బ్రతకటానికి పనికొచ్చింది". చదువనేది సంసారానికి అక్కరలేదు. మంచి గుణవంతురాలు అని పించు కుంటే  చాలు, పిల్లలు కన్న  తల్లి, దొడ్డ ఇల్లాలు అనిపిమ్చు కుంటే చాలు,  పెద్ద ముత్తైదువు   అని పించు కుంటే  చాలు ఆడదాని జన్మ ధన్యమైనట్లే.
మీ నాన్న గారు పెళ్లి సంభందాలు చూస్తున్నారు,   నీకు నచ్చితేనే ఒప్పుకోవాలి,  నీ అభిప్రాయాలు పెల్లికోడుకుకు తెలుపుకొని ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు, అమ్మ నాన్నలు చెప్పారు కదా అని తలవంచుకొని తాళి కట్టుకోవాలి  అనుకోవటం,  నీ ఆలోచన లేకుండా పెళ్లి చేసుకోవటం నీదె తప్పు.  ఎట్టి  పరిస్తితుల్లో పెద్దలను తప్పు పట్ట కూడదు.  వారు పిల్లల బాగుపడాలి అని తలకు మించిన భారమైన, మంచి సంభందమని,  పెల్లిచెస్తారు.  పెళ్లి విషయంలో ఒక్క నిజం పెల్లి కోడుకుకు సంభందించినది (లక్షణాలు) తెలిసి చెప్పితే ఒక ఆడపిల్ల ప్రాణం కాపాడిన వారవుతారు.   అందుకనే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు విషయాలు తెలుసుకొని పెళ్ళిచేయాలని పెద్దలు అందురు.
ఎందు కమ్మ అట్లా గట్టిగా చెపుతున్నావు పెళ్లి గురించి, పెళ్ళంటే నూరెల్ల పంట, ఒక్క సారి తాళి కట్టిమ్చుకున్నావంటే ఇంటిపేరు మారుతుంది, మనసు, తనువూ అర్పించుకొని బ్రతికే పరిస్తితి ఏర్పడుతుంది. అదృష్టం బాగుంటే అత్తగారి సాదిమ్పులు, మొగుడు వేదింపులు ఉండవు. అవి ఉన్నాయనుకో జీవితాంతము నరకం.   అటువంటి పరిస్తితుల్లో తెలివిగా భర్తను అత్తగారిని బుట్టలో   వేసుకోవాలి, వారి బలహీనతను బట్టి ప్రవర్తించాలి.  జీవితము హాయిగా సాగి పోవాలి అనేది నా మాటా  అని చెప్పింది  తల్లి శాంతమ్మ.

నేను ఎందుకు చెపుతున్నానంటే  కొందరి ఇళ్ళల్లో అత్తగారి పెత్తనం సాగుతుంది.  ఆమె మాటకు కొడుకులు కాని, కూతుర్లు కాని, భర్త కాని, చివరకు తల్లి తండ్రులు కాని ఎదురుచేప్పలేరు.  ఆమె వాక్కు వేదవాక్కు గా మారుతుంది. దానినే అత్తగారి పెత్తనం అంటారు. అటువంటి ఉమ్మడి కుటుంబములో నీవు పడ్డావంటే చాలా జాగర్తగా,  తెలివిగా,  బ్రతకాలి, లేదా కస్టాలు కన్నీళ్ళు నీకు మిగులుతా యి అన్నాది తల్లి శాంతమ్మ.

అమ్మ అత్తగారి పెత్తనం ఎలా ఉంటుంది  అన్నది.
మా అత్తగారు నన్ను పెట్టిన కొన్ని కష్టాలు, సుఖాలు  నీకు చెపుతాను,  అదివిని అందరూ అట్లా ఉంటారని, అనుకోకు, మంచివారు ఉంటారు , నా దురదృష్టం కొద్ది  మా  అత్తగారి మాటలు  వినాల్సి  వచ్చింది.

మాన్నాన్న గారితో మాఅత్తయ్యగారు పెల్లికి ముందు ఒక్కటే మాటన్నారు. మీ అమ్మాయి బంగారం, మా ఇంటిలో అడుగుపెడితే మా ఇల్లంతా బంగారం అవుతుంది, మా ఇంటిల్లిపాటికి  బంగారు లక్ష్మిగా మరుతుంది.  మీరేం భయపడకండి, నా సొంత కూతురుగా నేను చూసు కుంటా, కట్నం పైసా వద్దు. ఉన్న కట్టు బట్టలతో పంపించినా మాకు అబ్యంతరము లేదు. మా కోడలి కోసమని మేము చాలా నగలు , బట్టలు  కొన్నాము అవి అన్నియు మీ అమ్మాయికి ఇస్తాము అన్నది.

ఆమాటలకు మాఇంట్లో వారందరూ చాలా సంతోష పడ్డారు.  మీ అత్తగారు ఎంతో మంచిది, కోడలిని పూవుల్లొ పెట్టుకొని చూస్తుంది అని పెళ్ళికి ముందు ఎగతాళి కూడా చేసారు.
మానాన్నగారు తాహతుకు మించి మంచి  కళ్యాణ మండపం  ఏర్పాటు చేసి, పెల్లిబట్టలు కొని, అప్పగింత బట్టలు కొని , అన్ని లాంచనాలు  ఏర్పాటు చేసి పెళ్లిని రంగరంగా వైభవముగా చేసారు.
పెల్లిలో గొడవ ఏమి జరుగలేదామ్మ అన్నది శారద
జరుగకేమ్మ జరిగింది,  ఆడబడుచులకు మంచి చీరలు పెట్టలేదని అలిగి వెళ్లి పోయారు,  కాఫీ టిఫేన్లు సరిగా అమ్దిమ్చ లేదని మా అత్తగారు ఒకటే సతా ఇమ్చారు,   పిల్లలకు పాలు పంపలేదని,  దుప్పట్లు పంపలేదని,  బాత్ రూమ్లు బాగాలేవని, దొరికినప్పుడల్లా ఏదో ఒక మాట అంటు ఉండేది.
అంతలో పెళ్లి పెద్ద వచ్చి అన్ని సక్రమముగా జరుగుతున్నాయా  అని అడిగాడు.  ఏమయ్యా ఇప్పుడొచ్చి అడుగుతావా, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా అని భాద పడు తుంటే  ఇప్పుడు కనిపిస్తావా అన్నాది మా అత్తగారు.
ఏమన్నా లోటు మీకు చేసారా అన్నాడు.
ఆలస్యముగా వచ్చిమ్దిగాక లోటు ఏమ్చేసారా అని అడుగుతావు.  ఏదో అన్ని విషయాల్లో మేమే సర్దుకు పోతున్నాము అన్నది మా అత్తగారు. సరే మీరు పిల్లలు సరదా పడుతున్నారు. ఆ పేక ముక్కలుతా కాస్త ఏర్పాటు  చేయ్ అన్నది అట్లాగేనండి  ఇపుడే ఇపుడే పంపిస్తాను అని వెళ్ళడు.
తరువాత భోజనాలలో ఉప్పు,  కారాలు, సరిగా లేవని వంట బాగోలేదని సతా ఇమ్చారు.  ముందు మా మగపెల్లివారికి   పెట్టకుండా వేరేవారికి భోజనాలు పెట్టారని అలిగి గంటదాకా భోజనాలుకు రాలా. చివరకి మా అమ్మ నాన్న వచ్చి బ్రతిమలాడితే గాని భోజనాలు చేయలేదు.
చివరకి భోజనాలు చాలా  బగున్నాయి వంట బాగా చేసారు అని అన్నది మా అత్తగారు.
కిల్లి నోటిలో పెట్టుకుంటూ ఇది కిల్లినా, అసలు సున్నము  వక్కలేదు అన్నది.
అప్పుడే ప్రత్యేకముగా తోమలపాకు ఆకులు, వక్కలు , సున్నము ఇస్తేగాని సంతోష పడలేదు.
ఆమె కిల్లి నోట్లో పెట్టుకొని తుపక తుపక అని ఉమ్మేస్తూ ఉంటే చూసే వారందరికీ ఇదెక్కడి అత్తగారురా అను కొన్నారు.

అమ్మా పెళ్లి ఆయిన తర్వాత ఏమిజరి గింది.  ఏముంది ఆచారము ప్రకారము మొదటిరాత్రి జరిపారు తరవాత మమ్మల్ని కేరళ అందాలు చూసి హాయిగా అన్ని చూసి తిరిగి రండి అని మా అత్తగారు అన్నారు. ప్రకృతి అందాలు చూసి మేము తిరిగి వచ్చాము. అటువంటి సుఖము ఎన్ని జన్మలెత్తినా మరలా  రాదని అనుకున్నాము. స్వేచ్చగా సుఖాలు అనుభవించి మరీ తిరిగాము. అక్కడ ఇల్లు, చెట్లు కదులు తుంటాయి.  బోట్ హౌ స్ చాలా బాగున్నాయి.     
                                              

మేము తిరిగి వచ్చిన తర్వాత ఇల్లు చూస్తే,  సత్రం లాగున్నది.  భందువులోచ్చారని అనుకున్నాము. వారు భంధువులు కాదు అప్పుల వాళ్ళు ఆ మాటలకు నా కళ్ళు తిరిగినాయి.  ఏమండి ఇది నిజమా మీరు అప్పు  చేసారా అన్నది.  అవునే ఏదో అవసరానికి అమ్మ తెమ్మంటె  తెచ్చాను.  అప్పు తీరక పొతే గొడవ చేసారు అంతె.
మరి అప్పు ఎట్లా తీరుస్తా రండి  అన్నది.
నీవు ఉద్యోగము  చేస్తున్నావుగా,  ఆ డబ్బుతో అప్పు తీర్చవచ్చు  అని అమ్మ అన్నది.
నేను మీకు ఇస్తానని చెప్పలేదే,  ఏమో నాకేం తెలుసు ఇది అమ్మ పెత్తనం,  అత్తా కోడలు ఎలా నడుచు కుంటారో నన్ను మాత్రం బజారుకు ఈడవకండి  అన్నాడు భర్త వాచస్పతి.

అమ్మకు భయపడితే  మనం కాపురం ఎలా చేస్తామండి.  ఏమో నాకేం తెలియదు. అమ్మను మెప్పిమ్చాలి నామాట వినాలి అంతె అన్నాడు భర్త వాచస్పతి.
నిద్ర లెస్తూనె  ఏదో అరుపు విన బడింది.  కోడి అరుస్తుంది ఒకవైపు,  మరోవైపు మొద్దు నిద్రేమిటి లేచి ఇంత కాఫీ నా మొహాన కొ ట్టచ్చుగా అని  అరుస్తున్నది అత్తగారు.
ఆమాటలకు ఉలిక్కిపడి లేచాను.   అప్పుడు తెలిస్సిమ్ది పని మనిషి రాలేదని, అట్లు తోవాలని, బట్టలు నేనే ఉతకాలని.
చూడమ్మాయి నీది కొత్త కాపురం,  ఆ పనులు నీచెత చెయింమ్చ కూడదు.  మరిమ్చేద్దం పనిమనిషి రాలేదు. మనపని మనం  చేసుకుంటే తప్పులేదు. అన్నది అత్తగారు.
అత్తగారూ మీరు కూడా  నాకు సహాయం చేయండి అన్నాను, చూడమ్మాయి నేను మాత్రము చేయలేను,  నీవు వండి పెడితే నేను తిని కూర్చుమ్టా, లేదంటావా ఎదన్న గుడి మేట్ల దగ్గరో కూర్చుమ్టా నన్నది.
ఏమిటండి అత్తయ్యగారు ఈ చిన్న మాటలకు అంత పెద్ద మాటలంటారు.
ఇది అత్తగారి పెత్తనం అని అనుకోకు,  నీ ఇల్లు,  నీపని,  నీవు చేసు కుమ్టున్నావు,  అంతె  అన్నది.
సరే మీరక్కడే  కూర్చోండి కాఫీ తెచ్చి ఇస్తా త్రాగండి అన్నాను. .
ఆ రోజు రాత్రి నిద్దర పట్టలేదు నాకు,  కారణం చేతులు కాయలు కాసినాయి, కాళ్ళు చేతులు ఒక్కటే నెప్పులు, (అంట్లు  తోవటం బట్టలు ఉతకటం వళ్ళ)
అమ్మ నాన్న ఏమి అనలేద బామ్మను అన్నది శారదా
అమ్మంటే భయం, నీకు కొత్తకదా సర్దుకు పో అన్నాడు 
ఒకసారి అ త్తయ్యగారికి తెచ్చిన కాఫీ చెయ్ జారి క్రింద పడింది. గాజు కప్పు పగిలింది, అంతే  కళ్ళు  నెత్తికొచ్చాయే కోడిలి పిల్ల అన్నది.
నేను తుడుస్తానులెండి  పొరబాటు జరిగింది.  నీకు కొవ్వు పెరిగింది అన్నది.
నేను ఉద్యోగము చేస్తూ ఇంటి పనులు చేస్తున్నాను,  మీరు ఇట్లా ఆయనదానికి కాని దానికి పెడర్దాలు తీస్తె మంచిదికాదు అన్నాను.
నోరు లేస్తుమ్దే నీకు అని నీవు ఏమి పెట్టొద్దు నేనే కాఫీ పెట్టుకొని త్రాగుతా అని  లోపలి వెళ్ళింది.
గాజు పెంకులు తీస్తు చేతికి గుచ్చుకున్న, రక్త కారుతున్న, చూసి పట్టిమ్చుకున్నవారులేరు. అ భాదాతో నాకు కల్లవెంబడి  నీరు తిరిగా యి. మా అమ్మ నాన్నలు గుర్తుకొచ్చారు. వారు ఇక్కడ ఉంటే బాగుంటుందని. 

ఒక రోజు సెల్ ఫోన్ మాట్లాడు తుంటే,  ఎ మొగోడుతో మాట్లాడుతున్నావే కోడలిపిల్లా అన్నది.
ఎవ్వరితో మాట్లాడు లేదు,  మీ కొడుకుతో మాట్లాడుతున్నా అన్నది.
కొడుకు అంటున్నావు,  మాటలు జాగర్తగా రాని  అన్నది.  మీరు చక్కగా మాట్లాడితే నేను చక్కగా మాట్లాడుతా అన్నాను.
ఇదిగో నేను బయటకు వెళుతున్నాను నీవుకూడా వస్తావా అన్నది. నేను రానన్నాను  కోపముతో, అయితే నేను పోతున్నాను, బయట తాళం వేసి మరీ అన్నది.
అంటే ఆరోజు అత్తయ్యగారు వచ్చేదాకా అజ్ఞాత జైలు మాఇల్లె.                          
           

అమ్మ తరువాత జరిగిన విషయం,  నాన్నకు చెప్పావా అన్నది శారదా.

మీనాన్న గారు శాంత మూర్తి  అమ్మ,  ఎ విషయములో  కలగ చేసుకోరు,  ఓపిక లేదంటే ఉద్యోగము మానెయ మంటారు.  మీ అత్తగారు ఇలా పెత్తనం చేసేవారా అని అడిగింది.
అది పెత్తనం ఎందుకు అనుకోవాలి,  నా భవిషత్ కోసం,  మా అత్తగారు తీసుకున్న ముందు జాగర్తలు  అను కోవచ్చుకదా
ఎందుకమ్మ మీ అత్తగారి గురించి వెనకేసుకోస్తావు.  తప్పదమ్మ మన  యింటి  రహస్యాలు బయట పెట్ట కూడదమ్మ.
అవునమ్మ నాన్న గారు,  బామ్మను అరవ లేదా అన్నది.
ఒక్కసారి మాత్రము వాళ్ళ అమ్మ  మీద చాలా  కోపము వచ్చింది.
ఎం జరిగిమ్దమ్మ.
ఎం జరుగాలేదు శారదా,  అన్ని విషయాలు నీకు  చెప్పి నీ బుర్ర పాడుచేస్తున్నాను, ఈ వయసులో నీకు అవసరమా,
లేదమ్మా నీవు చెపుతుంటే నాకు వినాలని ఉమ్దమ్మ
ఒక రోజు పండు మామిడికాయ ముక్కలు అన్నంలో తిందామని తరుక్కొని పళ్ళెంలో పట్టుకొని ఉమ్చిన్నాను. మాటల సందడిలో పడి అన్నంలో తినలేదు.
మా అత్తయ్యగారు వచ్చి తరుక్కున్న  ఆ ముక్కలు తినలే దేమ్టి అన్నది.  తిందామని అనుకోని మర్చి పోయాను ఇప్పుడుతిమ్తాను అన్నది.
అత్తయ్యగారు మీరు కూడా తినండి అని ఒక పల్లెం  ముందు పెట్టాను.    నాకేం అక్కరలేదు, కడుపు నిండా నీవె మెక్కు అని విసురుగా పల్లాని చేత్తో తన్నింది.  దానివల్ల నా చేతిలో పళ్ళెం ఆ పళ్ళెం అన్ని క్రింద పడ్డయి.
అత్తయ్యగారు అంత దురుసు తనం ఎందు  కండి  అన్నాను.
ఈ ఎంగిలి  కంచాలన్ని ఎవరు తీస్తారె అని అరిచింది. మీ జేజమ్మ వచ్చి తీస్తుమ్దిదా,  మీ తాతమ్మ  వచ్చి తీస్తుమ్దా అన్నది,  రోజు నేనే తీస్తున్నాను కదండి.  ఏదో ఈ రోజు ముక్కలు తిని  తీద్దామని  అనుకుకున్నాను.  నోటి కూడు పాడు చేసారు అన్నాను.
అనండమ్మ అనండి నేనిక బ్రహ్మ రాక్షసిని అన్నది.
అప్పుడే మీ నాన్న గారు లోపలకు అడుగుపెడుతున్నారు.
ఏమిటమ్మ ఈ మాటలు నీవు ఒక ఇంటి కోడలుగా వచ్చావు.  అప్పుడు మీ అత్తగారు ఇలా సతా ఇమ్చారా అన్నాడు.
లేదురు మా అత్తగారు పువ్వుల్లో పెట్టి చూసుకుంది ఒక్క మాట అనలేదు, ఇప్పుడు నేను నీ పెళ్ళాన్ని ఏమి అనలేదురా అబ్బాయి గిన్నెలు తీసి తినోచ్చు కదా అన్నాను.
కోపంతో ఆపని నీవు చేయోచ్చు కదా అన్నాడు.
నీ పెళ్ళాం నీ ఇష్టం,  నీవు అన్నం పెట్టితే ఉంటా లేదా ఎ గుల్లో అరుగులమీద కూర్చుమ్టా అన్నది కోపంగా

అమ్మ అంత కోపం తెచ్చుకోకు, ఏదో కోపంలో అన్నాను తప్పయింది. నన్ను క్షమించు అన్నాడు.  ఆ సమయంలో నాకళ్ళు వెంబడి నీరు కారింది. అత్తయ్యగారు మీరు నన్ను కుడా క్షమించండి. ఏదో తొందర పడ్డాను అన్నాను.
మీరిద్దరు నన్ను క్షమిమ్చాలిరా మీరిద్దరు కత్తెరలో రెండు చిల్లుల లాంటి వారురా నేను దానిలో పోక చెక్కను, మీ రిద్దరు సుఖముగా ఉండండి నేను ఎక్కడకు పొనులె ఏదో కోపముతో అన్నాను అంతే.
మా అమ్మ మంచిది అన్న మాటలుకు మా అమ్మ ఎంత గారాబంగా పెమ్చిమ్దో గుర్తుకు వచ్చింది శారదా ఆరోజు.

అమ్మ మరి బామ్మ ఏదమ్మా, నేను ఇంత వరకూ చూడలేదు అని   అడిగింది  శారదా
దానికి కూడా జరిగిన విషయాలు చెపుతాను విను.
ఒక రోజు మా అత్తయ్యగారికి షుగర్ పెరిగి, బి. పి.  ఇంట్లో పడి పోయారుట, పని మనిషి నాకు  ఫోన్ చేసారు, నేను వెంటనే మీ నాన్న గారికి ఫోన్ చేసాను. ఇద్దరం కలసి వస్తున్నాము జాగర్తగా చూస్తు ఉండు అని పై మనిషి కబురు పంపాము.
అట్లాగే నని చెప్పింది పని పనిషి.
మేము  ఆటోలో ఇంటికి చేరేటప్పటి కల్ల ఇంట్లో అత్తయ్య గారులేరు. పని మనిషిని అడిగితె
ఉండమ్మ గారు అని అన్న వినిపించు కోకుండా పిల్లలను భాద పెట్టటం నాకు ఇష్టం లేదు, నేను రోజు పోయా డాక్టర్ దగ్గరకు పోయానాని చెప్పు వాళ్ళు వస్తారన్నది                                                                                                                    ఎంత సేపు  అయింది  అని అడిగాము. ఒక్క పది నిముషాలు అని చెప్పారు. మేము వెంటానే అదే ఆటోలో డాక్టర్ వద్దకు బయలు దేరాము.
మాముండే ఒక అంబులెన్సు పోతుంది. జనం అంతా గుమ్మి గూడారు ఏమిటని అడగాము, ఎవరో ముసలావిడి పోతుంటే స్కూటర్ గుద్దాడు చిన్న  పోరగాడు.
దెబ్బలేమీ తగిలినాయా అని అడిగాము.
కాలు మాత్రము బాగా దెబ్బ తగిలింది. ఇంకా ప్రాణం ఉంది .
ఎ ఆసుపత్రికి తీసుకెల్లరు.
ఎమ్కె ఆసుపత్రికి తీసుకెల్తారు అపొలో  ఆసుపత్రికి  మాత్రమె అన్నారు వారు.
వెంటనే అపొలో  ఆసుపత్రికి చేరాము
చేర్చింది మా అత్తగారేనని తెలుసుకున్నాము,  దగ్గరుండి అన్ని మందులు నేనువాడాను, ఆఖరికి రక్తం లేదంటే మీ నాన్న గారి రక్తం ఎక్కించారు.
మెత్తం మీద ఒక వారం రోజులు ఆసుపత్రిలోనే ఉండి అత్తయ్య గారికి అన్ని సేవలు చేసాను, ఎందు కంటే మొగవారిని లోపలకు రానియ్యరు కదా
చివరికి తగిలిన దెబ్బ మానింది,  ఇంటికి తీసుకొని వెల్ల వచ్చని చెప్పారు మేము  ఆటో తీసుకొని రావటానికి వెళ్ళాము.
ఆటో తెచ్చాక నర్సు వచ్చి మాచేతిలో ఒక లెటర్ పెట్టింది. మీరు వస్తే ఇమ్మని మీ అత్తగారు చెప్పింది
అత్తగారు ఏరి.   ఏమో మాకేం తెలుసు, మేము అటు వెళ్ళగానే మాకు కనిపించలేదు. మేము వెతుకుతున్నాము మీరు వెతకండి అన్నారు మేమందరం కలసి వెతికాము మాకు కనబడలేదు, చివరకు ఇంటికి  చేరాము.  ఇంట్లో ఉమ్దేమానని అక్కడ కూడ లేదు 

అమ్మ ఆ ఉత్తరంలో ఏముందో చెప్పామ్మ
 

ఈ ఉత్తరం మీరు చదివేటప్పటికి నేను కాశీ  వెల్లె  రైలులో ఉంటాను. నేను ముందుగానే నా  స్నేహితురాలద్వార టిక్కెట్టు బుక్ చెఐమ్చుకున్నను. నీకు తెలియకుండా  కొంత డబ్బును దాచాను.  ఆ డబ్బుతో నేను కాశీలొ ఉంటాను.  నాకోసం మీరు వెతకవద్దు. నేనే  ఆ కాశీ విస్వేస్వరుని కృపవల్ల త్వరలో తిరిగి రాగాలను. నేను ముఖ్యముగా వ్రాయునది,  నేను ఆసుపత్రిలో చేరక ముందు రాత్రి మీరిద్దరు మాట్లాడుకున్న మటలువిన్నాను.  నా సలహాను పాటిస్తారని నేను అనుకుంటాను. అందుకే పెద్దగా చెపుతున్నాను. అప్పు నిదానముగా తీర్చుకొగలరు. కోడలిపిల్ల కడుపుతో ఉన్నాట్లు తెలిసింది.  అబార్షన్ చేసుకోమని నీ వాదన విన్నాను. ఏది ఎదయిన  నాకొడుకు నీకు చెప్పిన మాట మంచిది కాదు.  ఆరోగ్యము చెడిపోతే మారాల  రాదు.  అందుకని నామాట విని పిల్లలు కనండి.  వారే మీ శేష జీవతమునకు ఆధారులవుతారు.  నేను మీకు అనేక ఇబ్బందులు కలుగ చేసాను. అన్యధా భావించద్దు. ఈ వారం రోజులు కోడలి పిల్ల నా దగ్గరే ఉండి  అన్ని సేవలు చేసిన దానికి నేనే ఋణపడి ఉన్నాను.  నేచేప్పేది ఒక్కటే పిల్లలు కనండి, పిల్లలు వద్దనుకోకండి,  అప్పు తీర్చుకొగలుగుతారు కాని ఆరోగ్యము చెడితే ఎప్పటికి అతుకు పడదు.
నా కొడుకు వాచస్పతి కి నీకన్న" తెలి తక్కువ" . ఇంటి ఇల్లాలు చదువుక్కున్న, తెలివి ఉన్న,  కుటుంబము బాగుంటుంది.
దయచేసి నామాట వినండి, నా తప్పులు మన్నించండి. మీరు హాయిగ జీవిమ్చండి                                                                                ఇట్లు

                                         ఈ మాటలు మీ ఆత్తగారి పెత్తనం అనుకొండి
 

అమ్డుకే శారద నీకు పెళ్లి చెసి  మీనాన్న గారు నేను కాశీ లో ఉందామని అనుకున్నాము, అక్కడ మా అత్తగారు ఎక్కడుందో వెతకాలని అనుకుంటున్నాము అన్నది తల్లి శాంతమ్మ.
సదరు పెళ్ళికి నా అభిప్రాయము త్వరలో మీకు చెపుతాను మా అమ్మ మంచి అమ్మ                              
                                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి