20, మే 2014, మంగళవారం

138. Philos'ophy story -42 (Life is clock)

గురువుగారు జీవితము అంటే ఏమిటి ?   జీవితము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే  గడియారం (క్లాక్)  అర్ధం కాలేదు.   నీ ప్రశ్నలోనే ఉన్నది.   అర్ధం చుట్టూ  తిరుగుతుంది  జీవితం,  ఇప్పుడు గడియారములో మనకు 12 గంటలు కనిపిస్తాయి.  అందులో ఒకే ముళ్ళు హమేషా తిరుగుతూ ఉంటుంది కదూ,   అవును గురువుగారు.  అది ప్రతి ఒక్కరి మనసు,  మరియు చప్పుడు విన బడుతుంది కదూ అది  "గుండె చప్పుడు".   ఈ రెండు సక్రమముగా జరగాలంటే పెద్ద ముళ్ళు,  చిన్న ముళ్ళు  ఉన్నాయి కదూ,  ఉన్నాయి గురువుగారు.   అవి పెద్ద ముళ్ళు  "పురుషుడు ", చిన్న ముళ్ళు  " స్త్రీ " ఈ రెండు ఒక సమయాన కలుస్తు ఉంటాయి. ఆ కలవటమే జీవితం.    కలవకుండా  ఉమ్డోచ్చు కదా గురువుగారు ?   మనిషిలో ఉన్న ఇంద్రియాలు సక్రమముగా లేకపతే  కలువరు,  అట్లే గడియారము పనిచే యక పోయినా కలవవు.   గడియారము వృత్తాకారము గానె ఎందుకు పెట్టారు?   భూమి గుండ్రముగానే ఉన్నది కనుక.   సూర్య చంద్రులు సంచారము చేస్తున్నారు కనుక  ఐతే మాత్రమూ మనిషిలో నవరంద్రాలు ఉంటాయి,   వాటిద్వార గాలి, నీరు,   లోపలకు పోయి,  వెలుపలకు వచ్చుట జరుగు తుంది.  అది ఎవ్వరికి కనిపించదు.  మన రక్తాన్ని సక్రమముగా పెట్టడానికి ఉపయోగ పడుతుంది.  మన శరీరములో  క్రింద నుండి పై దాక  నాడులు ఉండటంవల్ల  రక్త ప్రసరణ జరిగి  మనుష్యులు శక్తి రావటానికి ఉపయోగ పడును.   అనగా మనము తిన్న ఆహారము బట్టి జీవిమ్చుటకు వీలు బడును.   అట్లే గడియారమునకు బ్యాటరీ అనేది ఏర్పాటు చేస్తారు   దానిలో శక్తి  ఉన్నంత కాలం తిరుగుతుంది.  గడియారమునకు ఎప్పుడు బ్యా టరీ అవసరమో మనుష్యులకు (స్త్రీ పురుషుల సంగమము కూడా  అవసరము).          

తనను మొదలు నరికి మోడుగా మార్చినా చెట్టు,  గొడ్డలి మీద పగ తీర్చుకోదు,  మల్లి చిగురిస్తుంది.   పువ్వుని కాలికింద వేసి త్రొక్కిన పాదానికి సుగందాన్ని ఇస్తుంది,   దాని గుణం మార్చు కోదు.    గడియారమునకు ఎప్పుడు కీ ఇచ్చినా  అప్పుడు నడుస్తుమ్ది. దాన్ని సరిచేసుకొనే గుణం మనుష్యులలో ఉండాలి.                                                                                                      మనిషికూడా  ఒక యంత్రమే,   యంత్రము స్తిరమైనది,   మన శరీరము అస్తిర మైనది.   అన్ని తెలిసిన మనమే ఇతరులు చేసిన పొరపాట్లును మన్నించక అవకాసం వచ్చినప్పుడు కక్ష సాదిస్తాం,  పైశాచిక ఆనందాని పొందుతాం,  శక్తి యుక్తులను ఉపుయోగిస్తాం. ప్రతీకారమనెది  తాత్కాలికం,  సాస్వితము కాదు,  అలా కాకుండా మన మనసును గాయపరచిన వారిని మన్నిస్తే మనకు అనిర్వచనీయమైన మనస్సాంతి  కలుగుతుంది.  మనస్సాంతి కలగాలంటే భాగం పంచుకొన్న వారు ప్రశాంతముగా ఉండాలి,  వారి మనస్సు ఇబ్బంది పెట్ట కూడదు.   అవసరాన్ని బట్టి వారి సలహాను పాటించుట అందరికి అవసరము.  ఇరువురు కలసి చేసే పని అందరికి ఉపయోగం.  అట్లాగే గడియారము అర్ధరాత్రి 12 గంటలకు కలసినట్లుగా  ప్రతిఒక్కరు రాత్రిలో కలసి వారి అభిప్రాయాలు చెప్పుకొని మనసు ప్రశాంతముగా ఉంచుకోవాలి.  ఆ ఘడియ దాటిన తర్వాత  ముల్లు తిరిగినట్లు ఎవరికీ వారు సుఖముగా నిద్రపోవాలి అదే జీవిత సత్యం.( 5 నిముషాలకు ఒక నెంబరు పెట్టినట్లు) మనజీవితములొ కూడా కొన్ని మార్పులు వస్తాయి. బాల్యం, యవ్వనం, వృద్దాప్యం, కౌమారం, జరుగు తుంటాయి.  కాని ఎదసలో నఇనా  మానవులకు  రూపమ్  ఆభరణం  లాంటిది.  శక్తినిచ్చే పోషక ఆహారములు తీసుకుంటే  శక్తి మాత్రము తగ్గదు,  రూపము చెదరదు.  ఎ వయసులో నైనా నవ యవ్వన యువకుడు లాగా కనిపిస్తారు.  రుపానికి గుణం తోడవుతుంది.  ఎప్పుడు మంచి ఆలోచనలతో పనులు చేసే వారికి  చీకు  చింత లుండవు, దారము ఉన్నంత వరకు, గాలి ఉన్నంతవరకు గాలిపటము ఎగురుతుంది.   అట్లే శక్తి  ఉన్నమ్త వరకు మనమ్ ధర్మ కార్యాలు చెస్తు నడవాలి. లోక ధర్మాన్ని అనుసరించి బ్రతకాలి.  గుణానికి జ్ఞానం ఆభరణం లాంటిది. మనం నేర్చుకున్న విద్య నలుగురికి పంచి వారి వద్ద ఉన్న విద్యనూ నెర్చు కుంటు జ్ఞానాన్ని పెంచుకోవాలి,   నలుగురూ మెచ్చే విధముగా నడుచుకోవాలి,   విద్య అడిగిన వారికి కాదన కుండా  దానం చేయాలి, దానిలో ఉన్నది అసలైన సంత్రుప్తి,    జ్ఞానం ఒక్కటే ఉంటే ప్రతిఒక్కరిలొ సరిపోదు,  క్షమాగునం ఉండాలి, అనగా అందరి పై దయ చూపాలి.  అట్లే గడియారము ఎ ప్రాంతము పోయినా దాని సమయము మార కుండ  చూపు తుంది  అట్లే మానవులు కూడా  తమ ప్రవర్తనలు మార్చు కోకుండా దయా గుణంతో జీవిమ్చాలి. 

నరస్యా భరణం రూపం, రూపస్యాభరణం గుణం
గుణస్యాభరణం జ్ఞానం,  జ్ఞానస్యాభరణం  క్షమ

ఇది మన సనాతన ధర్మం,  ప్రతి ఒక్కరిలొ ఉండే సహజ లక్ష లక్షణాలు, ఇందులో ఎ ఒక్కటి తగ్గినా మనిషిగా గుర్తిపు ఉండదు.  

జమదగ్ని తన పుత్రుడు జమదగ్నితో ఈ విధముగా తెలియ పరిచాడు.
క్షమ కలిగిన సిరికలుగును
క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్
క్షమగలుగదోన కలుగును      
క్షమ కలిగిని మెచ్చు  శౌరి సదయుడు  తండ్రీ
క్షమ కలిగితే, సంపద విద్య, సుఖాలు కలుగుతాయి  భగవంతుడు మెచ్చుతాడని చెబుతాడు.

గోటితో పోయా విషయాన్ని గొడ్డలి దాక తేకుండా క్షమా గుణం అందరిలో ఉంటే అందరికి శ్రేయస్కరం.
కాల చక్రం తిరుగు తుంది, భూగోళం తిరుగు తుంది, గడియారం తిరుగు తుంది, మానవులలో ఉండే దుర్గునాలు తిరిగి  సద్గునాలుగా మారేది మనసు ఏకాగ్రత ఉంటే క్షమా గుణము పెరుగు తుంది.    

                                         

గడియారములో ముల్లులు పైనుంచి క్రిందకు జారి మరలా క్రింద నుండి పైకి ఎగ పాకుతాయి,   అట్లాగే జీవితములొ పెళ్లి అనేది " ఒక కేంద్ర నాడీ గడియారము"  దానియందు బిగుతుగా ఉన్నంతకాలము మూడు ముళ్ళ సక్రమముగా తిరుగును.   అదేవిధముగా పెళ్లి అయిన యువ జంట ఆరోగ్యముగా,  ఆనందముగా,  సుఖముగా,  సంతోషముగా ఎటువంటి అబ్యంతరము లేకుండా కాపురము చేస్తారు. వారి సంతోషానికి ప్రతిఫలముగా సంతానము కలగటం సహజం ముల్లులు పైనుంచి క్రిందకు దిగినట్లు సుఖాల ఫలితము,  పొమ్దుతూ పిల్లలు పుట్టుతూ, జీవిత సమరములో ఖర్చు అనేది ఏర్పడుతుంది.  క్రిందకు జరిగిన  ముళ్ళు పైకి ఎట్లా  పోతుందో,  అదేవిధముగా సంపాదనతో పిల్లల  పెంపకముతో,  ఒక్కొక మెట్టు ఎక్కుతూ,  పైకి పోతారు. రోగాలు, చదువులు, ఖర్చులు అంటు నిరుచ్చాహ పడుతారు.మరలా క్రిందకు జారుతారు ఇది లోక సహజం.  

నేనొక శిలను నా పెదవులపై నిరంతరము కదిలే దీపము వెలుగుతూ ఉంటుంది       
నాకళ్ళవెంబడి  నిరమ్తరమూ కన్నీరు కారుతున్న స్వప్నం సజీవమ్గా ఉంటుంది
నా హృదయం నిరంతరం రక్తలో ఉడుకుతున్నా, నాసంకల్పం సాన  పెడుతుంది.
గడియారము సమయము చూపుచున్న, రైలు గమ్య చేరుతుంది, కదులుతుంది

నా ప్రేమ నిరంతరము బ్రమిస్తూ ఉంటున్న, మల్లెల్లా నిత్యము సొభిస్తూనె ఉంటుంది
నా మనసు ఆలోచనల నిలయ మైన, శాంతి  కపోతాలలా నిత్యము పలుకరిస్తుంది
నాలో భావోద్వేగాలు చలిస్తున్నా, నా మాట  భగవత్  గీతామృతమూలా ఉంటుంది
గడియారము చప్పుడు పగలు వినబడదు, రాత్రిన కదిలిన శబ్దం నిద్ర పుచ్చుతుంది

నా జయాపజయాల మద్య ఏదో తెలియని శక్తి కదులుతుంది
నా  కలలు పగటి వెలుగుకు కరిగి నూతన తేజమవు తుంది
నా మనసు సంఘర్షణకు చిక్కిన,  శాంతముగా మారుతుంది
నా గడియారము ఆగిన సూర్యుని నీడ  కాలం తెలుపుతుంది         

గడియారము గంట ఏవిధముగా కదులు తుందో,   చెట్టుకు వేసిన ఊయల ఏవిధముగా కదులుతుందో,  సూర్య చంద్రులు ఏవిధముగా కదులు తున్నారో,   లేగ దూడ ఏవిధముగా ఏగురు తుందో,  కోతులు చెట్టు నుండి చెట్టు పైకి ఏవిదముగా ఎగురుతాయో, మనుష్యుల ఆలోచనలు స్తిరముగా ఉండక పరి పరి విధాలుగా  పరిబ్రమిస్తూ  ఉంటాయి. మష్యులకు పట్టుదల ఉంటే సాదిమ్చ లేనిదనేది ఉండదు'

అందుకే ప్రతియోక్కరు సమయాని వ్యర్ధ పరచకండి.  సమయము చాలా విలువైనది. పతిఓక్కరు ఖచ్చితమైన సమయ్యాన్ని నిర్ధారించుకొని పనులు చేయాలి.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి