15, మే 2014, గురువారం

136. Love Story-40 ( కలసిన మనసులు )

కలసిన మనసులు

శర్వాణి,  చక్రధర్ లు   "'ఎం.బి. ఎ ". చదివారు.  ఇరువురు మంచి ఉద్యోగములు చేస్తున్నారు.  వీరిరువురు ఒకరి కొకరు ఘాడముగా ప్రేమించుకొని,   తల్లి తండ్రుల మాటలను  కుడా  పట్టించు కోకుండా  " ప్రేమ పిచ్చి పెరిగి "   రిజిస్టార్  మారేజ్ చేసుకున్నారు.  వీరికి భంధువులు స్నెహీతులు మాత్రమె.    వీరి సంసారము మూడు పువ్వులు   ఆరు కాయలుగా కొన్నాల్లు జరిగింది, . వీరిద్దరి మద్య మాట మాట పెరిగింది

యువ దంపతులు జస్టిస్ చౌదరిని కలిసారు. మేమిద్దరం విడిపోవాలని నిర్ణ ఇమ్చుకున్నాము, మీరు ఎక్కడ సంతకము పెట్ట మంటే అక్కడ మేము సంతకము పెడతాము,  మీకు ఫీజ్ ఎంతో చెప్పండి అది ఇస్తాము.  మాకు ఈప్పుడే  విడాకులు ఇప్పిమ్చగలరు.

ఒకే  అట్లాగే   మీకు విడాకులు ఇప్పించగలను నేను,
మీది ప్రేమ వివాహమని చెప్పారు,    మరి ఎందుకు విడాకులు,   ఇందులో  ఎవరిది  లోపం,  విడి  పోయి వేరే పెళ్లి  చేసు కుందా మను కుంటున్నారా   మీరు.

వద్దుసార్ మీరు మా మనసు మార్చేందుకు  ప్రయత్నం  చేయకండి   "భర్త అనేది గౌరవము లేకుండా మాటలతో, చేతలతో, నిత్యమూ అవ మానిస్తుంది శర్వాణి "  ఈ అహంకారిని నేను భరించ లేను అన్నాడు చక్రధర్.        

జస్టిస్ చౌదరిగారు ఎప్పుడైనా ఒక చేత్తో  శబ్దము విన్నారా మీరు,  రెండు చేతులు కలిస్తేనే శబ్ధము అవుతుంది  కదా, అట్లాగే తప్పంతా   అతనిలో పెట్టుకొని నన్ను అదే పనిగా సాధిస్తే  "పిల్లిని తీసికెల్లి బోనులో పేట్టి  మరీ కొడితే  పులి అయినట్లు "  నాకు కోపం పెరిగి నాలుగు ఉతికా తప్పు చేసిన వారిని దండించమని మన్నారు పెద్దలు అదే నేను చేసాను. అందుకే నేను ఇతనితో కాపురము చేయలేను.

నేను కూడా  చక్రధర్ లాగా పనిచేస్తున్నాను,   సంపాదిస్తున్నాను,   ఇంటికి వచ్చాక ఈ పని ఆ పని చేయమని సతాయిస్తే నేను మాత్రము ఏమి చేయగలను,   నేను యంత్రము కాదు అని గట్టిగా చెప్పాను.

అట్లాగంటే ఆడవారు ఇంటి పట్టు ఉండాలి,  మొగవారు మాత్రమే ఉద్యోగము చేయాలి అని వాదించాడు,   "గుర్రాన్ని నీటిదాక తీసుకెల్ల వచ్చు కాని నీటిని త్రాగించ లేనట్లు "  ఈయన బుద్ధి మారదు,  మా కాపురము నిలువదు అందుకని మాకు విడాకులు  కావాలి.

పంతముతో, పట్టుదలతో, విసిగి, వేసారి పోయారు ఇద్దరు,  వీరిద్దరిమద్య  ఏకాభిప్రాయము  తీసుకు రావాలంటే ఆబ్రహ్మకు కూడా  చేతకాదు,మేము స్వేచ్చగా బ్రతక గలము,  ఈ బానిస బ్రతుకు మాకొద్దు అని వాదిస్తున్నారు ఇద్దరు.

మీకు విడాకులు ఖచ్చితముగా ఇప్పిస్తా ఈ కాగితములపై సంతకము పెట్టండి, కాని నాది ఒక షరతు ఏమిటి చెప్పండి ఆ షరతు అని అడిగారు ఇద్దరు.   

ముందు నా చేతిలో చెయ్యేసి చెప్పండి. " మీ మాట గౌరవిమ్చి మేమిద్దరమూ కట్టు బడి ఉంటాము అని "

అట్లాగే కాని మాకు విడాకులు మత్రము ఇప్పిమ్చగలరు.   అది మాత్రము ఖచ్చితము సరే ఇప్పుడు మేము ఏమి చేయాలి అన్నారు.

నేను చెప్పేది జాగర్తగా వినండి.   మీరిద్దరూ వారం రోజులు సెలవు పెట్టి నేను పంపించిన చోటుకి వెళ్లి ఉండటమే "   విడివిడిగా మాత్రమె"  మీకు అన్ని సౌకర్యాలు నేను ఏర్పాటు చేస్తాను.    
చెప్పండి ఎక్కడకు వెళ్ళాలి.

మీరిద్దరు కాలినడకన "తిరుమల తిరుపతి కొండెక్కి "  అక్కడ వారం రోజులు నేను ఏర్పాటు చేసిన గదులలో ఉండాలి,  దేవుని దర్సనం ఏర్పాట్లు అన్ని నేను మీకు ఏర్పాటు చేస్తాను.   ఈ ఖర్చు మొత్తము నేనే భరిస్తాను.   అందుకు ఇష్టమైతే ఒప్పు కొండి, నేను ఇప్పుడే  అన్ని  ఏర్పాట్లు చేస్తాను అన్నారు జస్టిస్ చౌదరిగారు.

కొద్ది సేపు ఆలోచించి మీ షరతుకు ఒప్పు కుంటున్నాము మేము ఎప్పుడు వెళ్ళాలో  చెప్పండి.
సరే మీరు విశ్రాంతి తీసు కోండి,  నేను కబురు పంపుతాను అన్ని ఏర్పాట్లు చేసి,
సరే మేము విడి పోయి బయటకు వెళుతున్నాము,  మా విడాకులు మాత్రము మరువకండి

ఇద్దరు కోపముతో ఇల్లు చేరి,  చెరో కుంపటి పెట్టి చౌదరిగారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.

వెంటనే కబురు అందింది. ఇద్దరూ చేరి చౌదరి గారిని కలిసారు.   నేను ఒక్కటే చెప్పేది మీరు గతంలో జరిగిన విషయాలు మనసులో పెట్టుకో కుండా  శ్రీ వేంకటేశ్వరుని దర్శించి మీ సమస్యలు చెప్పుకొని హాయిగా విడివిడిగా ఉండి తిరిగి రండి.   మీకు అన్ని సదుపాయాలూ నేను చేస్తాను.  నా షరతుకు లోబడి మీరు భాద పడనవసరము లేదు,  మీరు ఎప్పుడు వద్దను కుంటే అప్పుడే రండి,  మీకు విడాకులు ఇప్పిస్తాను.

శ్రీ వేంకటేశ్వరుని స్వామి పాదాలకు నమస్కరించి మెట్లపై నడక ప్రారంభించారు ఇద్దరు.   నడుచుట మెట్లు ఎక్కుట అలవాటు లేకుండా ఉండటం వాళ్ళ ఇద్దరుకు నీరసము ఆకలి వేసింది.  కాని వాళ్ళు  ఎటు వంటి వస్తువులు తెచ్చుకోలేదు.

అదే మెట్ల దారిన పోతున్న ఓ బైరాగి  ఎం  బాబు "ఒంటి ఎద్దులా పరిగెతుతూ పోతున్నావు",  నీభార్యను కలుపుకొని నడవటం మంచిది. గోవింద నామం చేస్తే ఇంకా మంచిది. అన్నాడు.

మీ రిద్దరకి కొన్ని విషయాలు చెప్పాలను కుంటున్నాను  అన్నారు బైరాగి.
సరే  చెప్పండి,  మీ మాటలు వింటూ నడుస్థూ బయలు దేరుదాం అన్నారు. గోవిందా, గోవిందా, గోవిందా అని మరొక్కసారి తలంచి "తరచి చూస్తె మీకే అర్ధమవుతుంది" అన్నాడు.

మాకేం అర్ధం కాలేదు అన్నారు.

కొన్ని విషయాలు మరల మరల లోతుగా వెళ్లి చూస్తె,  ఆ లోపలి విషయాలు మీకె అవగత మవుతాయి.  మెదట్లో పైపైన చూసినప్పుడు  కనబడని విషయాలు ఎన్నో బయట బడుతాయి.  కనుక ముఖ్యమైన విషయాలును తరచి చూచి గాని ఒక నిర్ణయానికి రాకూడదన్న విషయము తెలుసుకోవాలి అందరు.

అట్లాగే ప్రతిఒక్కరు మొదట్లో కూనిరాగాలతొ ప్రారంభమై,  ఆసక్తి పెరిగి,  సాధన చేయగా చేయగా,  అనుకోనంత  చక్కటి గాయకులుగా మారుతారు,   ప్రతి పనిని ఇష్టముగా చేస్తే దాని ఫలితము ముందుగానే మీరు చూడ గలుగుతారు.   అదే విధముగా పెద్ద రోగాలు ఎమీ లేక  పోయిన  ప్రతి చిన్నపాటి  అస్వస్తకు " పెద్ద పెద్ద అనుమానాలు పెట్టు కొని "  మూలుగు తుంటారు కొందరు. ఆ అలవాటు  నిజంగా ఒక రోగంగా మారుతుంది.  రోగానికి కారణం తెలుసుకొని ఉంటే అసలే రోగం రాదు.

తెలుసుకోకుండానే ఇతరులు నాకు ఏమి చేయలేదు అనుమానిస్తూ రోగం తెచ్చుకుంటారు అన్నాడు బైరాగి.

ప్రతిఒక్కరు గతం విషయాలు,  మరచి పోవలసినవి,  మరువ లేనివి గుర్తుంచు కోవాలి మనకు సహాయము చేసిన వారిని మరువరాదు.   మనకు హాని చేసిన వారిని అదే పనిగా ఆలోచిస్తూ భాద పడరాదు.  మనలో  అహంభావము పేరుగకుండా ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగేటట్టు బ్రతకటమే సుఖ జీవితము.

బయట శత్రువు లయితే కనబడుతారు.   మనలో ఉండే " కామ, క్రోదః, మద, మత్సర్యాలు నిజమైన శత్రువులు" కనుక ప్రతిఒక్కరు తమ జీవితములొ వాటికి తావీయక జాగ్రత్త పడవలసినది ముఖ్యముగా యువ ప్రేమికులు  అన్నారు బైరాగి. 

ఇటు వ్యక్తి  జీవితములొ కాని,   సమిష్టి జీవితములొ కాని  అనేక అనూహ్య  పరిణామాలు వచ్చి  జీవితాలను తారు మారు చేస్తుంటాయి. అవి  మార్చాలన్న ఎవరి వసము కాదు,   అట్టి వ్యతిరేక  సమయాలలో తలవొగ్గి ఆ పరిస్తితులకు అనుగుణంగా రోజులు గడుపు కుంటు  పోవటం తప్ప వేరే మార్గము లేదు. కాలము బలీయమైనది. కాలాన్ని ఎదురించి జీవిమ్చట ఎవరి వళ్ళ కాదు. (నల మహారాజు, హరిశ్చంద్ర మహారాజు, శ్రీ రామచంద్రుని కధలు  మనం తెలుసుకొనే ఉన్నాము.  వారు ఎంత భాద పడ్డారో గత  కాలం చెప్పిన విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే కొందరి జీవితలు బాగు పాడుతాయి అన్నారు బైరాగి.

నేను ఒక్కటే చెప్పేది " తొందర పాటు నిర్నయాలు అనర్దాన్ని తెచ్చి పెడతాయి " మంచి చెడులు,  సుఖ దు:ఖాలు, పాప పుణ్యాలు,
ఆలు మగలకు,  అడుగు జాడలగా, దాగుడు మూతలుగా, కొన్ని సమయాల్లో సుడి గుండాలుగా మారుతాయి. అంత మాత్రాన విడి పొ యి బ్రతకాల్సిన పనిలేదు.   ప్రతి ఒక్కరు ఒక్క  నిముషము ఆలోచించ గల శక్తి ఉండాలి. (సుందరా కాండలో హనుమంతుడు ఆలోచన శక్తి వలన సీతా రాములు  కలుసుకొనే విధముగా సహాయము చేసినాడు).

కనుక కొన్ని విషమ ఘడియలు, గ్రహాలూ వెమ్బ డిస్తాయి, అంత మాత్రమున భయపడ కుండా ధైర్యముగా ఎదుర్కొని జీవిమ్చటమే జీవితము,  కలసి అర్ధం చేసుకొని బ్రతకటమే దాంపత్యం అన్నాడు బైరాగి.   

మీరు నామీద ప్రమతో వినలేదు  నేను చెప్పే మాటలు,  ఒకరి కొకరి మీద ద్వేషము పెంచుకొని ఉన్నారు.  విడివిడిగా బ్రతకాలని అనుకుంటున్నారు మీరు. క్షనికా వెసములొ తీసుకున్న నిర్ణయాలు ఎట్లా  పనికి రాకుండా పోతాయో,  మీరు ఆలో చించ కుండా  విడిపోతే అంతకన్నా ఎక్కువ కష్టపడుతారు.   ఈ విషయాలు నేను మీకు చెప్పుటలేదు. ఆ పరమాత్ముడు నాలో ఉండి పలికించిన మాటలు మీకు వినబడినాయి,   ఆ వేంకటేశ్వరుని కృపవల్ల ఎటువంటి శ్రమలేకుండా కొండ పైదాకా  రాగలిగాము.  ఇక్కడనుంచి మీదారి మీది నాదారి నాది, ఆ స్వామివారి మ్రోక్కు తీర్చుకొని ఇక్కడే కొన్ని రోజులు ఉండాలని వచ్చాను.

                                               



శర్వానికి, చక్రధర్ కు మనతో పాటు వచ్చిన మహాను భావుని చూడాలని అనుకోని  ఎంత ప్రయత్నము చేసిన కన్ను మూసి తెరచే లోపే  మాయ మయినారు.

ఇటువంటి వింత అనుభవము ఇదే వారికి మొదటి సారి.  వారి మాటలు వింటున్నప్పుడు నా మనసు ప్రశాంతముగాను ఏదో తెలియని విషయాలు తెలుసుకున్నట్లు  ఉన్నది అని ఇద్దరు అనుకున్నారు.
 అంతలో చౌదరి గారు పంపినవారు వచ్చి  వసతి  గది  తాళాలు ఇచ్చి  చెప్పారు.  వారి మాటల ప్రకారముగా చెరొక గదిలోకి వెళ్ళారు.
ఇద్దరు స్నానము చేసి అక్కడ ఉన్న ప్రసాంతమైన పార్కులో ప్రక్కప్రక్కనే కూర్చొని  మైకులో వస్తున్న ఉపన్యాసము వింటున్నారు.
               
" జగదీస్వరా నాకు ధనం వద్దు,  జనం వద్దు, పిల్లలు వద్దు,  సుందరీమణులు వద్దు,  కవిత్వమువద్దు, జన్మ జన్మాంతరాలల్లో నీ యందే భక్తీ కలిగేటట్లు ప్రసాదిమ్చుము స్వామి " అని

" ఓ ప్రభు నీ పాదాల వద్ద నాకు స్థానం కల్పించు, సర్వదా  నీ సానిద్యములో ఉమ్డెందుకు అవకాసము కల్పించు, నా మనసు నీ మీద శ్రద్ద, భక్తి కలిగించు " అని

" దగ్గరగా ఉండి  కూడా  హృదయాన్ని వేదనలో ఉమ్చకూడదు,  హృదయాన్ని సన్నితంగా ఉన్న వారిని విస్మరించ కూడదు" అన్న మాటలు విని

ఇరువురి మానసిక పరివర్తన జరిగి ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇరువురం కలసి స్వామివారి మ్రొక్కు చేల్లి ద్దాం, నీలాలు అర్పిద్దాం అన్న మాటలు ఇద్దరు ముక్థఖంటముగా మరాయి.

ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అహంకారము వదలి ఏదో తెలియని శక్తి వళ్ళ ఇద్దరు ఏకమై ఆ స్వామి వారిని  దర్సనం చేసుకున్నారు.

చూడండి నామనసును మార్చుకున్నాను, నేను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినాను. నేను అనే అహంకారముతో మీకు సుఖం   లేకుండా చేసినాను. నా తప్పు క్షమించండి. మీరు క్షమిమ్చానంటేనే నాకు సంతోషము. నీవె కాదు నేను కుడా నీ పట్ల అసబ్యకరముగా అనేకసార్లు  ప్రవర్తిమ్చాను.  అట్లు చేయుట తప్పు నాదే. మన ఇద్దరం తెలియక తప్పు మార్గమున ప్రయానిమ్చాము మన ఇద్దరిలో ఉన్నది తప్పు.

మన తప్పులన్నీ ఈ దేవుని సమక్షములో వప్పు కుందాము, ఈ జన్మలో తప్పులు  చేయకుండా కలసి జీవిస్తాము మేము అని వేడు కుందామని అనుకున్నారు. అదేవిధముగా ఆ శ్రీ వేంకటేశ్వరుని వేడుకున్నారు.
బయటకు వచ్చి హనుమంతునికి హారితి ఇచ్చి ప్రార్ధించారు.
అక్కడ వున్న  భక్తులకు తమవంతుగా దేవునికి ప్రసాదము చేయించి అందరికి ఇద్దరు కలసి పంచారు.
మనసు ప్రసామ్టమైనది ఏదో శక్తి ప్రవేసిమ్చిమ్ది. మనసు తేలిక  అఇమ్ది
అప్పుడే చౌదేరి గారి నుండి  ఫోన్ వచ్చింది.
మీకు విడాకులు రడి ఐనాయి, మీరు వచ్చి తీసుకోని వెళ్ళవచ్చు అన్నారు
ఇద్దరు కలసి దయచేసి ఆ కాగితములు చింపి వేయండి,  మేమిద్దరం ఎకమయ్యం, మాకు విడాకులతో సంభందము లేదు, మీకు ఫీజు మాత్రము వచ్చాక ఇస్తాము.
                                            
మేము ప్రశాంతముగా  శ్రీ  వేంకటేశ్వరుని సన్నిదిలో కొన్నాళ్ళు ఉండి  తిరిగి వస్తాము.
మాకు వసతి గది ఒకటి చాలు, మేము త్వరలోమిమ్మల్ని కలుస్తాము.
                                                     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి