ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
1.*ప్రాయమ్ము (కవిత)
ఎవరో ఒకరు - ఎదో ఒక రకమ్
యిది అది అని ఏదీ చెప్పలేము
వయసు వలపు తలపుల పిచ్చి
వలచి వలపింపచేసే వయసు పిచ్చి
వయసు హృదయ కవాటములు తెరచి
ప్రపంచ విజ్ఞానమును ఆహ్వానించి
ఉడుకు రక్తముతో ఏదోసాధించాలని
నవీన వయో విలాసముతో తపన ఉంచి
యుక్త వయసు అర్ధాన్ని నిరూపించే
పడచు వయస్ ఉల్లాసంతో వచ్చి
గూటినుండి స్వతంత్రం కోసం పిచ్చి
ప్రతిభతో ఎంతో ఓచిత్యం వెళ్లబుచ్చి
ప్రాజ్ఞత పరిణత చెంది మేధస్సు పంచే
ప్రాయమున మోయరాని బరువైన దిమ్మలు
కొత్త ఆశలతో రేకెత్తించే నవీన కాంతి రేఖలు
అనుకూల ప్రతికూల హృదయ స్పందనలు
కోపావేశముతో నోరు పెద్దగా చేసి మాటలు పంచే
మేని సొగసులతో కొత్త ఆరాటంగా
వంకర టింకర కొత్త ఆలోచనగా
ప్రాయపు టెక్కు బిగువు చూపుగా
వాయలు వాయనాలాతో విరాజిల్లే
యోవనంలో పువ్వుల్ని హాత్తు కుంటే
వృద్ధాప్యంలో అవే ముల్లుగా మారుతాయి
మాటల్లోని యదార్ధాన్ని తాత్వికతను
గ్రహిస్తే మనస్సుకు ఎంతో ప్రశాంతత
కేళీవిలాసాల మౌళిలా బాటలో
పరువెత్తి శరీరాన్ని పాడుచేసుకోకు
భవిషత్తు నిర్మాణంలో చేయూత ఇస్తూ
శక్తి సామర్ధ్యాలను దేశం కొరకు పంచు
ప్రాయమ్ము వరమౌను ప్రాజ్ఞుడౌను
ప్రాయమ్ము అగ్ని రెచ్చిపోక చల్లగా ఉంచు
ప్రాయమ్ము సద్వినియోగం సుభంబౌను
ప్రాయమ్ము జీవనకృతుకు సేవగా పంచు
--((*))--
2.* ప్రాంజలి ప్రభ - ఓ దేవుడా (కవిత )
గుండెకు తోడుగా ఊరట నిచ్చావు
ఎండకు నీడగా తరువు నిచ్చావు
మంటకు తోడుగా చలిని ఇచ్చావు
జంటకు తోడుగా బిడ్డను ఇచ్చావు
మాటకు తోడుగా ఏడుపు పంచావు
పాటకు తోడుగా నాట్యము నేర్పావు
ఆటకు తోడుగా నేర్పరి చూపావు
బాటను నీటుగా చేయుట తెల్పావు
కోపము తోడుగా ఆకలి కల్పించావు
శాంతము తోడుగా సుఖాన్ని కల్పించావు
వేషము తోడుగా ఆకర్ష నందించావు
భాషకు తోడుగా కవిత్వ మందించావు
చీకటి తోడుగా వీలుగు నందించావు
భాధకు తోడుగా సంతోషం ఇచ్చావు
బంధము తోడుగా భాద్యత నిశ్చావు
ప్రేమకు తోడుగా సేవలందించావు
--((*))--
3.తరుణం
అమరావతి నగరంలో, పారిజాత వనంలో,
జగదేకవీరుడు అతిలోకసుందరి
ఏకమైన తరుణం - భావ కవితామృతము (ఛందస్సు)
పిచ్చి మనసు తనువునే
కూర్చియు వలపు తలపే
ఏకము అగుట కొరకే
ప్రేమను తెలుపుట కదా
ఈ చిలక కల వెలుగే
రంగుల కథల మలుపే
హంగుల తెలుపు వగలే
పొంగులు కలసి సెగలే
వేడి వలపు సొగసులే
వేకువ పలుకుల వలే
శోభల తలపు తెలిపే
మాటలతొ చిరు నగవే
హృదయ తపన తెలిపే
శృతి పలుకులు చిలికే
ప్రీతి కొరకు నటననే
చూపియు నాగువులొలికే
తామర లతలా సెలయే
రూ పరిమళము చిరుదీ
పం వెలుగులతొ మమతా
నందము శుభము కలిగే
తురుపు కిరణ వెలుగూ
పొద్దు తిరుగు లతలకూ
వేకువ సరయు నది కీ
పొంగు కడలి ఉరకలే
వాంఛ ఫలితము తరుణా
నంద సుమధుర మధురా
నంద భవ బగ తలపే
స్వర్గ సుఖ కల ఒకటే
ప్రతి అణువు కదలికే
ప్రీతి గొనుట మధురమే
శృతులు గొలుపు గళమే
ఒక్క నిముషము సుఖమే
జీవితమునకు సమభా
వాల మగువకు మగడే
సంత మవుటకు మదనా
నంద సుఖము కొరకే
4.*జీవితార్ధం
పుణ్యం వెనుక భాద్యతలు ఎన్నో
సోఖ్యం వెనుక సుఖములు ఎన్నో
లౌక్యం వెనుక పలుకులు ఎన్నో
నిజం వెనుక నిజాయితీ ఎంతో
ఇష్టం వెనుక కష్టం ఎంతో
కష్టం వెనుక సుఖం ఎంతో
సుఖం వెనుక కాంతి ఎంతో
కాంతి వెనుక శాంతి ఎంతో
చేష్ట వెనుక చేవ ఎంతో
ప్రీతి వెనుక ప్రేమ ఎంతో
ఖ్యాతి వెనుక భ్రాంతి ఎంతో
శాంతి వెనుక ప్రేమ ఎంతో
శాంతం వెనుక సంతోషం ఎంతో
అందం వెనుక పొందిక ఎంతో
సొంతం వెనుక కోరిక ఎంతో
పంతం వెనుక భాద్యత ఎంతో
కధనం వెనుక మధనం ఎంతో
నిదానం వెనుక సందడి ఎంతో
ప్రదానం వెనుక సంతస మెంతో
విధానం వెనుక సహనం ఎంతో
విజయం వెనుక వినియోగం ఎంతో
పుట్టుక వెనుక ఉపయోగం ఎంతో
ప్రేమల వెనుక భాందవ్యం ఎంతో
స్వేశ్చల వెనుక నష్టము ఎంతో
సారం వెనుక సాధన ఎంతో
భేదం వెనుక వేదన ఎంతో
శాంతం వెనుక సహనం ఎంతో
అంతం వెనుక ఆరంభం ఎంతో
ప్రశంస వెనుక ప్రతిభ ఎంతో
అహింస వెనుక ప్రశాంతి ఎంతో
అనంత వెనుక సునంద ఎంతో
ఆనంద వెనుక ఆనందీ ఎంతో
పంట వెనుక పరిశ్రమ ఎంతో
వంట వెనుక నిరీక్షణ ఎంతో
కంట వెనుక కలియుట ఎంతో
జంట వెనుక జరుగుట ఎంతో
ప్రగతి వెనుక ప్రయాసం ఎంతో
ప్రకృతి వెనుక వికృతి ఎంతో
ప్రతిభ వెనుక ప్రమాదం ఎంతో
ప్రమిద వెనుక చీకటి ఎంతో
జీవితం వెనుక జీవితార్ధం ఎంతో
సాహసం వెనుక ప్రోత్సాహం ఎంతో
విశ్వాసం వెనుక వినమ్రత ఎంతో
నమ్మకం వెనుక ప్రేమతత్వం ఎంతో
--((*))--
5.*శాంతి లేక (ఛందస్సు )
శాంతి లేదు నిన్ను చూడగా
బ్రాంతి చెందె నీవు ఉండినా
కాంతి రాదు మానసమ్మునా
వెల్తి నాలో వేద నమ్ముగా
నవ్వు లేక నల్గి పోతినే
పువ్వు చూసి ముర్సి పోతినే
ఇవ్వు అన్న ఇవ్వ పోతివే
కొవ్వు అన్న నోరు విప్పలా
ప్రేమ నీదె సృష్టికిన్ సదా
వాణి నీవే విధ్యకిన్ సదా
జ్యోతి నీవే భూతలమ్ము పై
స్వాతి నీవే మబ్బు లమ్మపై
సిద్ది పొంద లేక ఉంటినే
బుద్ధి చిన్న బోయి ఉంటినే
చద్ది తిన్న భీతి గొంటినే
ఇచ్చి పుచ్చు కుంటే మంచిదే
వట్టి మాట ఇప్పు డేందుకే
గట్టి మూట పట్టి తీస్తివా
తట్టి లేప నిద్ర రాదులే
మట్టి నమ్మే బ్రత్కు నాదిలో
జ్యోతి నీవె భూతలమ్ముపై
భాతి నిచ్చు భాస్కరా రవీ
హేతువీవె సృష్టికిన్ సదా
చేతనమ్ము జీవితమ్ములో
--((*))--
6*మంటల భావాలు
ఎప్పుడూ ఏదో మండుతూనే వుంటుంది
మంటలు అంటుకుంటూనే వుంటాయి
కోరల నాల్కలు నమిలి మింగేసి
బూడిద వూసేస్తూ!
వెచ్చదనానికి కరిగిపోయి
చలిమంటేనని ముట్టుకుంటే
చురుక్కుమంటుంది…
మంటనంటించి మంట మాయమవుతుంది!
మంటే మిగులుతుంది
కూరుకున్న బుర్ర బాంబై బద్దలవుతుంది
లేస్తున్న విమానం నిప్పుముద్దవుతుంది
మధ్యవేసిన పచ్చగడ్డి భగ్గుమంటుంది
ఆకలేసిన దూడ అరుస్తుంది
భస్మాసుర హస్తం
అదిమిపట్టిన ఒత్తిడికి
అక్కడో అగ్నిపర్వతం లావా కక్కుతుంది
ఇక్కడో గ్యాసు బావి బ్లో-ఔట్ అవుతుంది
అంటుకున్న అరణ్యాలు అంత తొరగా ఆరవు
ఆర్పడానికి కొంపల్లో నీళ్ళూ వుండవు
ఎక్కడో చమురు కాలుతున్న వాసన…
వంటిల్లే వల్లకాడు!
శవాలకు స్పర్శ తెలీదు
అయినా ఎర్రగా అంతటా ఏడుపు-
అయినా గొంతుకలు మర్యాదగానే నడుచుకుంటాయి
అయినా లేక అందుకే
ఇంకో అగ్గిపుల్ల ముద్దు పెట్టుకోకమానదు.
7*నేస్తమానేస్తమా నన్నొదిలి పోలేవు
అర్ధం చేసుకో లేకపోతున్నావు
వాస్తవ మనోభావాలు తెల్ప లేకున్నావు
నీవు ఒక వస్తువు కాదు నేస్తమా
నను వలచి వెంబడించావు
నను తలచి తపన చెందావు
నను కలసి మాటలు చెప్పావు
నీవు ధర్మమార్గాన్ని చూపావు నేస్తమా
స్వార్ధమునకు మనమధ్య చోటు లేదు
నిస్వార్ధ సేవలే మనమధ్య కమ్ముకున్నాయి
సుస్వరభావామృతము మనమధ్య ఉన్నది
మదిని మరిపించుట కదా నేస్తమా
వర్ణ వివక్ష మన మధ్య రాదు
వర్గ విలక్షణ అసలు రాదు
దుష్ట గణము మనమధ్యకు రాదు
ఉత్సాస నిస్వాసాలు ఒక్కటే నేస్తమా
మనమధ్య ఉన్నది ప్రేమ మాత్రమే
మనసారా నన్ను పిలిచావు
మదితీరా మనసును తెలిపావు
హృదయ స్పందన ఒక్కటిగా మలిచావు
వడిలో ఉండి ఓదారుస్తావు నేస్తమా
ఎప్పుడొస్తావో తెలపవు
ఎలా వస్తావో తెలపవు
ఏకంగా మమత పంచేసావు
మరువలేని అంటావు నేస్తమా
అలసి సొలసిన కాలానికి
అనంత ఆలోచన తరుణానికి
అమృత ఘడియల ఆనందానికి
పరమానందాన్ని పంచావు నేస్తమా
నేస్తానికి నేస్తం ప్రాణం
ప్రాణానికి ప్రాణం దేహం
దేహానికి దేహం ప్రేమ
ప్రేమకి ప్రేమే దాసోహం
మనమధ్య ఉన్నది ప్రేమ
ప్రేమను పంచి జీవిద్దాము నేస్తమా
8*కవిత ఎండు ఆకు (కవితా)
పండు టాకులు రాలి
ఎండు కాయలు డొల్లగా మారి
వండు వంటలు చెడి
మండు టెండలకు తట్టుకోక విలవిలలాడే
పూలు పూయుట లేదు
సెలవు పెట్టింది వసంత ఋతువు కాదు
వలకపోసే మనసు లేదు
నులక మంచముమీద నిద్ర రావటము లేదే
తెర వెనుక కధలు
తెరచాప లేని నావలా ఊగిస లాటలు
తరుము తున్న తరంగాలు
తరుణమంతా ధారపోసిన గుర్తింపు లేదులే
గాలి సెగలకు తట్టుకోలేక
గాలి పటంలా ఎగిరి తెగిన పటములా మారక
అలల అల్లరి చూడలేక
కలల కల్లోలం ఎవ్వరికి చెప్పుకోలేక తికమకే
వ్యర్ధమైన వాడని పూలలా
స్వార్ధ బుద్ధి లేని దివిటీలా
అర్ధపు మాటలు అర్ధమయ్యేలా
తీర్ధము త్రాగినా దేవుని పిలురాదులే
వృద్దాప్యం ఎండుటాకు సమానము
- అయిన కర్తవ్యం మరువదు వృద్ధాప్యము
9*వాంఛ (కవిత)
రోజులు మారుతూ ఉన్నాయి
రాజి పడక సతమత అవుతావు ఎందు కే
కాజును తిని తపన
మోజును వదలక తికమక పడతావెందుకే
చూపుల కలయిక జరిపి
పోపుల ఘాటును తెలియక మరోవైపు చూపే
తేపుల వలన సెగలు
కాపులా తనువులు నగవులు ఏకమవుటకే కాదే
నచ్చేటి పాటలు పాడి నా
మెచ్చేటి భావమ్ము మనసుకు చేరుట లేదే
పంచేటి లక్షణము ఉన్నను
పుచ్చుకునే లక్షణము లేనివారికి భాదయే కదా
కలయిక కోసము కధలు
కలలోని మాటలు వరుసగా చెప్పుట కాదే
ఇలలో జరుగు చున్నట్టి
వలపు తలపులు తెలుపుట కష్టము కాదే
కరుణ చూపిన కదలక
కారాలు మిరియాలు చూపి మనసును విరిచే
చిరకాల వాంఛ తీరుటకు
పరకాయ శాంతికి అవసరము కనపడక ఉండే
అతివాంఛ అనర్ధము - తృప్తిలో ఉంది శ్రేయోదాయకము
--((*))--
10. *. గానము (కవిత)
తీయని గానము పాడినా
మోయలేని బరువును మోసినా
మమతానురాగము పంచినా
మాయను కమ్మిన మనసును మార్చలేనే
పాషాణ హృదయాన్ని కరగించుటకు
తుషార సమీరములా కలియుటకు
కష్టాల కడలి నుండి విడి పడుటకు
వేషాలు మార్చి ప్రణయ గానము పలికే
తర తరాల గానము
తరింప చేయు ప్రయత్నము
స్వరములో స్వరము
నిరంతరము గాన మాదుర్యమే
సుశ్వర భావాలు తెలిపి
ఈశ్వర కృపకు మనసు కలిపి
విశ్వ వేడుకలు చూసి
నశ్వర శరీరర గానము పలికే
పాటల పందిరి వేసియు
మాటలు పొందికగా మనసును చేరియు
నటన కదలికలు చూపియు
చిటపటలు లేక సంతోషా లాయే
స్వరము లన్నీ ఆరాధనకు
- స్వర మాధుర్యములో మనసు మునిగి తేలుటకు
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి