30, జనవరి 2017, సోమవారం

Internet Telugu Magazine for the month of 2/2017/53

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


హనీమూన్ (ఛందస్సు)  

మల్లెల మాలల కురులతొ 
చల్లని గాలులు తలుపును వలపును పెంచెన్
తెల్లని తనువు తపనయు 
మెల్లని చూపులు మనసును సుఖమున ముంచెన్        

కమ్మని చూపులు చూపియు  
వమ్ము చేయక సుఖముగ నవ్వులు పంచెన్
తుమ్మెద చూపుకు చిక్కియు 
నెమ్మది చూపియు వలపుతొ ముద్దులు పంచెన్ 

మాటలు ఎక్కువ పలుకక 
పాటలు పాడియు వయసులొ ఆశను తీర్చెన్ 
ఆటల ఊరట పెంచియు 
నటన చూపియు మనసులొ దాహము తీర్చెన్ 

తక్కువ మాటలు పలికియు 
తక్కెడ లాగా మనసును సమముగ చేసెన్
ఎక్కువ తక్కువ చూపక 
మక్కువ చూపియు సుఖముతొ ఒక్కటి అయ్యెన్ 


--((*))--   

ఇది పొడుపు కధ - చదివి ఎదో మిరే చెప్పండి 

1 . గడప చిన్నది కానీ గదులు విశాలము 
     కట్టెవారొకరు - కాపురాలు పెట్టేవారొకరు 
     పెను విషవలయాలకు నిలయాలు   - 
     పండగకు పాలు గుడ్డు వేస్తారు - అది ఏది ?

2..  గడ్డిదిన్న నేమి, గడ్డి మొదట గాయ 
      కాయ నొలిచి తిన్న కంపు కంపే 
      ఉడకబెట్టి తిన్న కొంత రుచి 
      ఇంట్లో -హోటల్ ల్లో వాడుతారు -  అది ఏది ?

3.  గుడి యందు, చదువు బడి యందు  
     రైలు వచ్చి నిలుచు ప్రాంగణము నందు 
     సమయపాలనను చాటింపుగా నడుచు    
     నైవేద్ద్యమునకు వాడతారు - అది ఏది ?

4 .  గూటిలోని చిలక గుంజి పిలిచినా రాదు   
      పలుక నేర్చు సకల  భాష లందు 
      నిత్యమూ నన్ను వదలక శుభ్రపరుచు 
      రుచులు తెల్పి మతిపోగొట్టు- అది ఏది ? 


సమాధానాలు 
1  పాముల పుట్ట 2 . ఉల్లిగడ్డ  3 .గంట 4 .నాలుక    . 
--((*))--

ఇది పొడుపు కధ - చదివి ఎదో మిరే చెప్పండి 

1వెండి బొత్తెమునకు ముత్యాలు
వేడి  చేసిన అవి    రత్నాలు
వ్రేలఁ నుండుకురుల కొత్తాలు
తింటే ఆకలి తీరును  అవి ఏవి?

2 కాళ్ళు ఎక్కువ  వెలగగా  నొక  కన్ను
రాత్రి పగలు పొగలతో కదులు కన్ను
రెండు దారులమీద ఆగి గమ్యం చేర్చు
కష్టముతో సుఖమును పంచునది  ఏది ?     

3. పుల్ల పోటును భరించిన ఆకుల వరుస
వన భోజమునకు, పెళ్ళికి ఇది తప్పనిసరి
గొడవతల విసిరినా కుక్కలకు ఆహ్హారం
తిని బ్రతుకుటకు ఇది తప్పనిసరి అది ఏది ? 

4. సున్న  మధ్య  నున్న  సూళి  వాహనమగు
పూజ వీడ పరమ పూజ్య యగును
పరుగు దీయు నెపుడు పతిని జేరగ వేగ
ఇంతకీ నేనెవర్ని

సమాధానములు ౧. కంకి  , రైల్ త్రీ.   ఇస్తరి   ౪. నది 

Pastor Aleman:

1 . గూట నుండు గాని గువ్వ పిట్టలు కావు

     కలసి చూసి కదులు కలసి ఏడ్చు 
     కంచలుండు చుట్టూ, కంది చేను కాదు 

      తెరవందే కదులుట కష్టం - అవి ఏవి?
   

2. . కవచముండు మేన కదన వీరుడు కాదు  
     కలుగు నందు దాగు నెలుక కాదు
     సీత బాదను గుర్తు జేసెడు చిరంజీవి
      కష్టాలను ఓర్చుకొని ఉండేది, ఇనకి నేనెవర్ని ?

    
3. వళ్ళంతా కళ్ళు - కళ్ళు మూసుకొని
    అర్పిస్తోంది వళ్ళు - ముళ్ళ పొద అని
    తెల్సి వెళ్లి ధనం ఇచ్చి తృప్తి పొందే పురుషు
   బ్రతికే దిక్కే వాళ్ళు అర్పించే వళ్ళే ఇల్లు -ఇంతకీ నేనెవర్ని
   

సమాధానాలు 
1  kallu  2 .. పీత    3 .వేశ్య

4 .    . 
Brown Wood Owl
--((*))--తత్వ భోద 

నీటిబొట్టు పట్టలేము 
పట్టినా చూస్తుండగానే మాయం   
తామరాకుపై తరుణం మెరుపు 
నీటిబొట్టుకు అది ఒక మెరుపు రసం  

ఆకు కదలికకు కదులు 
హంగులతో మెరిసి మాయమగు 
కనుచూపులు అది ముత్యం 
అది పట్టలేని పాదరసం 

నేడునాది అనుట ఎందుకు 
రేపటికి అది ఎవరిదో నీకు తెలియదు 
మనసు మార్గం ఎప్పుడు స్థిరం  
కానీ ప్రేరేపణలకు లొంగి చలనం 
మానసిక వత్తిడికి పయనం 
అది తెలపలేని మనసు రసం

నేడు నాది అనుట యవ్వనం 
రేపటికి అది ఎవ్వరికి సొంతమో తెలియదు 
అందరికి ప్రేమ ఎప్పుడు స్థిరం
కానీ ఆకర్షణలకు లొంగి పయనం 
శుభ - అశుభాలకు చిక్కే నయనం 
అది తెలపలేని యవ్వన రసం      

నేడు నాది అనుట అమ్మ ప్రేమ 
అందరి సొంతమవుటకు తపించే ప్రేమ 
ప్రేమ శాశ్వతమని బోధించే తపన 
కానీ బంధానికి లొంగి పయనం
కాలాన్ని బట్టి ఓర్పు, ఓదార్పు 
ప్రేమను పంచుతూ పయనం 
అది తెలపలేని అమ్మ ప్రేమ రసం    
--((*))--

*అక్షర  గీతి (కవిత ) 

మదిర నీకేలరా - మధువు నేనిత్తు 
- మానసమ్మిత్తు - వ్యధలు నీకేలరా 
- వనిత నేనుండ - వలపుతో నిండ

తక్కువ చేయనురా - తాపము చూడుమురా
 - తమకం విడుమురా  - భాధలు ఎందుకురా
 - భద్యత నాదియురా - భారము నాదియురా


ఆకలి అణకురా - అసలు నీకేనురా
 - అంతయు పొందుమురా -దాహము తీర్చుకోరా
  - దాపరికం వద్దురా  - దావాలనం తగ్గునురా        

సుఖాలు మనవిరా  - సంతోషాలు మనవిరా
  - సంబరం మనదిరా - కోపాలు మరువురా 
- కోలాట ఆదుమురా  - కోరిక తీరునురా

మదిర నీకేలరా - మధువు నేనిత్తు 
- మానసమ్మిత్తు - వ్యధలు నీకేలరా
 - వనిత నేనుండ - వలపుతో నిండ

పక్క చూపు నీకేలరా - పరువం నేనిత్తు
 - వలపు అందిస్థా - లేదని అనుకోకురా 
- లోకాన్ని చూడరా - లోకులను గమనించారా    

కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా
 - కనువిందు చేస్తుండగా - పలకరింపు చూపరా
 - పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా 

పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ
 - బొదరింటిలోన -నాగవేషణ యెల్ల 
- నన్ను కన్గొనుట - నగుచు నే మనుట

సాన పట్టుమురా - సతతము కలవరా 
- సరిగమ అనరా - వేషము వద్దురా
 - వేగిర రమ్మురా - వెతలు తీరునురా

రాగవీణను మీటె - రమణి రంజిల్ల 
- రవము రాజిల్ల - యోగ మేమిటొ నాది 
- యురికి యొప్పారె - నురము విప్పారె

రామకీర్తన పాడే - రవళి రంగరించి
 - రసము శోభిల్లే - వేగము మరిచా 
- వేకువ చేరితి - వేదన తీర్చితి