7, జనవరి 2017, శనివారం

sankranth special I.T magazine for the month of 2/2017.50


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

No automatic alt text available.సర్వేజనాసుఖినోభవంతు

స్త్రీ - పురుష - సాహిత్యం (చందస్సు )   
భావనాలయ - ర/న/త/భ/య/జ/స/ర/గగ
UIU IIIU - UIU IIIU - UIU IIIU - UIU UU
26 ఉత్కృతి 5152059
 రచన మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ప్రేమయే మగువ శృం - గారలాస్యమును పం
చేందుకే  సుసమయం - కోసమే ఉండే  

సరసం తెగువ భా - ష్యం అనేకములుగా
దివ్య భావములతో-  సేవలే పంచే

 దివ్వెగా వెలుఁగుచున్ - గువ్వగాఁ బలుకుచున్ -
మువ్వగాఁ మొరయుచున్ - శ్రీమతీ పల్కే

రవ్వగా మెఱయుచున్ - పువ్వుగా విరియుచున్ -
నవ్వులన్ జిలుకుచున్ - ప్రేమనూ చూపే

రివ్వగాఁ గదలుచున్ - సవ్వడిన్ జెలఁగుచున్ -
దవ్వులన్ శశివలెన్ - నవ్వు తూ చూసే 

ఇవ్వఁగా వలపు నం-దివ్వఁగా ముదము లం-
దివ్వఁగా హృదయ మో - సుందరీ  సేవే 

ముద్దుగా మనసునే -  పంచెనే మమతతో 
భర్తయే  పలుకుతో -     సంతోషం పంచే 

--((*))--  

Image may contain: indoor

*ఛందస్సు న్యాయం

కమనీయ దృశ్యమే - కమనీయ కావ్యమే
కమనీయ భాష్యమే - కమనీయ మంత్రం

కనువిందు సిద్ధియే - కనువిందు సఖ్యతే
కనువిందు ధర్మమే  - కనువిందు మార్గం

విధిరాత కయ్యమే - విధిరాత నెయ్యమే
విధిరాత వియ్యమే - విధిలేని  కాలం

కనుపాప అద్దమే - కనుపాప రక్షణే
కనుపాప చూఫులే - కనుపాప లీలా

మహిలోన పుట్టుటే - మహిలోన జచ్చుటే
మహిలోన మంటలే  - మదిలోన భీతీ

నిముషంలొ మార్పులే - నిముషం లొ తీర్పులే
నిముషం లొ కూర్పులే - సమయం లొ  మార్పే

మరుగేల ఓరమా - మరుగేల  ఓ ఉషా
మరుగేల ఓసిరీ - మరుగేల నీతో

మదిలోని కాంతియే - మదిలోన మాయయే
మదిలోన ప్రేమయే - మదిలోని  ప్రియం

సువిధేయ శ్రీమతీ - సువిధేయ శ్రీపతీ
సువిధేయ నెయ్యమే - సువిధాతా లీలా       

--((*))--


No automatic alt text available. *స్త్రీ పురుష తత్త్వం(ఛందస్సు )
రచయత మల్లపగడ రామకృష్ణ 

కనుపాప చూపులకు - కమనీయ సౌరభము   
చిరునవ్వు చిందులకు - కమనీయ శోభా   
విరజాజి పువ్వులతొ - కనువిందు చేయుటకు 
సువిశాల వెన్నెలలు - కురిపించే రావా

మనసార మంగళము - మమతాను రాగమును    
మురిపాల ముందిడుచు - మురిపించ రావా
మదిలోన మాటలను - మధురాతి వాసనతొ   
మకరంద మాలికతొ   -  సుఖమివ్వ  రావే  

సిరులెల్ల వచ్చుటకు  - సిరివాణి మాటలతొ 
సరసాలు పంచుటకు - మధురంగ  మారే 
మనసున్న చిన్నదియు - మనసంత మౌనముగ
మదిలోని  ఊహలను -  కురులుప్పి చెప్పే
        
విరిదండ దాల్చుకొని - చరణాల నందియల -
సరసాల నందముగ - దరిరమ్ము దేవీ
వరవీణ మీటుచును - స్వరమాల నల్లుచును -
హరుసమ్ము జల్లుచును - వరమిమ్ము దేవీ

సిరివాణి హృల్లయల - సిరులెల్లఁ జిందిడుచు -
మురిపాల ముందిడుచు - మురిపించ రావా
తరుణేందు బింబ నవ - కిరణాల సోయగపు -
చిఱునవ్వు వెన్నెలల - కురిపించ రావా

వలపొక్క యాటయగు - వలపొక్క పాటయగు -
వలపొక్క బాటయగు - నిల జీవమందున్
వలపొక్క భావమగు - వలపొక్క రావమగు -
వలపొక్క నావయగు - నిల జీవమందున్

వలపొక్క యాసయగు - వలపొక్క లాసమగు -
వలపొక్క రాసమగు - నిల జీవమందున్
వలపొక్క పుష్పమగు - వలపొక్క ఖష్పమగు -
వలపొక్క బాష్పమగు - నిల జీవమందున్
(ఖష్పము=కోపము)

No automatic alt text available. అనుమాన 

మయ్యదియు - పెనుభూతమౌను గద -
విను నీకు సందియము - మనమందు వద్దే
కనుముందు నుండునది - కనుపించుచున్నదియు -
ననిశమ్ము నిక్క మవ - దని చెప్పుచుంటిన్

నిను దప్ప నేనెవరిఁ - గనలేదు నా సకియ -
విను మొట్టు నీపయినఁ - గనకాంగి యుంతున్
మునువోలె నిర్వురము - మనుచుంద మిఁకమీఁద -
నని చెప్ప నా ప్రియుఁడు - విని యామె నవ్వెన్
--((*))--
No automatic alt text available.

(1) మల్లాప్రగడ రామకృష్ణ (ఛందస్సు)
అపరంజి

అపరంజి తమ్మివివి - నీవు మనసివ్వు
కనుపాప మల్లివివి - నానావ రేవు
అనురాగ నవ్వులతొ - నాకు సిరి పంచు
సుఖభోద చేయవలె - నానావ రేవు

కలయందు మాటలతొ - ఆదరము చూపె
మనసంత సంతసమె - నానావ రేవు
తనువంత తాపముతొ - ఉంటె మతి పంచె
సుమలాస్య శాంతమునె - నానావ రేవు

అరిటాకు తాపసివి - కాలమును బట్టి
అలకొద్దు  ఆకలివి -  నానావ రేవు      
అనురాగ వాహినివి - యందముల ప్రోవు
నను నీవు చేకొనుము - నానావ రేవు
 --((*))--

No automatic alt text available.
కమనీయ కావ్య మొక - నయనముల కృతియు
మనసుతో కలియుటకు - కావలయు సతియు  
కనుదోయి వ్రాయు నొక - కవనముల కృతియు
కనులతోఁ జదువుటకు - కావలయు మతియు

సుమరాగ సఖ్యతకు - పరువముల కలయు
అనురాగ మల్లికకు - కమలములు వలయు
హిమబిందు పుష్పముకు - దళములె కలసియు
పవళింపు రాగముకు  - సుఖములను బడయు

కనులంత పెద్దవిగ - మరువము మెరిసియు
మనసంత మచ్చికగ - కలతొ  మనవలయు
తనువంత సంబరము - సరిగమల తపనయు
కళలంత   సమ్మతము - తరుణమున సుఖియు

       
ఆనంద సంద్రమున - నలలపైఁ దేల
నేనైతిఁ దూఁగఁగా - నిక్కముగ డోల
కానదే కన్నులకు - గమ్యమది యెందు
కాని నే సాఁగెదను - కదలుచును ముందు

(2) రమణ కవి పద్ధతి -

మోదమున నిట వచ్చి - ముద్దు లందిమ్మా
ఖేదమును బాపంగఁ - గృపతోడ రమ్మా
నాదరియు నీవుండ - నాకేల సొమ్ముల్
హ్లాదమున కొక కుండ - యందు క్షీరమ్ముల్

మానసము పిల్చె నిను - మన్ననల దేవా
యాననము సూపగను - నందములఁ దేవా
వీణియల నాదములఁ - బ్రేమ రవ మీవా
కానుకల నిచ్చెదను - కావ నను రావా
(ఇది వనమయూర వృత్తమే)

No automatic alt text available.

*స్త్రీ  సౌందర్య పిపాసి (ఛందస్సు )

నీ వలపు తలపును - నేను గన లేదే 
నీ మనసు తపనను - వేగ విన లేదే
నీ నగవు చిత్రమును - ఏల తల చేదే 
కానుకగా నా కిదియు చాలు

కాలమును మరువకు - ఆసమయ మందే
దీపమును వదలకు - ఆ నళిని యందే
పాపమును తలవకు - ఆతలపు  లందే
కానుకగా నా కిదియు చాలు

చేరువుగ తలపడి - మేలి వల వద్దే
మాటలను వదలియుఁ - మౌన మన వద్దే
వేషమును మరిచియు - మాన మన వద్దే 
కానుకగా నా కిదియు చాలు

చేరి వలువల మడి - మాయ లన వద్దే   
ఏది ఇది అది అని - మాట లన వద్దే
కాల అను మతి ఇది - పాప మన వద్దే 
కానుకగా నా కిదియు చాలు

నీ నగవు చిత్రమును - నేను గన నీ నా
మానసము చిత్రమగు - మాయఁ బడెఁగాదా
వేణువును ధేనువయి - వేగ వినలేనా
కానుకగ నాకిదియు చాలు

ఈరాత్రి భవ్యమై - యీరాత్రి దివ్యమై
యీరాత్రి నవ్యమై - యింపు నలరె
శరదిందు కాంతిలోఁ - జెల్వ మీ జగతి
సరసమ్ము లాడంగ రా

మిత్రుని మార్గమున - మేఘమా కంటివే
చైత్రపు రాత్రిలోఁ - జల్లని గాలిలో
నాత్రము హెచ్చయ్యె - నాతనిన్ గానఁగా
నేత్రముల నిర్ఝరిణులే

వరదా కరుణించి - వాంఛలఁ దీర్చు
తెరువున్ దయయుంచి - తెల్పుము నాకు
నెఱగా మనికిలో - నింపుము కాంతి
ధరపై నీవె నాతోడు

అమలా అతులా - అచలా వరదా
కమలా దయితా - కవితా సరితా
విమలా నిను నే - విరులన్ గొలుతున్
నమన మ్మిదిగో హరి

ఓర్పు ఓపిక ఉన్నంతవరకు
వద్దన్నా మనపని మనం చేయాలి

కాల వశులు సర్వులు!  నిల
కాలమె పక్వంబు సేయు కాగలపనులన్
కాలము దగ్గరె ఋక్కని
కాలంబము ధర్మపరుల కరుదనిపింపన్    

--((*))--

No automatic alt text available.
ఇంత అనకురా - ప్రాణ మున కురా
చింత వలదురా - భావి వెలు గురా    
చెంత నిలువరా - చేరు ఘడియరా
కాంత నిధి కదురా

స్వాస మనదిరా - ద్యాస మనదిరా
ప్రేమ మనసురా - తీపి పలుకురా
స్వేత తలపురా -  పేరు కలుపురా
కాంత నిధి కదురా

చింత వలదురా - శ్రీలు గలుఁగురా
వంత తొలఁగురా - భావి వెలుఁగురా 
చెంత నిలువరా - చేరు ఘడియరా
కంతు జనకుఁడా రా

మలుపులో తీపిగా - ఆకలి తీర్చు
కరువులో ఆశగా - మాయని మార్చు


మనసులో నీవెగా - మాయని సొమ్ము
దినములో రాత్రిలోఁ - దీపి నాకిమ్ము
వనములోఁ బూలలా - వాంఛలే పూచె
అనఘ రా నన్ను జూడన్

రజనిలోఁ జంద్రుండు - రమ్యమై వెల్గె
కుజనుఁడా చూపవే - కూర్మిని నాకు
విజనమౌ వనములోఁ - బ్రేమ లేదయ్యె
నిజముగా బ్రదుకేలనో

(పై రెండు పద్యములలో మొదటి మూడు పాదాలు ద్విపద పాదములే)

రారా త్వరగా - రసమయము యీరాత్రి
మారా కుమారా - మధురతర మీధాత్రి
నారీమణియో - నవరసాల పుట్టిల్లు
కోరెన్ జేరర

అమ్మ అటు చూడు - మందముగఁ జంద్రుఁడే
అమ్మ యతి త్వరగ - యా చంద్రు నాకిమ్ము
చిమ్ము నెలవెలుఁగుఁ - జేతిలోఁ బట్టుతా
నమ్మ పరుగెత్తుతా
Image may contain: indoor

*స్త్రీ  పురుష  తత్త్వం 
హృల్లయ - స/జ/న/జ/భ/న/ర/న/స/య - రెండేసి గణములకు ప్రాసయతి
IIUI UIII - IIUI UIII - IIUI UIII - IIUI UU
30 మహః 334228460

కనుపాప కాలమున  - కమనీయ భావమును
కనువిందు చేయుటయు - కలలేలు ఆశా
నవనీత గలబిబం - నవనాడులే వదలి
నయనాంధ కారముకు - వెలుగేను పంచే     

సమపాలు పంచుటయు - సమభావ పెంచుటయు
సఖిలాలి సామ్యమున - శుభరాత్రి సంతే  
లయకార లోలకము - లుకలేలు లాస్యమును
లతలాలి కోపమును - మదిలేలు వింతే

చిరునవ్వు వెన్నెలలు - చిరుజీవి పోకడకు 
సనజాజి పువ్వులయు - అణువూను మార్చే
కలలేలు భర్తకును - కనువిందు చేయుటకు
నవమల్లె నాట్యముతొ - సుఖశాంతి పంచే  

Image may contain: indoor
హృల్లయ -

నేను కల్పించిన ఈ హృల్లయ కూడ లయగ్రాహి వర్గమునకు చెందినదే. ఇందులోని పంచమాత్రా గణములు వరుసగా సల/భల/సల/భల/సల/భల/సల/గగ. ఒక గణము లఘువుతో ఆరంభమయితే, తఱువాతిది గురువుతో ఆరంభమవుతుంది ఇందులో, అందువలన గతిలో ఒక వైవిధ్యము కలుగుతుంది. లయ వృత్తములకన్నియు ప్రాసయతులే, కావున దీనికి కూడ ప్రాసయతియే. క్రింద నా ఉదాహరణములు -
*స్త్రీ  పురుష  తత్త్వం 
హృల్లయ - స/జ/న/జ/భ/న/ర/న/స/య - రెండేసి గణములకు ప్రాసయతి
IIUI UIII - IIUI UIII - IIUI UIII - IIUI UU
30 మహః 334228460

విరిదండ దాల్చుకొని - చరణాల నందియల -
సరసాల నందముగ - దరిరమ్ము దేవీ
వరవీణ మీటుచును - స్వరమాల నల్లుచును -
హరుసమ్ము జల్లుచును - వరమిమ్ము దేవీ

సిరివాణి హృల్లయల - సిరులెల్లఁ జిందిడుచు -
మురిపాల ముందిడుచు - మురిపించ రావా
తరుణేందు బింబ నవ - కిరణాల సోయగపు -
చిఱునవ్వు వెన్నెలల - కురిపించ రావా

వలపొక్క యాటయగు - వలపొక్క పాటయగు -
వలపొక్క బాటయగు - నిల జీవమందున్
వలపొక్క భావమగు - వలపొక్క రావమగు -
వలపొక్క నావయగు - నిల జీవమందున్

వలపొక్క యాసయగు - వలపొక్క లాసమగు -
వలపొక్క రాసమగు - నిల జీవమందున్
వలపొక్క పుష్పమగు - వలపొక్క ఖష్పమగు -
వలపొక్క బాష్పమగు - నిల జీవమందున్
(ఖష్పము=కోపము)

అనుమాన మయ్యదియు - పెనుభూతమౌను గద -
విను నీకు సందియము - మనమందు వద్దే
కనుముందు నుండునది - కనుపించుచున్నదియు -
ననిశమ్ము నిక్క మవ - దని చెప్పుచుంటిన్

నిను దప్ప నేనెవరిఁ - గనలేదు నా సకియ -
విను మొట్టు నీపయినఁ - గనకాంగి యుంతున్
మునువోలె నిర్వురము - మనుచుంద మిఁకమీఁద -
నని చెప్ప నా ప్రియుఁడు - విని యామె నవ్వెన్

సూచన - సామాన్యముగా పుస్తకాలలో ఛందస్సులు 26 సంఖ్యవఱకే. రమణకవి దానికన్న ఎక్కువగా ఉండే సంఖ్యలకు కూడ పేరులను పెట్టినాడు. 27- భూ, 28 - భువః, 29 - సువః, 30 - మహః.

No automatic alt text available.

 *స్త్రీ తత్వం వనితా - స/స/భ/భ/న/లగ IIUII UUII UIIII IIU  
17 అత్యష్టి 64924 
 
పలు మాటల కష్టాలను  -  ఓర్పుకలిగె వనితా
మన భాషల భావాలను  - తెల్సుకొనిన వనితా
మన అందరి ఔదార్యము - నే తెలుపును వనితా
మన సఖ్యత సాకారము - కోరుకొనుటె వనితా

మమకారము అందేట్లును - మాయని ప్రియ వనితా 
సహకారము పొందేట్లును - సంబరమగు వనితా                  
ఉపకారము చేసేందుకు - నిత్యము కృషి వనితా
సుప్రభాతము పాడేందుకు - భావనముల వనితా 

మనముందున బాధలను - తీరుటకును వనితా        
తలవంచిన కష్టములు - మాయమగును వనితా 
బ్రతుకంతయు సేవలను - అందుకొనుటె వనితా 
సహధర్మము పంచుటయు - ప్రేమ పలుకు వనితా  
 --((*))--

No automatic alt text available.
 *స్త్రీ తత్వం

వనమందున వాగ్దేవికి - వంతగ శుకవనితా 
మనమందలి మాధుర్యపు - మాయని ప్రియ మమతా 
స్వనమందున సంగీతపు - సంబరమగు కవితా 
నిను దల్చుచు నేనుండెద - నిత్యము రస భరితా 

పలు దివ్వెల వెల్గించుము - పంక్తులవఁగ నిశిలో 
పలు మువ్వల మ్రోఁగించుము - పాడుచు నవ నృతిలో 
పలు నవ్వుల నొల్కించుము - ప్రాణసఖుల స్మృతిలో 
పలు రంగుల జిల్కించుము - భావనముల గతిలో 

వనజాక్షిని వాగ్దేవిని - బద్యములకుఁ గొలుతున్ 
ప్రణవాత్ముని ప్రాణేశిని - ప్రాణ మిడఁగఁ దెలతున్ 
వనజాక్షుని ప్రాణేశ్వరి - భాగ్యము లియఁ బిలుతున్ 
మనమందున నా తల్లుల - మంగళ మియఁ దలఁతున్ 
--((*))--

No automatic alt text available. * స్త్రీ - పురుష తత్త్వం 
ఛందస్సు (కుసుమవిచిత్రా )
IIII UU - IIII UU ....  (3) 1111UU11
మెరుపులు సాగే - ఉరుముల శబ్దం
తరువులు ఊగే - పవనము వీచే
అణుకువ లేకే  - మనుగడ చేడే
చెమటలు పట్టేనూలే

మనసులు ఊగే - వయసును కోరే 
తమకము పొంగే - ఉరకలు తగ్గే 
కమలము మగ్గే  -  కరములు ఊగే   
చమటలు పట్టెనులే 

కలయిక వల్లే  - కలువకు అందం 
మగసిరి మెచ్చే - మమతలు పంచే 
మనుగడ భావం - మధురిమ హాసం 
చెమటలు పట్టేనూలే
   
సమయము మించే - కరములు ఊపే
వయసును దాచే - వలపును పెంచే 
నయనము తిప్పే - సొగసును చూపే 
మనసును అర్పించెను

యువతకు నేర్పూ  - వనితకు ఓర్పూ 
వయసుకు మార్పూ - తరువుకు దోస్తూ
మనసుకు ప్రేమా  - తనువుకు  శీలం 
మధురిమా భావాలను 

మరిచెను ప్రేమా - అవధులు మారే 
తలవని  గుర్తే  - పిలవని  మాయా 
కొడుకుల తీరే - కలియుగ సేవా 
భయమును పెంచెను    
--((*))--
No automatic alt text available.
 *స్త్రీ  -పురుష తత్త్వం     
లలిత లేక అను - I III UUI
న-య-ల, యతి లేదు
7 ఉష్ణిక్ 80

లలితము నీ రూపు - లలితము నీ చూపు
లలితము భావాలు - లలితము రావాలు
సరళము ఏర్పాటు  - సుఖములు సాపాటు
నయనపు భావాలు - వలపుల  తాలింపు   

లలితము నీ సృష్టి - లలితము వాగ్వృష్టి
లలితము నీ ప్రేమ - లలితతరశ్యామ
మిలితము నాదృష్టి - పరిమిత భావాలు
ఫలితము  నాద్యాస  - జయములు నాస్వాస

అనునయ మాలించి - నను పరిపాలించు
మనసును లాలించి - మనుగడ చూపించు
మనసును ఊరించు  - మమతను పంపించు
వలపును అందించు - వయసును మధించు

మనసును పండించు  - సుఖమును పంచాలి
భయమును తుంచాలి  - అభయము ఇవ్వాలి
సమయము నీ దేను - అవసర మే నాది
కాలముతొ రాసిస్త - కల కలమే నీది
     
 నయనము కవ్వింపు - సుమసుధ అవ్వాలి
 పెదవుల భాష్యాలు - శ్రవణము శబ్దాలు
 తపనపు స్వరం లొ - వికసిత సంతృప్తి 
 కలయిక  ఏకంలో  -  సుమసుధ సమ్మేళ     

--((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి