30, డిసెంబర్ 2016, శుక్రవారం

wish you Happy New Year(I.T.Magazine 1/2017/49)


Om Sri Ram - Sri Matrenama:
Pranjali Prabha
wish you Happy New Year

నూతన సంవశ్చర శుభాకాంక్షలు
అంతర్జాలంలో ప్రాజలి ప్రభను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు-

*లోకోక్తి -౧ (ఛందస్సు )

ధర్మా చరణ మార్గం - కోర్కెలకు అవసరం  
జ్ఞానామృత సువిద్యా - మార్పులకు అవసరం  
దోషాల పరిహారం - క్రోధాలను వదులుటే  
మాట్లాడుటలొ శక్తే  - భందాలను కలుపుటే 

 క్షిరంలో జలము కలసిన - గుణాన్నిచ్చున్ 
గంగాలో మురుగు జలముకు - గుణాన్నిచ్చున్
దేహంలో ప్రేమల  మనసుకు - గుణాన్నిచ్చున్    
దుర్మార్గం మరుపుకు సుగుణ - గుణాన్నిచ్చున్

వేకువే క్షణంలో -  కదులుతూ వెలుగు 
రాత్రులే స్వప్నాల -  కలలుగా వెలుగు 
స్నేహాలే భందాలు -  వలలుగా వెలుగు     
మాటలే సాహిత్య  - కధలుగా వెలుగు 

క్షామంలో కన్నీరు -  తలచుట జరుగు  
దాహంకి మున్నీరు - కలపగా కరుగు 
దేహంపై పన్నీరు  -  చిలికిన మెరుగు 
ప్రాణంతో మర్యాద -  వదలక ఎదుగు 

--((*))--

Native Images:
అంబరాల నంటిన సంబారాల నా భావ ఛందస్సు 
*నూతన వత్సర జయము- గేయము 
  
పున్నమి వెన్నెల తోడు రాగా  
కన్నెలు వన్నెల పంచి సాగా 
మిన్నకు అంటెను వెల్గు లాగా 
వన్నెల తెన్నులు  పంచు కోగా 

గిన్నేర్ర కన్నులు విచ్చు కోగా 
బాసయె వాసము వచ్చి చేరా 
ప్రాసయె శ్వాసము ఆశ కాగా  
లాసము హాసము వెంట రాగా

రాసము కోసము పోటి లాగా  
ఛందము నందన తార ల్లాగా 
సుందర బంధము వచ్చి చేరే 
లందున విందులు లందు చేసే 

మందర గంధము విస్త రించే    
అందవు సందుక విందే పొందే    
లాందియ చిందులు వేసి సాగే 
దేవుని దీవెన పొందె అందే 

నవ్వుల పువ్వులు వచ్చి చేరే 
రవ్వల గువ్వలు  సంత శించే
మువ్వల చోద్యము చేసి చూసే  
నిత్యము సత్యము భాష పల్కే 

--((*))--  


*నూతన వత్సర జయము- గేయము

వచ్చింది వచ్చింది నూతన వచ్చరమూ
తెచ్చింది తెచ్చింది నూతన వర్ఛస్సునూ
పల్కింది పల్కింది నూతన భాష్యమునూ  
చెకూర్పు ఓదార్పు  మనకు సత్వరము      

చిరునగవుల శ్రీవాణి నీవెంట ఉండగా
వరగుణముల వర్ధని నీచెంత ఉండగా
కరుణరసము శ్రీమాత నీనీడ ఉండగా
హృదయముల అర్ధము నీసొంత మవ్వగ    

నీతిని నమ్మి భీతిని వదలి జీవిద్దాం
నేతను బట్టి  దివ్వెగ మనము జీవిద్దాం
తల్లి ఓర్పుతో తండ్రి నేర్పుతో జీవిద్దాం
సహన గుణంతో సహకరిస్తూ జీవిద్దాం

ఇహ పర సుఖములు పొందుతూ
బ్రాంతిని తొలగించి శాంతిని నింపుతూ
స్వార్ధము విడనాడి కరుణను పంచుతూ
చెలిమితో చేయి చేయి కల్పి జీవిద్దాం

చదలువుల మర్మముతో సహకరిస్తూ
నిత్యము ధర్మ మార్గమును అనుకరిస్తూ
దేశ సంపద వృద్ధికె నిత్యము శ్రమిస్తూ
కుటుంబాన్ని రక్షించుకుంటూ జీవిద్దాం    
 
--((*))--

కొత్త వృత్తము (ఛందస్సు)
ప్రేమామృత

ఉత్పల మాలలో నుచ్చ భావమ్ముల
రాగము తాళమో  ఉచ్చ స్వరమ్ముల
భావము అర్దమో  ఇచ్ఛ  సేవమ్ముల
సౌష్ఠము శ్రేష్టము పంచె ప్రేమమ్ములు

చంపక మాలలో నింపె తాపమ్ముల
తృప్తిగ  తోటలో సొంపు  రావమ్ముల
ఇష్టము వంపులో ఒప్పు తూనమ్ముల
మత్తుగ మాయలో చిక్కి ప్రేమమ్ములు

మత్తెభ మాలలో  చూపె వృత్త
మ్ము
శక్యము భామతో  చాక చక్యమ్ముల
సత్యము పల్కుతో తెల్పె భాష్యమ్ముల
నిత్యము ప్రేమతో పంచె ప్రేమమ్ములు

శార్దూల  కూర్పుతో మాయా భేదమ్ముల
భావాల  దివ్వెతో  మామా మోహమ్ముల
శోకాలు  ఎప్పుడూ లేకే   సంతృప్తుల
జొప్పించి ఓర్పుతో కూర్చే ప్రేమమ్ములు
--((*))--

*సిరి లో మార్పు (కవిత) 

క్షణ క్షణము మారు సిరి - నిరీక్షణంలో ఉండు సిరి 
పత్ర పత్రము గాలి సిరి  - పరీక్షలలో  విద్య  సిరి 
బగ భగలు   వేడి   సిరి  -  ఆవరోహాణ  అగ్ని సిరి 
తహ తలు నీటి సిరి  -   ఆరోహణల మంచు సిరి 

ఊహకు ఊపిరి సిరి - చలికి వేడియు సిరి
భాషకు  మాటల సిరి - చినుకు నేలకి సిరి  
భాగ్యము పేదల సిరి  -   లవణ కళ్లకు సిరి 
భార్యయు భర్తకు సిరి - మగడు మగువ సిరి 

ఆలోచన ఒంటరి - ఆచరణ పెడసరి
విజ్ఞానము ఒంటరి - అజ్ఞానము గడసరి 
ఆరాటము ఒంటరి - ఆవేశము మగసిరి 
పొరాటము తుంటరి - ఆహ్వానము సహచరి  

వయస్సుకు ఉషస్సు సిరి - యశస్సుకు తమస్సు సిరి 
మనస్సుకు  తేజస్సు సిరి -  మనస్సుకు ఆశిస్సు సిరి 
పద్మముకు సూర్యుడు సిరి - కలువకు చంద్రుడు సిరి 
వెన్నెలకు  చీకటి సిరి  - మేఘముకు ఆకాశం సిరి 
--((*))--
   
చమరివాల - న/న/న/జ/న/లగ IIIII IIIII - UIII IIU
17 అత్యష్టి 64512

కల నిజము నవ దినము - కాలమున శుభమే
శుభ పలుకు నవ నడక  -   వత్సరము ఫలమే
ప్రభ వెలుగు నవ మెరుపు - కొత్త దిన యుగమే
ప్రజల అభిరుచులు పెన - వేసుకొనె సుఖఃమే    
--((*))--
ఆలోచన కొత్త దైతేనే ఫలితం
చేసేపని పాత దైతేనే సులభం
పూర్వ వైభవ స్పూర్తితోనే గమనం
శోభయు నవోత్సాహంతోనే విదితం

బ్రహ్మ విద్య ఆధ్యాత్మ శుబ్రమణం
దైవ సృష్టి అపూర్వ సమ్మేళణం
శాస్త్ర దృష్టి సమార్పు సమ్మోహణం
దేశ వృద్ధి జనాత్మ శఫ్యూహణం  
 --((*))--

  
ప్రాంజలి ప్రభ (ఛందస్సు )
అడుగు అడుగూ కలపి - ప్రేమలతొ పిలువగా

సెగలు వలె గాలితెర - కమ్ముకొని దొలఁగఁగా

మది తలపే మరులు - గ్రోలి కల సరసిలో

గగన జలమే చినుకు - జారి మది తడపగా


నళిని వెలుగే మనిషి - జీవిత కల మెరుపే

తొలికళ ఉషోదయము - కొత్తదనము పిలుపే

గడచినవి కోరికలు - కొన్ని అనుభవములే

మధుర లతలే మనసు - మార్పులకు కలలుగా

గతము వదిలే యవలె - రేపటి బ్రతుకునకే

మనసు మనసే ఒకటి - గా కలసి బ్రతుకుటే

కలక లవగా గతము - మానసము ఒకటిగా

శుభము కొరకే పిలుపు - నూతనమున మనమే

--((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి