16, డిసెంబర్ 2016, శుక్రవారం

ప్రేమామృతం - (కొత్తది ) ఛందస్సు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

fjcw5xc90g25t9dcc7v1.gif (500×500):
సర్వేజనాసుఖినోభవంతు ప్రేమామృతం - (కొత్తది ) ఛందస్సు
రచన :మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ 

UIIUI - UIII - (3) - UIIUI - UIIU
 
 1 .  సర్వ మతాల సారమును - సర్వము కొల్చె  దేముడును
పెన్నిధి లాగా  ఆదుకొనును -   జబ్బు లెకుండా  చూడుటయు సత్యము తెల్సుకొనుటయే. 


2. జాబిలి కన్న గొప్పదియు -    మల్లెల కన్న తెల్లదియు
మీగడ  కన్న  మించినది -  వెన్నెల కన్న చల్లనిది 
బిడ్డపై అమ్మ  ప్రేమయెరా    

3. పుట్టిన ఊరు మేడల తొ - ఉన్న తెనాలి, ధైర్యమును
జీవన మమ్మ నేర్పినది - సత్యమును తెల్పి బ్రతకమ
నీ,పిత నేర్పిన శ్రమయే

4. పాఠము నేర్పె పుణ్యభువి - రక్షణ పేరు  పెంచటము
తెల్గు సమీప వెలుగెను  - నల్గురుకీ సువిద్యయును
పంచుట  వేద పలుకుయే.

5. కోర్కల కొత్త మార్గమున - పట్టణ జల్స లేమరిగి
డబ్బుల యావ పెరిగెను  -  ఇష్టము వచ్చి  ఖర్చులను
చేయుట మోజు కల్గుటయే.

6. ఆదియు నన్ను ఆదరణ - చూపిన పల్లె ప్రేమలను
తెల్సిన నేను ఇప్పుడును - సేవలు అంద చేయుటయు
పల్లె ఋణం తీర్చు టయే.
* 7. తేనెలొ మాగీ తీయన గ - మామిడి పండు ప్రేమయును
అమ్మ  ప్రేమ అంతయును - మామిడి కన్న తీయగును 
స్వత్సము గానె ఉండుటయే.

8. చల్లని మంచు కన్నయును - వెచ్చని అగ్ని కన్నయును
భూమియు మేలు చూపినను  - నింగిన ఉన్న అంతయును
అమ్మను మించి ఏదియులెదే.


9. అక్రమ వక్ర మార్గమున - మూర్కుల కోప తాపమున
తామస వళ్ళ జాతులను - పిచ్చిత నం తొ అనేకముగ
కష్టము పాలు చేయువక్రా.

10. ఏమియు ఉంది లోకమున - స్వర్గ సుఖాలు ఎక్కడను
లేకయు కష్ట మే ఉదయ - భానుల తిర్గి సేవలను
పంచుట యే యశస్సులదీ.. ఈ నిశి రాత్రి పువ్వులను - నవ్వుల కాంతి వెల్గులను

రమ్యముగా సరాగమును - తెల్పి సమాన ప్రేమలను
పంచి సమంగ బ్రతుకుటే.          

 12 . వెన్నను పూసి వేదనను - మాత్రలు వేసి రోగమును
బుజ్జి అనీ  మనసును - చల్లగ మంచి మాటలను
స్వేదము లేక పంచావురా
 
13. కళ్ళతొ నన్ను అర్ధించియు - శోకము తీర్చి  వెన్నంటియు హృదయ తాప తగ్గించియు - శాంతము నాకు కల్గించియు కళ్లతొ నే  కౌగిలించావు రా.
     
14. శక్తిని వృధా చేయకము - భక్తిని మర్చి ఉండకుము
బుద్ధ్దిని వ్యర్ధ పర్చకము - యుక్తితొ మంచి గ్రహించుము
గీతను బట్టి బ్రతుకుము
రా.


15. డబ్బుల జబ్బు ఉండినను -  గుట్టు రట్టు చేసినను
బుద్ధికి ఇచ్ఛ లేకయును - మర్మము ఏది లేకయును
ప్రాణంతొ ఉండు టెందుకురా. Image may contain: flower, sky, cloud, nature and outdoor


16. పుట్టిన తెచ్చు దేదియును - మెట్టిన ఇచ్చు దేదియును
మధ్యన వచ్చు దేదియును - స్త్రీ వల నొచ్చు దేదియును
సౌఖ్యము నివ్వ దేదియురా.

17. శ్రీమతి నమ్మి మారుటను - శ్రీపతి విడ్చి పోవుటను
విద్యను వ్యర్థం చేయుటను - నమ్మియు మోస పోవుటను
ఎప్పుడు నీవు చేయకురా.           


18. న్నులు చూపి పుట్టుటయు - కన్నులు మూసి గిట్టుటయు
రెప్పల పోటు గొప్పదియు - దానము చేసే కళ్ళలొను
సూర్యుడు వెల్గులా మనిషే.

19. మత్తుయు జూదం ఎందుకుయు - మూర్కుల వలే మారకము -మంత్రము శక్తి ఆవాహము - ధైర్యము పెంచే భక్తియును - మార్గము గానే ఉండునురా

20. పెద్దల కేమి చెప్పవలె - పేదల భాద నంతయును
ఓర్పుతొ ఉండి భాదలను  - తీర్చుట తల్లి లాకడుపు
తీపిని అంచి ఉండుమురా .


 No automatic alt text available.


21. జాతక నమ్మి మారటము - వాస్తులు నమ్మి మార్చుటయు
గొప్పల కోసం పోవుటయు  - ఎందుకు కృషి నీ తలచి
నమ్మిన ఋషీ కాగలవూ.

22. తప్పులు ఒప్పినా మనసు - తేలిక, ఒప్పు కోనియడ
తిప్పల తప్ప వూ మది లొ - తప్పులు చేయ నీ నరులు
లోకము లోన లేరునులే
    
23. కోట్ల గడించి నా మెతుకు - అన్నము, ఓర్పే, ఆకలికి
సంతస మంత వాకిలికి - పంతము అడ్డు చీకటికి
వెన్నెల పంచు అందరికే.

24. మొక్కలు వంగి సాయపడు - పిల్లలు పెర్గి భాదపడు
వృక్షము పెర్గి  గాలులను - పంచుట లోక రీతియును
కాలము బట్టి ఉండుమురా.

25. నీకుయు నచ్చి నాకమగు - నీకుయు నచ్చ శోకమగు
తప్పులు చేయు టెందుకుయు - ఒప్పులు చేసి జీవితము
చల్లగా పంచి ఉండుమురా.

No automatic alt text available.
26. దీపము వెలుగు పొందుటయు - చీకటి తిట్టు టెందుకుయు సిగ్గులు చూపె మానసము - చిన్న సహాయ కారగును చీకటి వెల్గె జీవమురా .

27. లేరని తప్పు పల్కుటయు - రారని వత్తి చెప్పుటయు 
వచ్చె దరూ అనేపలుకు -  గాయము మానివేయుటయు  
 ప్రాణము నిల్పి బ్రతుకురా.   

28. అగ్నిపు నీత లౌఅక్షర - బాణమే నాకు రక్షణయు
నిర్ణయ  విజ్ఞ ప్రేరణయె  - వచ్చిన బంధు దీవనలె
నిత్యము  సత్యమే అగుటే.       

29. కర్తల పాలనా క్రమము - సాక్షిగా మేలు చేయుటయు
మర్మము బట్టి తెల్పుటయు - శక్తిని బట్టి నేర్పుటయు
వ్యక్తి గ యుక్తి ప్రేరణయే.

30. సూక్తుల సాధనే మనకు - సాక్షుల ప్రేమ యే మనకు
పాఠము చెప్పు గాత్రముతొ - సౌఖ్యము పంచు మార్గమున
పాలన చేయు టేమనకూ

31. నేనొక మోటు మానసిని - నేర్చిన విద్య తక్కువయే

జ్ఞానము పంచె శారదని - ప్రార్ధన తో వరమ్ములను
కోరితి సేవ చేయుటకే.

32. సంఘము కోరి విద్యలను - పంచుట నిల్చి తోడ్పడుట
తల్లియు తండ్రియే మనకు - దీవెన నమ్ము టే కవిగ
సేవలు చేయు టే పనిగా.

33. పొద్దునె లేచి వ్రాయటయు - నిత్యము సత్య మార్గమున
విద్యయు  ధర్మ మార్గము - దానము చేసి తృప్తి పడె
జీవన మే దినమ్ము సిరీ.

34. .తూరుఫు తెల్ల వారినది - బిడ్డల మేలు తల్లి తపన
తోరణ మే అలంకరణ - చేసిన భర్త  సేవ వలన
వేళకు భార్య సావసమే

35. మంచు తుషార బిందువులు - మానస తీగలే యగును -   
తెల్లని పట్టు చీరమణి - మోహిత భావమే కలుగు
స్త్రీలలొ ప్రేమ అమృతమే 

-((*))--