15, డిసెంబర్ 2016, గురువారం

Internet Telugu magazine for the month of 12/2016/47

ఓం శ్రీ రామ్ - శ్రీ మాయాత్రేనామ:
Hummingbird:
సర్వేజనా సుఖినోభవంతు

*శబ్దం - నిశ్శబ్దం (కవిత)  

శరీరంలో రక్తం కదలిక నిశ్శబ్దం
హృదయాన్ని కదిలించేది శబ్దం
జీవితం లో సగం నిద్ర నిశ్శబ్దం
నిద్రలో తెలి పర్చే  గురక శబ్దం

మనసులో కదిలే ఊహలు నిశ్శబ్దం
ఆశలరెక్కలు కమ్మి చప్పుళ్ళే శబ్దం
పచ్చి పాలు కాగే టప్పుడు నిశ్శబ్దం
పాలు వేడికిమరిగి పొంగి పొర్లే శబ్దం

చెట్లపై కాయలు కదలిక నిశ్శబ్దం
పండ్లు పృథ్విపై పడిగానే  శబ్దం
కాగితము పై వ్రాత లూ నిశ్శబ్దం
చదివితే మస్తిష్కంలో చేస్తాయి శబ్దం

నిద్రలో కలల కదలిక నిశ్శబ్దం
గుర్తున్నకల చెప్పిచేస్తారు శబ్దం
కిరణం వెలుగు కదలిక నిశ్శబ్దం
వేడిన తట్టు కోలేక మనిషి శబ్దం

ప్రేమించు కొనేటప్పుడు నిశ్శబ్దం
ప్రేమ పెళ్లిగా మారాలంటే  శబ్దం
పెళ్ళికి ముందట ఆశలు నిశ్శబ్దం
పెలైనాక ఆశలు తీర్చుకోలేక శబ్దం
              --((*))--

*నవదంపతులకు అక్షరమాల ఆశీర్వచనములు

కన్న కలలు నిజం చేసుకోవాలి
గతం మరచి జయం చూసుకోవాలి
ఘన కీర్తిని పొందేవిధముగా ఉండాలి
చక్కని పిల్లలతో సంసారం గుట్టుగా ఉంచాలి

ఛత్రంలా వారిని కాపాడి విద్య నేర్పించాలి
జయంగా సమస్యలు లేకుండా సుఖపడాలి
జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ బ్రతకాలి
టక్కరి పనులు పిల్లలు చేయకుండా చూడాలి

డంబాలు, బేషజాలు లేకుండా ఉండాలి
ఢంకాలా చదువులయందు విజఢంకా మొగించాలి
బాణంలా దూసుకు పోతూ ధైర్యంతో సాగాలి
తన్మయత్వంతో నమ్మిన వారికి సుఖం పంచాలి

దందాలు వద్దని, ధ్యానం తో శాంతిని పొందాలి
ధనాన్ని దురినియోగం చేయక జాగర్త పడాలి
నమ్ముకున్న వారిని ప్రేమతో ఆదుకోవాలి
పరీక్షలు ఎదుర్కొని  జీవితం సాగించాలి

ఫలాపేక్షలేకుండా పెద్దల ఋణం తీర్చుకోవాలి
బలగం పెంచుకుంటూ మానసికంగా బ్రతకాలి
మంగళ తోరణాలతో ఉషోదయాన్ని ఆహ్వానించాలి

యముడిని జయించే పతివ్రతగా బ్రతకాలి
రమ్య మైన జీవితంలో అపశృతులు మానాలి
లంచం అడుగక అడిగిన వారిని పట్టించాలి
వద్దు చేతకాదు అనేది మనసుకు రాకుండాలి

శంకలన్నీ తుడిచేసి ధైర్యంతో ఎదుర్కోవాలి
షరా మామూలుగా తేలిక భావంతో ఉండాలి
సగటు మనిషిని గౌరవించటం నేర్చుకోవాలి
హక్కుల కోసం అవసర మయితే పోరాడాలి

క్షణ క్షణం మంచి కోసం తపన చెందాలి
ఱంపంలా నిరంతరం చెడును తుంచాలి
ప్రకృతిలో ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాలి
అర్ధం కోసం బ్రతకకండి ధర్మ కోసం బ్రతకాలి

--((*))--



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 Image may contain: 1 person , people sitting and text
సర్వేజనా సుఖినోభవంతు

తమిళనాడు ముఖ్య మంత్రి జయలలితకు
శ్రద్ధాంజలి ఘటిస్తూ పుష్పగుచ్ఛాలు అర్పిస్తున్నాను


అమ్మ అమ్మా భువి నుంచి దివికి ఎగసినావమ్మా
మా హృదయంలో నీకున్న స్థానం పదిలమమ్మా 
మా భాదలు, నష్టాలూ ఎవరికీ చెప్పు కోవాలమ్మా
నీవు చూపిన మంచిమార్గాన్నే ఎంచుకుంటావమ్మా


మా కోసం నీవుకన్న కలలన్నీ మేము నిర్వహిస్తావమ్మా
ఇకలేవని అనుకోవమమ్మా, హృదయంలోనే ఉన్నావమ్మా
మానత్వం నిలిపి అందనంతదూరములో ఉన్నావమ్మా
మా హృదయంతో పుష్పాంజలిని ఆర్పిస్తున్నా మ్మమ్మా


ప్రాంజలి ఘటించి నీకు వందనాలు ఆర్పిస్తున్నామమ్మా
సత్య,ధర్మ,న్యాయం కోసం పోరాడుతామని శబధంమమ్మా
అమ్మ అమ్మా మామనసును అంతర్గతముగా చూడాలమ్మా
అమ్మా నింగి నుండి మాకు హితబోదచేసే జయలలిత వమ్మా

--((*))--
కన్నీరుతో సమర్పిస్తున్నది ప్రాంజలి ప్రభ


అత్యంత విషాద సంఘటన -
విప్లవ వనిత (పురచ్చితలైవి ) గా పేరుగాంచి , అశేష అభిమానులచేత ' అమ్మ' గా ఆప్యాయంగ పిలువబడిన అన్నా డి.యం.కె . అధినేత్రి , తమిళ నాడు ముఖ్యమంత్రి , కుమారి జయలలిత (68) ఇకలేరు . షుగరు .బి.పి. కీళ్ళనొప్పుల కొరకు అపోలో హాస్పిటల్ చేరి 72 రోజులు మృత్యువుతో పోరాడి , హృద్రోగంతో నవంబరు 5 న రాత్రి గం. 11.30 లకు తమిళ నాడును శోకసముద్రములో ముంచి ఆమె తుది శ్వాస విడిచారు.
1948 లో వైష్ణవుల ఇంట మాజి సినితార సంధ్య కు కుమార్తె గా జన్మించి , స్టేట్స్ లో విధ్యా భ్యాసం ముచించుకొని , తన 15 న ఏటనే చిత్ర రంగం ప్రవేశించి , ఆనాటి హీరోలు , ఎన్టియార్ , ఏయన్నార్ , ఎంజియార్ , శివాజి గణేశన్ , కృష్ణ  ,శోభన్ బాబు మొదలైన హీరోలతో , కధానాయికగా , తమిళం , తెలుగు , కన్నడ భాషలలో 146 చిత్రాలలో నటించి , అలనాటి తమిళ నాడు ముఖ్యమంత్రి యం.జి.ఆర్ . వారసురాలిగా 1987 న రాజకీయ రంగంలో ప్రవేశించి తొలి మహిళా ముఖ్య మంత్రి గా నాటినుండి నేటి వరకు తిరుగులేని రాజకీయ నాయకురాలు కుమారి . జయలలిత . లక్షలాది అభిమానుల హృదయం లో చోటు చేసుకున్న ' పురుచ్చి తలైవి ' ఇకలేరు .
మనందరి తరఫున అన్నా డి.యం .కె . అధినేత్రి , తమిళనాడు ముఖ్యమంత్రి ,
జయలలిత గారి ఆకస్మిక మృతికి , నా ప్రగాఢ సానుభూతి !!
- అమర్ రహే !!

--((*))--

శ్రీ.బాపు గారికి ...స్మృత్యంజలి...
ఇందిరాలయ - ర/స/జ/భ/ర/జ/జ/ర/గగ
UIU IIUI - UIU IIUI - UIU IIUI - UIU UU
26 ఉత్కృతి 5680475


బాపుడే మనముందు - బొమ్మలో కనిపించె

రాముడై మనయందు - దేవుడై   కనిపించే
గుండెలో బాపూ    

వృత్త (ఛందస్సు )



తెలుగే ప్రాణం - తెగువేకు లక్ష్యం

వెలుగే హృద్యం - మనసైన సాక్ష్యం
తపనే భాష్యం -  తనదైన బొమ్మా    
మనసే బాపూ -  చిత్రమే సృష్టించే




తెలుగు గీతకు ఎల్లలు లేని కీర్తి ,ప్రతిష్టనునిలిపి,

తెలుగు గుండెల్లో బాపు బొమ్మను ప్రతిష్ఠించి,
అచ్చ తెలుగు అందానికి,రూపాన్నిచ్చి,
తెలుగు తనపు తనదైన హాస్యానికి భాష్యం చెప్పి,
తెలుగు చిత్రానికి తనదైన ఒరవడి సృష్టించి,
స్నేహానికి,నిరాడంబరతకు,ఆదర్శముగా నిలిచి,
తెలుగు జీవితాల్లో,ఇంకిపోయి,
తెలుగు వారి గుండెల్లో దేవుడయిపోయిన
తెలుగు వాడు..గర్వంగా ఛాతీవుప్పొంగేలా.మా''బాపు'' అని
చెప్పుకునే.చిత్రబ్రహ్మ..

శ్రీ.బాపు గారికిభావుక సభ్యులు,అడ్మిన్ లువారి వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ అందిస్తున్న...స్మృత్యంజలి.........

* కవిత 

అదృశ్య భందము కాదు ప్రేమంటే
మనస్సు తృప్తి నిచ్చే సుఖాల ప్రేమ 
నదిలా సాగె సమాన వేగమే మనస్సు 
పరవళ్లు తొక్కే సంతోష దు:ఖాలే
  
పాదములు, కరములు కదలందే
ఉదర పోషణ కష్ట సాధ్య మే
రెక్కలు కొడుతూ నీటిపే తేలే పక్షి లా     
అంటి అంటనట్లుగా ఉండటమే 

పృథ్వి పులకిస్తుంది జడివానకే 
గుండెకు చల్లదనం పంచె మంచు గడ్డలా
నింగి శబ్ద ఘోష తట్టుకొని ఉండటమే 

మనోవాంఛలతో అగ్నిలో నేయిలా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి