ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
సర్వేజనాసుఖినోభవంతు
*పువ్వే మనం
పువ్వు పుట్టిన రోజే పరిమళిస్తుంది
మనం పుట్టిన రోజే ఏడిపించడం జరుగుతుంది
పువ్వు కాయా మారుతున్నది.
మనం ఊసరివేళ్ళులా తయా రౌతున్నాం
పువ్వు వికసించగానే నీరు కారుస్తుంది
దేవుని సన్నిధికా, సంతసానికా అని
మనం పుట్టగానే పాలకోసం ఆలపిస్తాం
పెరగగానే పెంచినవారినే మరుస్తాం
పువ్వులు సూదుల భాదను తట్టుకొని
అందమైన మాలగా సంతోషాన్ని తెలుపుతుంది
మనం ప్రకృతికి తట్టుకోలేక తిక మక
పడుతూ ఆశలకు చిక్కి అలమటిస్తాము
పువ్వులు పాదాలక్రింద నలిగినా
కొప్పుకుచేరి అందాలు చూపినా
గుబాళించే సహజ గుణం మారదు
మనం పాదాలు మ్రెక్కి ప్రార్ధనలు
చేసి, చేసిన పాపాలు చెప్పుకొని
అహంకారాన్ని వదలలేక
ప్రేమను పంచలేక నలుగుట
కొన్ని పరిస్థితులలో సహజమని
నేను అనుకుంటా
పువ్వు నలిగి వాడి పృద్విని చేరుతుంది
మనం జవసత్వాలు ఉడికి ధర్మో రక్షిత
రక్షిత: అంటూ పృద్విని చేరుతాముకదా
--((*))--
*గుండెమీద చెయ్యేసి చెప్పండి
గ్రుడ్డిగా కొందరిని నమ్ముతాం కానీ
గ్రుడ్డి తాతను ఎప్పుడైనా దాటించామా
పిల్లల చదువు కోసం తాపత్రయపడ్డాము కానీ
చదువురానివారికి ఉచితంగా చదువు చెప్పామా
పిల్లలకు బర్తడే పార్టీ ఘనంగా చేస్తాము కానీ
వృద్ధాశ్రమానికి గాని,ఆసుపత్రికి గాని వెళ్లి
ఎప్పుడైనా పండ్లు పంచి వారికి సహకరించామా
పిల్లలు వైద్యవృత్తిని చేయుటకు సహకరిస్తాము కానీ
ఉచిత వైద్యము చేయమని చెప్పగలమా
చదువుకున్నాం ఊరి సమస్యలు తెలుసుకున్నాం కానీ
ధైర్యము చేసి గర్భిణీ స్త్రీలకు సహకరించామా
ఊరి సమస్యలకు ఉచిత సహాయము చేసినామా
న్యాయాన్ని బ్రతికంచాలని అందరికి చెపుతాము కానీ
న్యాయవాద వృత్తిలో న్యాయంగా మనం పోరాడుతామా
రోగం తగ్గుటకు మందులు తయారు చేసాము కానీ
ఉచితంగా మందులు చేయగలుగు తున్నామా
జవాన్ సాహసగాథను పది సార్లు చెప్పుకుంటాము కానీ
ఎండా,వాన చలి తోడు లేక బ్రతక కగలుగు తున్నామా
ఆటలను చూసి ఆనందిస్తాము, విమర్శిస్తాము కానీ
ఉచిత్తంగా శిక్షణ ఇచ్చి ప్రోత్స హించ గలుగు తున్నామా
ఆడపిల్లలను చూసి బహువిధాలుగా వర్ణిస్తాము కానీ
ఆడపిల్లలకు ఆత్మ అక్షణకు కరాటి నేర్పు తున్నామా
మన:శాంతికి మందు లేదు కానీ
మానవత్వం బ్రతికించ టానికి
నిర్మలమైన మనస్స్సు ఉంది మనకు
చెప్పుకుంటే భారం తగ్గుతుంది
ఒప్పుకుంటే ఫలితం తగ్గుతుంది కదా
అందరి ధన్యవాదములు
భావాలు వేరైనా నాది సేవా దృక్పదం
బ్రతికి బ్రతి కించు కోవటంలో ఉన్నది మనుగడ
--((*))--
*ప్రేమలో పట్టు
సరిగమల సరాగం ప్రేమతో పుట్టు
చెరపలేని ప్రేమ మనసులో పుట్టు
ప్రేమార్ధం విశ్వ మంతటి లో గుట్టు
అంతుతెలియని మాధుర్యంతో పట్టు
అరిగిపోని అనురాగం పంచె పట్టు
కడలి పొంగును చల్లఁపరిచే పట్టు
ఆలింగనాల అభిరుచులతో పట్టు
తీపిగుర్తులు అందించి నలిగే పట్టు
నిరంతర త్యాగాలతో, ఓర్పుతో పట్టు
వివరించలేని సుఖం ఇచ్చిన పట్టు
తెలియని ఆనందం అందించే పట్టు
వీడని నమ్మకం తో బ్రతికించే పట్టు
ఇరుహృదయాల సంగమమే ప్రేమ పట్టు
ఈశ్వరుని లీలలను తట్టుకొనే ప్రేమ పట్టు
ఆకలేస్తే అన్నంపెట్టు, కోరికను వడిసి పట్టు
క్షణమొక యుగంగా బ్రతుకు ఈడిస్తు పట్టు
--((*))--
* ఏమి తెలుసు ?
అద్దం అందరికి తెలుసు
అందం చూపుతుందని తెలుసు
జారితే మిగులుతుందని తెలుసు
పగిలిన అద్దంలో చూడలేము కదా
స్త్రీల మనసు కోమలం అని తెలుసు
ఆదరిస్తే ఆదు కుంటుందని తెలుసు
ద్వేషిస్తే ఆదిశక్తిగా మారునని తెలుసు
ప్రేమతో గెలిస్తేనే బ్రతక గలము కదా
నోట్ల అవసరము మనకు తెలుసు
దాచుకుంటే అక్కరకు పనికొస్తుందని తెలుసు
అక్రమ సంపాదన దొంగల పాలని తెలుసు
డబ్బు దానం గా వాడితే లక్ష్మి ఉండు కదా
మనసు కొన్ని సార్లు భాద పడునని తెలుసు
మన:శాంతికి మార్గాలున్నాయని తెలుసు
మనస్సును సక్రమముగా ఉంచాలని తెలుసు
మనస్సును పంచుకుంటే సుఖము కదా
బంగారం కొనుక్కోవటం కష్టమని తెలుసు
బంగారం వళ్ళ ఆశ పెరుతుందని తెలుసు
బంగారం కొనమని వేధిస్తే భాదని తెలుసు
బంగారం అతిగా ఉన్న నిద్ర ఉండదు కదా
--((*))--
చంపకమాల (స్త్రీ తత్త్వం )
కళలతొ సందడే మనకు. చక్కని పల్కులే శక్తి నీకు, నీ
మనసును వేరు చేయనను - నమ్మక మాటలే శక్తి నీకు, నా
తలుపుల ఏకమే అగుట - తప్పక వప్పులే శక్తి నీకు, నా
సరసిజ నేత్రి, భానుమతి, చక్కని నవ్వుల జ్ఞానదాయి నీ
*వృక్షో రక్షిత రక్షిత:
(ఛందస్సు)
వేవేల వృక్షాలు ఉన్నాయి
ఉజ్వాల ఉత్తేజ ఉచ్వాస
ఉద్దేశ ఉద్బోధ ఇచ్చేవె
ఉత్తుంగ విద్యుత్ లు ఇస్తాయి
క్షుద్ బాద శ్రీఘ్రంగ తొల్గించు
వ్యత్యాస అత్యాస లేకుండు
సంభావ సంతాప ప్రత్యేక
పుష్పాలు అందేటు వంగేను
దిక్కూలు అన్నీయు వ్యాపించి
ఆకూలు మందులై త్వజించు
ప్రాణాలు కాపాడు అందర్ని
స్వలాభ మానేను దివ్యమై
ఉయ్యాల ఊపుల్లే గాలులై
సుస్వాస సంతోష వెల్లువై
ఊహాలు మెల్లాగ మార్చేను
నవ్యాయి ఏడ్చాయి తేల్సుకొ
--((*))--
*స్త్రీ తత్త్వం
స్రగ్విణి / కామావతార -
స్రగ్విణి - ర/ర/ర/ర UIU UIU - UIU UIU
12 జగతి 1171
తూర్పునా ఊడ్చెనే - సుబ్రమే చేసెనే
నీటినీ చల్లెనే - ముగ్గులే పెట్టెనే
రంగులే దిద్దేనే - పువ్వులే చల్లెనే
ఓర్పుతో సంతసం - నిత్యధర్మాములే
రమ్ము కామావతా - రా ప్రకాశమ్ముగా
నిమ్ము ప్రేమమ్ముతో -నిప్డు ప్రీతిన్ సదా
తమ్మి నీమోము కెం - దమ్మి నీ రూపమే
చిమ్ము సోమమ్ము రం - జిల్ల సోముండగా
కళ్ళలో వెల్తురూ - కాంతిలో సంతసం
చీకటే మెట్టుగా - గుట్టుగా సంక్రమం
పద్యమే వేదమై - భావమే నాదమై
అందమే సొంతమై - శ్రీమతీ సౌక్యమై
తామసం తగ్గెనే - తన్మయం చెందెనే
సుందరం కాంతలో - నోములే పండెనే
మన్మధా అంబరం - ప్రుద్విలో సంబరం
చీకటే తీరెనే - వెల్తురే పంచెనే
పున్నమీ వెన్నెలే - వేకువే మంజులం
మోహనం నిర్మలం - రామనీ రూపమే
ప్రుద్విలో సంగ్రహం - నింగితో సంభవం
దివ్యమై సవ్యమై - మాధవో మాధవీ
లీలావతీ - న/న/య/ర/ర/ర/గల IIII IIIU UUI - UUI UUI UUI
20 కృతి 599168
వెలుగుచు నిలబడేన్ నాదేవి
- ఆనంద మానంద మొచ్చేను
రసములు చిలికెనే రాగాల
- రంజిల్లు రంగుల్ విరాజిల్లు
కుసుమముల మనసే నా సీత
- నవ్వేను పల్కేను నమ్మెట్లు
రుస రుసలు లేనిదే నామల్లి
- సాహిత్య సంగీత లాస్యమ్ము
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి