ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
సర్వేజనా సుఖినోభవంతు
స్త్రీ - పురుష - సాహిత్యం -1మధురలయ - త/న/స/భ/న/య/న/న/త/గగ
UUI IIIII - UUI IIIII - UUI IIIII - UUI UU
29 సువః 150797565
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
జ్యాసంత సొగసులకు - తన్మాత్ర కదలికలకు
తత్భావ పిలుపులకు - చిక్కాను రావా
సర్వాంగ సుమధురివి - అన్వేక మధురిమవు
ఆహ్లాద కమలమువి - ప్రేమించ రావా
ప్రత్యేక వలువలను - బంగార భరణమును
తెచ్చాను తమకముతో - క్షమించి రావా
మందార సుమములిట - సంగీత పవన మిట
మేఘాల చినుకులిట - నందాత్మ జారా
మందమ్ము నడక యిట - నందమ్ము కవన మిట -
ఛందమ్ము రవణ మిట - నందాత్మజా రా
మందమ్ము మధురలయ - లందమ్ము స్వర సరిత -
చందమ్ము రవము లిట - నందాత్మజా రా
మందమ్ము పదము లిట - నందమ్ము నటన మిట -
విందైన సొబగు లిట - నందాత్మజా రా
నీ శాంతి మరి వలపు - నీ శాంతి మరి తలపు
నీ శాంతి మరి పిలుపు - శాంతించి రావా
ఈ స్వాస మనదియును - ఈ స్వాస సిరి నెలయు
ఈ స్వాస జల నిధియు - నవ్వాలి రావా
నీ నాట్య మది మధువు - నీ నాట్య మది సుధయు -
నీ నాట్య మది ముదము - నేనున్ నటింతున్
వచ్చాను తమకముతొ - ఇస్తాను మధురిమను
పొందాలి సుఖములను - సంతోష మేగా
--((*))--
నానననలు - (న)6-లల IIIII IIIII - IIIII IIIII
20 కృతి 1048576
రచన : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తొలి వెలుగు కిరణములు - మది తలుపులు తెరుచును
తెలివి తనము పెరిగెను - ఉదయమున నడకలుయు
మనసు సఫలము కలిగి - జలమున మునిగి తడిసి
మనసున మరులు గొలుపు - మనసు చలనము సడలు
కలలవలె దలపులిట - అలలవలె జరుగునట
చినుకువలె మెరియునట - కుసుమముల వలె ఉబుకు
వనమున తరువుల వలె - కలసి మెలసి కలియుట
మెరుపు లవలె మెరియుచు - ముసుగులొ కలవరము
నవ రసములు కనుగొను - నవ విధముల సరియగు
సరసముల సమయమున - రస రుచుల తమకమున
వధువు యదల సరిగమ - వరుని వలపుల కలలు
మురిసి కలసి వలపును - మది తలపుల నిజములె
వనిత వరుసలు కలిపి - వరుని మగసిరికి నలిగి
తనువుల తపన మరిగి - తరచు రుచులను కలిగి
మనువు మమతను తెలిపి - మనసు మనసుయు కలసి
మగువ మరులను గొలిపి - మదనుని యదతొ మునిగి
అలలవలెఁ దలఁపు లిట - నమరగను మది ములిగె
నలలు నను దడిపె నిట - నలసితిని మెయి గలఁగెఁ
జలితమయె మదియు నిట - సఖియు నను గనదు గద
జ్వలనమునఁ గమలితిని - చలనములు సడలెఁగద
ననలు బలు వనలతల - నయముగను విరిసినవి
కొనలు చెలు వలరుచును - గొమరుగను మురిసినవి
కొనిరి యపు డలరులను - కురుల నిడ సువదనలు
వనితలకు ముద మొసఁగు - పదములయెఁగద ననలు
తొలివెలుఁగు కిరణము ల-తులితముగఁ గనఁబడఁగ
మెలమెలగ మహిఁ జెలఁగు - మృదులమగు తెర తొలఁగె
కలకలము లధికమయెఁ - గలరవము విటపములఁ
దెలివెలుఁగు పరవఁగను - దెసల మిస దనరెఁగద
--((*))--
UUUU - లెగో 1
IIIIIU - లెగో 2
UIU UIUU - లెగో 3
ఈ లెగోలతో వృత్తములు -
UUUU - IIIIIU - UIU UIUU
సౌందర్యోపా శమువలననే - కామినీ కాంతలేలే
స్త్రీలోలుండై కుచముఖములే - వర్ణణా తీతమేలే
కాలాతీతం గుణములవలే - స్త్రీప్రెమామృత దివ్వే
ప్రాణాలేలే విరహముగనే - భావ బాంధవ్య మేలే
భావము : స్త్రీలకు అలంకారం ఆయుధం, వారికి సహజ సౌందర్యం ఉంటుంది, మగవారిని ఆకర్షించేందుకు కొత్త కొత్త వేషాలు వేస్తారు స్దన స్సౌష్టవములతో కామిని కాంతలుగా ఉంటారు. స్త్రీల స్థన సౌ ష్టములే అందాలను వర్ణించడటం ఎవ్వరికి సాధ్యము కాదే , కాలాన్ని బట్టి స్త్రీ ల గుణాలు వెలుగులుగా మారుతాయి, ప్రేమను కుమ్మరిస్తారు, విరహవేదనతో బంధమును పెట్టుకొని, ప్రాణాలను అర్పించి స్త్రీలను గౌరవించటమే అందరి ధ్యేయం .
--((*))--
*స్వయం పాకం (ఛందస్సు )
(1) UIU UIU - II - UIU UIU,
పంతమూ ఎందుకే ప్రియ సందడీ చేయకే
భావమే చూపవే ప్రియ రాగమే పల్కవే
ప్రేమయే పంచవే ప్రియ వేగమూ చూపవే
చేతలే వద్దులే ప్రియ చేష్టలూ చాలులే
నందమో గాలిలో మక రాందమౌ పువ్వులో
స్నేహమో ప్రేమతో ఇక భాష్యమో భావమో
అందమా పొద్దులో నర విందుయే రాత్రిలో
విందుగా గానమే మరి పొందుటే సంతసం
మారవా చూడరా మధు పాకమే సొంతమే
కాలమే పిల్చెరా మధు సమ్మతే జుర్రుకో
ప్రేయసీ కూడనా మధు సంగ్రహం చేయనా
మాధవా సూడరా మధు సూధనా కూడ రా
ప్రేమలే పల్కులే విను నాదముల్ విందులే
గానముల్ చిందులే విను భావముల్ పంచునే
రాగముల్ వెల్గులే విను సంతసం పొందుకే
మాధవా రమ్మురా సిరి నాదగున్ నమ్మురా
మంచిగా నవ్వలన్ బుల కించగా పువ్వు లన్
పంచెనే పువ్వులిన్ బుల కించగా తుమ్మెదన్
మంచుగా చల్లగా ఉడి కించగా వేడె క్కే
దించినా స్వర్గమున్ తిల కించగా దృశ్యముల్
--((*))--
సోఁగు - రెండు లఘువుల వంతెనతో స్రగ్విణి -
స్రగ్విణీ వృత్తపు మధ్యలో రెండు లఘువులను ఉంచి కల్పించిన వృత్తము సోఁగు. సోఁగు అంటే సరము అని అర్థము. స్రగ్విణిలోని స్రక్ అంటే కూడ సరము అనియే అర్థము. ఈ వృత్తమును రెండు విధములుగా వ్రాయ వచ్చును. (1) UIU UIU - II - UIU UIU, (2) UIU UIU - IIUI UUIU. రెండింటికి క్రింద నా ఉదాహరణములు -
(2) UIU UIU - IIUI UUIU.
జాలమేలా ప్రియా - చలిలోన వేసారితిన్
చాలు చాలా కథల్ - సరసాలఁ జాలించరా
పూల నెత్తావులన్ - బులకించ వేళయ్యెరా
పాలు చల్లారురా - ఫల మారగించంగ రా
కాలమే నీదిరా - సుమమాల నీ దేనురా
కోపమే వద్దురా - మధుపాత్ర పొందాలిరా
తాపమూ తీర్చరా - మురిపాల ముత్తావురా
లాస్యమూ చేయకూ - సరసాలు చూపాలిరా
తప్త - స/భ/త/త/గ
13 అతిజగతి 2356
IIU UII UUI UUI U -13
కథలే తెల్పుచు సందర్భ సంఘర్షణే
సమరం జీవిత సంగ్రామ భాష్యాలలో
సహనం మార్గముగా భావ ప్రాధాన్యతే
మరులే గొల్పుచు భావాల సాహిత్యమే
మనసే అల్లిన వేదాంగ భావాలు గా
వయసే విప్పిన పుష్పా0గ కోర్కేలు గా
తనువే ఎప్పుడు సాహిత్య సంగీత గా
ప్రేమయే ఇప్పుడు సద్బావ సంతోషగా
వినుటే వింతలు - చూడాలి అర్దాలుగా
మలుపే మాయలు - మందిర భాష్యాలుగా
పరువే ప్రేమల - సంసార సంతోషి గా
మగువే సేవల - శృంగార వేషాలు గా
కలలో కమ్మని -చిత్రాలు చూసేను గా
చలిలో కౌగిలిలో - జక్కగా వెచ్చ గా
కురులే విచ్చెను - కళ్ళల్లొ గమ్మత్తు గా
మరులే కొల్పెను - పంతాలు విద్దూరంగా
కదిలెన్ నా మదిలో - గమ్మగా గీతికల్
మెదిలెన్ నా కలలో - వేగమే రమ్మురా
కరముల్ నీ వలలో - చిక్కెనే మత్తుకే
వెలిగించన్ దివెలన్ - వేగమే రమ్మురా
--((*))--
హృదయమనేది ఉల్లాసముగా ఉంచుకోగలిగితే ప్రీతిగా ఉంది రసాలు ఊరిస్తుంది
విశ్రాంతి ఎక్కువగా ఉండి వేడిసెగలు ఎక్కువగా ఉన్న శరీరము ఆశాపాశములకు చిక్కవలసిందే
స్వయముగా భయాన్ని తొలగించుకొని బ్రాంతిలేకుండుగా వలఁపునందించటమే
ఒకరికొకరై మోక్షము పొందుటకు ఉపచారములు పొందుతో ఆరోగ్యముగా ఉండుటయే ఉల్లసము
విశ్రాంతి ఎక్కువగా ఉండి వేడిసెగలు ఎక్కువగా ఉన్న శరీరము ఆశాపాశములకు చిక్కవలసిందే
స్వయముగా భయాన్ని తొలగించుకొని బ్రాంతిలేకుండుగా వలఁపునందించటమే
ఒకరికొకరై మోక్షము పొందుటకు ఉపచారములు పొందుతో ఆరోగ్యముగా ఉండుటయే ఉల్లసము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి