16, డిసెంబర్ 2016, శుక్రవారం

*శ్రీ శ్రీనివాస (ఛందస్సు - లీల )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

సర్వేజనా సుఖినోభవంతు
ప్రాంజలి ప్రభ 

--((*))--   

*నిజరూప ధర్శించు కుంటూ వేడుకుంటున్నా 

కల కమ నీయ మైనది - కల హిమ బిందు వైనది    
కల మధు తృప్తి నైనది - కల కధల లోక  మైనది 
కల జ్వాలా తోరణ మైనది - కల కామి తార్ధ   మైనది      
కల చిర స్మరణీయమైనది - కల కాదు నీదర్శన మిది

కల కాదు ఇది పవిత్రత - కళ పరోపకార దృక్పధం 
కళ మానవ జన్మ శుకృతం - కళ స్వార్ద రాహిత్యం
కళ మానవ చరితార్థం - కళ చిత్త  శుద్ధికి మార్గం 
కళ సర్వ మానవ సౌభాతృత్వం - కళ స్థిర చిత్తం

ఫలితాన్ని ఆశించక - దృఢ సంకల్పం తో 
స్థిమిత ఆచరణ - మనో దృక్పధం తో 
క్రమ శిక్షణ  గా - మనో వాంఛలతో
అభ్యాస ఆరాధనతో  వేడుకుంటున్నా 

కలలో  నీమాటలు అక్షర  సత్యంగా  భావించా 
కలియుగంలో మాయనుండి ప్రార్ధిస్తూ భరించా
చెడుని తిరస్కరించి మంచి   కోసం జీవించా 
కలకాని నిజరూప ధర్శించు కుంటూ వేడుకుంటున్నా   
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర 
గోవిందా - గోవిందా - గోవిందా      
ఈ తిరుమల తిరుపతి కొండపై 23 -12 -2016  వ్రాసినది 

ఇందు పొందు పరుస్తున్నాను 
ఎందరో మహానుభావులు అందరికి వందనములు, నాకు కలలు వచ్చుట తక్కువ, కానీ  ఈ  కవితా వ్రాసిన తర్వాత నాకు తెల్లవాయారు జామున అనగా 3 .౪౦ (౪-౧-౨౦౧౭) నిముషములకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఉన్న సారాంశ మిది, దీని భావ మేదో  నాకు తెలియదు, తెలిసిన వారు చెప్పగలరు 
నేను  గుడి ప్రాంగణంలో తిరుగు తున్నాను, అది ఎక్కడో తెలియదు, అక్కడ ఓ రేకులు షెడ్డు ఉన్న ది, దానికి తాళాలు వేసి ఉన్నది , అక్కడ ఒక పిల్లవాడు నాన్న నాన్న, అని ఏడుస్తున్నాడు, ఎక్కడ మీ నాన్న అని అడిగాను, అదుగో అన్నాడు,  నేను కూడా తలుపు సందులో నుంచి చూసాను, అంత గాఢాంధకారము ఒక మూలా స్థిరా సనంగా కూర్చొని ఉన్న  ఒక వ్యకి కనిపించాడు , అంతలోనే ఆగదిలోకి ఇసుక రేణువులు కమ్మినాయ్, గుడి అంతా ఇసుక నిండి పోయినది, ఇసుక తప్ప ఏమి కనబడలేదు, ఆ పిల్లవాడు నాన్న నాన్న ఏమైనాడు అని ఏడుస్తున్నాడు, తలుపు తాళం పగలకొట్టాలని ప్రయత్నిమ్చాను కుదరలేదు, ఇక్కడే ఉండు నేను వేరొకరిని పిలుచుకు వస్తా అని వెళ్ళాను అంతే  తిరిగి వచ్చాక పిల్లవాడు లేడు ఇసుక లేదు తలుపు సందులో నుంచి చూస్తే వెలుగు చున్న దివ్య   రూపం కనిపించలేదు. ఆరూపం వర్ణించే శక్తి నాకు లేదు అటువంటి అద్భుత రూపం 
ఇది నిజమైన యదార్ధ కల   
   
No automatic alt text available.


10.*కాపాడే శక్తి నీకే ఉంది శ్రీ వేంకటేశ్వరా
రచన: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అస్త్రము తెలీదు , శస్త్రము తెలీదు 
శాస్త్రము అసలే తెలీదు 
నిమిత్త మాత్రుణ్ణి , నిర్నీత సమయాన్ని 
సద్వినియోగ పరుచుట తప్ప 
నాకు ఏమీ తెలియదు శ్రీ  వేంకటేశ్వరా

బంధ, అనుభంద, ఆత్మీయతను  
ఆశ్రయ, అనురాగ, ఆత్మ విస్వాసమును
అనంత కోటి సాహిత్య సంపదతో 
నీ దివ్య రూపమునకు అభిషేకముతో   
ఆత్మార్పణము చేస్తున్నాను 
సువాసనా వెలుగును అందించే 
హారతి కర్పూరము లాగా కరగి 
పోవాలని ఉన్నది శ్రీ వేంకటేశ్వరా 

వర్ణ, సువర్ణ, వదలి, అపర్ణ లాగా 
ఆది మధ్యాంత రహితుడవైనా 
అనంతకోటి బ్రహ్మాన్డ నాయకుడవైనా
శ్రీ దేవి, భూదేవి సమేతుడవైనా
నిత్యకళ్యాణ దురంధరుడువైన
కలియుగ కల్పతరువైనా నిన్ను 
అజాత శత్రువని భావించి, 
ప్రేమతో ప్రార్ధించటం తప్ప
ఏమీ తెలియని ఆరాధకుణ్ణి శ్రీ వేంకటేశ్వరా

కరుణించి, నా మనస్సుని 
ఏకాగ్రతలో ఉంచి, నిత్యమూ  నీ సేవ 
దేశ సేవ, చేయుటకు అనుమతి 
కోరుతున్నా శ్రీ వేంకటేశ్వరా 

అమ్మ అలివేలు మంగమ్మను కూడా
హృదయ పూర్వకముగా ఆరాధిస్తున్నా
ఆశీర్వాదములతో, మా నడకను   
మార్చి కాపాడే శక్తి నీకే ఉంది శ్రీ వేంకటేశ్వరా

గొండా గోవిందా - గోవిందా గోవిడా - గోవిందా గోవిందా     
--((*))--

ప్రాంజలి ప్రభ 
రచన మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శ్రీ వేంకటేశ్వరా ఏమి ఆ చిద్విలాసం
నారదా నీవు లోకసంచారివి
అందరూ కుశలమేనా
అందరూ కుశలమే
నా సతులు కుశలమే
ఏమని చెప్పేది ని సతుల గురించి
ఏమైంది నారదా
ముదావహమ్ము నీదు పూజ ముక్తినిచ్చు త్రోవగా 
హృదంతరాళమందు నెంచి హేమమంచు కొల్చి నీ 
పదమ్ములందు కాంక్షలుంచి భావమందు భక్తి తో 
సదా నినున్ తలంతు నయ్య స్వామి వేంకటేశ్వరా!


  --((*))--
7.*నమో నమో శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరా -7

గెలుపు ఓటములు అనుభవించాను 
నీ కరుణ కోసం గుండె బిగపట్టి ఉన్నాను 
శ్రవించే గాయాన్ని లెక్క చేయ కున్నాను 
కాలమానాన్ని తట్టుకొని ప్రార్థిస్తున్నా శ్రీ వేంకటేశ్వరా

సంఘర్షణను తట్టుకొని సానుభూతి చూపాను
మనసు గాయాన్ని మౌనంతో సరి చేస్తున్నాను 
నిర్లక్షపు మనసును మార్చుటకు ప్రయత్నిస్తాను
నాకు మంచి గుణాలు కలిగించు శ్రీ వేంకటేశ్వరా 

మౌన నివేదనతో ప్రార్ధించి అర్ధించు తున్నాను 
రేపటి ఆశల రెక్కలను తొలగించ మంటున్నాను 
అశ్రువులతో ఆరాధించుతూ వేడు కుంటున్నాను 
క్షణ భంగురమైన జీవితాన్ని నీకే అర్పిస్తున్నాను 
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరా 

గోవిందా గోవిందా - గోవిందా గోవిందా - గోవిందా గోవిందా   

--((*))--


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి