ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
సర్వేజనా సుఖినోభవంతు
*ఛందస్సు ఏకప్రాస వచనాలు
యమునమ్మ కెరటాలనెల రాజునవ్వె
వినయమ్ము మనసార మను రాజు నువ్వె
వచనమ్ము నవజాత కల రాజు నువ్వె
సమయమ్ము వినియోగ రసారాజు నువ్వె
ఈడు కుదిరాక... నిన్నే చూస్తూ నిలవలేక
జోడు కలిసాక ... నిన్నే పిలుస్తూ గడపాలేక
మాడు పగిలాక ... నిన్నే అరుస్తూ ఉండలేక
తోడు వదిలాక ... నిన్నే తలుస్తూ బ్రతకలేక
కొలమానం లేని ఉపమానాల్ని భరించా
అవమానం చెంది మనువాడిందాన్ని భరించా
శతమానం తిట్లు తిన్న వాడ్ని భరించా
తులామానం లా ఉండలేక ఓర్పు వహించా
నిర్లక్షపు మనుష్యులు నిశ్శబ్దం లోఉన్న
వివక్షత చూపే మనుషులు ఎగిరిపడుతున్న
అక్షరత పొందిన మనుష్యులు మాట్లాడుకున్న
దీక్షతో ధర్మ రక్షణ కోసం నేను వేచి ఉన్న
అంతరంగపు మాటలు అని వార్యమైనా
తరంగపు మాటలు నిలబడ లేకపొయినా
భహిరంగపు చేష్టలు భరించ లేకపోయినా
తురంగము వలే సేవలు అందిస్తూ ఉంటా
ఎప్పుడో నిను కల్సి నా నవ రూపమే నని పించెనే
ఇప్పుడే నిను తల్చినా యువ రూపమే కని పించెనే
చప్పుడే విని వచ్చినా మన మేకమే అని పించెనే
ఎందుకో నిను జూచినా మన మీయగా నని పించెనే
ఎందుకో విన గీతికన్ బ్రణయేశ్వరీ మనమెంచెనే
ఎందుకో ప్రణయమ్ములోఁ జిన నృత్యమున్ మనసాడెనే
సుందరీ నును వెల్గుగాఁ గను సొంపుగా నను గాంచ రా
వీణతోఁ గలరావముల్ దలపించుచున్ బలికించవా
వాణిగా లలితమ్ముగాఁ దెలి భావముల్ జిలికించవా
వేణువై వలయమ్ములో వలపించఁగా గులికించవా
ప్రాణమై యిలపై సదా తొలి శ్వాసగా నలరించవా
ప్రేమయై ఇలలో సదా తను వంతయూ జవిజూపవా
మధురలయ - త/న/స/భ/న/య/న/న/త/గగ
UUI IIIII - UUI IIIII - UUI IIIII - UUI UU
29 సువః 150797565
శ్వాసిచ్చు పవనములు - మాయల్లొ కనబడవును -
కన్నూలె తెరుచుకొను - సూర్యూడు వల్లే
శబ్దాల గ్రహణములు - గ్రహించు చెవులు విను
వచ్చేను దశదిశలు - శబ్దాలు వచ్చే
*నవ వధువు నవ వరుడు
చిరు నగవు మది మలుపు - తొలి వలపు మది తలపు
కల తెలుపు కలి మనసు - చక నడుపు మది తడువు
సుఖ పిలుపు వల బిగువు - వడి కుదుపు మడి ముడుపు
చలి వనకు బిగి కలుపు - నవ వధువు నవ వరుడు
అలలవలె తలపులిట - కలలవలె వలపులట
మమత తలపుల నటన - మది పరుగుల కలయిక
తొలి వరద ఉరుకులట - కెరటముల వలె కలబడు
సరి సమయము ఫలితము - నవ వధువు నవ వరుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి