ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
సర్వే జనా సుఖినోభవంతు
అది ఒక స్టూడియో అక్కడ అనేక సినిమాలు, టివి ఫిలిములు తీసున్నారు, అక్కడ ఒక బోర్డు చూసాడు నిర్మాత శుభంకర్ " ఇక్కడ డబ్బు ఉంటే చాలు రీళ్లతో వెళ్ళగలరు అన్నీ సదుపాయాలు ఉన్నాయి " అని ఉన్నది
అక్కడ ఒక నిర్మాత సినిమాగా తీద్దామని అన్నీ ఏర్పాట్లు చేసుకొని ప్రారంభించాడు.
షాట్ రెడీ అనగానే లొకేషన్ హడావిడి మొదలైనది, మొదటి సీను దేవుని పఠాలను చిత్రీకరించాలి, పటాల వెనుక రకరకాల బ్యాటరీ వెలుగులతో, ఫోటోలకు ఇరువైపులా టేబుల్ ఫాన్లు,పూల దండలు ఏర్పాటు చేశారు, కొబ్బరికాయ కొట్టంగానే ఫాన్ గాలికి పూలు రాలి పడటం, వెనుక లైట్లు ఒక్కసారి వెలిగి గది అంతా కాంతి ఏర్పడటం, అన్నీ ఏర్పాట్లు చేసారు దర్శకుడు.
కొబ్బరికాయ కొట్టారు, పెద్ద శబ్దం వచ్చింది, ఏమిటా అని నిర్మాత వెనక్కి తిరిగి చూసాడు, కొబ్బారి పెంకు వెళ్లి కెమారా పట్టుకున్నవానికి తగిలి చేతిలో ఉన్న కెమారా క్రింద పడింది, షాట్ ఒకే మాత్రం కాలా. అపశృతి అయినా చేసేది లేక, కెమెరా మెన్ హాస్పటల్లో చేర్చటం జరిగి పోయింది.
తర్వాత మంచిరోజు చూసి సినిమా ప్రారంభ పూజ ముగించారు.
మొదటి షాట్ హీరో తో ప్రారంభించు దామని తలంచారు అసిస్టెంట్ డైరక్టర్లు ఒక డైలాగ్ చెప్పఁమని ఇచ్చారు, అది ఇలా ఉన్నది "
ఎవరైనా ఆదెయ్యాన్నీ ఎదుర్కోలేరు, నేను ఎదుర్కొన్నాను, నా మీదకు నిప్పుల వర్షం కురిపించింది, నేను భయపడలేదు, నేను మీముందు ఉన్నానంటే నాలొ ఉన్న ఆ హనుమంతుని భక్తి, మీరందరూ నాకు ఇచ్చిన ధైర్య సాహసాలు తెలుసా, కొందరైతే భయ పడి
మూర్చ పొయ్యారు తెలుసా . "
డైరక్టర్ షాట్ ఒకే చెప్పే లోపో దెయ్యం దెయ్యం అని అరిచారు, హీరోగారు వణికి పోయాయారు.
ఈ డైలాగ్ చెప్పటం దేవుడెరుగు అక్కడే ఉన్న గడ్డిలో సిగరెట్టు పడిమంటలు లేచాయి, కరంటు వైరు తగల బడింది, ఒక్కసారి ట్రాన్సఫారం పేలిన శబ్దం మ్రోగింది, అక్కడే ఉన్నవారు దెయ్యం వచ్చింది, మనషుటింగ్ నాశనం చేసింది అని ఎవరో అరిచారు, అక్కడున్నవారు ఎటు వీలు ఉంటె అటు పరిగెత్తారు, నిర్మాత మాత్రం నా బ్యాగ్ దెయ్యం ఎత్తుకెళ్లింది ఇప్పుడు నేను ఎలా సినిమా తీయాలి, అంటూ తలమీద గుడ్డ వేసుకొని కూర్చున్నాడు.
అందరూ చూసారు, భయంగా పరిగెత్తడం మంటలు ఆర్పటం అమోఘం గా వచ్చింది. చివరకు నిర్మాత తలమీద గుడ్డ కప్పుకోవటం తీసాడు, అప్పుడే నిర్మాత బ్యాగ్ ఎత్తు కెళ్లు చున్న ఒక వర్కర్ ను పోలీసులు పట్టుకురావటం నాలుగు కొట్టడం వేగంగా జరిగింది, అది కూడా షూటింగ్చేసాడు కెమారా మెన్ అనుకోని విధముగా షూటింగ్ విజయం కావాటం దర్శకుడు మెచ్చుకున్నాడు.
నిర్మాత అనుకుంటున్నాడు అరే నాసర్వీసులో ఎందర్నో చూసినా, డైరక్టర్ ద్వారా ఎంతో ఖర్చు చేసి సినిమాలు తీసాను. కానీ ఈ డైరక్టర్ ఏంచేస్తాడో చెప్పాడు,చేస్తున్నదేదో చెప్పాడు, నామీద భారం పెట్టు, నీకు విజయం తధ్యం అన్నమాటలే గుర్తు చేస్తుంటాడు.
మొత్తం మీద అందరికీ "లంచి" ఏర్పాట్లు ఘనంగా చేసాడు నిర్మాత.
ఎం డైరక్టర్ నెక్స్ట్ ఎం షాట్ తీద్దామనుకున్నారు , ఒకపాట తీద్దామనుకున్నాను, పాటల రచయితకు విరోచనాలుట రేపటికి రెడీ చేస్తానన్నాడు, మరి ఇప్పుడు ఎం చేద్దా మనుకున్నారు.
వర్ధ మాన రచయతలు కొందరొచ్చారు వారివారి చేత వ్రాయించి షూటింగ్ చేద్దాం అన్నాడు.
ఏమో డైరకర్ నన్ను ముంచేట్లున్నావు, అసలు ఇప్పటిదాకా మిమ్ము ఖర్చు పెట్టించింది ఒక్క కెమారా రీల్ కే కదా, మరి భోజనాలు దికూడా సినిమా షూటింగ్ సార్ . సరే యిప్పుడు ఎవర్ని పిలుస్తావ్, ఒక పాట పాడుతూ యాక్ట్ చేసే కుఱ్ఱవాడ్ని పిలుస్తా సరే పిలువు దర్శకుడు నీవు ఆకలి రాజ్యం చూసావా, ఆ చూసాను, ఎన్నిసార్లు ఎన్నోసార్లు చూసాను సార్, ఆసినిమాలో ఒక
హిట్, సాంగ్ ఉంది, దాన్ని సినిమా ఫక్కీలో మార్చి పాడాలి, కొద్దిగా యాక్ట్ చేస్తూ పాడాలి ,
నీకుతోడు నిరుద్యోగులుగా మా జూనియర్ యాక్టర్సు చేస్తారు నీకు ఇష్టమైతే. కొద్దిగా మేకప్ చేసుకొని వాళ్ళిచ్చే డ్రస్సు వేసుకో ఇప్పుడెందుకు సార్ షూటింగ్ అప్పుడుకదా ఇదే షూటింగ్
అనుకో నాచుల్ గా ఉండాలి కదా, అట్లాగే మీరన్నారుగా మార్చి పాడుతా మీ సినిమాలో నన్ను పాటాలు పాడించాలి, ముందు నీవు పాడవయ్యా తర్వాత చూద్దాం. నాది ఒక షరతు నేను పాడే డప్పుడు, యాక్షన్ అని మీరు చెప్పాలి.
ఓసి ఇంతేగా నేను చెపుతాలే , యాక్షన్ అన్నాడు
అంతే వర్ధమానుడు స్టూడియో అంతా చూసి పాటను నటిస్తూ అందరికీ చూపించారు, అందరూ ఒక్కటే చప్పట్లుకొట్టారు, ఇదిగో ఈ పైకము తీసుకో, మరలా పిలుస్తాను,
డిన్నర్ చేసుకొని మరీ వెళ్ళు అన్నాడు.
నిర్మాత రైటర్ కు ఫోన్ చేద్దామా మరి ఈ రోజు షూటింగ్ లేనట్టేగా అని అన్నాడు.
మీకంతా తొందరా ఇప్పుడే పాటకూడా షూటింగ్ అయిపొయిన్ది చూస్తారా, మినీ థియటర్ కు పోదాం పదండి, ఎం డైరక్టరయ్యా ఎం తీస్తున్నావో ఏమీ తెలియటంలేదు, నీవు నన్ను ముంచెట్లున్నావు అదేనయ్యా ఇప్పుడు షూటింగ్ పాటకూడా అదే, నన్ను ముంచేశావన్న మాట, నవ్వుతూ కదిలాడు డైరక్టర్
ఒక నిర్మాత సినిమా ప్లాప్ అని విన్నాడు, అతని బ్రదర్ సంతోషం తో పాడాడు వినండి, సినిమా తీయటం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు, అయినా తీసి పార్కులోకి వచ్చి కూర్చున్నాడు చూడండి పాట చూపించాడు.
సినిమా ఎటూ ఆడదు - పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధివీధి సినిమాలే బ్రదర్
అన్నగారి పాలనలో సినిమాలు ఆడటం కష్టం బ్రదర్
మన తల్లి సినిమా తల్లి - మన అన్న డైరక్టర్
మాన సినమా ఆడ లేదురా - తమ్ముడూ
మనకు దక్కింది గుండు సున్నా డబ్బు బ్రదర్
సినిమా రీలు తెచ్చు కొని -సినిమా హాలు కోసం
రాజధాని చేరి దేహి దేహి అని అన్నా చూసే వారుండరు
కానీ దేశాన్ని పాలించేది సినిమా ప్రభావమే బ్రదర్
పూటకో కధ టివి సీరియల్ - ఉరూరా మూతబడిన హాల్స్
సినిమా గూర్చి ఎలుగెత్తి చాటుదామురా - సొమ్ము ఖర్చు చెయ్యొద్దురా
ఈ సినిమా రంగంలో పుట్టడం మన తప్పా
మీడియాను నమ్మటం అంతకన్నా పెద్ద తప్పా
ఆశపడే నిర్మాతలది తప్పు - దేవుడ్ని తిడితే మరీ తప్పు
సినిమా ఎటూ ఆడదు - పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి సినిమాలే బ్రదర్
డైరక్టర్ గారు పాట బాగున్నది, ఇదే సినిమాలో పెట్టేద్దాం, ఓ అట్లాగే రేపు రండి షూటింగ్ విషయాలు రేపు చెపుతా నిర్మాతగారు అంటూ ఒకరోజు షూటింగ్ విషయం తెలిపాడు డైరక్టర్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి