15, డిసెంబర్ 2016, గురువారం

సాహిత్య ప్రక్రియ

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


సర్వేజనా సుఖినోభవంతు 


మన జన్మ సంగ్రహ సంఘ్ర్షణ దైవ విధానముల్
యుగ ధర్మ సంతృప్తి జీవన వేద విధానముల్
యువ శక్తి సద్భావ భోధన సత్య విదానముల్
ప్రతి నిత్య దాంపత్య సంతోష ప్రేమ విధానముల్    
   
 భావము : దేవుని ప్రేమ మనపై ఎలాఉంటుందో ఎవరు చెప్పలేరు, పుట్టుక అనేది ఘర్షణల వళ్ళ వచ్చే సంగ్రహ విధానములు,  వేదములలో ఉన్న మహాత్య ప్రభావము వళ్ళ, ధర్మాలను అను సరించి సాగు జీవన విధానములు, యువశక్తి ద్వారా అధునాతన విధానములు, అంతర్జాల విధానములు సద్భావముతో చేసే పనులు,  ప్రతిఒక్కరు సుఖ శాంతులతో ఉండుట యే ఒకరికొకరు అర్ధం చేసుకొని బ్రతకట యే ప్రేమ విధానములు.        

 
దేశ సౌభాగ్య ప్రవీణ సేవ హితమతుల్

ప్రేమ ఔదార్య గుణాన్ని అర్ధ హితమతుల్
 

ధర్మ ప్రబోధ భాగ్యము నాకు హితమతుల్
 

నాద బ్రహ్మాండ సాహిత్య బోధ హితమతుల్

 భావము : దేశము కొరకు మేధావు లందరు హితవచనములు తెలిపి ప్రపంచములో మనదేశ గుర్తింపు కోసం నీవంతు సేవచేస్తూ తెలపాలి హిత వచనాలు, ధనం కోసం ప్రేమ ఔదార్యం, మంచి గుణం ఎప్పటికి వదలొద్దు, నీవీవు చెప్పే హిమవచనాలే ధనంతో సమానము కావాలి, ధర్మాన్ని రక్షించుట నాకు భాగ్యమ్ము అని తలచాలి, బాంద్రా పురాణాల సాహిత్యమును అర్ధమే మనకు మనసు ప్రశాంత్ పరిచే హిత వచనాలు


 ప్రేమ భావాల ప్రతీక ధర్మ ప్రభోధమ్ములన్ 

దేశ కాలాన్ని ప్రబోధ మార్గ మనోనేత్రముల్
 
వేళ గ్రహించి ప్రచండ కల్ప మనోశాంతముల్
 
సత్య ధర్మాన్ని పకృతి నిలిపే మనోభావముల్
 
 భావన :

ధర్మాన్ని నిలబెట్టుటకు, ప్రతి వక్కరి మనస్సులో ప్రేమను నింపేందుకు, మంచి మార్గాన్ని చూపే ప్రబోధాలను గ్రహించి జీవితము గడపాలని,  మనస్సులో ఉన్న మంచి మార్గాన్ని నలుగురికి చూపి దేశాన్ని కాపాడుటకు మనో నేత్రములతో సహకరించాలని, ఏంతో కష్టము  వచ్చిన, ప్రళయము వచ్చిన, భయముతో వణుకుతున్న ప్రాంతాన్ని ఆదుకొని భయమును తొలగించి మనస్సుతో శాంతిని కల్పించాలని, ప్రకృతి అనుకరించి సత్యము, ధర్మము గ్రహించి మనుష్యుల మనోభావాల ననుసరించి జీవితము సాగించాలి.       
 

   సాహిత్య తల్లికి కావ్య మందించే దివ్య సౌఖ్యానుభూతి

స్థన్యము బిడ్డకు తల్లి అందించే పొందు సౌఖ్యానుభూతి

భావాన్ని రాగము భాష అందించే క్షేత్ర   సౌఖ్యానుభూతి

శృంగార సారము ప్రేమ అందించే పెళ్లి సౌఖ్యానుభూతి

 భావన :

అమ్మలు గన్న అమ్మ ను మనం నేర్చుకున్న విద్యతో తృప్తి పరిస్తే దివ్య సుఖాలు మనవెంటే ఉండు నని అనుభూతి కలుగు, తల్లి పాలు త్రాగి తల్లిని ఆదరించి, తల్లిని జీవితాంతము కాపాడుతూ ఉంటే సుఖానుభూతి కలుగు, మనసులోని మాటను, మంచి మాటలతో దేశసేవకు
సహకరించు తూ ఉంటే మనసుకు ప్రశాంతి సుఖ శాంతి కలుగు,  ఆకర్షణలతో ఇద్దరు ఒక్కటవుతూ ముగ్గురుగా మారుటకు పెళ్లి అనే ప్రేమ మార్గాన్ని పండించుకొని తృప్తిగా జీవితము సాగుతుంటే కలుగు సంతృప్తే సౌఖ్యానుభూతి.            

--((*))--

ఎక్కిళ్ళు తృప్తి ఆకలి ప్రాణం

చెక్కిళ్ళు తృప్తి ప్రేమకు ప్రాణం

వేవిళ్లు తృప్తి తల్లికి ప్రాణం

పాలిళ్లు తృప్తి బిడ్డకు ప్రాణం

భావం :

అతిగా తిన్న జీర్ణము కాదు ఎక్కిళ్ళతో తృప్తిని తెలియపరిచే ప్రాణం, బుగ్గల నునుపు పురుషుల కళ్ళ చూపులకే పొంగి పిలుస్తున్నట్లు తృప్తి ప్రేమకు ప్రాణం, మాతృశ్రీ గా మారి మాత్త్రుదేవతగా ఒక బిడ్డ కు తల్లిగా మారుతూ వచ్చే వేవిళ్లు తృప్తి తల్లికి ప్రాణం, స్థనములు బరువెక్కి క్షిరధారలు బిడ్డకు పట్టి,  తల్లి బిడ్డల సుఖమే ప్రాణం      

--((*))--

స్థిర సంకల్ప వీశాల భావ భరితల్

దివ్య  భావాలు అనేక బింబ భరితల్ 

సవ్య స్వాభావ సరాగా భాను భరితల్

మంజు బాషామణి మూర్తి సేవ భరితల్

  భావము :

 సంకల్పం విశాల మైనది, స్థిరముగా ఆలోచనను, ఉంచి తే మనసు ప్రశాంత,వెలుగును పంచె భావాలను ఉంచు కోక పోతే, బింబాలుగా మనసును వెంబడిస్తాయి, మంచి
స్వభావంతో మంచిగా పల్కరించితే సూర్యుడిలా వెలుగును పంచుతూ మనస్సు  ప్రశాంతముగా ఉంటుంది.  మంచి మాట నోటి వెంట వచ్చే విధముగా ఆ దేవదేవుని కి సేవలు అందించాలనిమనస్సుతో  కోరు తున్నాను 

--((*))-- 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి