21, జనవరి 2017, శనివారం

Internet Telugu Magazine for the month of 1/2017/52


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

తత్వ బోధ   

ఏకాత్మ తత్వము ఇది అని తేల్చి
దేహాత్మ తత్వము మనిషికి చేర్చి


ప్రేమాత్మ తత్వము ఇదిఅని పోల్చి 
బ్రహ్మాత్మ తత్వము మనసులొ కూర్చి

ఎప్పుడు ఇప్పుడా అంటూ అనకు
తప్పుడు గొప్పలూ అంటూ అనకు
చెప్పుడు మాటలూ వింటూ అనకు 
చప్పుడు కోపమూ తెచ్చు అనకు   

చెప్పక చెప్పి తెలియ చేసిన 
ఒప్పక ఒప్పి  తెలియ పర్చిన
తప్పక నొప్పి మనసు తెల్పిన
గొప్పలు గొప్ప అతిగా తెల్పిన   

చిత్రము కాధార వస్త్రము ధరించు వాడు 
పత్రము ఆధార శాస్త్రము భోదించు వాడు 
ఛత్రము నాధార ఎండను తగ్గించు వాడు
సత్రము ప్రదాత నీడను కల్పించు వాడు      

తన్ను  తానూ మరవక నిల్చి 
కన్ను చూపు  ఎరుగక చూసి 
పన్ను భాద    కలగక చేసి 
మన్ను నమ్మి  బతుకుగ మారి       

మధు పానుని ఆడు పల్కు ఆలోచించు 
చేదు పల్కులు చెడు వాణ్ణి ఆలోచించు 
జాదు వేషము జూద గాడ్ని ఆలోచించు
కాదు ఔనౌను  అనే వాడ్ని  ఆలోచించు     
--((*))--

*ప్రాంజలి ప్రభ . తత్వ బోధ 



కూరుచున్నచోట కుంపటెట్ట వలదు 

నేర్చుకున్న విద్య దాచి పెట్ట వలదు 

దాహమన్న వాడి భాద పెట్ట వలదు 

పేరువచ్చి బీద వాడ్ని తిట్ట వలదు 

కొసరి తిట్ట రాదు కూడు బెట్టి 
విసిరి కొట్ట రాదు మంచి చెప్పి 
కసిరి పెట్ట రాదు తిండి వద్ద 
పసిడి ఆశ వద్దు  నమ్మ వద్దు  
  
బ్రతికి చెడిన వాణ్ణి బయల కీడ్చవలదు 
ఆశకు చిక్కిన వాణ్ణి వదలి ఉండవలదు
ఒప్పులు చేసిన వాణ్ణి మరచి ఉండవలదు   
దానము చేసిన వాణ్ణి మరచి ఉండవలదు 

నిజము చెప్ప వలదు నీచు లకును
మనసు పంచ వలదు నీచు లకును
బోధలు చేయ వలదు నీచు లకును
కాలము ఏమి చేయదు నీచు లకును  
 --((*))--


  *తత్వ బోధ -3



సమయము నిలువదు సహజము

నయనము తడియగు సహజము

పయనము వదలదు సహజము

కలయిక మరువదు సహజము

అమరము జననము కనుమిది
తమకము తనువుది కనుమిది
సమరము మగనిది కనుమిది
వినయము మగవది కనుమిది

మమతలు నిలువవు వినుమిది
కలతలు తొలగును వినుమిది
పలుకులు వెఱియును వినుమిది
తలపులు మరువవు వినుమిది

మధులిక కలకథ వలదిక
లతవల చిలకల వలదిక
తనువుల తపనలు వలదిక
తమకపు తికమక వలదిక
--((*))--



తత్వ బోధ -4



తలకెక్కిన పొగరు ముదిరి  

కల చూపిన వగరు ముదిరి 

అల పొంగిన వరుస ముదిరి 

గిల గిలక మనసు చెది రె  

తలబిరుసుగమారుచుండెధరణీ తలమున్. 
కల బరువులు మారుచుండె తరుణీ మదిలోన్
అల మెరుపులు మారుచుండె కడలి తరుణమునన్
గిల గిల చెడు వాని స్నేహము మనసు చెడున్    
  
వలపించెడితరుణీమణి 
కల పంచెడి వనితామణి
అలలు చూపెడి చింతామణి 
గిల గిల నవ్వించె మహిళామణి 

 విలపింపగజేయుచుండె విన్యాసమునన్.
కల నిజము జేయుచుండె సన్యాసమునన్  
అల తలపులు మనసులో చేరి వేదింపులన్
గిల చేరి మంచి వాడి స్నేహమ్ము  చెఱచున్ 
   
 --((*))-- 



తత్వ బోధ -5



పల్లె సీమ లందు పాడి  పంటలు ముద్దు 

మన్నె సీమ యందు జంతు జీవాలు పద్దు 

కన్నె సీమ యందు ప్రేమ భావాల హద్దు   

వన్నె సీమలో పుత్తడి ఆశల వలయాలొద్దు    

రైతు కంటే గొప్ప రౌతు లేడు
ప్రేమ కంటే గొప్ప తీపి లేదు
మాట కంటే గొప్ప కీర్తి లేదు 
వేట కంటే గొప్ప తప్పు లేదు  
  
తిండి గింజ కరువు మొండిజబ్బులమయం 
కంటి నిండ నిద్దుర  లేక  జబ్బులమయం  
వంటి నిండ బట్టలు లేక డబ్బుల  మయం 
పంటి మధ్య తిండి మరచి మందుల మయం 
  
నగర వాస మిచట పరమ చేదు
పొగరు నేత తల బిరుసు చేదు  
తగని మాట మరి మరీ చేదు 
స్త్రీల తగువు తీర్చుట మరీ చేదు 
 --((*))--
  


తత్వ బోధ -6



సరసపు మాటలు పలికిన

విరసపు చూపులు చిలికిన 

మధురిమ నడక నడచిన 

మనసు మారాక బ్రతకాలి 

విరసము గాచు చుండు వెటకారముగా
సరసము చూచు చుండు మమకారముగా  
మధుర మాయలో పడు చుండు వయ్యారంగా 
మనసు అర్ధం చేసు కోకపోతే చేదు పయనమేగా 
    
పరి పరి భాషించుట తగదు 
పరి పరి ధూషించుట తగదు 
పరి పరి ద్వేషించుటా తగదు
పరీ పరి ప్రేమించుటా తగదు 
  
మాటలు పెరిగిన మనకు పరపతి పోవున్   
చేతలు మారిన కుటుంబ గతులే మారున్ 
నేతలు  మారిన మది తలపులు మారున్ 
వెతలు పెరిగిన మనుష్యుల తీరే మారున్ 

--((*))-- 



తత్వ బోధ -7



మనిషి కన్నా మబ్బును నమ్ముట మిన్న

మమత కన్నా మట్టిని నమ్ముట మిన్న 

పదురు మాటకన్న పడతి మాట మిన్న 

పగలు పని కన్నా రేయి సుఖము మిన్న      

పశువును నమ్మి మేత పెట్టు పాడి పెరుగు
వనితను నమ్మి సుఖపెట్టు మనసు కరుగు 
పరువును నమ్మి మోసపోకు మనసు కలుగు  
తనువును నమ్మి ఆశపడకు రోగము కలుగు 

కుక్క కింత పెట్టు విస్వాసము చూపు చుండు 
నక్క కింత పెట్టు అతి తెలివి నేర్పు చుండు 
అక్క కంతా మంచి చేయి ఆధారముగా ఉండు      
పక్క చేరి సుఖ పెట్టు కాపురంలో సుఖముండు    

మనిషి నేడు గొప్ప మాయలు నేర్చిన వాడు     
మని షి కొరకు మనసునే అమ్ము చున్న వాడు
పర షి కొరకు పాకులాడి పతనం పొందే వాడు  
విధి షి మణిలా మారి బ్రతుకు పండించు వాడు   
     
--((*))--



తత్వ భోద -8  



కను రెప్పల శశి వదనం 

చీకటి వెన్నల సమరం 

నగ్న పాదాలతో పయనం 

తారల మధ్య కలాపం 

నిద్రకాని నిద్రలో ఉండి 
సంచార నిర్వేదంతో ఉండి
మేఘాల మధ్య నలుగుతూ ఉండి 
తరాల మధ్య ఏకత్వముగా ఉండే 

అనునాద శబ్దాలు భరిస్తూ 
ఆకాశ నౌకాయానము చేస్తూ 
క్రియా విశేషాలను సేకరిస్తూ
కార్య సమర్థుడుగా సంచరించే   

నిద్రలో చల్లటి ఉపశమనం ఇస్తూ 
సృష్టికి నాంది పలికిస్తూ 
వేకువనే గౌరవాన్ని కోల్పోతూ  
తలవంచి నేస్తాన్ని ఆహ్వానించే 

వాద ప్రతి వాదనలు లేక
పంతాలు పట్టింపులులేక
సూర్య చంద్రులు కలసి
సమయాను బట్టి సర్దుకొనే 

అట్లే ఒకరికొకరు తోడుగా ఉండి 
ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ     
జీవిత సాఫల్యమే కుటుంబము 
అదే సూర్య చంద్రుల ఆంతరార్ధం 
--((-))--     

 తత్వ భోద -9 

మనసు అంటే కాస్త ప్రేమ 
మరికాస్త ఆశయాల ప్రేమ 
ఆశల జోలికి పోనీ ప్రేమ 
ఆత్మీయ అనురాగ ప్రేమ 

గుట్టుగా కడుపునా దాచుకొని 
మగువ మనసుని తెలుసుకొని 
గట్టున చేర్చి చెలిమి నందుకొని 
పున్నమి రాత్త్రులు వెన్నెలందుకొనే 

మొన్నటిలా నిన్న లేదు కాని
నిన్నటిలా నేడు లేదు  కాని
రేపటి రూపం తెలియదు కాని
ఎల్లుండి రూపం గూర్చి ఆలోచిస్తామే 

మేఘాన్ని ప్రార్ధించి వర్షందింపుకొని     
నిరంతర ప్రవాహంలా దారిచేసుకొని
కడలిలో చేరినట్లు మమత అందుకొని 
ఆనంద తరంగాల మధ్య నలిగి పోయే 
 --((*))--

తత్వ భోద -8  

కను రెప్పల శశి వదనం
చీకటి వెన్నల సమరం
నగ్న పాదాలతో పయనం
తారల మధ్య కలాపం

నిద్రకాని నిద్రలో ఉండి
సంచార నిర్వేదంతో ఉండి
మేఘాల మధ్య నలుగుతూ ఉండి
తరాల మధ్య ఏకత్వముగా ఉండే

అనునాద శబ్దాలు భరిస్తూ
ఆకాశ నౌకాయానము చేస్తూ
క్రియా విశేషాలను సేకరిస్తూ
కార్య సమర్థుడుగా సంచరించే  

నిద్రలో చల్లటి ఉపశమనం ఇస్తూ
సృష్టికి నాంది పలికిస్తూ
వేకువనే గౌరవాన్ని కోల్పోతూ 
తలవంచి నేస్తాన్ని ఆహ్వానించే

వాద ప్రతి వాదనలు లేక
పంతాలు పట్టింపులులేక
సూర్య చంద్రులు కలసి
సమయాను బట్టి సర్దుకొనే

అట్లే ఒకరికొకరు తోడుగా ఉండి
ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ    
జీవిత సాఫల్యమే కుటుంబము
అదే సూర్య చంద్రుల ఆంతరార్ధం
--((-))--    

 తత్వ భోద -9

మనసు అంటే కాస్త ప్రేమ
మరికాస్త ఆశయాల ప్రేమ
ఆశల జోలికి పోనీ ప్రేమ
ఆత్మీయ అనురాగ ప్రేమ

గుట్టుగా కడుపునా దాచుకొని
మగువ మనసుని తెలుసుకొని
గట్టున చేర్చి చెలిమి నందుకొని
పున్నమి రాత్త్రులు వెన్నెలందుకొనే

మొన్నటిలా నిన్న లేదు కాని
నిన్నటిలా నేడు లేదు  కాని
రేపటి రూపం తెలియదు కాని
ఎల్లుండి రూపం గూర్చి ఆలోచిస్తామే

మేఘాన్ని ప్రార్ధించి వర్షందింపుకొని    
నిరంతర ప్రవాహంలా దారిచేసుకొని
కడలిలో చేరినట్లు మమత అందుకొని
ఆనంద తరంగాల మధ్య నలిగి పోయే
 --((*))--
  

 తత్వ బోధ -10

జరిగిన దెల్లయు మంచిది
విరిగిన దెల్లయు చెడ్డది
తరిగిన దెల్లఁయు తగ్గును
పెరిగిన దెల్లయు విరుగు

మంచి దెపుడు చెడ్డది కాదు
తుంచి చూసిన వాసన పోదు
వంచి  కోసిన  వాసన మారదు
సంచి ఉప్పులో మంచు మారదు

మరువని వలపుల కావ్యం
తరగని తలపుల కావ్యం
కరగని కాలల లొ కావ్యం
చిరగని భందాల కావ్యం


 శృంగారమా నీకు ఎందుకు ఇంత థళుకు
ప్రాస ప్రేమా నీకు ఎందుకు ఇంత కునుకు
బంధు ప్రేమా నీకు వలదు కొంత దడుపు
బంగారమా నీకు ఎందుకు ఇంత మెరుపు

--((*))_-

తత్వ బోధ -11

తెలుగు తీయదనం - 
మధురం కన్నా తీపిదనం 
తెలుగు వెలుగుల దీపం -
సూర్య చంద్రులకన్నా మించిన రూపం 

తెలుగు పద్య పఠనం 
ప్రతి మనస్సుకు కల్గించు ఆనందం 
తెలుగు స్వాతంత్ర సమర శంఖం 
ప్రపంచ ప్రజలను మేలుకొల్పే శంఖారావం 

తెలుగు ప్రజల సంస్కార్ బోధ 
హృదయాలను తపింపచేసే సూక్తి ప్రభ    
తెలుగు ప్రజల వైభవ వేదం 
చిరస్మరణీయ ప్రజల ఆకాంక్ష 

తెలుగు పండుగల శోభ
సాంప్రదాయాలకు మచ్చు తునక 
తెలుగు కవితా మాధుర్యం 
తెలియనివి తెలిపే గ్రంధం 
--((*))-- 

ప్రాంజలి శుభోదయ ప్రభ 
తత్వ  బోధ  -12

సెలయేరు మనలో ఉన్న - దయా హృదయం 
దయా అనే యేరు నదిలో చేరి  - నది  కడలని
ఉత్తేజం ఉత్సాహము కలిగింపచేసే హృదయం 
నదిఒక నీటిగుండె కదిలి పనిచేస్తేనే ధాహాఁమ్ తీరు 

నిత్య జాగరూకతో నదీమ తల్లి ప్రవహించి కడలి 
లోని కాలుష్యాన్ని కన్నీరు కలిపి తొలగిస్తుంది 
గట్టిగా ఉన్న కాటిన్య  హృదయాన్ని చల్లని  
అమృత  హృదయ  స్పర్శలతో ధాహమ్ తీర్చు 

దయా ప్రవాహానికి హద్దులుండవు - భాష్ప జలంతో 
ఉన్న కడలికి అధరాంమృత దారాలను అందించి 
సూర్య రేతస్సుతో  ఆవిరిగా మారి మేఘం గా ఏర్పడి 
సకల జీవన ప్రాణులకు అందించే దయామృత ధార 
  
అల్లం చేసే మేలెంతో తెలుసా?త్రిదోషాలైన వాత, పైత్య, శ్మేష్మాలను హరించే శక్తి అల్లానికి ఉంది అల్లం నోటికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా కడపు నొప్పిని సైతం తగ్గిస్తుంది. దగ్గును, పాండురోగాలను కూడా నివారిస్తుంది. ముఖ్యంగా జీర్ణకారిగా ఎంతగానో ఉపయోగపపడుతుంది.
కడుపు అజీర్ణం చేసినట్టయితే, గ్లాసు మంచినీళ్ళలో ఒక నిమ్మకాయ రసం పిండి అందులో మూడు టీ స్పూన్ల అల్లం రసం పిండి తాగినట్టయితే ఎలాంటి అజీర్ణమైనా పోతుందంటారు. అల్లం, బెల్లం కలిపి ఆరగించినట్టయితే అరికాళ్ళపై పొరలు ఊడటం, కొద్దికొద్దిగా విరేచనాలు తగ్గటం జరుగుతుంది.
ఈ అల్లం ఇలాంటి వంటింటి వైద్యాలకు మాత్రమే కాకుండా, శుభకార్యాలలో కూడా వినియోగిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. శుభకార్యాలలో చేసే పిండి వంటలు, రకరకాల కూరలు, నూనె, నెయ్యి పదార్థాలు తిని అతి దాహంతో, పైత్యంతో వికారం కలిగి అజీర్తి పాలిట పడకుండా ఈ అల్లం పచ్చడి కాపాడుతుందనే నమ్మకం ఉంది. ముఖ్యంగా మలబద్దకాన్ని పోగొట్టి మూత్రం ధారాళం1గా పోయేందుకు దోహదపడుతుందట.
అలాగే, మూడు చెంచాల అల్లం రసం, మూడు చెంచాల వంటాముదం కలిపి తాగినట్టయితే, రక్త గ్రహణి, బంక విరేచనాలు తగ్గుతాయట. దీర్ఘవాత రోగాలతో బాధపడేవాళ్లు ప్రతి రోజూ పల్చని మజ్జిగలో అల్లం రసం కలిపి మూడు పూటలా తాగినట్టయితే కీళ్ళవాతం కటివాతం, గృధ్రసివాతం మొదలగు వాతాలకు ఉపశమనం కలుగుతుందట.
అలాగే, ఒక గ్లాసు మంచినీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, దానిలో రెండు చెంచాల ధనియాల రసం కలిపి ఉదయం పూట మాత్రం తీసుకుంటే పది, పదిహేను రోజుల్లో రక్తపోటు తగ్గుముఖం పడుతుందట. అంతేకాకుండా గుండెదడ, అలసట, వికారాన్ని పోగొట్టి గుండెకు బలం ఇస్తుందట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి