19, జనవరి 2017, గురువారం

*పుష్ప వనం కావాలి (ఛందస్సు)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
*పుష్ప వనం కావాలి (ఛందస్సు) 

సుఖాలల్లొ సేవ  ప్రీతి పూల వనం కావాలి
నవా భ్యుద యాల వెల్గు పూల వనం కావాలి
సుసం గీత శ్రావ్య  రాగ పూల వనం కావాలి
శశీ వెన్నెల కారుణ్య పూల వనం కావాలి 

గుబాళించి - ప్రతి - గుండె పూల - వనం కావాలి
చమత్కార - చారు -హాస  మాల -  వనం కావాలి
 సునామీగ - చేటు - చేయ లేని  -  వనం కావాలి
సమారాధ - చేసె  - సామరస్య   -   వనం కావాలి   

సమాధాన -  పర్చి - శాంతి సౌఖ్య - వనం కావాలి
సురక్షా ల  - వల్ల  - శోభ  భావ  -  వనం కావాలి
సుహాసంతొ- సేవ - తత్ప రాల - వనం కావాలి
దయామూర్తి -రేఖ - శాఖ వాల - వనం కావాలి     

సమా నంద గాలి తెల్పె పూల  వనం కావాలి 
సదా వెల్గు పంచె సూర్య పూల వనం కావాలి 
జలా లన్ని మంచి నీటి పూల వనం కావాలి 
సెగా మంట నవ్వు పంచె పుష్ప వనం కావాలి   

--((*))--

ప్రాంజలి ప్రభ (ఛందస్సు)
తత్వ   భోద  - 

పాఠాలు నేర్పించు పంతులమ్మా
భేదాలు నేర్పూట  ఎందుకమ్మా 
వాదాలు పెంచూట వద్దులెమ్మా 
శాపాలు  దోషాలు చేయధమ్మా

మాటాడ  దీనంగ మాన్యమమ్మా
వేదాలు చద్వాలి  నిశ్చమమ్మా
శాస్త్రాల పాఠాలు  నేర్పుమమ్మా
భోగాలు శోకాలు వద్దులెమ్మా

కాఠిన్యమున్ జూప గానిదమ్మా
పంత మ్మూ వద్దు ఎందుకమ్మా        
శాంతంమ్మూ జూపి ఉండువమ్మా
భాగ్యంమ్మూ  పంచు కోవలమ్మా

అటాడ కష్టమౌ నజినికొమ్మా
పోరాట ఇష్టమో నజినికొమ్మా  
పేరాశ శాపమో నజినికొమ్మా
వేషాలు కోపమౌ నజినికొమ్మా

నామాట లెప్పుడున్ నాణ్యమౌనే
నాశక్తి ఎప్పుడున్ భాగ్యమౌనే
నాదైవమ్ హృదయం లోనమౌనే
నాప్రాణం ప్రేమంత భద్రమౌనే 
           
నీ మీద నిరతమ్ము నెయ్యమేనే
నీ రూపు పదిలమ్ము హృద్యమేనే
నీ మాట మనసమ్ము వుండెనేనే
నీ నవ్వు ఎపుడూను పొందునేనే

ఎన్నెన్నొ నేవింటి నీరీతిగా
చెయ్యాలి సేవాలు నీరీతిగా
పొందాలి సంతోష మీరీతిగా
భాగ్యము వచ్చేలె ఈరీతిగా
              --((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి