ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
భోగి పండుగ
సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం.
ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది.
అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.
భోగిమంటలు
వ్యామోహానికి నిప్పు
మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.
భోగిపండ్లు
యోగిత్వం.. బదరీఫలం
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.
బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.
పిలిచిందర్రా భోగిమంట!
ఈ చలితోటి వచ్చింది మహ చెడ్డ తంటా!
ఎండుటాకులు తెచ్చి వెయ్యండి
సరసర మండేటట్టు కాస్త ఊదండి
వెదురుపుల్లలు విరిచి వెయ్యండి
బిరబిర ముదురుకట్టెలు పరచి విసరండి!
చలిచలి చలిచల్లి దుప్పటి
తాతకి తేరా కుంపటి!
ఉహుహుహు ఉహుహుహు గొ0గళి
అవ్వకి తేరా కంబళి!
కర్రి చీకట్లోన కరిచేటి చలిలోన
ఎర్రని పాముల్లాగ సర్రున చేతులు చాచి
పిలిచిందర్రా భోగి మంట!
(శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
రచన)
పచ్చ పచ్చని కళ్ళాపి
ముంగిట ముత్యాల ముగ్గులు
జోడు బసవన్నల తాళమేలం
భక్తి భావాల హరి దాసులు
గంగిరెద్దుల ఆటపాటలు
ఇవేనండీ మన తెలుగు సంస్కృతులు
కోడి పందాలు డబ్బు పందాలు
పశువుల హింసించు జల్లికట్టులు
కానే కావు మన సంస్కృతులు
ఆ.వె 1
మసక మసక తెరల మబ్బుతాకిన మంచు
చినుకు చినుకు కలిసి చిలక రించె
విచ్చుకున్నవిరుల వెలుగొందిచామంతి
పచ్చగుసిరి కాసి పలకరించె
ఆ.వె 2
సుప్రభాత వేళ సొగసుల ముంగిళ్ళు
స్వాగతములు పలికె సోయగముగ
నగర వీధులన్ని హరినామ భజనచే
అంబరమును తాకె సంబరముగ
ఆ.వె 3
హంస విల్లు యందు హరియంశమునజేరి
మకర సంక్రమమున మరలి పోవు
వాసి కెక్కె జగతి వైకుంఠుని మాసమై
విష్ణు పురము తలుపు వెలుగు జూడ
ఆ.వె 4
కోవెలందు జ్యోతి కాంతులీనుచునుండ
కప్పియున్న మంచు కరిగిపోయె
పాసురముల పిలుపు ప్రారబ్ధములుదెంచ
మేలు కొలిపె జనుల ముక్తి కొరకు
ఆ.వె 5
పాసురముల కొకటి పూల మాలను గట్టి
మెడను వేసుకొనగ మురిసిపోయె
మదిని పతిగ తలచి మురహరి కీర్తించి
హృదయ ఫలక మందు కొలువు జేసె
ఆ.వె 6
మాల వేసి హరికి మనసార కొనియాడి
విరహ వేదనమున కుమిలిపోయె
సకల భువన విభులు సాక్షులై విలసిల్లి
ధరణి పతిని జేరి ధన్యమాయె
ఆ.వె 7
భక్తి కున్న పదును మరియెందు కలుగును
భాగవతుని జేర భోదపరిచె
రాసలీలలన్ని రస రమ్యముగబల్కి
జనుల మేలు కొలిపె జగతి యందు
సంక్రాంతి (ఛందస్సు )
ఓర్పు నేర్పు కూర్పు తీర్పు పంచు సంక్రాంతి
శాంతి కాంతి పంచె బ్రాంతి తుంచే సంక్రాంతి
పంట వచ్చే మంచి పంచే శోభ సంక్రాంతి
అక్క బావ అన్న చెల్లి బిడ్డ సంక్రాంతి
సూర్య చంద్ర నింగి నేల వెల్గు సంక్రాంతి
పెంచు కున్న ప్రేమ పంచు తున్న సంక్రాంతి
పెంచు తున్న డబ్బు మబ్బు మాయ సంక్రాంతి
మంచి మార్పు కోసం ప్రేమ పంచు సంక్రాంతి
బంధు మిత్ర స్నేహ భావ పంచే సంక్రాంతి
తల్లి తండ్రి కూర్చో బెట్టి చేయు సంక్రాంతి
పిండి వంట చేసి కల్సి తినే సంక్రాంతి
పెద్ద చిన్న ఆట పాట శోభ సంక్రాంతి
నువ్వు నేను కల్సే భావం ఉండె సంక్రాంతి
ఇచ్చి పుచ్చు కొనే ప్రేమ పంచే సంక్రాంతి
పూల ముగ్గు గొబ్బి పెట్టే శోభ సంక్రాంతి
కొత్త బియ్యం తీపి బెల్లం పంచే సంక్రాంతి
--((*))--
*సంక్రాంతి (ఛందస్సు )
హరి దాసు పాటతో పాడుతున్న కోకిలలు
హరి విల్లు నీడతో పాడుతున్న చిన్నారులు
సిరి మల్లె రాకతో పాడుతున్న గోపికలు
మెలి పూలచెట్లతో ఆడుతున్న పువ్వులులే
రంగ వల్లి మధ్య గొబ్బెమ్మల ముచ్చట్లు
రేగి పళ్ళు పోసి అమ్మొమ్మల ముచ్చట్లు
పిండి వంట చేసి నానమ్మల ముచ్చట్లు
ఆట పాట కోడి పందెమ్ముల ముచ్చట్లు
సంకు రాత్రి వచ్చే సంబరమ్ములు తెచ్చే
సంత సమ్ము వచ్చే శాంతి సౌఖ్యము తెచ్చే
వంక లేక భూమి శోభిల్లి ఖ్యాతి తెచ్చే
మారు చుండు కాల మెప్పుడున్ కాంతి తెచ్చే
బ్రాంతి వీడి శాంతి నిల్పే సంక్రాంతి
సూర్య వెల్గు చంద్ర వెన్నెల క్రాంతి
బ్రహ్మ సృష్టి జన్మ సాహిత్య క్రాంతి
నిత్య దృష్టి ధర్మ గ్రహ సంక్రాంతి
--((*))--
రవి - సార్థకనామ గణాక్షర వృత్తము
ఆధారము - జయదామన్
ఇతర నామములు - కామినీ, భామినీ, తరంగవతీ
యతి - లేదు, ప్రాస ఉన్నది
రవి (కామినీ, భామినీ, తరంగవతీ)- ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171
సంకురాత్రి వచ్చెఁ జూడుమా
శంక లేని సమ్ముదమ్ముతో
వంక లేక వర్ధిలంగ ర-
మ్మింక భూమి శోభిలున్ గదా
మారుచుండుఁ గాలమెప్పుడున్
మారుచుండు చంద్రునిన్ రవిన్
ధారుణిన్ గనంగ వచ్చు నిం-
పారు పండుగై ముదమ్ముతో
శాంతి గల్గు గావుతన్ సదా
క్షాంతిపై సుఖమ్ము నిండ సం-
క్రాంతి సంబరమ్ము లెంతయో
కాంతు లిచ్చు వింతవింతగా
భామినుల్ హసంతివద్ద స-
త్కామనల్ మనమ్ము నుండఁగా
బ్రేమతోడ వండి పొంగలిన్
దా మొసంగిరప్డు దేవికిన్
సూర్యు నుత్తరాయణమ్ము నేఁ
డార్య దేశమున్ దొడంగెఁగా
సూర్యదేవుఁ డిచ్చు జీవమున్
సూర్యదేవుఁ డిచ్చు సర్వమున్
సంక్రాంతి శుభాకాంక్షలతో -
విధేయుడు - మోహన
పిలిచిందర్రా భోగిమంట!
ఈ చలితోటి వచ్చింది మహ చెడ్డ తంటా!
ఎండుటాకులు తెచ్చి వెయ్యండి
సరసర మండేటట్టు కాస్త ఊదండి
వెదురుపుల్లలు విరిచి వెయ్యండి
బిరబిర ముదురుకట్టెలు పరచి విసరండి!
చలిచలి చలిచల్లి దుప్పటి
తాతకి తేరా కుంపటి!
ఉహుహుహు ఉహుహుహు గొ0గళి
అవ్వకి తేరా కంబళి!
కర్రి చీకట్లోన కరిచేటి చలిలోన
ఎర్రని పాముల్లాగ సర్రున చేతులు చాచి
పిలిచిందర్రా భోగి మంట!
(శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
రచన)
పచ్చ పచ్చని కళ్ళాపి
ముంగిట ముత్యాల ముగ్గులు
జోడు బసవన్నల తాళమేలం
భక్తి భావాల హరి దాసులు
గంగిరెద్దుల ఆటపాటలు
ఇవేనండీ మన తెలుగు సంస్కృతులు
కోడి పందాలు డబ్బు పందాలు
పశువుల హింసించు జల్లికట్టులు
కానే కావు మన సంస్కృతులు
ఆ.వె 1
మసక మసక తెరల మబ్బుతాకిన మంచు
చినుకు చినుకు కలిసి చిలక రించె
విచ్చుకున్నవిరుల వెలుగొందిచామంతి
పచ్చగుసిరి కాసి పలకరించె
ఆ.వె 2
సుప్రభాత వేళ సొగసుల ముంగిళ్ళు
స్వాగతములు పలికె సోయగముగ
నగర వీధులన్ని హరినామ భజనచే
అంబరమును తాకె సంబరముగ
ఆ.వె 3
హంస విల్లు యందు హరియంశమునజేరి
మకర సంక్రమమున మరలి పోవు
వాసి కెక్కె జగతి వైకుంఠుని మాసమై
విష్ణు పురము తలుపు వెలుగు జూడ
ఆ.వె 4
కోవెలందు జ్యోతి కాంతులీనుచునుండ
కప్పియున్న మంచు కరిగిపోయె
పాసురముల పిలుపు ప్రారబ్ధములుదెంచ
మేలు కొలిపె జనుల ముక్తి కొరకు
ఆ.వె 5
పాసురముల కొకటి పూల మాలను గట్టి
మెడను వేసుకొనగ మురిసిపోయె
మదిని పతిగ తలచి మురహరి కీర్తించి
హృదయ ఫలక మందు కొలువు జేసె
ఆ.వె 6
మాల వేసి హరికి మనసార కొనియాడి
విరహ వేదనమున కుమిలిపోయె
సకల భువన విభులు సాక్షులై విలసిల్లి
ధరణి పతిని జేరి ధన్యమాయె
ఆ.వె 7
భక్తి కున్న పదును మరియెందు కలుగును
భాగవతుని జేర భోదపరిచె
రాసలీలలన్ని రస రమ్యముగబల్కి
జనుల మేలు కొలిపె జగతి యందు
సంక్రాంతి (ఛందస్సు )
UI-UI-UI-UI-UI-UUI(kottadi)
సంక్రాంతి (ఛందస్సు )
ఓర్పు నేర్పు కూర్పు తీర్పు పంచు సంక్రాంతి
శాంతి కాంతి పంచె బ్రాంతి తుంచే సంక్రాంతి
పంట వచ్చే మంచి పంచే శోభ సంక్రాంతి
అక్క బావ అన్న చెల్లి బిడ్డ సంక్రాంతి
సూర్య చంద్ర నింగి నేల వెల్గు సంక్రాంతి
పెంచు కున్న ప్రేమ పంచు తున్న సంక్రాంతి
పెంచు తున్న డబ్బు మబ్బు మాయ సంక్రాంతి
మంచి మార్పు కోసం ప్రేమ పంచు సంక్రాంతి
బంధు మిత్ర స్నేహ భావ పంచే సంక్రాంతి
తల్లి తండ్రి కూర్చో బెట్టి చేయు సంక్రాంతి
పిండి వంట చేసి కల్సి తినే సంక్రాంతి
పెద్ద చిన్న ఆట పాట శోభ సంక్రాంతి
నువ్వు నేను కల్సే భావం ఉండె సంక్రాంతి
ఇచ్చి పుచ్చు కొనే ప్రేమ పంచే సంక్రాంతి
పూల ముగ్గు గొబ్బి పెట్టే శోభ సంక్రాంతి
కొత్త బియ్యం తీపి బెల్లం పంచే సంక్రాంతి
--((*))--
*సంక్రాంతి (ఛందస్సు )
హరి దాసు పాటతో పాడుతున్న కోకిలలు
హరి విల్లు నీడతో పాడుతున్న చిన్నారులు
సిరి మల్లె రాకతో పాడుతున్న గోపికలు
మెలి పూలచెట్లతో ఆడుతున్న పువ్వులులే
రంగ వల్లి మధ్య గొబ్బెమ్మల ముచ్చట్లు
రేగి పళ్ళు పోసి అమ్మొమ్మల ముచ్చట్లు
పిండి వంట చేసి నానమ్మల ముచ్చట్లు
ఆట పాట కోడి పందెమ్ముల ముచ్చట్లు
సంకు రాత్రి వచ్చే సంబరమ్ములు తెచ్చే
సంత సమ్ము వచ్చే శాంతి సౌఖ్యము తెచ్చే
వంక లేక భూమి శోభిల్లి ఖ్యాతి తెచ్చే
మారు చుండు కాల మెప్పుడున్ కాంతి తెచ్చే
బ్రాంతి వీడి శాంతి నిల్పే సంక్రాంతి
సూర్య వెల్గు చంద్ర వెన్నెల క్రాంతి
బ్రహ్మ సృష్టి జన్మ సాహిత్య క్రాంతి
నిత్య దృష్టి ధర్మ గ్రహ సంక్రాంతి
--((*))--
రవి - సార్థకనామ గణాక్షర వృత్తము
ఆధారము - జయదామన్
ఇతర నామములు - కామినీ, భామినీ, తరంగవతీ
యతి - లేదు, ప్రాస ఉన్నది
రవి (కామినీ, భామినీ, తరంగవతీ)- ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171
సంకురాత్రి వచ్చెఁ జూడుమా
శంక లేని సమ్ముదమ్ముతో
వంక లేక వర్ధిలంగ ర-
మ్మింక భూమి శోభిలున్ గదా
మారుచుండుఁ గాలమెప్పుడున్
మారుచుండు చంద్రునిన్ రవిన్
ధారుణిన్ గనంగ వచ్చు నిం-
పారు పండుగై ముదమ్ముతో
శాంతి గల్గు గావుతన్ సదా
క్షాంతిపై సుఖమ్ము నిండ సం-
క్రాంతి సంబరమ్ము లెంతయో
కాంతు లిచ్చు వింతవింతగా
భామినుల్ హసంతివద్ద స-
త్కామనల్ మనమ్ము నుండఁగా
బ్రేమతోడ వండి పొంగలిన్
దా మొసంగిరప్డు దేవికిన్
సూర్యు నుత్తరాయణమ్ము నేఁ
డార్య దేశమున్ దొడంగెఁగా
సూర్యదేవుఁ డిచ్చు జీవమున్
సూర్యదేవుఁ డిచ్చు సర్వమున్
సంక్రాంతి శుభాకాంక్షలతో -
విధేయుడు - మోహన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి