26, జనవరి 2017, గురువారం

నేటి మార్పు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: 

తత్వబోధ. 
ప్రాంజలి ప్రభ - ఎవరికైనా 

ధనాన్ని చూస్తే ఎవరికైనా 
బుద్ది చంచల మౌతుంది 
శెవాన్ని చూస్తే ఎవరికైనా    
బుద్ది వేదాంత మౌతుంది

స్త్రీ వేషాన్ని చూస్తే ఎవరికైనా 
బుద్ధి ఆలోచన మారుతుంది  
యువతి కళ్ళు చూస్తే ఎవరికైనా 
ఎవరికైనా ఎదో తెల్పాలనిపిస్తుంది 

పౌర్ణమి వన్నెల చూస్తే ఎవరికైనా   
కలలు నిజం చేసుకోవాలనిపిస్తుంది        
అమావాస్య చీకటిని చూస్తే ఎవరికైనా  
తెలియని మైకం కమ్ము కుంటుంది 

తలఎత్తి పైకి చూస్తే ఎవరికైనా 
కళ్ళను కమ్మే వెలుగు కనబడుతుంది
చుక్కలతో చంద్రుని చూస్తే ఎవరికైనా
మనసు తన్మయత్వం చెందుతుంది 

కమనీయ ప్రకృతి చూస్తే ఎవరికైనా 
నయనాలు వెలుగు చిమ్ముతుంది
అనుకోని సంఘటన చూస్తే ఎవరికైనా
హృదయం గగుర్పాటు చెందుతుంది 


--((*))--


*సరస సంభాషణ (ఛందస్సు)
UUUU-IIII-UIU (KOTTADI)

సాంఘీకంగా కధలను పోల్చగా 
సామాన్యంగా నిజమును పోల్చెనే
స్నేహంగానే  కళలను  తీర్చెనే
ఆనందంతో అలకను మార్చెనే 

సందానంగా అణుకువ చూపెనే
మౌనంగానే ఒకటవ  టానికే 
మెదస్సంతా తెలుపుచు ఉండెనే
శక్తీనంతా  కలలతొ పూడ్చకే 

సమ్మోహంగా కణతలు విచ్చెనే
ప్రాధాన్యంగా పలుకులు  పల్కెనే 
ప్రాభావంగా విలువలు    పెంచేనే 
వ్యత్యాసంగా వలపులు చూపెనే     
     
పాఠాలన్నీ వరుసగ చెప్పవే 
కొర్కళన్నీ మనసుతొ  తీర్చవే  
సమ్మోహంతో మనసును పంచుదాం 
సంతోషంతో ఒకరిగ మారుదాం   


--((*))--

తత్వ బోధ 

ఎత్తులతో నడుస్తాయి పావులు 
పావుల కదలకలే చదరంగం 
ఎత్తులు పై ఎత్తుల రంగం 

ధనంతో నడుస్తుంది రాజకీయం 
మనుష్యుల బలహీనతతో 
ఆడుతుంది రాజకీయ చదరంగం    
ఎత్తులు పై ఎత్తుల రంగం 

సంపాదించిన దాని రక్షించుకోవడం 
రక్షించానదాన్ని వృద్ధిపరుచుకోవడం 
లేని దాన్ని పట్టుదలతో సంపాదించడం 
తగిన రీతిలో వినియోగించడం 
ఇదియే తెలుసుకోవలసిన రాజతంత్రం 

రాజతంత్ర ఆయుధం నీతి శాస్త్రం 
సంధికి నిగ్రహానికి ఉండాలి రాజతంత్రం 
బీదలను గొప్పవారిగా మార్చేది తంత్రం 
గొప్పవారిని బీదవారిగా మార్చేది తంత్రం 

ఆశలు ఆశయాల మద్యే ఉండే తంత్రం 
కుట్రలు కుతంత్రాలతో నడిపే తంత్రం 
రాజకీయాలను మలుపు తిప్పే తంత్రం 
వ్యావహారికంగా నడిపించే ఒక యంత్రం 

శత్రువులను మిత్రులుగా మార్చే రాజీ మంత్రం 
మిత్రులను శత్రువులుగా మార్చే రాజీ మంత్రం 
రాజకీయం నీతిగా బ్రతికితే గుర్తు ఉండే మంత్రం 
ప్రజలు నాయకులు ఆడుకొనే రాజ తంత్రం 

--((*))--      


తత్వ బోధ 

మనసుకు మనసు తోడు 
మనసుకు మమత తోడు 
మమతకు స్నేహము తోడు 
స్నేహముకు బలము తోడు

బలానికి ధనము తోడు 
ధనము ధర్మానికి తోడు 
ధర్మం న్యాయానికి తోడు
న్యాయం సత్యానికి తోడు

సత్యమే మనిషికి తోడు 
మనిషికి ప్రేమ తోడు 
ప్రేమలే దేశానికి తోడు   
ఒకరికి ఒక్కరే తోడు

కష్టాల కు కడలి తోడు 
సుఖాలకు మనిషి తోడు 
క్రమశిక్షణకు చీమ తోడు 
ఐక మత్యంకు కాకి తోడు  

ఎండకు నీడ తోడు
చలికి వెచ్చ తోడు
ఆతృతకు ఆశ తోడు
కోపానికి ప్రేమ తోడు
--((*))--
తత్వ బోధ 

మదిలో భావం అనంతం 
అనంతాన్ని చేసుకోలేము అర్ధం 
అర్థంలోనే దాగి ఉంది పరమార్ధం 
పరమార్ధ భావాలే నిజమైన అర్ధం  

మనసు ఎప్పుడూ నలుగుతుంది
కారణం ఇదేనని చెప్పనంటుంది 
సుఖదుఃఖం చుట్టూ తిరుగుతుంది   
ఎండా వాన చలికి మనసు పూస్తుంది 

ఒకటికి ఒకటి  మన మమేకం  
మమేకం లోనే ఉన్నది ఏకత్వం 
ఏకత్వంలో ఉన్నది సృజనత్వం  
సృజనత్వమే కవితలో పటుత్వం

కేశములెన్నో చెప్పుట కష్టమో 
తరంగాలెన్నో తెల్పుట కష్టమో  
మనసు అంతరంగాలు తెలుపుట కష్టమే 
కావ్యాలను గగన చుక్కలను తెల్పుట కష్టమే కదా 

అనుకున్న వాడికి ఎప్పుడూ ఒంటరి తనం 
నేను కాదు అన్నవాడికి లేదు ఒంటరితనం 
నాలో ఉన్నవాడు నడిపిస్తున్నాడు అనటం 
చెట్టులా గా సహాయ పడటమే కదా వేదాంతం 

ఋతువులు మారిన మనసు స్థితి మారదు  
భూ భారము తీరేదాకా ఎప్పుడూ  మారదు 
సృష్టిని వ్యతిరేకించి ఎప్పుడూనడక సాగదు 
కదులుతున్న క్రతువు ఇది ఎవ్వరి కష్టం కాదు 

పువ్వు విచ్చి పరిమళిస్తుంది 
ఆస్వాదించి మనసు వికసిస్తుంది 
దేవుణ్ణి ఒక్కసారి ప్రార్ధించ మంటుంది 
అందరి సుఖం తనదని బ్రతక మంటుంది 

నదులు సంగమమే ఏకత్వం   
ఏకత్వంలో ఉన్నది పరమాత్ముని తత్త్వం 
స్త్రీ పురుషులే ఆది సంగమం
తత్వాలు హృదయాల సమానత్వం  

చీకటి రాత్రి కొందరికి కాళరాత్రి 
మరికొందరికి మధుర  రాత్రి 
కొన్ని తారలకు తన్మయ రాత్రి 
విధాత సుష్టికి అందించిన శుభ రాత్రి 

మమేకమే ప్రేమకు రూపం లేదు 
అనంతమే వెన్నెలకు మార్గం లేదు 
సమానత్వమే సుఖ లో మార్పు లేదు 
మౌనవత్వమే ప్రశ్నకు జవాబు అనదు

నీవెనుక ఉన్నది నీవు గమనించలేవు 
జరుగ బో యేవి ఏవి తెలుసుకో లేవు 
నీవు  జవాబే వెలుగు గా భావించావు 
తృప్తిలోనే సంతృప్తిని గమనించావు 

మనసులోని భావమే ఒక లోకం 
మమతలోని అర్ధమే మరో లోకం  
మనసుకి తాకే దే కవితా లోకం  
మరోలోకానికి చేర్చిది భావ తత్త్వం  

--((*))--


తత్వ బోధ   

నేత్రాకర్షణే ఒక  మంత్రం 
మామూలుమనిశికి మంత్రమే ఒక దీపం 
మంత్రానికి నిగ్రహ శక్తి తధ్యం 
మంత్రశక్తే  దేశాభివృద్ధికి గమ్యం 
  
ఇద్దరి ఆలోచనే ఒక మంత్రం 
మంత్రసాధనకు సహాయం ఖచ్చితం 
మంత్రమే అందరికి రక్షణ వలయం 
మంత్రాన్ని జపిస్తే కార్య సిద్ది సులభం 

స్త్రీ, ధనం వళ్ళ మంత్రసిద్ధికై ఆటంకం 
ఓర్పు  ఓదార్పే మంత్ర సిద్ధికి  ముఖ్యం       
తనకు  తాను  జీవించటమే మంత్రం 
నమ్మకం లేనిచోట పనిచేయదు మంత్రం 

--((*))--


తత్వ బోధ 

సుఖానికి మూలం ధర్మం
ధర్మానికి మూలం అర్ధం 
అర్ధానికి మూలం అర్ధాంగి 
అర్ధాంగికి మూలం రాజ్యం 

రాజ్యానికి మూలం ఇంద్రియం 
ఇంద్రియానికి మూలం వినయం 
వినయానికి మూలం వృద్ధ సేవ 
వృద్ధసేవకు మూలం విజ్ఞానము 

విజ్ఞానమునకు మూలం సంపాదన 
సంపాదన కు మూలం ఆత్మ తృప్తి
ఆత్మతృప్తికి మూలం ఓర్పు లాభం 
ఓర్పులాభానికి మూలం ప్రకృతి వరం 

ప్రకృతి వరానికి మూలం క్రమశిక్షణ 
క్రమశిక్షణ కు మూలం సూర్యోదయం
సూర్యోదయానికి మూలం కాలచక్రం 
కాలచక్రానికి మూలం విధాత సృష్టి 

విధాత సృష్టి కి మూలం ఆదిపరాశక్తి 
ఆదిపరాశక్తి కి మూలం సర్వాంతర్యామి 
సర్వాంతర్యామి కి మూలం ప్రేమతత్వం 
ప్రేమతత్వానికి మూలం నమ్మకత్వమే         

--((*))--

తత్వ బోధ - (ఛందస్సు) 

కలువలు పూజ లాలసులకు 
ముడుపులు దైవ లాలసులకు 
మకుటము రాజ లాలసులకు 
సకటము బద్ద లాలసులకు     

కపటము మోస లాలసులకు 
నటనము హాస్యలాలసులకు
జపమును మౌన లాలసులకు 
తపమును మోక్ష లాలసులకు 

ధనమును సత్య లాలసులకు 
గుణమును మంచి లాలసులకు 
సతియును ధర్మ లాలసులకు   
పతియును న్యాయ లాలసులకు 
   
తలపులు ప్రేమలాలసులకు 
గడువులు అప్పులాలసులకు 
పదవులు భోగలాలసులకు 
చదువులు విద్యలాలసులకు 

--((*))--
ఆటవెలఁది షట్పది - (ఛందస్సు) 
తేట జలము చాల 
తీపి ఉండ దగును
ప్రాణమమ్ము రక్ష-గాజలములు    

మీట గలను వీణ  
మేటి మాట వలన 
మానసమ్ము రక్ష - గావలయును

తేట తెలుగు మాట 
తేజ రిల్లు కనుక 
హృదయమ్ము రక్ష - గావలయును

ఆట వలన తృప్తి 
దేహ మంత కదులు 
రక్త మంత వేడి - గామెరియును      

ప్రాణ తపన కొంత 
ప్రేమ యంత కదులు
ప్రేమ వళ్ళ జీవి - గాకదులును     

మాట పలుకు మంచి 
భావ సొంత  మగును  
సత్య మంత తెల్సు - కోకలిగెను 

--((*))--

నేటి మార్పు (chandassu)

ఎర్రిచూపుతో - ఏటిఎం చెరా 
- లైను ఉన్నదీ - లంఖణంబులే
ఉండి కూడనే - వంతు రాగ నే 
-డబ్బు లేదులే - ఇంత మీకులే 
అన్న మాటలే - రేపు బోర్డు రా 
ఎంతకావలే - ముందు నీకు రా  
అన్న మాటలే - ఆశలే కదా 
       
బ్యాన్కు వారిచ్చే - 2 వేలనోట్లులే 
ఇంటి కెళ్లగా - చిల్లరా లెదే 
అన్న మాటలే -  చిర్రెత్తి కొనీ
మారెదీ ఎలా - నెత్తి  పట్టెనే 
బ్యాంకుకే పొగా - కొత్త నోట్లు లే   
వంద నోట్ల నూ - మార్చి ఇచ్చెనే
ఇచ్చె చిల్లరా - సంతసించెనే 
    
బీదవారి కీ - గొప్పవారి కీ 
కార్డు గీకగా - డబ్బు వచ్చురా 
షాపులో పప్పు - ఉప్పు తెచ్చురా 
హాయి హాయి గా - ఉండూ ఇప్పుడే 
-((*))--

తత్వ బోధ 

స్నానమునకు మేను సుబ్రమగు 
కలుషిత మనసు సుబ్రముకాదు  
దైవపూజా వల్ల మనశాంతి కలుగు
దేవున్నినమ్మని వాడికి శాంతే ఉండదు 

రామ నామ జపము మనసుకు తేలిక యగు      
హృదయం లోపల శృతి చెంది శుబ్రమగు 
చిత్త శుద్ధి కలిగి చిన్మయ చిత్తము ధన్య మగు     
బాహ్య శుద్ధి కొరకు జీవిత మంతా శ్రమయగు  

చీకటిలో కనులు తెరిచినా శూన్యము
శూన్య మందు చేయవలె సాధనము
సాధన వళ్ళ చీకటిలో మెరియుము 
పెంచును సాధన ధ్యానము జ్ఞానము   

--((*))--మంచి వల్లనే - శోభలే ఇకా        

--((*))--