22, జనవరి 2017, ఆదివారం

(తత్వ బోధ -

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే  నమ:
 
*శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా

రేపటి గురించి నిన్ననే ఆలోచించి 
ఈ నాడు జాగర్త పడటమే మానత్వము 
అందుకే నీవేదిక్కని ప్రార్ధిసున్న
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా   

మా  ఆటంకాలను తొలగిం చి      
మా  శారీరక రుగ్మతలను తగ్గించి      
మా  మానసిక వత్తిడిని శాంత పరిచి
మా  ధర్మాలను ఆత్మను ఆకాంక్షించేవిగా
మాలో నెలకొని ఉన్నావు శ్రీ వేంకటేశా

మా మతి ధర్మ గుణముగా 
మా సేవ నిరాకరించకుండగా 
మా వాక్కు ప్రాణ రక్షణ దిశగా 
మా శ్రోత్రం కీర్తనలు విను దిశగా
మా కళ్ళు నీ ధర్మ దర్సన దిశగా   
మా ఆత్మ  దైవాంశ భూతిగా 
మా మనసంతా భక్తే ప్రాధాన్యతగా 
మా దేహం నీకే అర్పణగా     
మేము ప్రార్ధిస్తూ, కీర్తిస్తూ, వేడుకుంటూ 
ఉన్నాము నమో నమో 
శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా    
--((*))--
black and white sunflower tattoos - Google Search:
తత్వ బోధ -12 (కళ్ళు) 

ప్రేమకు తార్కాణం  కళ్ళు 
కళ్ళు చూసి మోసపోయేది ప్రియుడు 
ప్రియని ఆ కళ్ళతోనే తృప్తి పరిచింది ప్రియురాలు 
ప్రియురాలు ప్రేమకళ్ళే  ప్రియునికి జీవితం 

జీవితంలో కళ్ళు తెరుచుకొని బ్రతకాలి   
బ్రతుకులో అనేక కళ్ళను చూడక తప్పదు 
తప్పదు కల్లతో ప్రేమించింది స్నేహితురాలు 
స్నేహమే జీవితాన్ని నడిపే కళ్ళు    

కళ్ళుతో ఉరిమి చెప్పేది భార్య
భార్య కళ్ళే భర్తకు మరువలేని సంకెళ్లు 
సంకెళ్లు ఇరువురి మధ్య ఏర్పడే బీజం 
బీజం కళ్ళు మూసేవరకు ప్రేమించేది అమ్మ        
  
అమ్మ మాతృత్వమ్ రంగరించి చూపే  కళ్ళు 
ఆకళ్ళ చుట్టూ భాష్పాలు కమ్ముకున్న వదలని ప్రేమ 
ప్రేమ కనబడకుండా కళ్ళతో ప్రేమించేది నాన్న 
నాన్న అమ్మతో సర్వాన్ని కళ్ళతో కాపురాన్ని నడిపేది  

Black and White Sunflower Tattoo Designs | Sunflower Tattoos:
http://eemaata.com/em/issues/201702/10225.html


తత్వ బోధ - 13 . 

ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ
అమ్మ మనసు అర్ధం చేసుకునేది నాన్న
నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తూ 
జీవన మార్గం చూపేది నాన్న, జీవితం నేర్పేది అమ్మ
        
ఆకలి తీర్చుటకు సరమించేది అమ్మ
అమ్మ నాన్న తో ఆకలి తెలిసేలాగా
భధ్రత కల్పించి భాద్యత నేర్పేది  

నడక నాన్నది, నడవడిక నాన్నది
హితబోధ చేసి ధైర్యం నేర్పేది నాన్న
అమ్మ ఆలోచన అనుభవాలు అర్ధం చేసుకొని 
నిన్న సలహాలు ఆచరించుట అందరి ధ్యేయం  

--((*))--
Sunflower tattoo. Really liking this.:

తత్వ బోధ -14

అప్పు చేయని మనిషిని 
తప్పు చేయని యువతను 
నిప్పు పట్టగల జీవిని 

ఒప్పు చెప్పి బ్రతికేవాన్ని 

లంచం తీసుకోని మనసుని 
స్వలాభం ఎరుగని మనుష్యుల్ని 
స్వార్థ చింతలు లేని నాయకుల్ని     
బీదరికంలో ఉన్న నాయకున్ని 

మతము జాతి లేని దేశాన్ని 
పోరాటాలు లేని నేలను  
ఆకలి చావులేని కులాన్ని 
మమతలు పంచని బంధాన్ని 

ధ్వంద్వర్ధాలు లేని పాటల్ని 
ప్రజలను అర్ధం చేసుకున్న నాయకుల్ని 
పేదలకు సర్వం దానం చేసినవాడ్ని 
పెడదారి పట్టని యువతీయువకుల్ని 

ప్రాణాలు తీయని ప్రేమను 
నీతిని బోధించే విద్యను  
తల్లి తండ్రి పూజించే బిడ్డల్ని 
కోపం రాణి మనిషిని 

ఎవరైనా చూసారా ఉంటె 
ఎక్కడా ఎలా ఉన్నారో చూపండి 

--((*))--

తత్వ బోధ. -15


ఏమని చెప్పేది నీవు పేదల్లో పేదగ  

మాటలకూ పరిమళ కర్పూర సెగ 
మొఖం అరవిరిసిన జలిత పద్మంగా  
కర్పూర చల్లదనంతో వెలుగుతో 

తనువు రూపు బంగారు తీగ మెరుపుతో      

నల్లని  కురులు మణిమయంతో 
కురులలో పాపిడి పిందెలతో 
జడలయందు సూర్య చంద్ర అలంకారాలతో

మెడలో చెంద్రహారాలు, చక్కిలిగొలుసులతో 

చేతులకు అరవంకీలతో బంగారు గాజులతో 
చూపుల్లో కలువల వెలుగుతో  
వేళ్ళకు మణిఖచితఉంగరాలతో 

చెవుళ్ళకు పుత్తడి దిద్దులతో 

ముక్కుకు బంగారపు ముక్కులతో 
కాళ్లకు మెరిసే గజ్జల పట్టాలతో 
నడుముకు సువర్ణ వడ్డాణంతో 

మణిమయమైన భూషణములతో 

బంగారు తీగలతో అంగాంగ ప్రదర్సనతో 
ఏడువారాల సొమ్ముల అలంకారాలతో 
దివినుంచి దిగిన వనిత వైభవం తో

అందరి కళ్ళు ఆమెను చూడమంటే 

అతిశయోక్తి కాదేమో కదా
కళ్లప్పగిచి చూడని మొగవాడేవాడో 
ఉంటాడో మీరు చెప్పగలరా 

--((*))--  
Feather Flock Arrow  Tattoo Design by LapineTattooDesign:

తత్వబోధ -16

మాతా ఋణమ్ము తీర్చుకో
నిజమానుషత్వము తెలుసుకో
నీతి రాతలు అర్ధం చేసుకో 
ధర్మ మార్గమేదో తెలుసుకో

నమ్మకము వమ్ము చేయకూ
నమ్మిన వాన్ని ఎప్పుడు వదలకూ
కమ్మిన చీకటిని మార్చు వెలుగుకూ       
అమ్మిన వణ్ణి చెడ్డవని అనుకోకూ 

ఏపని ప్రారంభించకూ నీచబుద్ధితో
ఏపని ఆపకు కోప తాప బుద్దితో
ఆటంకములను ఎదుర్కో మనసుతో 
ప్రోత్సహించు రెట్టింపు ఉత్సాహంతో  

--((*))--
Feather tattoo design:
తత్వ బోధ - 17

నిప్పు లేక పొగ రాదు 
- మంచిగా ఉంటె చెడు చేరదు 
చెట్టు లేక నీడ రాదు 
-  తప్పులేక తగువు చెప్పి రాదు
ఒట్టు పెట్టి మాట తప్పరాదు
 - నీటి గట్టు కొట్టి ఉండరాదు 

 స్మశానం లేని ఊరు లేదు  
- బంధము లేని ఇల్లు లేదు 
తెలివి  రాని  విద్య   లేదు 
- బ్రతక లేని జీవియు లేదు 
భేదాలు చూపని ఇల్లు లేదు
-ప్రేమని పంచని స్త్రీయే లేదు  

పలుక చూపని మౌనం నిలవదు
- చెడ్డ చెలిమి చేయ వలదు   
వీరత్వము లేని సేన వలదు 
- నీటి లేని కీర్తి నిలవదు 
వేశ్య కూర్మి వలదు 
- భార్యను చులకన చేయవలదు

తేన టీగ కూర్చి తేన తినదు
-ఖడ్గమృగం కస్తూరి వాసన ఎరుగదు
స్త్రీల మనస్సు ఎవ్వరికి అర్ధం కాదు
మగువ లేని చోటున నగువే లేదు 
తల్లి ప్రేమ ఎప్పటికి మారాదు 
- తండ్రి ప్రేమ ఎప్పటికీ వదలదు
Feather with flowers and insects:
తత్వ బోధ -18

నీకే మర్ద మయిందో - 
నాకు మాత్రం అర్దముకాలా   
నీ కోరిక ఏమిటో తెలియదే 
నాకు కావాల్సినదేదో తెలుసుకోవా 

నీలో యే ఆలోచన ఉందో
నా అలోచన ఏమిటో తెల్సుకోవా  
నీ ఊహలకు రెక్కలొస్తే 
నా ఆశలు ఏమిటో తెలుసుకోవా 

నీ చూపుల్లో మార్పు ఏమిటో 
నా ఆకర్షణ కళ్ళను చూసుకోవా  
నీ గుండెలో ప్రేమ  చెప్పవేమిటో 
నా గుండెలో ముళ్ళు తీయలేవా 

నీవు చూడనట్లు ఉంటావేమిటో 
నా చూపు ఎప్పుడూ నీతోనే  
నీవు అలలపై మరుపు అవతావూ 
నా నీడ ఎప్పుడూ నీ చుట్టూనే 

--((*))--
Bonus: Feathers and Flowers and All the Pretty Things! - 31 of the Prettiest Mandala Tattoos on Pinterest - Photos: 'h
  తత్వ  బోధ  - 19 

మమత మమత ఒక్కటై  
తనువు తపన మార్గమై 
వలపు తలపు ఆశలై 
మనసు మనసు ఏకమై 

ఒకరికి ఒకరం కలిసే పోషిద్దాం 
ఇరువురము రక్షణగా జీవిద్దాం 
మనము కలిసే ఊర్జిత శక్తే యుద్ధం 
పరిమళములో పంచుటలో సంసిద్ధం

మనం మానసిక స్థితిలో శ్రమిద్దాం 
మనం చేయు పనిలో క్షమిద్దాం 
మనం సాద్యనట స్థితిలో శాంతిద్దాం 
మనం పూర్ణతమ స్థితిలో ప్రేమిద్దాం 

మన స్వాధ్యాయం ఏకాగ్రమూ ఫలవంతం
మన సంతృప్తే సేవాగ్రమూ సుఖమంతం 
మన సాఫల్యం  ప్రేమామృతమ్ ససుమంతం
మన తేజోవం తం విర్యార్ధం సమ మాత్రం 

--((*))--