19, జనవరి 2017, గురువారం

రైతు బాద (ఛందస్సు ) *

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

సర్వేజనాసుఖినోభవంతు 


*రైతు బాద (ఛందస్సు )

బత్క లేక చావ లేక
బట్ట కట్టి ఉండ లేక
గుట్టు విప్పి చెప్ప లేక
మిన్ను మన్ను నమ్మ లేక

పొట్ట కోసం అడ్కొ లేక
నీటి కోసం వెడ్క లేక
మట్టి మర్చి ఉండ లేక
చేను రక్ష చూప లేక

నోరు లేక తీరు లేక
నీలి రాత్రి బత్క లేక
దారి తెన్నుకాన లేక
పడ్తు లేస్తు ఉండ లేక

చెప్పు కొనే దారి లేక
విన్న వాడు ఓర్పు లేక  
కన్న  బిడ్డ  చూడ లేక
విద్య నేర్చి బత్క లేక

మొండి బత్కు ఈద లేక
నమ్మ కమ్ము వమ్ము లాయె
కంట  నీరు ఎక్కు వాయె
బత్కు రైలు బ్రేకు లాయె

మందు లన్ని కల్తీ లాయె
మృగ దండు ఎక్కు వాయె
అప్పు లోల్లు పీక్కు తినే
భార్య మాత్రం ధైర్యం చెప్పె

నీకు తోడు నేను ఉన్న
నాకు తోడు నీవు ఉన్న
మన్కి తోడు భూమి ఉన్న
ఓర్పు ధైర్యం మన్కి ఉంది    

నిండు డబ్బు ఉన్న వార్కి
  విద్య ఉన్న గొప్ప వార్కి
రాజ కీయ న్యాయ వాద్కి
రైతు బత్కు గుర్తు రాదె
          
పవన్ పుత్ర నమ్మి బత్కు
మంచి జర్గు ముందు ముందు
--((*))--
om sri raam 

*అప్ప గింత  (ఛందస్సు)
రవి (కామినీ, భామినీ, తరంగవతీ)- ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171  (ఛందస్సు)

స్త్రీకి పెళ్లి శోభ ఖచ్చితం
తల్లి తండ్రి పెళ్లి చేయడం
మంచి భర్త తెచ్చి కల్పడం
ప్రేమ భావ పంచి పంపటం          

మంచి మాట మించి పోకుండా
బంధు మిత్ర సంత సించెనే 
తల్లి తండ్రి సాగ నింపుటే
పెళ్లి చేసి అప్ప గింతలే  

కళ్ళ నీరు కార కుండుటే
ఇష్ట కోర్క తీర్చి పంపుటే
కష్ట పెట్ట కుండ సాగుటే
దివ్య బంధ ఒక్క టవ్వటం

అత్త మామ ఇంటి పెద్దయే
కన్న బిడ్డ  లాగ చూడుటే
భర్త ప్రేమ కల్సి పొందుటే
శాంతి పంచి కల్సి పొందుటే 

నీవు భర్త కీర్తి పెంచుటే
ధర్మ మార్గ పట్టి ఉండుటే
మంచి మాట పల్కి ఉండుటే    
శాంతి సౌఖ్య పంచి పెట్టుటే 
  --((*))--
   
ఛందస్సు "తరుణి "

దాచిన తేనెలు తోచే సమయం 
చూపిన అలక తీరే  సమయం
వేచిన ఆకలి తీర్చే సమయం
 దోచిన మనసు పంచె సమయం

జీవితము జీవించి ప్రేమించుటకే"
ప్రేమయును దీవించి బ్రతికించుటకే
బ్రతుకును సద్వినియోగం చేసుకొనుటకే
యోగం ఒకరికొకరు అర్ధం చేసుకొనుటలోనే    

 నవ్వులు చూపుతూ మనసు 
పువ్వుగా మార్చి  పరిమళాలను పంచే 
రివ్వున సాగిన గాలిలా
యవ్వన సొగసు మత్తుల ఆకలి తీర్చే 

ప్రతిన పూనకు నీవూ 
ప్రతి విషయములో సుఖమును పంచే మనసే 
అతిగా ఉండకు కష్టం
మతిచెడి మమత పంచక ఉంటె భయమే

నిజమే కళలు తెలిసిన బోధ చేయు
కనులే నిజము తెలిపిన వేద భూమి
వయసే పెరిగి నిజమగు  ధర్మ సేవ
మనసే తెలిపి నిజమగు సత్య బోధ 

పెదవుల్లో చిరునవ్వు మదిలో తలపే తెల్పు
అలజడే  అలకలే  యదలో వలపే తెల్పు
నడవడే మెలుకవే కరుణే తమకం తెల్పు
మగణితో మగువయే వయసే పరువం తెల్పు

మనసు తార్చుట ఎందుకే తలపు నారి
వయసు ఓర్పును పంచుటే నిజము నారి
సొగసు పంచక  వట్టిదే అలక నారి
అలుసు చూపియు పల్కుట మెరుపు నారి

  
 మానస మల్లికే మమత మాయను తెల్పుచు తానుగా సుమా

సుందర మెర్పులే వలయ వాకిలి మార్పుచు నేరుగా సుమా
వందన వేల్పులే  మలయ మారుత గాలుల  సేవలే  సుమా
ప్రేమతొ తన్మయం కలిగి మాటను నేర్పుతొ తెల్పునూ సుమా 

దేవుని కానుకే మనకు - జీవన సాద్వియు శక్యతే సుమా
నిర్మల వేడుకే సమయ - పాలన సత్వర ప్రేమలే సుమా
సేవలు చేయుటే తరుణి - భావము తోరణ దీపమే సుమా
విద్య యశస్సు భోగకరి - భార్య మనస్సుకి అర్ధమే సుమా
 
ప్రేమను పొందుటే సమయ - భావన రాగము ప్రార్ధనే సుమా 
స్నేహము పంచుటే మనసుకే శరళామృత భాష్యమే సుమా
కోపము ఉండకే ప్రణయ గీతము పాడుట సంతృప్తే సుమా   
కాలము వెంటనే నడచు - టే మన జీవన సార్ధకం సుమా        
ప్రేమను ప్రేమిస్తూ తరుణి ప్రేరణ నవ్వులు శాంతమూ సుమా  
సాధన  మంజులా మమత ఓర్పులె ప్రేరణ  సొంతమూ సుమా 
మార్పులు చేర్పులే మనసు మౌనిక మౌనము దీపము   సుమా
 భర్తల  హృదయం వనిత భోగము మార్గము కాంతియే  సుమా  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి