ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
*మహిళ (ఛందస్సు )
మగువ మనసు మధురత
మరులు గొలుపు చతురత
వలపు తెలుపు సముఖత
అవునని అనుచు మమత
మహిళ నడక జడ జత
వగలు సెగలుల చిరుత
ముఖము పెదవి సుమలత
కురుల కదలికల మమత
పడచు పరిమళ లలిత
పరుల ఎదుట విముఖత
నయనము వలన కలత
అభిన యనముతొ మమత
చిరు నగవుతొ శుభలత
మరులు గొలుపు మదురిత
మనసు ముడిపడితె జత
వయసు వలపుతొ మమత
అనువనువు అనుకువత
చలి చినుకుల కల లత
కలసి మెలసి ముఖలత
మది తలపు తెలుపు లత
--((*))--
పుట్టిన రోజు (chandassu)
UIUUIUUU - 8 (PADMAMAALA )
పుట్టినా రోజు పండుగే
నవ్వులా పువ్వు విచ్చెనే
బంధువుల్ స్నేహితుల్
శుభా- కాంక్షలూ తెల్పెవేలగా
మబ్బులూ కమ్మినా వేళా -
వర్షమూ కుర్సినా వేళా
కోర్కలూ వెల్లువై వేళా -
శోభలే చిందులై వేళా
రమ్ము నా కిమ్ము సౌఖ్యమ్మున్
జిమ్మ పీయూషముల్ సొంపై
సొమ్ము లీ జీవితమ్ముల్ బ్రే-
మమ్ముతో నుండఁగా ధాత్రిన్
నీల మేఘమ్ము లీరాత్రిన్
నేల యాకాశమున్ జేరెన్
చాలు నీయాట మాయావీ
పుట్టినా రోజు రావేలా
దివ్య సందేశ కొల్వులే -
త్రాగి నాట్యమూ చేయుటే
సామ రస్యాను సేవలే -
శోభ కల్పించే వెల్గులే
--((*))--
UIUUIUUU - 8 (PADMAMAALA )
పుట్టినా రోజు పండుగే
నవ్వులా పువ్వు విచ్చెనే
బంధువుల్ స్నేహితుల్
శుభా- కాంక్షలూ తెల్పెవేలగా
మబ్బులూ కమ్మినా వేళా -
వర్షమూ కుర్సినా వేళా
కోర్కలూ వెల్లువై వేళా -
శోభలే చిందులై వేళా
రమ్ము నా కిమ్ము సౌఖ్యమ్మున్
జిమ్మ పీయూషముల్ సొంపై
సొమ్ము లీ జీవితమ్ముల్ బ్రే-
మమ్ముతో నుండఁగా ధాత్రిన్
నీల మేఘమ్ము లీరాత్రిన్
నేల యాకాశమున్ జేరెన్
చాలు నీయాట మాయావీ
పుట్టినా రోజు రావేలా
దివ్య సందేశ కొల్వులే -
త్రాగి నాట్యమూ చేయుటే
సామ రస్యాను సేవలే -
శోభ కల్పించే వెల్గులే
--((*))--
*వచన కవిత (చందస్సు) కొత్తవృత్తము
III-UII-UII-UI -11
1 . గురువు తల్లియు తండ్రియు ప్రేమ అతిధి సత్యము నిత్యము ప్రేమ
కవియు వ్రాసిన పద్యము ప్రేమ
కధల జీవిత భావము ప్రేమ
2 .చెవికి చెప్పుడు మాటల యింపు
కునుకు గుప్పెడు గుండెకు సొంపు
వణకు తప్పుడు మాటల కంపు
తెలిసి తప్పులు చేయుట ముప్పు
3 .గమన ఆకృతి ప్రకృతి ఇచ్చె
జనత జీవన సుకృతి విచ్చె
సమయ సత్యము జాగృతి పంచె
విషయ వేదము జీవిత మిధ్యే
4.భయము భేదము కల్పన వల్లె
సుఖము శాంతియు నమ్మిక వల్లె
దిగులు భాధలు ఆత్మలు వల్లె
సమయ భావము అర్ధము వల్లె
5.నకలు చూపియు మోసము వద్దు
సెగలు చూపియు వేదన వద్దు
పొగలు బంధము సిద్దము వద్దు
పగలు ఎందుకు పెంచుట వద్దు
6. సతియు సేవలు చేయుట ముద్దు
పతియు ఆశలు తీర్చుట ముద్దు
మతియు ఇచ్చుట పంచుట ముద్దు
గతియు బట్టియు ఉండుట మూడు
7.తనువు తాపము శాపము కాదు
పరువు పోవుట పాపము కాదు
తగువు భోగము వల్లయు కాదు
మనువు కాలము బట్టియు కాదు
8.సుఖము పెంచును నాగరి తీరు
ముఖఃము మార్చును నాధుని తీరు
పరుల ప్రేమను పొందుట తీరు
తరుణ మాధురి సాధన తీరు
9.సహజ ధర్మము తో పని చేయు
పలుకు సత్యము గాపని చేయు
నరులు నిత్యము సాధన చేయు
వనిత కష్టము అంతము చేయు
__((*))__
*పెళ్లి చూపులు (కొత్త వృత్తము)
III-UII-UII-IUU - 12
వెలుగు రేఖలు చీకటిని తర్మే
పడచు ఆశయ సిద్ధికి కుదిర్చే
తలపు ఆశలు వాకిటన నిల్చే
వనిత కోరిక ముంగిటన వాల్చే
కనుల వెల్గులు మానసము దోచే
తెరలు కమ్మిన వాటమున లౌక్యం
కలువ పువ్వువసంతమును కోరే
విరియు వెన్నెల వేగమున చేరే
పుడమి వర్షముతో తడిసి విచ్చే
వనము కోయిల కూతలును పంచే
పవన మేచల చల్లగన వీచే
మగువ సఖ్యత మక్కువను పెంచే
వరుస నచ్చెను ఇష్టమును తెల్పే
వధువు మెచ్చెను పెళ్ళికియు మొగ్గే
వరుడు సందడి నిద్దురయు లేచే
అసలు ఆశలు తీర్చెనులె పెళ్ళే
--((*))--
వచన కవిత -2 (ఛందస్సు)
III-UII-UII-UIU -- 12
1. మనసు జబ్బుల డబ్బుల ఖర్చుయే
అలల తాకిడి సంద్రము ఖర్చుయే
విజయ తాకిడి సాహస ఖర్చుయే
జలము తాకిడి దాహము ఖర్చుయూ
2. నురగ గావెలు గూకల కాన్కుయే
బుడగ లావేరు పూవాలా కాన్కుయే
తడిక లా సమ భాగము కాన్కుయే
కలువ పువ్వులు నీటిలొ కాన్కుయే
3. మనుజ భాద్యత ప్రేమల తీరుయే
మమత భాద్యత శాంతుల తీరుయే
యువత భాద్యత విద్యల తీరుయే
కలత భాద్యత కష్టము తీరుయే
4 .ఎదురు గాలికి వేగము ఆగునా
సదరు ఖర్చులు చేసిన సాగునే
వగరు కాయలు తీపియు వేరునే
పొగరు మాటలు తోచుట వేరునే
5 .పడవ సాగుట నీటికి తెల్సునా
నడక సాగుట కాళ్లకు తెల్సునా
మునక తేలుట జీవికి తెల్సునా
అలక ఏడ్చుట నవ్వుకి తెల్సునా
6. మగువ మాటలు నమ్మిన శోభయే
వనిత వాదన విన్నను శోభయే
మహిళ మాటలు అర్ధము శోభయే
పడచు చేష్టలు ఇష్టము శోభయే
7. మరచి పోవును విన్నవి చెప్పటం
వలచి ప్రేమను పెళ్ళియు ఒప్పటం
సుఖము సత్యము భోదని తెల్పటం
వగచి ధర్మము తప్పక బ్రత్కటం
8 . జగతి కీహిత మాటలు తెల్పుతూ
మనిషి కీసమ శాంతులు తెల్పుతూ
మమత కీమను వాక్యము తెల్పుతూ
చదువు కీ సమ భావము తెల్పుమూ
-((*))--
వచన కవిత (ఛందస్సు )
UI-UI-UI-UII-IIUI -14 (KOTTA VRUTTAMU)
డబ్బు మీద ఆశ జబ్బును కొని తెచ్చు
కష్ట కాల మెప్పు డుండదు గమనించు
నమ్మ కంతొ మూగ జీవిని బతికించు
ఆశ వైపు పోక అర్థమును గ్రహించు
ఒప్పు చెప్పి నీతి వెంట నడవ వచ్చు
తప్పు చేస్తె ముప్పు వెంట నడక తంట
తప్పు ఒప్పు అందరికి తరుణ మంట
తీపి చేదు జీవి తాంతము మణి పూస
మాట మాట ఉంటె జీవితమున ముప్పు
ఆట పాట కల్పితే మనసున ఒప్పు
మాట నేర్పు తెల్పి సేవలు నువు పొందు
శ్రమ శక్తి ఉంటె మానసమున శాంతి
కన్న వారి ఆశ తీర్చుట మన వంతు
ఉన్నవారి కోరిక తీర్చుట మరొ వంతు
చిన్న పెద్ద పంతమే మనసులొ మార్పు
కాల మాయ ఎప్పుడు మనలను చూడు
విన్న నిత్య సత్య భాష ననుకరించు
కంట నీరు పెట్ట కండ అను కరించు
నువ్వు నవ్వు చూపి సంతసమున ఉంచు
శక్తి యుక్తి ముక్తి మార్గ మని తలంచు
--((*))--
*సంసార సుఖమే (కొత్త చందస్సు )
UUU-III-UUU-UUI-IIU --15
సంధర్బం మనకు నేస్తమై శ్వశ్చత తలపే
సంకోచం వదలి సందేహా ల్లేక సమన్వ
యంచూపించి చిరు సౌఖ్యాలే కల్పించి మనసే
మందిరం కలల తీర్చుట్లో సంసార సుఖమే
బాల్యంలో మనకు సద్బుద్దే నేర్పించి తరుణా
వేదాంతం తెలిపి బోధించే పాఠాలు తెలిపే
దీ అమ్మే మనకు విస్వాసం విజ్ఞానమును పం
చే నాన్నే మనకు బంధంగా సంసార సుఖమే
మంచివాని తలపే ఆనందం మార్గ మెపుడూ
ధర్మాన్నీ తెలిపి సత్యయాన్ని బోధించి నవ భా
వామృతం పలుకుగా ఆధ్యా త్మికంగ గురు భో
దాంమృతం సమము చేసేదే సంసార సుఖమే
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి