*మనసు నీతి (ఛందస్సు )
సంతోషం సగము బలమే
-జీవిత సత్యమే గా
ఉల్లాసం వలపు తలపే
- ప్రేమ సంతృప్తే గా
మాధుర్యం మదన కొరికే
- సరసం వళ్ళే గా
సాహిత్యం మెదడు మెరుపే
-మానసోల్లాసం గా
సంసారం సహాయ నటనే
-ఒక్కటి మార్పే గా
సంగీతం వయసు మరుపే
-ప్రాయ, ప్రేమ తత్వం గా
సద్భావం, సమత మమతే
-ప్రేమ మాధుర్యం గా
శృంగారం, మగువ మగాడే
-తృప్తి సంతృప్తే గా
ప్రోత్సాహం మరులు గొలిపే
-కాంత ప్రేమ శోభే
శ్రేయస్సే పలుకు తల్లియే
- మణి దీపం వెల్గె
రాద్ధాంతం రణము తలపే
స్త్రీల వళ్లే కాదే
ప్రాధాన్యం పరుల కొరకే
- గీతా భాష్యం భోదే
--((*))--
*లక్షణమే (ఛందస్సు )
మార్పు నేర్పు ఓర్పు చూపేది జీవితమే
మంచి చెడ్డ కక్ష తెల్పేది లక్షణమే
ఎండ వాన మంచు పంచేది ఆకాశమే
రాత్రి వెల్గు తృప్తి ఇచ్చడి సంతసమే
తల్లి బిడ్డ ప్రేమ గుర్తింపు నమ్మకమే
పాలు నీళ్లు పొంగు కల్పన ప్రణయమే
స్వచ్ఛ స్వేచ్ఛ ఇఛ్ఛ ప్రకృతి దైవతమే
కళ్ళ నీళ్లు నమ్మి నిర్ణయ తప్పిదమే
శక్తి యుక్తి ముక్తి బోధించు అమ్మతమే
నవ్వు ఏడ్పు డబ్బు మార్గము తండ్రితమే
జ్యోతి ఖ్యాతి నీతి తెల్పుట ధర్మతమే
నన్ను నిన్ను మన్ను భాద్యత పృథ్వితమే
-((*))--
కొద్దీ (ఛందస్సు )
తోమె కొద్దీ గిన్నె మెరుపు
రుద్దె కొద్దీ సబ్బు నురగ
పిండె కొద్దీ పండు నలుగు
కొట్టె కొద్దీ కొండ కరుగు
తవ్వె కొద్దీ నీరు పడుట
మెచ్చె కొద్దీ ఆశ పెరుగు
నచ్చె కొద్దీ భాధ మిగులు
నవ్వె కొద్దీ కళ్ళు మెరియు
ఉతికె కొద్దీ బట్ట చిరుగు
తురుమె కొద్దీ చిప్ప మిగులు
ముదిరె కొద్దీ బెండ తినరు
చితిపె కొద్దీ చీము కురియు
రాపిడి కొద్దీ వేడి కలుగు
సాధన కొద్దీ విద్య పెరుగు
సోధన కొద్దీ కొంత తెలియు
ఇష్టము కొద్దీ కాని దవును
--((*))--
*దైవమే చూపించే (ఛందస్సు)
మాటయే మనకు తీర్పు
-ప్రపంచం అంతయూ ఇంతే
ప్రతిభే జగతి మార్పు
-లోకంలో శాంతియూ కొంతే
దేహమే మనసు కూర్పు
-జీవంలో ప్రేరణే వల్లే
ప్రేమయే బతుకు ఓర్పు
-మౌనంలో మాటలే వల్లే
మార్పులే జగతి కొంతా
-భాష్యమే లాలనే కొంతా
ఏడ్పులే బతుకు కొంతా
-సద్భావం లేకయే కొంతా
శాంతులే కళలు కొంతా
-ఉల్లాసం ఊయలే కొంతా
గాయాలే మనసు కొంతా
-శృంగారం వేదనే కొంతా
శ్రీమతి మనసు చూసే
-సంద్రంలో అన్వేషి లాగా
శ్రీపతి గుణము చూసే
-స్థిరంగా సంతసం లాగా
ప్రేయసీ ధనము చూసే
-భంధంతో అర్పణ మాయే
ప్రేమలే మదిని చూసే
- దైవమే చూపించే దారే
--((*))--
*కవిత (తెల్సు )
వాస్తవం ఎప్పటికి నిప్పే
కాల్చటం ఎప్పటికి తప్పే
పుట్టేది అందరికి తెల్పు
గిట్టేది ఎవరికీ తెల్సు
శిల్పియే శిల్పమును చెక్కే
దేవుని శిల్పముకు మొక్కే
ప్రసాదం ఎప్పటికి కొద్దే
కొండత ఆలోచన ఇచ్చే
కొన్నేళ్లు మల్లెలకు సెంటూ
స్త్రీలలో ఎప్పటికి సెంటూ
ఇల్లాలే కుటుంబం జ్యోతి
భర్తయే వెలుగుకు వత్తి
కులమే కొలమానం కాదు
గుణమే బహుమానం నాకు
నీ కోసం అర్పించే నారి
నారీయే భర్తకు నిజందారి
--((*))--
*ఎప్పుడూ శుభోదయం
(రచన మల్లాప్రగడ రామకృష్ణ)
నిజానికి నేడు ఏమి జరుగుతున్నదో
నిరీక్షణ పెర్గి ఏమి పనులు చేయ కో
అన్యూన్యత తగ్గి నరక మార్గమో
అలసత్వం పెరిగి సులభ వదిలావు
ఆంతర్యపు స్పందనలు లేకయె
ప్రతిబింబం చేసే చర్య లేకయె
నీడను బట్టి తట్టి ఉండ లేకయె
ఆత్మీయల చెలిమి పొందలేకున్నావు
హృదయ స్పందనకు లొంగకయో
పలకరింపు అనేది ఇప్పుడు లేకయె
భవిషత్ అనేది ఏమిటో తెలీకయో
తల్లి తండ్రి మరచి దేశ దిమ్మరైనావు
మానసికంగా పొందే తృప్తిని మరిచావో
మనుషుల్లో మమతలను గమనించలేవో
ఎక్కడో ఉన్న సంతోషం కోసం ఉన్నావో
చదువుకున్న బికారి అని భాద పడతావు
నిజానికి నేడు కనుమరుగౌతున్న ప్రేమలు
మనుష్యులమధ్య ఉన్న సత్సంబంధాలు
ఆత్మీయత అనురాగం పంచే మనుష్యులు
లేరనుకుని మనసును కలత పెట్టుటెందుకు
మనసులు మధ్య సయోధ్యలు సద్భావనలు
సామీప్యతలు, అభిమానాలు, ఆప్యాతలు
స్నేహితులు, ప్రేమను పంచే తల్లితండ్రులు
ఇందరుండగా ఒంటరి వాడ వెట్లా అవుతావు
మనసును నిగ్రహించుకో - శక్తిని గ్రహించుకో
రూకల కోసం కష్టాన్ని నమ్ముకో - ప్రేమను పంచి
ఉన్న దానిలో నిజాయితిని గమనించి బ్రతికి
తోటివారికి బ్రతుకుమార్గము ఇచ్చే శక్తి ఉంది నీకు
దేశం నాకేమిచ్చింది అనకు
దేశాభివృద్ధికి నావంతు సహాయ పడాలి
తల్లితండ్రుల సేవా వృత్తి ధర్మం
పాటించి సాగు ఎప్పుడూ శుభోదయం
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి