23, ఫిబ్రవరి 2015, సోమవారం

Telugu Comedy Love story (అమ్మా నన్ను క్షమించు: )

Om Sri Ram
ప్రాంజలి       
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:
అమ్మా  నన్ను క్షమించు: 
  కధా సాగరం

బ్రహ్మానందం, రాము కలసి ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు చూస్తు నడుస్తున్నారు ఇద్దరు, అప్పుడే పరిగెడు తూ ఒక పిచ్చి ఆడ మనిషి అక్కడకు  రావటం జరిగింది, వీల్లు చూస్తున్నంతలో చిన్న పిల్లలు చుట్టూ మూగి పిచ్చి అమ్మాయి, పిచ్చి అమ్మాయి అంటూ రాళ్ళతో కొడుతున్నారు. వీరిద్దరు కలసి వాళ్ళందరిని తరిమారు, ఆమె బొమ్మను చేతితో  పట్టుకొని ఎడుస్తూ ముందుకు పోతున్నది, అప్పుడే కొందరు పొలీసులు వచ్చారు,  పిచ్చాసుపత్రి నుండి  పారిపోయి వచ్చినదని లాటీలతొ కొట్టి మరీ వ్యాను ఎక్కించారు పిచ్చి పట్టిన స్త్రీ ని . ఆదృశ్యమ్  చూసెటప్పటికల్ల రాముకు కళ్ళంబడి  నీరు తిరిగాయి,.  ఎందుకు రాము ఆమెను ఎక్కించుకు పోతుంటే, ఎందుకు మీకు తెలిసినవారుని చూసినట్లు చూసి భాద పడుతున్నావు. ఒక స్త్రీ పరిస్తితి చూసి నాకు భాద వేసింది. ఇటువంటి స్థితి ఎవ్వరికి రాకూడదు, అవును దేవుడు మనుష్యుల ఆడించి సంతోష పడతాడు, కొందరిని ఏడిపిస్తాడు.   

ఆమెను చూసినప్పుడు  మా అమ్మ గుర్తుకు వచ్చింది, మాఅమ్మకు పిచ్చేక్కినదని పిచ్చాసుపత్రిలో చేర్చారుట అప్పుడు నా వయసు 12 సంవస్చరాలు, అప్పటి  నుండి మా అమ్మను చూడాలని ఉన్నది, మా నాన్న అమ్మను గూర్చి ఎన్ని సార్లు అడిగినా చెప్పలేదు.  కనీసమ్ ఎక్కడ ఉన్నదో చెప్పమన్నా చెప్పుటలేదు, అప్పటి నుండి వెతకని స్తలములేదు, వెతకని రోజు లేదు. ఆ వెతుకులాటలోనే నీవు నాకు స్నేహితుడుగా మారావు, నా భాద చెప్పి నీకు భాద పెట్టుట నాకు ఇష్టములేదు, అందుకనే నాగురించి, మా కుటుంబము  గురించి నీకు చెప్పలేదు.

ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగాడు బ్రహ్మానందం,  ఆ విషయం  నీవె చెప్పాలి ఏమని చెప్పాలి నీకు తెలిసిన విషయం చెప్పు కాస్త కాలక్షేపం మవుతుంది.

వెంటనే అదిగో అక్కడ బల్లమీద ప్రేమ జంట ఎంత ముద్దుగా ఉన్నారు, వాళ్ళది  ప్రేమ వరకేనా,  పెళ్లికి కూడా   అంటున్నారా ఎట్లా తెలుస్తుంది అని బ్రహ్మానందం గొనుగుతున్నాడు.
ఎందుకాలోచిస్తావు ఒక్క  కాగితము తీసుకొని,  రాకెట్ చేసి వాళ్ళ మీదకు వదులు,  అప్పుడు నీకె తెలుస్తుంది, ఎంతెలుస్తుంది, వాళ్ళు చూసి,  కొవ్వెక్కి ఏమిటిరా,  ఆ చిన్న పిల్ల చాష్టలు అని నాలుగు ఉతుకుతారు, అందులో దానిమీద   ' ఐ లవ్ యు  ' అని మరీ వ్రాయమన్నావు.
గోతిలోకి దిగబోతూ   ' లోతెంతా  'అని,  ప్రేమలోకి దిగబోతూ  ' ప్రే మేం తా  ' అని, అలాగే కొన్ని విషయాలు తెలుసు కోవాలంటే పనిలోకి దిగితె కాని తెలియదు అని నవ్వుతూ చెప్పాడు రాము.

అతి కష్టం మీద కాగితం సంపాదించి  దానిలో చిన్న రాయిని పెట్టి రాకెట్ చేసి వాళ్ళపై విసిరాడు, అంతే  అది వాళ్ళ దాకా పోలేదు ప్రక్కనే ఉన్న నిద్ర పోతున్న ఒక కుక్కను తగలరానిచోట   తగిలింది  అంతే  ఒక్కసారి నిద్రలేచి  'బౌ బౌ  ' అని అరుస్తూ వీల్లను  ఏమ్బడి పడింది.   
అంతే  చేసేది లేక పిక్క  బలం చూపించి పరుగెత్తారు, ప్రేమ జంట వీల్ల పరుగును చూసి ఒక్కటే నవ్వు కున్నారు.
వెంటనే రాము ఆ ప్రక్కనే మాంసము ముక్కలు తో  బిరియాని చేసి అమ్మే బండి కనిపించిది, వెంటనే  రాము మఠన్  బిరియాని ప్యాకెట్ కొని దానిని చేతితో పట్టుకొని,  ఒక్కసారి ఆగి,  కుక్క మొఖంలో చూస్తు,  ప్యాకెట్ తీసి దాని ముందు పెట్టాడు, అంతే  అప్పటి దాక అరిచే కుక్క ఒక్క సారి పొట్లంలో ఉన్నది గబగబా తినటం చూసి బ్రహ్మానందం  వెనక్కు వస్తూ  ఒక్కటే నవ్వు,  అనవసరంగా చాలా దూరమ్ పరుగెత్తాను.                                          




మనం కూడా ఏమైనా తిందామా, అసలే నేను ఆకలికి తట్టుకోలేకున్నాను అన్నాడు బ్రహ్మానందం,  అది నాకు తెలుసు. రోడ్డు మీద అమ్మేవి ఎప్పుడు కొనకూడదు, తినకూడదు, ఎందుకంటే గాలిలో ధూలి రేణువులు ఉంటాయి,  మనం తినే వాటిపై వాలి ఉంటాయి. అవి మనకు కనిపించవు అవి మన శరీరములోనికిపోయి   రోగ క్రిములుగా మారి మొదట జలుబు తర్వాత దగ్గు. లేని రోగాలను తెచ్చుకున్న వార మవు తున్నాము అది అవసరమా ఇప్పుడు .

మహాను భావా నాకు చెప్పకు అసలే ఆకలితో ఉన్నాను, రోగాలు గురించి చెప్పి భాద పెట్టకు నీవు ఎం తిందాం మంటే అదే తిందాము.  అదిగో అక్కడ పుచ్చకాయ బండి ఉన్నది కదా మనం ఒక కాయ కొనుక్కొని తిని నెమ్మదిగా నడుద్దాము. దాని కన్నా వప్పు కున్నావు సంతోషం, అసలే ఇది హైదరాబాద్ ఆకలితో అలమటించి క్రింద పడ్డ గమనించే వారు ఉండరు, ఇంకా వీడొక మూర్చ వ్యాధి గ్రస్తుడు అని నాలుగు కాసులు ప్రక్కన పడేసే ఎంచక్కా వెళ్లి పోతుంటారు
అంతే కదా బ్రదర్. నీకు లోకం గురించి బాగా తెలుసు, అవును నేను సినమాలు చూసి నేర్చుకున్నా అయితే ఈ లోక విలువ చూడాలని ఉన్నదా, అంటే నీవు ఎం చేస్తావు, అసలే ఆకలి ఉండలేక క్రింద పడి పోయేటట్టు ఉన్నాను. అవును నీవు అన్నావుగా ప్రజలు ఎట్లా నీ చుట్టూ గమనిస్తారో చూస్తాను, అంటే ఓరి నాయనో వద్దు, పడొద్దు, ఏదో భుద్ది తక్కువై నోటి కొచ్చి నట్లు పేలాను, పుచ్చకాయను కొనిపెట్టు బ్రదర్.

అతిగా వాగకు వాగావనుకో  నీవొక నెక్సలైట్  అని తీసికెల్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంచుతారు, ఎవరూ అని అన్నాడు బ్రహ్మానందం, ఇంకెవరు మీ మావలు, నాకు పెళ్ళే కాలేదు నాయన, అక్కడ కెల్లాక నీకు పెల్లిచేస్తారు నాయనా, ఎవరునాయనా,  ఇంకెవరు నాయనా మన రక్షక భటులు నాయనా అంటే పొలీసోళ్ళ నాయనా  మరి ఇంకే వరును కున్నావు నాయనా  మావాలంటే.

నాకు ఇప్పుడు ఆకలి లేదు ఎమీలేదు ముందు రూముకు పోదాం పదా మా అమ్మ పంపిన దిబ్బరొట్టె ఇంకా ఉన్నది, అది తిని ఈరొజు ఆకలి తీర్చుకుంటా, ఎందుకు అంత  తొందర పడతావు,  ఇక్కడ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా ట్యాంక్ బ్యాండ్ పై ఉన్న విగ్రహాలే ఇంకా చూడలేదు, సరే ఆ పుచ్చాకాయన్న కొనిపెట్టు ఆ మహానుభావుడు నందమూరి తారకరామారావు పట్టు బట్టి విగ్రహాలు నిలబెట్టాడు, హుస్సేన్ సాగర్ లో బుద్ధుని విగ్రహం నిలబెట్టాడు, అన్ని ఉన్నాయి, ఆ యుగపురుషుని విగ్రహం ఇక్కడ లేదేమిటి, అదో పెద్ద కధ ఇప్పుడు చెప్పాననుకో నీవు పడి  పోతావు, ఈ రాష్ట్రం రెండు ముక్కలుగ చీలి పోయింది నీకు తెలుసా, నాకు తెలియదే ఇంకా ఎ లోకంలో ఉన్నావో

ఈ లోకంలో ఉన్నాను అదిగో బండి పుచ్చ కాయలు కొందాం పదా, ఇద్దరు కలసి పుచ్చకాయ కోయిన్చుకొని ముక్కలను కాగితపు  పల్లెం  వేసుకొని, తినబోతుంటే  బిచ్చగాడు అదే పనిగా వారి వంక చూస్తు ఉన్నాడు, వెంటనే రాము చేతిలో ఉన్న ప్లేటును ఆ బిచ్చగాడికి ఇచ్చి వెనక్కు వచ్చాడు, నీవు తిను నాకు ఆకలి కావటం లేదు అని మంచినీరు త్రాగి ప్రక్కనే ఉన్న బల్లపై కూర్చొన్నాడు.

అప్పుడే లూనా మీద ఒక వ్యక్తి వచ్చాడు, ఇదిగో రాము మీ నాన్న ఉన్న పలానా నిన్ను రమ్మన మన్నాడు, కారణం మాత్రము నాకు తెలియదు, మీ సెల్లు మ్రోగుతున్న తీయటం లేదుట అందుకే నాకు ఫోన్ చేసి చెప్పారు,  బాబు అని చెప్పి పోయాడు.

బ్రహ్మానందం నేను  వెళ్దామనుకున్నాను, మల్లి వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను అని చెప్పి  బిబి నగర్ పోతున్నాను అని చెప్పి సిటి బస్సు ఎక్కాడు. 

ఇంట్లోకి అడుగు పెట్టబోయాడు, తలుపు మీద ఉన్నా కాలింగ్ బెల్ కొట్ట కుండా  ఉండి  వింటున్నాడు రాము,  అప్పుడే పిన్నమ్మ పెద్దగా అరుస్తున్నది, నీ కొడుకును ఊరిమీద బలాదూరుగా తిరగ మన్నావు, ఇక్కడ ఇంటి పనులు ఎవరు చేస్తారు, మీకు కొంచమైన ఇంకిత జ్ఞానమున్నదా, ఉన్న డబ్బులన్ని కర్చుచేసి  అబ్బాయిని చదివించావు ఏదన్న ఉద్యోగము  వచ్చిందా, ఏదన్న షాపులో చేరితే కొంత సంపాదన అన్న ఉండేది, ఇంట్లోకి కర్చులకన్న పనికొచ్చేవి, సంవస్చరం నుంచి అక్కడ ఇంటర్వు, ఇక్కడ ఇంటర్వు అని ఉన్న డబ్బులు కర్చు చేసాడు, తిండి పోతూ, తిరుగుబోతు, ఎక్కడన్నా యర్రగా బుర్రగా అమ్మాయిలు  కనిపిస్తే చాలు వాళ్ళ చుట్టూ తిరుగుతాడు, కొడుకు కొడుకు అని మీరు అనుకుంటున్నారు, వాడికి ఇంటి భాద్యతులు ఎమీ తెలియటం లేదు, నేను ఏదన్న అన్నానంటే వాడు చిన్నఅ పిల్లవాడు అని మీరు సమరిమ్చుతారు, నేను ఏదన్న అంటున్నపుడు నోరు ఎత్తరు, మీకెదన్న కావాలన్నప్పుడు సుమతి సుమతి ఇటురా, ఇటు కూర్చొ అంటూ నెమ్మదిగా ఎక్కడలేని ప్రేమ కురిపిస్తారు,   ఆ ఎందుకే  ఈ పురాణ ప్రవచనము అని దగ్గరికి లాక్కుంటారు ఆమాటలకు అదికాదే అన్న నాన్న మాటను విని కోపంతో చెతిలొఉన్న చెంబుని క్రింద పడేసి పిలిచారుగా మీ అబ్బాయి రానీయండి వాడినే అడుగుతా అని అరుస్తున్నది  నాన్నను.
                                                                         రాము అప్పుడే చాలా కోపము తెచ్చుకొని పిన్నమ్మను అరవాలని, కొట్టాలని అనిపించిది,  కాని  నాన్న పరిస్తితిని అర్ధం చేసుకొని రాత్రికి ఇంటికి చేరుదామని అనుకొని అక్కడ దగ్గరగా ఉన్న విఘ్నేశ్వర దేవాలయములోకి వెళ్లి అక్కడ ఉన్న దేవుల్లందరికి నమస్కారములు తెలియపరిచి,  అక్కడ పెట్టిన ప్రసాదమును తిని, కొంత ఇంటికి తీసుకెల్లవఛని కవర్ఫ్లోపెట్టుకొని,  అక్కడే కూర్చున్నాడు.

మధ్యాన్నం అన్నదానం జరుగుతుందని తెలుసుకున్నాడు  అక్కడే ఉండి,  భోజనం చేసి వేలదామనుకున్నాడు రాము.  ప్రక్కన ఉన్న పుస్తకాల షాపులో పుస్తకము తీసుకొని చదువుతూ మూల కూర్చున్నాడు, అప్పుడే ఆ గుడిలోకి అడుగు పెడుతున్నారు,  పినతల్లి సుమతి, చెల్లి సుచిత్ర, తండ్రి హరిచంద్ర రావు.

నాన్న అంటూ చెల్లి సుచిత్ర అన్నయ్య వచ్చాడు నాన్న అన్నది, వాడు గుడికి రావట మేమిమిటి, నీవు ఎవరిని చూసి ఎవరనుకున్నావు, లేదు నాన్న అంటూ,  అమ్మాఅడుగో అక్కడ మూల కూర్చున్నవాడు అన్నయ్య కదు, అవునూ ఇంటికి రాకుండా ఇక్కడ కూర్చొని చదువు కుంటున్నాడేమిటి, ఇల్లు ప్రక్కనే ఉంది ఇంటికొచ్చి చదువు కోవచ్చుగా, నేనేమన్న రాక్షసినా, కూర్చొని చదువు కుంటానంటే నేనెప్పుడైనా వద్దన్నాన, అంటు  మీ పుత్రికారత్నం పిలవండి మీరు పిలిస్తే వస్తాడు, నేను పిలిచాననుకోండి రుస రుస లాడుతాడు, ఏమిటో మీ తండ్రి కొడుకుల భంధం  నాకేం అర్ధం కావటం లేదు అన్నమాటలకు, నాన్న మీరెప్పుడొచ్చారు అని దగ్గరకొచ్చి పలకరించాడు రాము. 

ఇప్పుడే వస్తూన్నము ఇక్కడున్నావేమిటి, ఇంటికి రామన్నాను కదా , అవును నాన్న రమ్మనమన్నావు నాకు మన కొరియర్ లెటర్ ఆతను చెప్పాడు, ఇంతకు ముందే వచ్చాను దేముడి ప్రసాదము తీసుకున్నను, మీకు ఇద్దామని   ఈ కవర్లో ఉంచాను, ఏదో పుస్తకము కనిపిస్తే ఇక్కడ కూర్చొని కాసేపు చదువుకుందామని కూర్చున్నాను, సరే నీవు ఇంట్లో కూర్చొ మేమోచ్చేదాక, ఇదిగో   తాళం అని ఇచ్చాడు, తాళం తీసుకొని వెల్ల బోయాడు. 

 చెట్టంత తల్లిని, ఇక్కడ ఉన్నాను పలకరించాలని లేదా, ఈ అమ్మ నీకు ఏమి తక్కువ చేసింది బాబు, అంత  తల తిప్పు కొని తిరుగుతున్నావు,  తండ్రి కొడుకు మద్య ఎం రహస్యాలున్నాయో ఏమో నాకెందుకు కాని, నీవు ఇంట్లోకి వెళ్లి టేబుల్ పై ఉప్మా ఉంచాను వెళ్లి తిను,  ప్లేటు ఆగిన్నే కడిగి బోర్లించు, మేము వచ్చేటప్పటికల్ల కొంచం ఆలస్య మవు తుంది, ఎందు కంటే ఇక్కడ అన్న సంతర్పణం కదా అందుకని ప్రసాదం తిని మరీ ఇంటికి వస్తాము, తలుపేసుకొని మరీ పడుకో, అసలే రోజులు మనకు బాగ లేదు దొంగలు పడినా పడవచ్చు, ఆప్పుడు దేవుడి ఉస్చవ విగ్రహము ఊరెగిమ్పుగా మేళ తాళాలతో వచ్చింది, వేల్లోస్తానాన్న అంటూ వెళ్ళిపోయాడు రాము, 

ఏమిటండి మీ అబ్బాయి వెళ్ళొస్తా నాన్న అని చెప్పి వెళ్లి పోతున్నాడు,  అమ్మ వెళ్ళొస్తా అని చెప్పలేదు అన్నది. 
మనసులో అనుకున్నాడు హరిశ్చంద్ర రావు, ఏనాడు నీవు తల్లిగా వాడ్ని చూడలేదు, నన్ను భర్త గూ చూడలేదు తప్పు అంతా  నీలొ పెట్టుకొని వాడ్ని అంటావెందుకు, ఏమిటండి అట్లా గోనుగుతున్నారు,  ఎమీ లేదు అదిగో దేవిడికి దండం పెట్టుకో అంటూ దేవుడి వైపు తిరిగి దండం పెడుతూ నుంచున్నాడు.
  
అప్పుడే ఆ గుడిలో శ్రీ ఆది శంకరాచార్యులు విరచితమైన కనకధార స్త్రోత్రము గురించి బ్రహ్మ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు ఉపన్యసిస్తున్నారు.  అధికారు తెలియపరిచారు, భక్తులు తమ తమ స్తానములలొకూర్చొని వింటున్నారు        
             
   శ్రీ శంకర భగవత్పాదులు  బ్రహ్మ చర్యాశ్రమమునవలంబించి  మధుకర వృత్తితో జీవించుచు వేద వేదాంగాది విద్యల నభ్య్యసించు  చున్న కాల మది.  ఆయన ఒకనాడు మధుకరమునకై  ఒక గృహము వాకిట నిలిచి "భవతి! భిక్షాందేహి" యని అనెను.  ఆ ఇల్లాలు నిరుపేద . మహాసాద్వి  తమ  పేదరికమునకు వగచుచు ఒక్క ఉసిరిక పండును భిక్షగా పెట్టి కన్నీరు కార్చేను.  శ్రీ శంకర దేశి కేంద్రుడు ఆశువుగా ఇరువదినాలుగు శ్లోకములతో శ్రీ మహాలక్ష్మిని స్తుతించెను.  ఆ దేవి ప్రత్యక్షమై శ్రీ శంకరులు కోరిన విధముగా బంగారు ఉసిరిక  పండ్లను  ఆ నిరుపెదరాలి  గృహమున వర్షముగా  కురిపించెను.    శ్రీ శంకర భగవత్పాదులు  ఆ లక్ష్మీదేవినిస్తుతించిన ఇరువదినాలుగు శ్లోకములకే  కనకధారాస్తవము (స్త్రోత్రము) అని పేరు .  దీనిని అనుదినము చదివిన వారికి సకల సంపదలు చేకూరును.  అనాదిగా అనుదినము అనేకమంది దీనిని చదువుతున్నారు,  భారతదేశము మరియు  ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు  మరియు   ప్రతిఒక్కరు చదివి ఆ లక్ష్మిదేవి కృపకు పాత్రులగుదురు.  



                                                                                    to be continue tomorrow  

................................................................................................................................................................

1) శ్లో.  వందే వందారు మందార మిందిరా  నందకందలమ్ 
           ఆమందానంద  సందోహ భంధురం సింధురాననమ్
 
ప:          ఇందిరా నంద కందలు నేకదంతు
              అఖిల పందారు మందారు నభయవరదు
              ప్రవిమలానంద సందో హ భందురుని ప్ర
              నటుల్ నర్పింతు భక్తి  విఘ్నంబు  తొలగ  
 ............................................................................................................
2) శ్లో.   అంగం హరే: పులక భూషణ మాశ్రయంతి
            భ్రుంగాంగ నేవ ముకులాభరణం తమాలం
            అంగీ కృతాఖిల విభూతి రపాంగ లీలా
            మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా:     
 
ప:   రంగాగుమోగ్గలంబరగు రమ్యత మాలముపైకినేగు సా
       రంగి యనంగ వెన్నుని యురమ్మున నుండిన సారసాక్షి ఆ
       మంగళమూర్తి  నాపయి సమంచిత ముగ్ధ  కృపావలోకనా
       పొంగ  కటాక్ష లీలలను బర్వేడుగాక నిరంతరంబుగా

 
తా:    మొగ్గలే  నగలు గాగల తమాల వృక్షమును ఆడు తుమ్మెద ఆశ్ర  
          యించినట్లు, పులకలతో  నిండిన శ్రీ హరిపైకి ప్రసరించు నదియు  
          భక్తులకు సర్వసంపద లొసంగు  జాలు నట్టి మంగళ  
           దేవతయైన  లక్ష్మీదేవి కరుణ తోడి కడగంటి చూపు నాకుమంగళ 
           ముల నోసంగునుగాక .         
.............................................................................................................
3)శ్లో.    ముగ్ధా ముహర్విదధతీ వదనే మురారే:
            ప్రేమ త్రపా ప్రణిహితాని గతా గతాని
            మాలా దృశో  ర్మ్దుదుకరీవ మహోత్పలే యా   
           సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:
 
ప:    చూచుచు  ప్రేమతోడ హరి సుందరరూపము,  శౌరి ప్రేమతో
        జూచినయంత సిగ్గుమెయి చూపుమరల్చుచు నుత్పలంబులో
        నేచు మరందముంగొనగ నేగెడి  భ్రుంగి విలాసలీలలన్
        దోచేడు భాగ్యలక్ష్మి కృపతోడుత  నన్నును జూచుగావుతన్   

 
తా:      మకరమ్దముకై నల్లగలువపైకి రాకపోకలు సాగించు ఆడు   
             తుమ్మేద వలె శ్రీ మహావిష్ణువు మొగముపైకి ప్రేమతో సిగ్గుతో 
             మనోహరములగు చూపులను పరపుచు అయన 
             చూచినంతనే  మాటికి సిగ్గుతో మరల్చునట్టి లక్ష్మీదేవి  
             చూపుల పరంపర నాకు సిరిసంపద లోసగునుగాక.
........................................................................................................
 
4.శ్లో.    విశ్వా మరేంద్రపద విభ్రమ దాన దక్ష
            మానందహేతు రధికం మురవిద్విషో పి
            ఈ షన్నిషీదతు మయి  క్షణ మీ క్షణార్ధం
             ఇందీ వరోదర సహోదర మిందిరాయా:   

 ప:     ఈ యగుజాలునట్టి దమరేం ద్రుని రాజ్యమునైనగని, నా
          రాయనమూర్తికెంతయు ముదావహమైనది, తమ్మిదుద్దుమే
          ల్చాయకు సాటివచ్చునది సారసవాసినిఐన లక్ష్మి  అ
          త్యాయత లోచనాంచల కటాక్షము నాపైబర్వుగావుతన్
 
తా:     దేవేంద్రుని రాజ్యమునైన ఈయగలదియును శ్రీ మహా  
           విష్ణువునకు ఆనందము  కలిగించునది    యును, తామర  
           దుద్దు పసిమి మిసిమి గలిగిన మేనిఛాయగల లక్ష్మీ దేవి
           కరుణా కటాక్షము  నాపై సదా ప్రసరించు  గాక      
 .....................................................................................................
5.శ్లో.     అమిలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
             ఆనంద కంద మనిమేష  మనంగతంత్రం
             ఆకేకరస్థిత కానీనిక పద్మనేత్రం
             భూత్యై భవే న్మమ భుజంగ  శయాంగనాయా:
 
ప:     అరమర లేని ప్రేమను ననంగుని మోహము మోడ్పుకన్నులన్
        గురియగుదన్నుజూచెడి ముకుందుని మోహమును గాంచి సిగ్గుచే
        మురిపెముగా మురారి నరమోడ్పు కనంగతోడ జూచు ఆ
        సిరి కరుణా కటాక్షములు శ్రీల నొసంగుత నాకు నెప్పుడున్

తా:   మన్మధుని ప్రేరణచేత అమందానందముతో, అరమోడ్పు      
        కన్నులతో రెప్ప వాల్చక తనవైపు చూచుచున్న మహావిష్ణువును 
       గాంచి సిగ్గుతో కమలములవంటి అరమోడ్పు  కన్నులతో  కంటి
        పాప నోరగా జేసి పతివైపు చూచుచున్న పాలకడలి పట్టి లక్ష్మీ దేవి 
        కటాక్షము నాకు సమస్తైశ్వరములు నోసగుగాక.  
............................................................................................................
6.శ్లో.      కాలంబుదాళి  లలితితోరసి కైటభారే:
              ధారాధరే స్పురతి  యా తటి  దంగనేవ
              మా తుస్సమస్త జగతాం  మహానీయమూర్తి:
               భద్రాణి మేదిశతు భార్గవ నందనాయా: 


ప :            నీలపయౌ ధరంబునను నిగ్గులుదేరు తటిల్లతాంగానం
                 బోలిమురారి వక్షమున మొదముతోడ వసించి కుర్మిమై
                 హేలగ సర్వలోకముల నేలుచు నుండెడి  కన్న  తల్లి  ప
                 ద్మాలయ  నాకోసంగుతను మంగళముల్ సతతం  
                 బుదారతన్

తా:           నల్లని మబ్బులో మెర యు చున్న మెరుపు తీగవలె  శ్రీ 
               మహావిష్ణు హ్రుదయమున వసించుచు, సమస్త లోకములను 
                చల్లగా పాలించు కన్న తల్లి భ్రుగు నందనయగు  లక్ష్మీ  
                దేవి నాకు సమస్త శుభములు నొసంగును గాక             
........................................................................................................... 
7. శ్లో :     బాహ్వాంతారే మురజిత: శ్రితకౌస్తుభే యా 
               హారావళీవ   హరినీలమఈ  నిభాతి
               కామప్రదా భాగవతోపి  కటాక్షమాలా
               కళ్యాణ మావహాతు మే కమలాలయాయా: 
 

ప:  అతులిత కౌస్తుభం బురమునందున దాల్చిన విష్ణు  వక్షమం
      దతి  రుచిరంబు నీల మణిహారము వోలె వెలుంగు నిందిరా
      సతి సవిలాస ముగ్ధ వికసన్నవకైరవ  లోచనాంచలా
      తత కమనీయదృక్కులు సతంబు శుభంబు లోసంగు గావుతన్

తా:  కౌస్తుభ రత్నాలంకృతమైన శ్రీ మహావిష్ణువు వక్షమునందు  
       వసించేడి  లక్ష్మీ దేవి యో క్క ఇంద్ర నీల మణిహారము వలే 
       విరాజిల్లు కరుణా తరంగితములైన కడగంటి చూపులు సదా నాపై  
       ప్రసరించు నుగాక.  
 .......................................................................................................
8. శ్లో :      ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ప్రభావాత్
                మాంగల్య  భాజి  మధుమాధిని మన్మధేన
                మయ్యా పతే  త్తదిహ మంధర మీక్షణార్ధం
                మందాలసంచ  మకరాలయ కన్యకాయా:
 
ప:  ఏయమప్రేమపూర్ణములు దృక్కులు విశ్వ ము నేల్లగావ, నా    
      యణమూర్తి కాదినిననంతముశక్తినొసంగేనట్టి                                
      త్యాయత పద్మనేత్ర మకరాలయపుత్రి కటాక్షవీక్షణల్
      చేయుత  మంగళంబుల సశేషముగాను నిరంతరంబుగా

తా:  సంపూర్ణప్రేమ భరితములైన ఏ చూపులు సృష్ట్యా దిని శ్రీ 
       మహావిష్ణువునకు విశ్వసంరక్షనకై అనంత శక్తి నొసంగెనో అట్టి  
       క్షీరసాగరతనయయగు లక్ష్మి దేవి కటాక్షవీక్షణములు నాపై 
       ప్రసరించును గాక.
...........................................................................................................  

9. శ్లో :      దద్యా ద్దయ్యానుపవనో ద్రవిణాంబుధారా
                మస్మి న్నకించన విహంగశిశౌ  విషణ్ణే
                దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
                నారాయణ ప్రాణయినీ  నయనాంబువాహ:
ప:  కరుణా మారుత చోదితంబులతులే కల్యాణి దృక్పధముల్
      చిర కాలార్జిత పాపపుంజము వలె న్వేదంబు పోకార్చునో
      పరితప్తాకుల చాతకంబునగు నాపై నార్తి చల్లారగా
      కురియుమ్గాక దరిద్రతా జడిమ లేకుండా న్నిరుల్ సంపదల్

తా:  శ్రీ మహావిష్ణువు ప్రియసతియైన శ్రీ మహాలక్ష్మి కటాక్షవిక్షణ మనేడి  
      మేఘము దయయను మారుతముచేత ప్రేరితమై చిరకాలార్జిత పాప 
      రూపమగు చెమటను పోగొట్టి పేద చాతక  పక్షికూననగు నాపై కనక 
       వర్షమును తనివితీరా కురియునుగాక .  
..........................................................................................................
10.శ్లో       ఇష్టా వశిష్ట మతయోపి యయా దయార్ద్ర  
               దృష్టా స్త్రివిష్ట మపదం  సులభం భజన్తే
               ద్రష్టి: ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం
               పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:
 
ప:  అనయం బెవ్వడు పుణ్యకార్యముల జేయన్లేదో యవ్వానికిన్
      అనంఘంబైన మహేం ద్ర రాజ్యమును నీయంజాలునో  సత్క్రుషణ్
     కనకాభ్జోదర సోదరంబాగు తటిత్కామ్తి స్త్రకాసిమ్చు ఆ
     కనదబ్జాసన  లక్ష్మి  నాకిడు సనర్ఘంబైన భాగ్యంబులన్

తా:  ఎన్నడును ఎట్టి పుణ్యమును కుడ  చేసి యుమ్దరో అట్టి వారికి  
       సైతము దయతో దేవేంద్ర పదవినైన ఈయగల్గినదియును 
       పద్మములోని పసిడి కాంతులుగల మేనిచాయ గల లక్ష్మీ దేవి
       కటాక్ష వీక్షణము నాకు అనంత సంపదల నొసగును గాక.  
 ........................................................................................................
 11.శ్లో      గిర్దేవతేతి  గరుడధ్వజ సుందరీతి
              శాకంభరీతి శశి  శేఖర వల్లభేతి
              సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  
              తస్యై  నమ స్త్రిభువనైకగురో స్తరు ణ్యై:

ప:  వనజభవునకు సృష్టిలో వాణి  యనగా
      రక్షణము నందు శౌరికి రమ యనంగ
      ప్రళయవేళను శివునకు పార్వతి యన
      సాయపడు నిందిరకును సాస్టాంగ నతులు

తా:  లోకములను సృజించువేళ  బ్రహ్మాకు సరస్వతిగాను, లోక రక్షణ    
        మందు నారాయణునకు లక్ష్మిగాను ప్రళయ కాలమున 
        శంకరునకు  శాకంభరియనబడు  పార్వతిగాను 
        సర్వవిధముల  సహకరించు ఆ పరాశక్తికి నమస్కారములు.    
...............................................................................................................................................................
12. శ్లో     శృ త్యై  నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
               రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 
              శక్యై నమోస్తు శతపత్ర  నికేతనాయై
              పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ ఫల్లభాయై:

ప:  శుభ ఫలప్రద  యగునట్టి శ్రుతికి సతులు
      రమ్య గుణరత్న నిధిఐన రతికి సతులు
      స్వ ఛ శత పాత్ర  వాసినీ  శక్తి  సతులు
      పూజ్య పురుషోత్తముని పత్ని పుష్టి సతులు

తా:  యజ్ఞాది పుణ్యకార్యములకు కారణ భూతఇన వెదరూపిణికి  
       శ్రీలక్ష్మికి నమస్కారములు,  సద్గుణములకు సాగారమైన రతి 
       స్వరూపిణికి నమస్కారములు, నూరు రేకుల పద్మ మందు  
       వసించు శక్తి  స్వరూపిణికి నమస్కారములు.  పురుషోత్తముడగు 
       విష్ణు దేవునకు పత్నిఐన  పుష్టి  స్వరూపిణికి నమస్కారములు.
.......................4
వ రోజు  (01-03-2015)........................cont...................................................
13.  శ్లో :    నమోస్తు నాళీ క నిభానానయై
                 నమోస్తు దుగ్దోదధి  జన్మభూమ్యై
                 నమోస్తు సోమామృత సోదరాయై
                  నమోస్తు నారాయణ వల్లభాయై

ప:  సరసిజాత  సమాస్యయౌ సతికి నతులు
      క్షీరసాగారభవయైన సరికి నతులు
      తత సుధాకర సుధల సోదరికి నతులు
      సరసిజోదర పత్నికి సతము నతులు

తా:  కమలమువంటి మొగముగల లక్ష్మికి నమస్కారములు.  పాల 
       కడలి గారాబుపట్టియగు సిరికి నమస్కారములు.  చంద్రునకు  
       అమృతమునకు తోబుట్టువగు  లక్ష్మికి నమస్కారములు.  శ్రీ 
       మహావిష్ణువునకు ప్రియసతి ఐన  లక్ష్మీదేవికి నమస్కారములు. 
 ...........................................................................................................
14.   శ్లో :   నమోస్తు హేమామ్భుజ పీటికాయై
                నమోస్తు భూమండల నాయి కా యై
                 నమోస్తు దేవాది సుపుజితాయై
                  నమోస్తు శార్జాయుద వల్లభాయై :

ప:  కనక పద్మ నివాసినీ  కమల నతులు
      రమ్య భుమండలంబెలు రాజ్ఞి నతులు
      వానవాదుల కరుణించు పద్మ నతులు
      శార్జ  పాణిప్రియా సరోజాన్య  నతులు  

తా:  స్వర్ణ పద్మ వాసినియగు లక్ష్మీదేవికి నమస్కారములు.  సమస్త 
       భుమండలమును పాలించు మహారాజ్నికి నమస్కారములు.  
       ఇంద్రాదేవతలను కరుణతో కాపాడు కన్నతల్లికి నమస్కారములు.  
       సార్జమను విల్లు గల శ్రీ మహావిష్ణువునకు ప్రియసతిఐన శ్రీ 
       మహాలక్ష్మికి నమస్కారములు.
.........................................................................................................
15: 15. శ్లో :     నమోస్తు దేవ్యై  భ్రుగునందనాయై
                నమోస్తు విష్ణో రురసి స్థితాయై
                 నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయై
                  నమోస్తు దామోదర  వల్లభాయై :
 
ప:  భ్రుగుతనూభవ అలికులవేణి నతులు
      విష్ణువక్షోనివాసినీ వేలనతులు
      కమలవాసిని శ్రీ దేవి కమల నతులు
      నతిననాభుని వల్లభా నతులు నీకు

తా:  భ్రుగు మహర్షిపుత్రిఐన శ్రీదేవికి నమస్కారములు.  శ్రీ విష్ణు వక్షస్థల 
       నివాసినికి లక్ష్మికి నమస్కారములు.  కమలవాసినిఐనకమలకు 
        నమస్కారములు.  నందసుతుడైన శ్రీ  కృష్ణునకు   రుక్మిణి 
        నామముతో పత్నిఐన శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు.      
........................................................................................................
 16.:శ్లో :    నమోస్తు కాన్యై కమలేక్షణాయై
                నమోస్తు
భూత్యై భువన ప్రసూ త్యై
                 నమోస్తు దేవాదిభి రర్చితాయై
                  నమోస్తు నందాత్మజ  వల్లభాయై :

 ప:  కాంతి రూపిణి  ఐన ఒకమల  నతులు
      అఖిల సంపత్ప్ర దాయి నీ  అంబ నతులు
      దేవముని గణపూజితా దేవి  నతులు
      నందన సుత వల్లభా పద్మన  న నతులు

తా:  పద్మములవంటి  కన్నులుగల కాంతరూపిణికి   
      నమస్కారములు.   లోకజననికి, ఐస్వర  రూపిణికి  
      నమస్కారములు,  ఇంద్రాది దేవతలు చేత పుజింప బడు
      శ్రీదేవికి నమస్కారములు. నందసుతుడగు శ్రీ కృష్ణునకు
    రుక్మిణి నామముతో సతిఐన లక్ష్మీదేవికి నమస్కారములు .     ...........................................................................................................
17: శ్లో :      సంపత్కరాణి  సకలేంద్రియ నందనాని
                  సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
                  త్వద్వందనాని దురితాహరణోద్యతాని
                  మామేవ మాత రనిశం కలయంతు మాన్యే  

            ప:  సకల సంపత్క రంబులు  సారసాక్షి
                  విందు లఖిలేంద్రి  యమల ఆనందములకు
                  పాపహరములు సామ్రాజ  అ  భాగ్యదములు
                  పద్మ జనయిత్రి నీకిడు వందనములు

తా:  పద్మ పత్ర విశాలలోచనా మాతా నీకు చేయు    
       వందనములు , సకల  సంపద్ర్పదములు
       సకలెంద్రియములకు ఆమమ్దా అమందా నంద ముల
       విందు చేయును .  సర్వ పాపములను తొలగిమ్చును. 
       సామ్రాజ  వైభవమును  సైతము యీయ గలవు. తల్లి
       నీకు సదా వందన మొనర్చు భాగ్యము  నాకే 
       కలుగునుగాక  
............................................................................................................
18. శ్లో :       యత్కటాక్ష సము పాసనా  విధి:
                 సేవకస్య  సకలార్ద  సంపద:
                 సంతనోతి వచనాం గ  మానసై
                 త్వాం  మురారి హ్రుదయేశ్వరీం  భజే.  

ప:  సకల సంపద్ర దంబులు  జనని నీదు
      సాంద్ర  కరుణా కటాక్ష వీక్షణములమ్మ
      భక్తితో గొల్తు నీ పాద పద్మములను
      స్తుతి యో నార్చెద త్రికరణ  శుద్ధిగాను

తా:  ఎవరి కరుణా కటాక్ష వీక్షణము  భక్తితో సేవించు వారికి సమస్త 
        సంపదలోసంగునో అట్టి మహాలక్ష్మీ  శ్రీ హరి హృదయేశ్వరి  నిన్ను 
       త్రికరణ శుద్ధిగా ఆరాధించెదను 
 ..........................................................................................................................................................................19. శ్లో :        సరసిజ నయనే సరోజ హస్తే
                    ధవళ తరాం శుక  గంధ మాల్య శోభే
                    భగవతి హరివల్లభే మనోజ్జ్నే
                    త్రిభువన భూతికరి ప్రసీద మహ్య్యాం 

ప :  కమలలోచన  జనయిత్రి  కమలహస్త
       ధవళతర గంధ  మాల్య  వస్త్రా మానోజ్న
       భగవతీ  హరివల్లభా భాగ్యదాత్రి
       కరుణతో  బ్రోవుమా మమ్ము కన్నతల్లి.

తా : కమలముల  కన్నులు గల తల్లీ,  కమలము కరమునందు  గల 
        జననీ,  తెల్లని పట్టు వస్త్రములను ధరించి, తెల్లని గంధమును 
        పూసికొని, తెల్లని పూలమాలలతో శో భిమ్చు లక్ష్మీ దేవి,  
        నారాయణ ప్రియసతీ, నన్ను అనుగ్రహింపుము.    
         ............................................................................................................
20. శ్లో :         దిఘస్తిబి: కనకకుంభ ముఖావ సృష్ట
                     స్రగ్వా హినీ  విమల
చారు జల ప్లు తాంగీం
                     ప్రాతర్నమామి జగతాం  జననీ మశేష
                     లోకాధినాథ గృహిణీ   మమృతాబ్ది పుత్రీం 

ప:  కనక కలశాల  నాకాశ  గంగ దెచ్చి
      తీ ర్ధ మాడింపగా నిన్ను దిగ్గజములు
      స్నాతవై  యోప్ప త్రైలోక్య జననీ  క్షీర
      వారాశి  పుత్రికా వందనములు

తా:  బంగారు కలశములతో నిర్మలమైన ఆకాశ గంగా నది 
       జలములను  తొండముతో దిగ్గజములు తెచ్చి స్నానము 
       చేయింపగా  నిర్మల  శరీరముతొ ప్రకాశించుచున్న తల్లీ, సమస్త 
       లోకములకు  ప్రభువైన నారాయాణుని ప్రియ పత్నీ  
       నమస్కారములు      .............................................................................................................
21. శ్లో           కమలే కమలాక్ష వల్లభే త్వం
                     కరుణాఫూ ర తరంగితై  రపాంగై :
                     అవలోకయ
చారు మా  మకించ నానాం
                     ప్రధమం పాత్ర మకృ త్రిమం దయాయా:
             
ప: కమల కమలాక్షవల్ల్లభా కమలనయన
     కనుము కరుణా కటాక్ష వీక్షణముతోడ
     వరమ దారిద్ర్య  వంతులం బ్రథముడనగు
        నన్ను బ్రోవుము! దినునిగన్న తల్లీ !
                
                   పద్మదళములవంటి కన్నులు గల తల్లీ !  పద్మాక్షుడగు  నారాయణుని  ప్రేయసి!   నేను పరమ దరిద్రులలో ప్రథముడను, నీ  దయకు పాత్రుడ నగు నన్ను కరుణా వీక్షణములతో కనుగొనుము  
.............................................................................................................
22.
శ్లో :        బిల్వాట వీమధ్య లసత్సరోజే
                    సహస్రపత్రే సుఖ సన్ని విష్టాం
                    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం
                    సువర్ణా వర్ణాం  ప్రణమామి నిత్యం 

ప::అమ్మ మారేడు వనములో  నలరు నరసి
     వేయి రేకుల తమ్మిలో వెలయు  దీవు
     కనక కమలము కరమున గలిగి పసిడి
     చాయ నొప్పెడి సిరి నమస్కారమమ్మ

            మారేడు వనములో గల తామర కొలనులో  వేయి  రేకుల పద్మ మందు సుఖముగా కూర్చుండి, పసిడి తామర పువ్వు కరమునందు దాలిచి మిసిమి గల మేని చాయతో నొప్పారు లక్ష్మీదేవీ  ! అమ్మ! నమస్కారము.         ...............................................................................................................,,,
23.
శ్లో :       కమలాసన పాణినా లలాటే 
                   లిఖితా మక్షర పంక్తిమస్య జంతో:
                   పరిమార్జయ మాత  రంఘ్రిణా  తే
                   ధనిక 
ద్వార నివాస దు:ఖ దోగ్ద్రీం 

ప: నాదు  నుదుటను వ్రాసెను నలువ యిట్లు
     వరమ దారిద్ర్య  దు:ఖంబు పడయు మంచు
     కలిమి గలవారి వాకిట నిలువు మంచు
     బ్రహ్మ వ్రాతను తుడువు నీపదముతోడ

                    పరమ దరిద్రులలో ప్రథముడవై కలవారి వాకిళ్ళ ముందు నిల్చి బిచ్చమెత్తుకొనుమని బ్రహ్మదేవుడు  నా నుదుటిపై వ్రాసెను.  తల్లి నీవు ఆ బ్రహ్మవ్రాతను నీ  పాద పద్మముతో తుడిచి వేయుము 
.....................................................................................................................................................................
24. శ్లో :  అంభోరుహం జన్మగృహం భవత్యా;
              వక్షస్థలం భర్త్రు గృహం మురారే
              కారుణ్యత: కల్పయా పద్మవాసే !
              లీలా  గృహం మే హ్రుదయార విందం

ప: ముద్దు గొల్పెడి తమ్మి  నీ పుట్టినిల్లు
     ఆ మహావిష్ణు హృదయమే అత్తయిల్లు
     కమలవాసిని! కొలు వుండు  కరుణతోడ
     ఎల్లవేళల నాదగు హ్రదయ పీట్టి 
 
                    తల్లీ శ్రీ మహాలక్ష్మి పద్మము నీకు పుట్టినిల్లు, శ్రీ మన్నరాయణుని హృదయమే నీకు మెట్టినిల్లు, ఓ పద్మాలయా కరుణతో నా హృదయారవిమ్దమును నీ  విలాస మందిరముగా చెసికొనుము. 
..............................................................................................................................................................
25. శ్లో :   స్తువంతి యే  స్తుతి భి రమూ భి రన్వహమ్
               త్ర ఈ మ ఈమ్ త్రిభువన మాతరం రమాం
               గుణాధికా  గురుతర భాగ్య  భాజినో
               భవంతి తే భువి బుధ భావితాశయా;   
   
ప:   ఎవరు స్తుతియింతురో వారలి స్తవమున
       మాన్య వేదాత్మ త్రిభువన మాత  రమను
       అతుల సంపద గల్గి గుణాధికులయి
       పండితుల మెప్పు గాంతురు వసుధయందు

                 ప్రతిదినము ఎవరు ఈ స్తుతులతో ముల్లోకములకు తల్లి ఐయిన లక్ష్మీదేవిని స్తుతిమ్తురో వారు గుణములచే నధికులగుచు అధిక ధనవంతులై  పండితుల మెప్పు గాంతురు.

ఉపన్యాసం ముగించారు ఎవరిదారి వారు బయలుదేరారు

రాము నెమ్మదిగా ఇంటికి చేరాడు,  తలుపు తీసి లోపలకు అడుగు పెట్టగానే  నేల మీద పాదాల అచ్చులు పడుతున్నాయి, దుమ్ము పేరుకు పోయింది, ఎన్నో సంవస్చరాలు నుండి తాళాలు తీయని ఇల్లులా గున్నది, వెంటనే మూలఉన్న చీపురుతీసుకొచ్చి  మొత్తం ఊడ్చి  కాసిని నీళ్ళు చల్లి తుడిచాడు, బల్లపై ఉన్న ఉప్మా గిన్నెపై మూతలేదు, అది తినుటకు ఇష్టం లేక దానిని బయట గచ్చు మీద ఉన్న కుక్కకు పెట్టాడు, అక్కడ ఉన్న గిన్నేలను సర్ది, కొన్ని కడిగి, సుబ్రంగా  తుడిచి, బెడ్ రూమ్లో ఉన్న గుడ్డలను మడచి,  అక్కడ ఉన్న ఒక కుర్చీలొ కూర్చొని తను  తెచ్చు కున్న పుస్తకమును చదువు చున్నాడు.

 అలికిడి విని వచ్చి తలు తీసాడు రాము, తల్లి  తండ్రులు వచ్చి నట్లు గమనించాడు, లోపలకు వస్తూనె పినతల్లి, బాబు ఉప్నా తిన్నావా, అయ్యో నిన్నుకూడా గుడిలో ఉండమంటే బాగుండేది, మరల నీ కోసం  వంట చేయ నవసరము లేకుండా పొయ్యేది ఈరోజుకు,  ఆవలిస్తూ ఇప్పుడు నాకు బుక్తయాసముగా ఉన్నాది, లోపలకు వెళ్లి కాసేపు పడుకుంటాను లేచాక వంట వండుతాను, ఆయినా ఉప్న తిన్నావు కదా, అఅయితే ఇప్పుడు వంటచేయ నవసరము లేదు, రాత్రికి వంట చేస్తాను అంటూ బెడ్ రూంలోకి వెళ్ళింది పినతల్లి సుమతి. చెల్లి కుడా తల్లిని అనుకరించింది.

తండ్రి మాత్రం రాము ఎప్పుడు వచ్చావు, ఎమన్నా తిన్నావా, నీవెళ్ళిన పని ఎంత దాక వచ్చింది, నిన్ను తొందరగా రమ్మన మంటానికి కారణం వేరే ఉన్నది, కాసేపు నీవు విశ్రాంతి తీసుకొ, నేను  కూడా  కాసేపు నడుం వాల్చొస్తాను, తరువాత ఇద్దరం అలా పార్కుదాక పోయి కాస్త మాట్లాడు కుందాము అని  లోపల గదిలోకి వెళ్ళాడు తండ్రి. రాము కూడా  చేసేది లేక కుర్చీ ముందు ఇంకొక కుర్చీ పెట్టుకొని పడుకున్నాడు, కాని నిద్ర మాత్రము రాలేదు, పగటిపూట కుడా గడియార శబ్దములు స్పస్టముగా వినబడుతున్నాయి.  
అక్కడే ఉన్నా పాపర్ ను చూస్తున్నాడు దానిలో బడ్జెట్  గురించి (2015-16) వివరంగా వ్రాసి ఉన్నది. ఆపకుండా పాపర్ మొత్తం చదువుతున్నాడు. అప్పుడే తండ్రి లోపలనుంచి వస్తూ నాకు నిద్ర పట్టుట లేదు పాపర్ చదువుదామని వచ్చాను, ఇదిగో నాన్న చదువు అని ఇచ్చాడు రాము. 

రాము మనుష్యులు ఆకర్షణకు లొంగి పోతారు   నేను వయస్సులో ఉన్నప్పుడు  ఇంటిదగ్గర ఉన్న పార్కుకు వెళ్ళే వాడ్ని, ఆ పార్కులో మీ అమ్మ పరిచయం అయింది. 
ఒకరోజు నన్ను మీ అమ్మగా కాక ముందు విజయవాడకు పోదామండి నాకు తోడు మీరు వస్తారా అని అడిగింది,  ఒక పెళ్లి ఉన్నది దానికి హజ రుకావాలి, నాకు మొగతోడు  ఎవ్వరు లేరు, మీరు ఉంటె బాగుంటుందని నా మనసులో మాట మీకు చెప్పను అన్నది.  అప్పటికే నాకు మీ ఆమ్మకు పెల్లి అయినది, ఆ విషయం చెపుదామని    అను కున్నాను, ఆ సమయాన ఏదో ఆకర్షణ నన్నుకట్టి పెడేసింది అట్లాగే వస్తానని అమెతొవెల్లాను. ఆ పరిచయము ఎదో  తెలియని ప్రేమగా  మారింది, మీ అమ్మకు అణ్యాయం చేయలేదు, అప్పుడప్పుడు నీ పినతల్లి ఇంటికి వెళ్ళే వాడిని ఆ విషయం మీ అమ్మకు తెలిసింది, ఏమిటండి ఆ పాడు తిరుడుగుడు, ఇంట్లో ఇల్లాలు ఉండగా, వెలయాలి కోసం తిరుగు తారెందుకు అనేది తప్ప, ఒక్క మాట అనేది కాదు, ఒక రోజు మీ పిన్ని మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు ఒక్కరవు సహాయం చేయమని అర్ధించింది, దానికి మీ అమ్మ కూడా  వప్పుకున్నది. ఇద్దరం కలసి వెళ్ళాము కర్మలు నన్ను చేయమన్నది, మీ పిన్ని ఒక్కతే ఆడపిల్ల అగుటవల్ల, దాయ్యాదులు ఎవరులేక పోవటం వళ్ళ, ఉన్న వారు రాలేక పోవటమువల్ల, ఆ సమయంలో కర్మలు నేనే  చేసాను.  సుమతికి తోడుగా నేను ఉండటం మొదలు పెట్టాను, చదువు లేక పోవటం వళ్ళ,   గారాబంగా పెరుగుట వళ్ళ, మీ పిన్ని నన్ను నమ్ము కున్నది, నేను ఎమీ చేయలేక ఆమెను రెండవ వివాహము చేసు కున్నాను, ఆ తరువాత నీవు కడుపులో పడి నప్పటి నుండి మీ అమ్మకు ఏదో రోగం ఆవహించింది, అది  తెలుసుకోలేక పోయినాను, ఇంతకీ మీ అమ్మ పేరు ఏమిటో కూడా నీకు తెలియదు కదు,  తెలియదు అమ్మ పేరు ఏమిటి, మీ అమ్మ పేరు " సావిత్రి ". 

అమ్మ ఇప్పుడు ఇక్కడ ఉన్నది నాన్న, నా ఊహ తెలిసి నప్పటి నుండి అమ్మ నాకు కనుపించ లేదు, మీ అమ్మ గురించి చెపుదామని అనుకున్నాను ఈరొజు, ఏమిటి మీ పుత్రునికి  కధలు చెపుతున్నారు, మీ పుత్రిక పెళ్లి విషయమ ఏమి చేద్దామనుకున్నారు,  సంభందం ఖాయం చేద్దామను కున్నారా అని అడిగింది తండ్రి కొడుకుల్ని, చెల్లెలి పెళ్లి విషయం గురించి ఇంకా ఏమి చెప్పలేదు, మరి ఇప్పటిదాకా ఏమిచేప్పారు. 

ఆ ఏమి చెప్పలేదు బడ్జెట్ విషయాలు మాట్లాడు కుంటున్నాము, దేశ బడ్జెట్ మనకెందుకు, ముందు ఇంటి బడ్జెట్ చూడండి అంటూ నేను  టి తీసుకొస్తాను  అని లోపలకు వెళ్ళింది సుమతి. తరువాత వీలు ఉన్నప్పుడు మాట్లాడుకుందాము ఇదిగో పాపర్ చదువుకో అని పాపారు చేతిలో పెట్టి వంటగదిలోకి పోతున్న భార్యతో, కాస్త అల్లం ముక్క వేసి టీ  పెట్టు అంటున్నాడు, ఇన్నేళ్ళు వచ్చిన రుచులకు తక్కువేం లేదు అని గొనుగుతూ, అట్లాగే అని గెట్టిగా  సుమతి పలుకు వినబడినది   ఇద్దరికీ
                                                                                                                                                                 
       
      







    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి