14, ఫిబ్రవరి 2015, శనివారం

ప్రాంజలి /Daily Poet-News (15-2-2015 to 28-2-2015)


Om Sri Ram
ప్రాంజలి       
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:

 28-02-2015 ప్రాణులకు-రక్తే-శక్తి

నవ జీవన సుకుమారమా
నవ భావన మాధుర్యమా
నవ రత్నపు నక్షత్రమా
నవ రాగపు రత్నమా

నా మనసును దోచిన గంధమా
నాకు పరిమళాలు అందించే పుష్పమా
నన్ను వరించిన ధన గుణ సంపెంగమా 
నా మనసంతా శాంతి నింపే అమృతమా

నవ నవ నాడే నడుమున్నా భామా
నయన మనోహరములు గల సుమా
నటన తెలియని ముద్దా మందారమా
నిత్యాను భూతుల తొ  రంజిల్లిదామా

నిర్మల హృదయంతో నేమ్మదౌదామా 
నిర్విరామంగా  అనుభవిమ్చుదామా
వలపు తలపు అంటూ ఎకమౌదామా
నువ్వు నేను కలసి ఒకటై జీవిద్దామా


అడగందే- అమ్మైనా- అన్నం- పెట్టదు = గౌరవిన్చందే- పెల్లామైన- సుఖం- పంచదు  


---{{*}}---

 27-02-2015 మనం  
పృధ్విపై వికసించే ఘంధపు పువ్వులం మనం
విశాల భావనతో ఎల్లప్పుడు నిస్వార్ధలం  మనం
త్యాగ బుద్ధుల తో కలసి బ్రతికే  ప్రజలం  మనం    
ఎల్లకాలం వికసించి ఉండని మానవులం మనం  

రోగానికి భయపడి రోగాన్ని పెంచుకొనే వాళ్ళం మనం
తోటివారు అనారొగ్యులైతే మనసులేని వాళ్ళం  మనం
ప్రేమ  ఎడిపిస్తే  ధైర్యంతో  జీవిన్చాలనే  వాళ్ళం మనం   
ఆలోచన అనర్ధం అని తెలిసి ఆలోచించే వాళ్ళం మనం

అవకాశ  వాదులకు  చిక్కుతున్న   అమాయకులం మనం
వనరులు ఉన్న ఉపయోగించు కోలేని  అసమర్ధులం మనం
స్త్రీ, సిరి వ్యామోహంలో పడి మనసులేని మనుష్యులం మనం
వ్యసనాలని వదలలేని ప్రకృతిలో ఉండే వింత జీవులం మనం

కలుషాల-నిలయంలో- ఉన్నాము-మనం = మనస్సు-సంతృప్తి-కొరకు -పోరాడుతున్నాం - మనం 

---!!!!((*))!!!!---

26-020-2015 సగటు మనిషి
 పల్లెటూరులో సగటు మనిషి ఉండే విధానం

పచ్చని పొలాల మద్య చల్ల గాలిని పీలుస్తూ
ఉల్లాసంగా పూల పరిమళాలను ఆశ్వాదిస్తూ
ఆరుబయట నక్షత్రాల పందిరి క్రింద నిద్రిస్తూ 
అతిధులకు చల్ల ఇచ్చి అప్యాయతగా పలకరిస్తూ

రచ్చ బండ వద్ద లోకాభి రామాయణం తెలియపరుస్తూ
పక్షులకు, పావురాల్లకు, కోళ్ళకు జొన్న విత్తులు వేస్తూ
కొండదేవర లింగన్నను దర్శించే వారికి నీరు అందిస్తూ 
సగటుమనిషి సహకరిస్తూ ప్రశాంతముగా జీవిస్తున్నాడు 

నగరములో సగటు మనిషి ఉండే విధానం

వీధిలొ ఉన్న కలుషితమైన, ధూలితొఉన్నగాలిని పీలుస్తూ
మృగాలవంటి వాహనాల మద్య ఉండి పొగను ఆశ్వాదిస్తూ
బయట కూక్కల అరుపు, లోన విద్యుత్ గురకతో నిద్రిస్తూ
సగటు మనిషి  పలకరింపు లేక బందిఖానాలో ఉన్నాడు   
 
మాట్లాడటానికి మనుష్యులు లేక, టి.వి చిత్రాలు చూస్తూ
వేలకు తిండిలేక, చేద్దామన్న చేతికి  పనిలేక  విచారిస్తూ
గుడికి వచ్చి, లైన్లో ఉండి దేవుని దర్సనం కాక విలపిస్తూ
సగటు మనిషి సహకారం లేక అశాంతిగా జీవిస్తున్నాడు        

పల్లెల్లో- ఉండే- స్వేచ్చ - బస్తీలొ ఉండదు = పల్లెల్లో ఉండే గాలి బస్తీలొ కానరాదు  
--::(*)::--

 25-02-2015    విద్యార్ధి  

అద్యాపకులు పిల్లలకు అవగాహన శక్తి కల్పించాలి
పిల్లలను విద్యతో పాటు వ్యాయామం  చేయించాలి
ప్రతి ఇంట్లో  మానసిక శక్తిని మనొశక్తిగా మార్చాలి
లేత హృదయాలకు భాదఅనేది లేకుండా పెంచాలి

నేటి  విద్యా విధానాలు సమగ్రంగా మార్పు  తేవాలి
ఆశక్తకరమైనా పాఠాలతోమనస్సును ఆకట్టుకోవాలి    
మాతృబాషతో నేర్చిన విద్యకు ఉద్యోగాలు  ఇవ్వాలి
అన్య భాష కోసం అధికశ్రరమతో ఎందుకు చదవాలి

తల్లి తండ్రుల ప్రవర్తనలు పిల్లలపై ఉంటాయని గమనించాలి
డబ్బుమ్దని అహంకారం చూపిస్తె పిల్లలలో మార్పు చూదాలి
కులమత విచక్షణ చూపిస్తె పిల్లలకు విద్య రాదనీ గుర్తించాలి
పిల్లలకు స్వేచ్చ ఇచ్చి, మంచి, చెడుగురించి కధలు చెప్పాలి

మార్కులకోసం అరిస్తే పిల్లలు బెదిరి పారిపోతారని తెలుసుకోవాలి
ఇంగ్లీషులోనే మాట్లాడాలని హింసిస్తే  ఆ స్కూల్ల ను  తొలగించాలి
పిల్లలపై అసబ్యపదజాలమును, వాడేఅద్యాపకులను తీసివెయాలి
పిల్లలను అను కరించి  ఉపాద్యాయులు భోదించటం నేర్చు కోవాలి

పొటి తత్త్వం పెంచుకొని గతం కన్నా మిన్నగా ఎదగాలి
పిల్లల ప్రవర్తనలను తల్లి తండ్రులు గమనిస్తూ ఉండాలి
పిల్లలకు డబ్బు అందించిన ఖర్చుల ప్రశ్నలు వేయాలి
పిల్లలవృద్ధికి గురువుకన్నా తల్లి తండ్రులదని గమనించాలి  

ఆత్మావిశ్వాసం - ఉంటె - ప్రతివిద్యార్ధి - ఒకమేధావి - అవుతాడు= అహంకారంతో- ఉంటె - దెశ ద్రోహిగా - మారుతాడు           
<<(^)>>

      24-02-2015 -ప్రేమంటే - ఇదేనన్న
 కన్న వారి కన్న,  కాని వారు మిన్న
మిన్న మిన్నఅంటే కోర్కలు  తీరవన్న 
అన్నఅన్నా అన్న క్రమ భందం కాదన్న
కాదన్న ఔనన్న అనురాగం  పంచదన్న

విన్న మాటలు గడప దాటి పోతాయన్న 
యన్న నేమి యతి ఆశలు తీర్చ లేరన్న 
వన్నెదన్నఅన్న అందరుఎక్కిరింతురన్న
అంటూ వరదలా ముంచి  వేయుదు రన్న

ఏదన్న వలపు అందించే సతి సాని కన్నామిన్న 
సూటి పోటి మాటలు ఎప్పుడు  తప్పవు   కదన్న
సతి పతి మాటలకే విడిచి  మరచుట ఎందుకన్న  
ఎప్పుడు మనసుమనసు కలుపుకొని జీవించాలన్న

ప్రేమ సహజమన్న -  అదే జీవితాంతం ఉండాలన్న
--<<0>>--

23-2-2015 తోడు 
చీకటిని చూసి చిందు లెందుకు,
 వెలుతురుగా నేనుండగా
నీడను చూసి భయమెందుకు,
నీలోనె నేనుండగా
ముసురుని చూసి ముసుగెందుకు,
నీ ప్రక్కన వెచ్చగా నేనుండగా 
గులాబీని చూసి గుబులేందుకు,
పరిమళాలను ఇచ్చేందుకు నేనుండగా 
కాలమును గూర్చి కలవరింతలెందుకు,
కాలచక్రమై నేనుండగా 
ధనమును చూసి దడ ఎందుకు, 
ఖర్చు చేసేవాడ్ని నేనుండగా 
పక్కలో ప్రక్కకు తిరుగుట ఎందుకు,
పరువాన్ని దోచుకునేందుకు నేను పనికిరాన
తోడు- నీడగా- నేనుండగా -ఎడమొఖం -పెడముఖం- ఎందుకు
--//0\\--

22-2-2015  వలపుల తలపు

అతడు:  నా ఆశల రూపానివి, ఊహల దీపానివి
             నా మనసైన సుందరివి, కోర్కెలు తీర్చె దానివి
ఆమె: కదిలించావు నా హృదయాన్ని, దాసోహం నీ మాటల వినయానికి
          మెచ్చాను నీ ధైర్య సాహసాన్ని, పెదవుల దాహం తీర్చటానికి
అతడు: మెరుపై మెరిసితివి, మెలికలు తెలిపితివి
             సరిగములు అల్లితివి, స్వరములు నేర్పితివి
ఆమె: వయ్యారపు వలపు ఇచ్చేదాన్ని, పలుకుతో తనువూ అర్పించటానికి
          మురిపించి మోజు తీర్చె దాన్ని, నీ వయసును మురిపించటానికి
అతడు : అందాలను చూపితివి, రాగాలను నేర్పితివి
             కన్నులు కుంచలా త్రిప్పితివి, కలలో కలవార పెట్టితివి
ఆమె :  సుఖాలను అందించెదాన్ని, మనసు మనసు కలవటానికి
            అనురాగం పెంచుకొని మనం  ఆదర్శంగా జీవించటానికి
ఇద్దరు : వెన్నెల వెలుగుల్లో విహరిద్దాం
             కన్న కలలు సుఖం చేసుకుందాం
             వెన్నలా కరిగి కలసి జీవిద్దాం
             ఉన్న దానితో సుఖపడి బ్రతికేద్దాం    

ఆశలతొ ఎన్నైనా కోటలు కట్టవచ్చు - ఆశలు నేరవేర్చుకోవటమే నిజమైన జీవితం అనవ చ్చు 
--ll*ll--

మాతృభాషా  దినోశ్చవం  21-02-2015

ప్రపంచ తెలుగు ప్రజలారా  తెలుగును బ్రతికించండి
అణ్యభాషా నేర్చుకున్న మాతృభాషను మరవకండి
తెలుగు వారందరూ ఏకమై ప్రాంజలిని ఆదరించండి
తెలుగులో మాట్లాడి ఆనందం పంచుకుందాం రండి

తెలుగు  భాషకు పడు తున్నాయి   సంకెళ్ళు
తెలుగుపుస్తకాలకు పడుతున్నాయి తెగుళ్ళు
కను  మరుగౌతున్నాయి  తెలుగు  ఆచారాళ్ళు
తెలుగుపండితులకు ఇవ్వటం లేదు ఉద్యోగాళ్ళు  

సరసమైన పండిత పద్య భాష తెలుగురా
అణ్యభాషా నమ్మి మాతృభాష వదలకురా
కన్నతల్లి నిద్రపుచ్చే జోల పాట తెలుగురా
అన్నమయ్య కీర్తనలు వ్రాసింది తెలుగేనురా

త్యాగరాజు   గళం ధన్యమైనది  తెలుగేనురా
పంచమవేదం భారతం వ్రాసింది తెలుగేనురా
సంగీత, పద్య సౌరబాన్నిచూపెది తెలుగేనురా
ముత్యాల  ముగ్గులాంటి  భాష  తెలుగేనురా

అన్నం పెట్టి ఆత్మీయత పంచె భాష తెలుగురా
మృదు  మదురంగా  మాట్లాడే భాష తెలుగురా
ప్రభుత్వం  తెలుగును మరచుట మన ఖర్మరా
కళ్ళుతెరచి ప్రభుత్వం తెలుగును బ్రతికిన్చాలిరా

నేనొక ప్రపంచ అంతర్జాలంలో చిక్కి తిరుగు తున్న పక్షిని
తెలుగుజాతిని బ్రతికించుటకు ప్రయత్నం చేయుచుంటిని
తెలుగువారి ఆదరణకోసం సహకారంకోసం తిరుగుచుంటిని
2012 నుండినేటివరకు ప్రాంజలినందు కధలు వ్రాయుచుంటిని

 ప్రతిజ్ఞ

దురాశ లేకుండా,  తృష్ట లేకుండా
ద్వేషం లేకుండా,  అహం లేకుండా
ఈర్ష్య  లేకుండా, ధర్మ తప్పకుండా
తెలుగులో మాట్లాడుతాను, తెలుగులో వ్రాస్తాను

గొప్పతనం పోకుండా, పాపాలు చేయకుండా
అనుభవం లేకుండా, భయం లేకుండా 
ఆచారాలు వదలకుండా, హర్షం లేకుండా
తెలుగులో మాట్లాడుతాను, తెలుగులో వ్రాస్తాను


వేదాలు వదలకుండా,  దు:ఖం తెలియకుండా 
జాతిని విమర్సిమ్చకుండా, మతాన్ని వదలకుండా
తల్లి, తండ్రి, గురువు, మాతృదేశాన్ని  వదలకుండా
తెలుగులో మాట్లాడుతాను, తెలుగులో వ్రాస్తాను

జై తెలుగు,  జై జై తెలుగు, అని గొంతెత్తి చాటాలిరా

..//\\//\\..


ఏం  మొగుడవు
 
నిదానంగా ఉన్నానని  నెత్తి కెక్కు   తున్నావు
ఏది అడిగిన కస్సుమంటూ ఎగురు  తున్నావు
నన్నొక మనిషిగా   చూడక   తిడు  తున్నావు
నన్ను ప్రేమగా చూడలేని నీవు ఏంమొగుడవు

కారణం లేకుండా కస్సు బస్సు లాడుతున్నావు 
కళ్ళు నెత్తి కొచ్చి కాళ్ళకు అడ్డు  పడు తున్నావు
నవ్వులు లేక  నీవు  కోపిష్టిగా మారు తున్నావు
వాతలు పెట్టినా బుద్ధి రాని నీవు   ఏం మొగుడవు

కుళ్ళు జోక్సు వేసి నన్ను ఏడి పిస్తున్నావు 
కూల్ గా ఉన్న నన్ను రెచ్చ గొడుతున్నావు 
వయసు మీరుతున్నా రా రా అంటున్నావు
మూర్ఖుడుగా మారుతున్నావు ఏం మొగుడవు

కొవ్వొత్తిలా కరిగిన నీవు సంతోష పడవు 
  కొరివని తెలియక ముందు  కొస్తున్నావు    
కోర్కలతో నీవు నన్ను భాద పెడుతున్నావు
ఉత్తి పుణ్యాన తిడతావు నీవేం మొగుడవుఅమ్మ, చెల్లి, అంటూ పెళ్ళాన్ని  గుర్తించని వాడవు
అమ్మ  మాటలకు  జవ దాటని  ఘనుడవు  నీవు
చిన్నతప్పునుచూసి అందరి ముందు అరిచేవాడవు
పెళ్ళాన్ని గౌరవించలేనివాడవు నీ
వేం మొగుడవు  

  కట్టు కున్న స్త్రీ పై జాలి లేని  పాషాణుడవు
ఎవరితో మాట్లాడిన రంకులు  కట్టే వాడవు
ఎంత ఓర్చుకున్న ప్రవర్తన మారదంటావు
 విడిచి పొమ్మంటున్నావు నీ వేం మొగుడవు

శ్రీమతి- ఓర్పుతో- అంటుంది -ఆనాడు -నీవేం- మొగుడవు -
 శ్రీమతి స్వేచ్చతో- అంటుంది- ఈనాడు- ఎరా- ఏం- మొగుడివి   
-oOo-

19-02-2015  - అందరికి - దేవుడే - దిక్కు 

ఎప్పుడు చదువు తుండాలి బుక్కు
భవిషత్ లో కలుగు తుంది లక్కు
ప్రతి ఒక్కని  పై  ఉంచాలి  లుక్కు
అప్పుడు మీలొ పెరుగు తుంది  కిక్కు

ఇరువురి మద్య  వస్తుంది   టెక్కు
స్పర్ధలవళ్ళ కోరుతుంటారు హక్కు
కలసితీర్చాలంటుంది దేవుని మొక్కు
మొక్కులు తీర్చుటకు ఏడుకొండలు ఎక్కు

ప్రయాణ ఖర్చులకు మారుస్తారు చెక్కు
ఆదుకునెవారెవ్వరూ లేరు దేవుడా నీవెదిక్కు
పశ్చతాపమతొ చేసిన తప్పులు అక్కడే కక్కు
గోపికలకు గోపాలుడు చిక్కినట్లు నీకు మేము చిక్కు
 
వాన చినుకుల్లో మా కళ్ళు  తలుక్కు
కానుకలు వేసాము ఆశలు తీర్చు ఈ బ్రతుక్కు
ధర్మమా తప్పమని కలసి ఒట్టుతో మా వాక్కు
చూసాము నక్షత్రం లాంటి మేరుపు తో చమక్కు
పశ్చాతాపమే - నిజమైన - వెలుగు - తృప్తినిచ్చేది - దేవునిచూపు  - వెలుగు

డాక్టర్ దగ్గుపాటి  రామానాయుడు సినీ నిర్మాత, రామానాయుడు సిని స్టూడియో అధినేత, 
మరణవార్తకు అశ్రు నివాళి అర్పి స్తున్నాను

జననం.  06-06-1936 - మరణం. 18-02-2015
పునరపి జననం - పునరపి మరణం


++(*)++

18-02-2015 - ప్రేమలేని - జీవితం - వ్యర్ధం

మౌన మునిని కుడా కలచి వేయు నీ అందం
నా మనస్సులో నీకు గులాం చెపుతున్నాను
మధురానుభూతూలతొ ఉన్న నీ హృదయానికి
నా హృదయ తాపం తెలపాలనుకున్నాను  

నీ మనసుని అర్ధం చేసుకోవటానికి
నా ప్రయత్నం నేను చేస్తున్నాను
నీ మాటలకు ఈ గుండె భరించటానికి
నా ప్రాణం ఇంకా ఉందను కుంటాను

నీ నవ్వులు నా హ్రుదయాన్తరములోనికి
నవ వసంతం చూపు తుందనుకున్నను
నీకు నడమంత్రపుసిరి రావటానికి
నేనొక పావుగా ఉపయోగ పడినాను

నీ విద్యా, వికాస, వినోద, అభివృద్ధికి
నా సహాయ సహకారమనుకున్నాను
నీ ప్రేమ ఎంత నిజమో తెలుసుకోవ టానికి
నా జీవిత కాలము సరిపోలేదను కుంటాను

నీవు నన్ను గరళము తినమన్న తినటానికి
నీ ప్రక్కన ఎప్పుడు వేచి ఉంటాను
నీవు నన్ను త్రునీకరించ టానికి
నా ప్రేమ నీకు తెలియదనుకుంటాను 

నీవు వేరొకరితో సుఖపడటానికి
నా ప్రేమను త్యాగం చేస్తున్నాను
నీవు కనిపించని ఈ లోకానికి
నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను  

ప్రేమిస్తే - ప్రేమను - పొందాలి  = ప్రేమించకపోతే - ఒకరికొకరు -కలవటం -మానాలి  (నేను వ్రాసిన ఈ కవిత సాహితీ కిరణ పత్రికలో
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్చవ సందర్భంగా
ముద్రించ బడినది) 

--((*))-- 

1:46am Feb 20
బాహుశక్తి సురాసురుల్ సని పాలవెల్లి మథింప హా
లాహలంబు జనించె నేరి కలంఘ్యమై భువనంబు కో
లాహలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దోహముం బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!

(అని దేవతాప్రార్థితుండై ఈశ్వరుఁడు హాలాహలపానాసక్తుడై పార్వతీదేవినడిగిన నయమ్మ...)

మ్రింగెడివాఁడు విభుండని, మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో.
...
ఉదరము లోకంబులకును, సదనంబగు టెఱిగి శివుఁడు చటుల విషాగ్నిన్
గుదురుకొనఁ గంఠబిలమునఁ, బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.

మెచ్చిన మచ్చిక గలిగిన, నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం
జిచ్చుఁ గడిఁ గొనఁగ వచ్చునె, చిచ్చఱచూ పచ్చుపడిన శివునకుఁ దక్కన్.Shankara Naadasharirapara - Sankarabharanam Movie Song - Somayajulu
మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు
మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని
అభిషేకిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది.తెలుసుకుందాం

కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో, బిల్వ 
పత్రంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది.
పలురకాల పువ్వులతో శివాభిషేకం చేస్తే రాజభోగం కలుగుతుంది.
వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.
నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం.
పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది.
ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది.
విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి.
బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో జయము కలుగుతుంది.
వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును.
మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది.
ఉసిరికాయలతో చేస్తే మోక్షము.
బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది.
అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి, మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది.
పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి.
ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుంది
ఉమ్మెత్త పూవులుతో శివలింగాన్ని అర్చించినట్లు అయితే కళ్యాణ ప్రాప్తి,మాంగల్య దోషాలు పోతాయి
.


17-02-2015 నేటి కవిత "శివరాత్రి "
 
నమ: శివాయ: నమ: శివాయ:  నమ: శివాయ: 
 

శివ శివ అని స్మరణ   చేయండి
సర్వ  పాపాలనుండి  విముక్తి  పొందండి
నేడే శివనామ స్మరణ రాత్రి అండి
శివరాత్రినాడు జాగారం శుభమండి

భక్తికి పొంగునట మహాదేవుడు
అభిషేక  ప్రియుడట ఆది శంకరుడు
కోరికలు తీర్చె భోలా శంకరుడు
నిత్యం రామ నామం చేసే పరమేశ్వరుడు 


భక్త జన ప్రియుడు కైలాస వాసుడు
భక్తి శ్రద్ధతో సేవిస్తే మురిసి పోతాడు
కోరిన సంపదలు సమకూరుస్తాడు
భక్త జన దాసులకు ధన్యులను చేస్తాడు

మహా శివుడు వసంకరుడు
హృదయాలయ వసుడు
తాండవ కేళి  లయుడు
భాషకు ఉద్బవకారకుడు

అభంగ  ఢమరకనాదకుడు
శివంకరుడు అర్ధనారీస్వరుడు
భక్తునికి పరమ పవిత్రుడు
దైవభాషకు మూల కారకుడు 


గంగను తలపై ఉంచుకున్న గంగాధరుడు 
ధ్యానముద్రలో చిరుమందహాస త్రినేత్రుడు 
చంద్రుని శిరస్సునందుంచుకున్న శంకరుడు 
గరళాన్ని తన కంఠంలో ఉంచుకున్న నీలకంటుడు 

 సర్పాలనుండి రక్షించే భుజంగధారుడు 
వృషబాలను ఆవులను వృద్ధి పరిచే వృషభవాహనుడు 
ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా ఉండే దిగంబరుడు 
ఓంకారం పుట్టించి బీజాక్షరాలును సృష్టించిన ఓంకారేశ్వరుడు 

హర హర మహాదేవ అంటున్నాం ఆదుకో శివ 
సదాశివా లోకమంతా నీకోసం నామ జపం చేస్తున్నది 
నీ దృష్టి ప్రకృతినే కాదు మాపై కూడా ఉంచి కరుణించమన్నది 
మమ్ము విస్లేషాత్మక దృష్టితో భయాన్ని తొలగించమంటున్నది 
ఎన్నెన్నో మార్పులకు సదాశివ నీ సహాయం కావాలంటున్నది


అవినీతి నీతిగా చలామణి కాకుండగా సహకరించాలన్న లోకంఇది 
కుహనా భావాలకు లొంగ లొంగకుండా కాపాడాల్సిన జాతి ఇది
వివేకమపెంచి,వింతచేష్టలు చేయకుండా చూడాల్సిన కలియుగం ఇది
సదాశివ తిరోగమునుండి పురోగమనకు వస్తున్నా దేశం ఇది 

ప్రజలంతా నమ: శివాయ అంటు పుణ్యక్షేత్రాలు దర్శించే రోజు ఇది
అభిషేకాలతో, ఆరధనలతో శివరాత్రి జరిపే రోజు ఇది
లింగ పూజ చేసి మనస్సును ప్రశాంతి పరుచుకొనే రోజు ఇది 
నమ: శివాయా అంటూ ఆహారం, నిద్రా లేకుండా ప్రార్ధించే రోజు ఇది  

ముక్తకంఠంతో -నమ: శివాయ- అనండి = ధర్మ -మార్గాన -నడవండి


16-02-2015 నేటి కవిత " ఆశ "  యాల  పాశం
గాలి,  నీరు, అగ్ని,  భూమి, పర్వతాలు  అందించి నావు
వృక్షాలు, పూలుకల్పించి మానవులకు ఆశ చూపించావు 
ఆశయాలతో బ్రతకాలని మానవులకు స్వార్ధం పెంచావు
స్వార్ధంతోపాటు, అహంకారం, మమకారం,భయం పెంచావు 

ప్రకృతి  లో వనరులు కల్పించి ఆశలు పెంచావు
మాలో  ఈర్ష్యా,  ద్వేషం, అనుమానం  కల్పించావు
మృగాలకన్న హీనంగా మనుష్యులను సృష్టించావు
ఆశాజీవిని చూసి ఎడి పించే వారిని చూపిస్తున్నావు

ఆశాపాసానికి అలుపుఎరుకగా శ్రమిమ్చమన్నవు
భవభందాలను ఆశయాలతో ముడిపెడుతున్నావు
ఊహల వెనుక ఆశలను చేర్చి నవ్వుకుంటున్నావు
వయసు మీరిన ఆశయాలతొ  జీవిమ్చ మన్నావు

ఆశయాలతో - సంసారం-  సాగాలన్నావు =వయసు -మీరిన -ఆశ -

వదలదన్నావు

  "' వియోగ వేదం "'

మనసు నిశ్చలంగా ఉండదాయె
లోకం  మౌనంగా  ఉన్న దాయె
హృదయం వికలమై భారమాయె
ధ్వనులు   వేమ్బ డిస్తున్నాయె

కాగితపు పూలు వాసనొస్తున్నాయె
సంధించిన భానాలు గుచ్చుతున్నాయె
దీపమ్లేకుండా మిణుగురులు మాడుతున్నాయె
వసంతంలో ఆకులు మాడి రాలుతున్నాయె    
 
ఎ ఆశా, ఆలంబనా లేకుండ దాయె
హృదయ తపనలు వేదిస్తున్నాయె
గుండె చప్పుళ్ళు పరుగులు తీస్తున్నాయె
చల్లని హృదయానికి వేడి గాళ్ళు వేదిస్తున్నాయె

మాయా భంధంతో సుఖం లేదాయె
జీవితం అడవి కాసిన  వెన్నలాయె  
అరణ్యంలో చిక్కుకున్న మనిషి నాయె
వర్షం లో కష్ట పడిన నిద్ర రాదాయె

భూ ప్రకంపణాలకు ప్రాణాలు పోవాయె
తీరందాటలేని నిస్సహాయ స్థితి నాదాయె
మనస్సుకు ఊరట కల్పించే నీవు లేవాయె     
నీకోసం, నీప్రేమకోసం వేచి ఉండ గలనోయి

  ఓర్పు వహిస్తే ప్రేమను పొందగలరు - తొందరపడితే సుడిగుండంలో పడగలరు

15-2-2015 తోలి ప్రేమ

ప్రేమ రాగం శృతి కల్సిన వేళ
మనసు మనసు కలసిన వేళ
వయసు పరవశం చెందిన వేళ
ప్రధమ వీక్షనమ్ కల్పించిన వేళ

నవ నవ లాడే చిగురాకులతో
నిగ నిగ లాడే  సొగసుల తో
తోడు తొలి ప్రేమ రాగాలతో
మురిపముల  మాటలతో

ప్రేమ చిగురించేదాక  కంటికి  నిదుర  రాదు
ప్రేమ గెలుపు కోరకు దొంటిగా  బ్రొద్దు  పోదు
ప్రేమజయించే వరకు చేసిన బాస నెరవేరదు
ప్రేమ మనసులొ ఉన్న ఎమీ తినబుద్ది కాదు  

నీ వాక్కు కర్ధమై నే వెళ్ళుతాను
నీ చూపు పావునే నే నటిస్తాను
నీ హారములో పుత్తడినవుతాను
నీకు ప్రేమానురాలు పంచుతాను

వయస్సుతో నిమిత్తం లేని మాధుర్యం
మాధుర్యం మనస్సుకు పసందైన వైద్యం
వైద్యం హృదయానికి అందించే ప్రేమామృతం
అమృతం కన్నా మాధుర్యం తొలిప్రేమ సరసం

బాహ్య సౌందర్యం అశాస్వితమ్ అన్నది వేదాంతం
మనసే ఆకర్షణకులోనై బ్రమలో పడేసేది సౌందర్యం
తోలి వలపు చూపుల్లొ చిక్కి ఉరకలేసే యవ్వనం
ప్రేమను పంచి ప్రేమను పొంది ఏకమవ్వటం ఆదర్శం  
   

తొలిచూపు- హృదయ- స్పందనే = భంధం-ఏర్పడ్డాకకూడా- ఉండాల్సిన- -స్పందన 
   క్రికెట్ 

యువ కిసోరాల వీర విహారం
 దేశమంతా ఉస్చవాల మయం
కోహిలీ సెంచరి,బౌలింగ్ పట్టుతో విజయం 
 పాకీస్తాన్ పై భారత ఘనవిజయం   
అందరు- కలసి- పట్టు- బిగిస్తే- కష్టతరమైనది- కూడ- సులభం  

(14-2-2015 ) Premikula roju, and  world Cup 
 ప్రేమికుల- దినోత్చవ -సందర్బముగా - ప్రేమతో - అందిస్తున్న- చిరు కవిత 
Om Sri Ram 

ప్రేమికుల రోజు (14-02-15)
ప్రేమను ప్రేమగా ప్రేమించు  ప్రేరేపణ   కల్పించు
ప్రేరేపణకాదు కాని ప్రేమకుకట్టుబడి  సంచరించు
వలపు తలపు కలిసిపుట్టే ప్రేమను  అనుసరించు
ప్రేమే లోకమనితలచి ప్రేమ మాదుర్యతతో తరించు

మాధుర్యంతో పరస్పర అనురాగంతో కొత్త తదనంతో జీవించు
కోరికలతో  ప్రపంచ ప్రేమ ద్రుశ్యాలాను చూస్తు కలసి చలించు
ప్రేమలో ఎన్నో పాట్లు, అగ చాట్లు ఉన్న  ప్రేమను  విస్తరించు
ప్రేమకు చిక్కని వారు లేరు, చిక్కినవారికి అనురాగం పంచు

అనురాగం తో, అనుభందంతో, విరహంతో ప్రేమను వివరించు
ప్రేమ విస్తరించి నప్పుడు విశాలం, అది ఒకరిపై ఇరుకనిపించు
తొలిచూపు ప్రేమ అనుకోని ఆకర్షణకు చక్కి మనసు మదించు   
ప్రేమలో కష్టం వస్తే ప్రారబ్ధం, సుఖం జన్మభందం అని భావించు

ప్రేమకు కొలమానం లేదు, ఆశకు అంతంలేదని విశ్వశించు
ప్రేమకొంతకాలంకాదు, ప్రేమ పెళ్ళిగా మారి నిత్యంసుఖించు
హృదయ సాక్షిగా ప్రేమ పుట్టిన చోటే ప్రేమ  జయం వరించు
ప్రేమ ఫలించ   లేదనకు, ప్రేమించే వారికి  ప్రేమను పంచు 

నమ్మకం,రుజువు పడుగుపెకలాగా కలసి హృదయం తెరచు
మనసు మాట్లాడుతున్నా ధర్మాన్ని తెలుసుకొని  శాంతించు
నిత్యం శాంతి  ఉన్నచోటే  ప్రేమబలంగా ఉండి జ్ఞానంభోధించు 
ప్రీమలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించి దేవుణ్ణి ప్రేమించి శక్తిని గ్రహించు   
    

కళ్ళతో-కాదు -హృదయతో- ప్రేమించు = ప్రేమించిన - వానితో-కలకాలం -జీవించు  వరల్డ్ కప్పు ప్రారంభం (14-02-15)
విశ్వ క్రీడ క్రికెట్ పరిమితానంద ప్రారంభం
ఆస్త్రేల్యా, న్యూజులాండ్ సంయుక్త ఆతిధ్యం
హోరా హరి ఆటలతో అభిమానులకు ఆనందం
ఉద్వేగం, ఉత్కంటం రగిలిస్తూ 50 ఓవర్ల క్రికెట్ మయం

ఇది ప్రత్యుర్దుల రెచ్చి పోయి నువ్వా నేనా అనే ఆట  
దేశ  భక్తికి, క్రికెట్ క్రీడాభిమానులు తృప్తి నిచ్చే ఆట
అందరుక్రమశిక్షనగా ఆడాలని గురువులుచేప్పేమాట
సాయశక్తుల ఆఖరిదాక ప్రయ్యత్నిం చేసిన గెలుపు బాట6 సార్లు చివరిదాకా వచ్చి గెలువక న్యూజులాండ్ సొంతగడ్డపై గెలవాలని పట్టు
శ్రీలంకవారు జయవర్ధన, సంగాక్కరుకు ఈగెలుపుతో వీడ్కోలుతొ చెప్పాలని పట్టు
4 సార్లు గెలిచినా ఆస్టేలియ ఇంకా గెలవాలని తహ తహ లాడుతూ గెలవాలని పట్టు
బలంతో తెలివితో భారత జట్టు గతవైభవాన్ని (2011)పునరావృతం చేయాలని పట్టు   

ఇది అనూహ్య మలుపులకు ఆటపట్టు
చివరి బంతి ఆడేదాక గుండె దడ పెట్టు
భంధకాలను ఎదిరించు బిగించాలి పట్టు 
దేశానికి  ఆటతో గెలుపు సాధించి పెట్టు  

   
అఖండ క్రికెట్  క్రీడాబిమానాల  ఆశలు  నేరవేరాలి
బెట్టింగులకు అమ్ముడుపోకుండా నిలకడగా ఆడాలి 
దేశానికి మచ్చ తెచ్చే క్రీడ ఆడ కూడదని  తెలియాలి
భయంవదలి 11మంది కలసికట్టుగాఉండి గెలుపుతేవాలి 
 
 
 
విజయమో -వీరస్వర్గమో - ఆనాటిమాట = విజయము - తధ్యమని- క్రికెట్ అభిమానుల - నేటిమాట

యె రోజు కారోజు ప్రాంజలి / వీక్లీ (2పార్ట్శ్ ) మీ అభిప్రాయాలు పూర్తి చిరునామాతో వ్రాసి పంపండి