10, జులై 2017, సోమవారం

విశ్వంలో జీవితం - 40

Om Sri Ram - ri matrenama:

ప్రాంజలి ప్రభ - కలలు ఎరుగవు (కవిత)

కలలు కల్లాకపటం ఎరుగవు
మనుష్యులను హెచ్చరిస్తూ ఉంటాయి
కష్టాలు  ఎప్పుడో తెలపవు
మనుష్యుల మతి మారుస్తూ ఉంటాయి

నిజాలు ఎందుకో చెప్పలేవు
చెప్పిన నమ్మలేని స్థితిలో ఉంటాయి
వర్షం ఎక్కడపడునో చెప్పలేవు
పడ్డ చోట యుద్దవాతావరణాలుంటాయి

గుండెలో గగుర్పాటు చెప్పలేవు
ఆహ్లాద రాబందులు కమ్ము కుంటాయి
చల్ల కొచ్చి ముంత దాచలేవు
మొహమాటానికి పొతే జరుగుతుంటాయి

కళ్ళతో అందాన్ని చెప్పలేవు
నోటితో చెప్పిన కళ్ళు నమ్మలేమంటాయి
స్నేహం కోసం ఎదురు చూడవు 
స్నేహం మనసు భాధను తగ్గించలేనంటాయి


ప్రాంజలి ప్రభ - యుద్ధం (కవిత )

రాజ్యాల మధ్య కాదు
రాబందుల మధ్య కాదు
చేస్తున్నారు యుద్ధం  
కేవలం విద్య విద్యార్థుల మధ్య
విద్యాసంస్థలు చేస్తున్న యుద్ధం
చెంబుడు బుర్రలో
బిందెడు విద్యను క్రుమ్మరిస్తూ
భరించాలని యుద్ధం
అధిక ధనం పొందుతున్నాం కదా
ఆరవ తరగతిలో 10 లెక్కలు
7  వ తరగతిలో ఐ ఐ టి
8  వ తరగతిలో రాష్ట్ర విజ్ఞానం
9  వ తరగతి లో ప్రపంచ విజ్ఞానం
10 వ తరగతికి పోటీ పరిజ్ఞానం
జన్మ త: సిద్దులు ఉన్నవారు
జన్మత: జ్ఞాపక శక్తి ఉన్నవారు
అంతవిద్య భరించలేరు
విధ్య తగ్గించి ఆరోగ్యాన్ని పెంచేవి 
చెప్పాలని చేయాలి యుద్ధం
మార్కుల మధ్య , రాంకుల మధ్య
చేస్తారు ఎందుకు యుద్ధం
మనిషిని మనిషిగా గుర్తించ విద్య
నలుగురితో మంచిగామాట్లాడే విద్య
పరభాషకాన్న మాతృభాష బోధించే విద్య
బండెడు మోత విద్య కన్నా
మెదడుకు తగ్గవిద్య నేర్పమని
చేయాలి యుద్ధం
విద్య తో పాటు సకల కళలు నేర్పాలని
చేయాలి యుద్ధం
వయసుకు తగ్గ విద్య నేర్పాలని
చేయాలి యుద్ధం       
జాగర్త మితిమీరిన విద్య
మనసుతో చేస్తుంది యుద్ధం 


ప్రాంజలి ప్రభ - ఎవ్వని భావం (కవిత ) 

ఎవ్వని పేరు విన్న 
పులకించునో 
నెమ్మది ప్రస్ఫుటముగా 

ఎవ్వని యాస విన్న 
తలపించునో 
నెమ్మది బహిర్గతముగా 

ఎవ్వని నీతి విన్న 
కురిపించునో 
కళ్ళవెంబడి కన్నీరుగా 

ఎవ్వని కోరిక విన్న 
గుండె నిండునో 
తనువంతా తపించునుగా

ఎవ్వని క్రియలు విన్న 
మనసు నిండునో 
మమత లూరించునుగా 

ఎవ్వని తోడును గన్న 
నిగ్రహ ముండునో 
చెప్ప లేకుండుట యేగా 

ఎవ్వని కళలు గన్న 
కవ్వింపు చెందునో 
కను మరుగుటయే గా  

ఎవ్వని కన్నులు గన్న
కాంక్షలు ఏర్పడునో 
హృదయ వేదనము లేగా   

ఎవ్వని నవ్వులు గన్న 
గుండె చెదరకుండునో 
నిర్మలత్వంతో బ్రతుకుటేగా
  

--((*))--

ప్రాంజలి ప్రభ - దృక్పధం (కవిత) 

పొద్దు వాలే బ్రతుకు
చీకటి కమ్మె కడకు
వయసు పెర్గే ఉడుకు
మనసు కదిలే చిటుకు


చెప్పి రాదు మనకు
కళ్ళ వెంట చినుకు
నిజం ఉండదు కలకు
తనువు ముదురు మనకు


కట్టె కాలే బ్రతుకు
కనబడని కులుకు
ఆశతో వెంట పడకు
అలుపనేది ఎరుగకు  

          
పాశానికి చిక్కకు
కాలానికి మొక్కకు
వెలుతుర్నినమ్మకు

మనసు గా ఉంచకు
 

మమతలు ఎరుగకు
మది తొలచు కినుకు
కంటికి ఉండదు కునుకు    
జీవితసాఫల్యమునకు
 

దైవప్రార్ధన మటుకు
ఎట్టి పరిస్థితిలో వదలకు
నమ్మకమే వృద్ధ్యాప్యమునకు
సేవలు అందించాలి కొడుకు
 

ప్రేమ ఉండాలి బిడ్డలకు
సేవలందించాలి చివరకు 
భయమనేది రానీయకు
ప్రేమ తప్పదు దృక్పదమునకు