వ్యాఘ్రెస్వర్ తెల్లని లాల్చి ఫైజమా ధరించి నడిరోడ్డులో ఉండి, రోడ్డు మీదకు ఎన్ని ఇల్లు ముందుకు వచ్చాయో, ఇంటి నెంబర్లతో సహా,షాపులు ముందు ఎన్ని వేహికల్సు ఆపారో, నో పార్కింగ్ అన్నచోట ఎన్ని కార్లు ఆపారో
నెంబర్లతో సహా, చిన్న బుక్ లో నాట్ చేస్తున్నాడు.అతివేగముగా కారు నడుపుతూ ఎడమవైపుకు పోవాల్సింది కుడివైపుకు వచ్చి ఒక్క సారి బ్రేక్ వేస్తూ వ్యాఘ్రెస్వర్ ముందు ఆపాడు.
నీకు పొయ్యే కాలం వచ్చిందా, ఈ కారు క్రింద పడాలని ఉందా, ఈ కారు ఎవరిదో తెలుసా అని గాటిగా అరిచాడు దిగిన డ్రైవర్.
ఇంతకు నీవు తప్పు దారి వచ్చి నన్ను వోట్రింమ్చటం ఒక తప్పు, ప్రొద్దున్నే త్రాగి నడపటం మరోతప్పు, ఈ కారు ఎవరిదో తెలుసానటం మరో తప్పు, తప్పు మీద తప్పు చేసింది నీవు, అన్ని తప్పులు పెట్టుకొని నన్ను తొలగ మంటావెమ్దుకు అని నెమ్మదిగా అన్నాడు.
ఐతే నేను ఫోన్ చేస్తాను మా సార్ కి.
నీవు ప్రైమ్ మినిస్టర్ కు ఫోన్ చేస్తావో, చీఫ్ మినిస్టర్ కు ఫోన్ చేస్తావో, హోం మినిస్టర్ కు చేస్తావో, ఇంట్లో నీభార్యకు చేస్తావో, లేదా నీ రెండో భార్యకు చేస్తావో, అని నేను అడిగానా, నా దగ్గ్గర ఆపి నన్ను చంపాలని అనుకున్నావు కదూ,
లేదు ఏదో భుద్దితక్కువై రాంగు రూటు వచ్చాను, అందులో కొద్దిగా త్రాగివున్నాను, నన్ను క్షమించండి, ఈ రోడ్డుకు ఎప్పుడు రాను, నన్ను వదిలెయ్యండి అన్నాడు డ్రైవర్.
నీ వళ్ళ నాలెక్క తప్పింది, మాల్లీ మొదటినుంచి లెక్కపెట్టాక నేను కదులుతాను, నీవు ఎన్ని చెప్పిన నేను కదలనంటే కదలను అన్నాడు వ్యాఘ్రెస్వర్.
సరే మీలెక్క మీరు చూసుకోండి, ప్రక్కకు తొలగి లేక్కవేసుకోండి అన్నాడు, నీవు వెనక్కన్న పో, లేదా నామిదనుమ్చి అన్న పొనీ, ఏదోఒకటి చేయి అనే కానీ నేను మాత్రం కదలను అన్నాడు.
నేను ముందుకు నడిపానంటే నీవు గుర్తుపట్ట కుండా పోతావు అదినీకు తెలుసా.
నేనేమన్నా అడుక్కొనే వాడినా, లేదా అదిరిసె పరుగెత్తే జంతువునా, నీ లాంటి మామూలు మనిషిని, నీలాగా త్రాగిమాత్రము లేను, నీవు మాతము త్రాగి ఉన్నావు , అసలు నీకు లైసంసు మంజూరు చేసిన వాడ్ని తీసు కొచ్చి జైల్లో పెట్టాలి, ఒక త్రాగుబోతుని డ్రవర్ గా పెట్టుకున్న మీ యజానిని జైల్లో పెట్టాలి.
నేనే వెనక్క్ వెళుతున్నాను అంటూ డ్రైవర్ వెనక్కి నడిచాడు,
ఆగు నన్ను కదలమని నీవు పోతావేమిటి,
సరే వెళ్ళు నీవు అడ్డం తోలగరు కదా "నేను ఒక్కసారి చెపితే వంద సార్లు చెప్పినట్లు " అన్నాడు.
ఐతే మీ మీదకు పొనిస్తా, పొనీ నేనేమి భయపడను అన్నాడు
డ్రెవర్ కోపంగా ఒక్కసారి వ్యా ఘరెస్వర్ ప్రక్కకు లాగాడు,
పెద్దగా అరుస్తూ నామీద దాడి చేయటానికి వచ్చాడు, నన్ను కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరిచాడు, చుట్టూ ప్రక్కలవారు ఒక్కసారి మూగారు
ఆ దోవలో లారి మిద చాలామంది జండా కర్రలు తీసుకోని ఊరెగిమ్పుకు, బహిరంగ సభకు పోతున్నారు, లారి ఆపి ఎం జరిగింది అంటూ అన్దరూ దిగారు, ఒక్క సారిగా జనం మూగరు, డ్రైవర్ది తప్పు అని పెద్దాయనకు క్షమాపణ చెప్పమని వాదిస్తున్నారు కొందరు, ఇదిగోతప్పు నువ్వే చేసావు మేము కళ్ళార చూసాము ఆయన తోయటం, క్రిందపడి తగలరాని చోట తగిలితె ఆ నేరం ఎవరిదీ, ఆ శిక్ష ఎవరికి పడాలి, ఆయన ఘట్టి కాయం కాబట్టి నీవు తోసిన క్రింద పడలేదు ముందు క్షమాపణ చెప్పు అని వెరొకన్నారు.
క్షమాపణ నేను ఎందుకు చెప్పాలి, అసలు ఇక్కడ ఎం జరిగిందో మీకెం తెలియదు అర్ధం చేసుకోండి అన్నాడు డ్రెవర్.
అంతలో ఒకరు ఈ కారెవరిది, ఈ కారు ఓనర్ ఎవరు చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు పిలిపిస్తాను అంటూ వేరొకరు. త్రాగి నడుపుతావా అన్నాడు మరొకడు, ముందు కారుకు గాలితీయండి అంటూ తీసారు ఒకరు, జండా కర్రలతొ కారును బాదారు మరొకరు, రాళ్ళతో కారుపై విసిరారు కొందరు, అప్పుడే గమ్పలతొ కోడి పిల్లలను అమ్ముకునేవాడు రావటం, గంపజారి క్రింద పడటం కోడిపిల్లలు చెల్లాచెదరి పోవటం వాటికోసం వేతకటానికి పరిగెత్తటం, అవకసవాదులు బాంబు పేలింది అంటూ షాపులు మూఐమ్చడం, అందుకున్న వస్తువలను దొంగతనంగా తీసుకెళ్ళడం, డ్రైవర్ని కొందరు కొట్టడం ఒక్క నిముషములో ప్రజల్లో కోపం పెరిగి ఎమ్చెస్తున్నారొ తెలియక ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా మార్చారు, ఒకే స్కూటర్ మీద ఆరుగురు ఎక్కివెగమ్గా పోతూ గోడకు గుద్దుకొని క్రింద పడ్డారు.
వ్యాఘ్రెస్వర్ మాత్రమూ నింపాదిగా బ్రహ్మనందం గారు ఇక్కడ కూర్చొని కాస్త మాట్లాడు కుందాం రండి పదినిముషాలు ఐతే పోలీసోల్లు వస్తారు అంతా సర్దు మనుగు తుంది అన్నాడు.
ఏమయ్యా ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడుట నీలాన్టి పెద్ద మనిషి
వాళ్ళ గొడవ మనమెందుకు హాయిగా ఒక జోకు చెప్పుతా నవ్వుకుందాం విను, అవునయ్యా నీకేం చెపుతావు " రోమ్ " నగరం తగలబడి ఏడుస్తుంటే గిటారి వాయిస్తూ కూర్చున్నాడుట ఎవరొ, ఇది పాత కధ కదా
పొలీసోల్లు వస్తూన్నారు మనం ఇక్కడ కూర్చున్నాము, మనజోలికిరారు, నీవెమ్ భయపడకు వాళ్ళ పని వారు చూసుకొని పోతారు.
పొలిసు వాన్ రావటం వ్యాన్ నుండి కొందరు దిగడం వ్యాఘ్రెస్వర్కు నమస్కారం చెప్పడం ఒక్కసారిగా జనాన్నిచేదర గొట్టడం నిముషములో జరిగి పోఇంది. ఇక్కడ పుకార్లు వ్యాపించకుండా జాగర్త చేయండి.
అసలే ప్రజలు ఎలాంటి వారంటే "ఒకగోర్రే ఎటుపోతే మిగతా గొర్రలు అటేపోతై " అనే సామెతలాగా మారుతారు.
పొలీసు విజిల్సుకు జనం పరుగెత్తారు, అందులో ఒకడు ఈ పొలీసోల్లు అంతా అఐపోయిన తరవాత వస్తారు
అన్నాడు, ముందు వాణ్ని ఎక్కించండి ఇట్లాంటి వారు బయట ఉంటే పుకార్లు ఎక్కిస్తారు "ఇదిగో అంటే అదిగో పులి అని భయపెడతారు " మరియు ఆ తాగుబోతు డ్రైవర్ ను కూడా ఎక్కించండి. ఎవ్వరు ఎదురు తిరిగెగితె వారిని వ్యానులో ఎక్కించండి.
ఇప్పుడు చూసావుగా ,ఒక్క త్రాగుబొతు వళ్ళ ఎంత నష్టమో,
త్రాగినవాడు ఇంట్లో ఉంటె త్రాచుపాము ఉన్నట్టే త్రాగుటకు బానిసైతే అ కుటుంబము వీధిన పడినట్టే
పిల్లల బ్రతుకు ఇష్టా రాజ్యమై, అగమ్య గోచర మఇనట్టే
పట్టుదలతో నేను త్రాగానని నిగ్రహిమ్చు కుంటే కాపురాలు బాగుపడినట్టే
కొద్దిగా గ్యాసు వాసనే కదా అని ఊరుకుంటే ఇల్లు పేలి పొఇనట్టే
చిన్నమంటే కదా అని అజాగార్తగా ఉంటె కారు చిచ్చు ఐననట్టే
అభద్దపు మాట చీనదైన, పెద్ద దిన కాపురాలుకూలి పోయినట్టే
త్రాగుడుకు బానిస ఐతే కుటుంబ గౌరవము గంగలో కలసి నట్టే
"కామానికి రావణుడు, వాలి, కీచకుడు, ఏమైనారో తెలుసుకొ !
జూదమునకు నలమహారాజు, ధర్మరాజు ఏమైనారో తెలుసుకొ!
మత్తుకు బానిసై శుక్రాచార్యులు, ఇంద్రుడు ఏమైనారో తెలుసుకొ!
వేటవల్ల దశరధుడు, పాండురాజు, ఏమైనారో తెలుసుకొ!
పలుకు ప్రల్లదనువల్ల శిశుపాలుడు, దూర్వాశుడు ఏమైనారో తెలుసుకొ!
వృధా వ్యయం చేసి రాజులు, మహారాజులు, ఏమైనారో తెలుసుకొ!
కామానికి బలి కాకుండా జీవతము సరిదిద్దుకొ !
జూదము అనేది మనస్సులోకి రానీక సంసారం సరిదిద్దుకొ !
ఇల్లు,వళ్ళు గుల్లచేసే మత్తు పానీయం త్రాగాట ఎందుకొ !
కోపముతో అనరాని మాటలు పలికి భాదపడుట ఎందుకొ !
నలుగురుకు సహాయపడుతూ జేవితం సాగించు ముందుకు !
అందుకే అందరికి నేను చెపుతాను
నవ్వుల కుటుంబమురా, చింతలేని కుటుంబమురా !
నడ మంత్రపు సిరికోసం పాకులాడకురా, నవ్వుల పాలవకురా !
నవ జీవనం గడుపరా, నవ్వుతు, నవ్విమ్చుతూ ఉండురా!
స్త్రీ లకు నవ్వులు నాలుగందాల ప్రతిభకు నిదర్సనంరా !
నవ్వుల కవ్విమ్పులతో సాగుతుందిరా, సంసార నావరా !
నవ్వులతో వెక్కిరిమ్చకురా, నవ్వినా నాపచేను పండునురా !
నవ్వులు ఆరోగ్యానికి పట్టురా, నవ్వులతో భాద దూరమగునురా !
నవ్వుల మధ్య వచ్చును నవ యవ్వనం అని మరువకురా !
నడకసాగిస్తూ నమ్ముకున్నవారిని నవ్విస్తూ నడవాలిరా !
స్త్రీలను అతిగా నవ్వించకురా ఆనందభాష్పాలు రాలునురా !
సిరిమల్లె పూవల్లె ఉండురా, చిన్నారి పాపల్లె నవ్వరా !
కన్నవారిని సవ్వులు పాలు చేయకురా, సేవిస్తూ బ్రతకరా !
నవ్వుతూ, నవ్విస్తూ, నమ్ముకున్నవారి నవరత్నాలు పంచరా !
నవ్వుతూ బ్రతకాలిరా, నవ్వుతూ చావాలిరా !
నవ్వుతూ జీవితమ్ ఆనంద డోలికల్లో మునగాలిరా
అదే జీవిత పరమానందం బ్రహ్మానందం అని గమనిమ్చురా
అంతా ప్రశాంతముగా ఉంది వచ్చినపని మరిచాను నో పార్కింగులో ఉన్న వాహనాలను గురిమ్చాలా
అంతలో వెనకొచ్చి బ్రహ్మానందం అక్కడ పడిన చెప్పులు కుడానా అన్నమాటలకు ఒకటే నవ్వు
Bagundi sir@SRINATH
రిప్లయితొలగించండిNenu ne 2 bagundi
bagundi.oka danlonumdi veroka danloki poyaru.sandarbhamu chedipotundi.kadha kadha ga undali.neetulu vere ga undali.ila jumping valana disturbing ga untundi
రిప్లయితొలగించండిbaavundi.
రిప్లయితొలగించండి