22, ఫిబ్రవరి 2014, శనివారం

114. Mythol'ogical Story-18 (ఆశ్రమము)

త్రిమూర్తులలలో ఉన్న  మహాశివుడు గుణ రహితుడు, దయామయుడు, భోలా శంకరుడు, చంద్రశేఖరుడు, గంగాధరుడు,కంట్టము చుట్టు కర్ణములపై  సర్పాలను ధరించువాడు, అగ్నిశిఖ నేత్రము కలవాడు,  సుందరమైన గజ చర్మము వస్త్రముగా ధరించు వాడు, త్రైలోక్య సారభూతుడు, నిత్యమూ శ్రీ రామ జపము చేయువాడు, కోరినవార్కి కోరిన వారాల ఇచ్చే నిత్యమూ ప్రార్ధిమ్చుతూ ఉంటే మోక్షము సిద్ధించు తుంది.అవ్యమైన కర్మలు నిస్ప్రయొజనాలు. 
                                   
                                                   


మనమందరమూ కలియుగంలో జీవిస్తున్నాము  ఏది పుణ్యమో ఏది పాపమో తెలిసికొనే పరిస్తితిలో లేము,  నా వారు బాగుంటే నాకు చ్చాలు అనుకుంటూ ఉన్నాము. నేనోక్కడ్ని లోకంలో ఏమి చేయలేను అనుకుంటాము,  అట్లా అనుకోవడం మన తప్పు కాదు, మనకున్న సమయములో మన చుట్టూ ఉన్న వారి మనస్సు నొప్పించకుండా, వారి వలన మనస్సు భాద పడకుండా ఉన్నదానిలో  ఉండటమే జివతమని భావిస్తాము. పగలంతా కష్టపడి అలసి పోతాము. కాల చక్రములో తిరుగుతూ కోర్కల వలయములో చిక్కుతూ, ఆరోగ్యమును కాపాడుకుంటూ కాలము వెల్ల పుచ్చు తుంటాము.  ఇది అంత నేనే చ్చేస్తున్నాను అనుకుంటాము, మన వెనుక ఒక దేవుడున్నాడని ఆ పరమాత్ముడే  నడిపిస్తున్నాడని అనుకునే వారెందరు.  ప్రతిఒక్కరు తెల్లవారుజామున లేచి ఇష్ట దైవాన్ని కొలిచి నిశ్చ కృత్చాలు నేరవేర్చగలరని ఆరోగ్యము చెడకుండా, ఆనందము వదలకుండా, ప్రేమే అన్నింటికి ఆధారమని భావించి, ఓర్పుతో, ఓదార్పుతో, శివనామ  జపముతో  అమృత భాష్యా లను అందరికి పంచుతూ కుటుంబాన్ని సరిదిద్ది, లోకరక్షణకు కృ షి చేయవలేనని, నిశ్చము శివ నామము, అభిషేకములు , పూజలు చేస్తూ ఉంటే మనస్సు ప్రశాంతముగా ఉంటుదని మనపెద్దలు, మునులు, ఋషులు చెప్పిన వాక్యములు నీను చెపుతున్నాను.  ఎందరో మహానుభావులు శివును గురించి కావ్వాలు గ్రంధాలు, కీర్తనలు వ్రాశారు వారి అందరికి నా పాదాభి వందనాలు. నాకు తెలిసినవి కొన్ని మీకు తెలియ పరచాలని ఇందు పొందుపరుస్తున్నాను ఇందులొఉన్న మంచిని గ్రహించి ఆ దేవదేవుని కృపకు పాత్రులవుతారని ఒక చన్న ఆశతో వ్రాస్తున్నాను.  తప్పులున్న క్షమించ గలరని వేడు కుంటున్నాను.  " ఓం నమ: శీవాయ: సిద్ధం నమ: " 
                                                           
                                                                              
                                                 
  
                                                 
లింగాష్టకమ్
బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మలభాషిత శోభితలింగమ్,
జన్మజ దు:ఖ వినాశకలింగం,  తత్ప్రణమామి సదా శివలింగమ్,.........1.
దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణా కరలింగమ్,
రావణ దర్ప  వినాశణలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  .........2.
సర్వసుగంధ  సులేపితలింగం,  భుద్దివివర్ధన కారణ లింగమ్,
సిద్ధ  సురాసుర వందితలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  ......3.      
కనకమహామణి  భూషితలింగం, ఫణిపతి వేష్టిత శోభితలింగమ్,
ధక్షసుయజ్న వినాశనలింగం,  తత్ప్రణమామి సదా శివలింగమ్,  ......4.
కుంకుమ చందన లేపితలింగం, పంకజహార సు శోభితలింగమ్,
సంచితపాప వినాశనలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  ..........5
దేవగణార్చిత సేవితలింగం, భావైర్భక్తిభిరేవచలింగమ్,
దినకరకోటి ప్రభాకరలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  ............6
అష్టదళో పరివేష్టితలింగం, సర్వ సముద్భవ  కారణ లింగం
అష్టదరిద్ర వినాశనలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  ..............7
సురగురుసురవర ఫూజితలింగం, సురవన పుష్ప  సదార్చితలింగమ్,
పరమపతిం పరమాత్మకలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,  .....8
లింగాష్టకమిదం పుణ్యం య: పఠెచ్ఛివసంన్నిధౌ,

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే,
ఇతి శ్రీ లింగాష్టకం  

                                                                                
                                                                                 
     శివాష్టకమ్
ప్రభుం ప్రాణ నాథం విభం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజాం,
భవద్భవ్య భుతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశాన మీడే.
గళే  రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాదిపాలమ్,
జటా జూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశాన మీడే.
ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మభూషధరం తమ్,
అనాదిం హ్యపారం మహామోహమారం  శివం శంకరం శంభుమీశాన మీడే.
వటాధోనివాసం మహాటాట్టహాసం మహాపాప నాశం  సదాసుప్రకాశం,
గిరీశం గణేశం సురేశం  మహేశం శివం శంకరం శంభుమీశాన మీడే..  
గిరీంద్రాత్మజానం గృహీతార్ధదేహం, గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం,
పరబ్రహ్మాది భిర్వంద్వమానం శివం శంకరం శంభుమీశాన మీడే.
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదామ్భొజనమ్రాయకామం దదానమ్,
బలీవర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశాన మీడే.
శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం,
అపర్ణా కలత్రం సదాసచ్ఛరిత్రం  శివం శంకరం శంభుమీశాన మీడే.
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం,
స్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశాన మీడే.
స్వయం య: ప్రభాతే నరస్సూల పాణే  ఫటేత్ స్తోత్ర రత్నం త్విహ ప్రాప్య్యరత్నం
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం  విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి.
ఇతి శ్రీ కృష్ణజన్మఖండే శివాష్టక స్తోత్రం సంపూర్ణం. 

                                                

అలసిపోయిన  బాటసారి చెట్టు నీడను ఆశ్ర యించినట్లు
జలప్రవాహములొ కొట్టుకుపోయేవానికి చెక్క దొరికినట్లు
పెను తుఫాను వళ్ళ  భీతి చెందినవాడు ఇంటికి చేరినట్లు    
పొరుగూరినిమ్చి వచ్చి ఆతిధి గృహస్తుని ఆశ్ర యించినట్లు
దరిద్రుడు, పండితుడు ధర్మాత్ముడైన రాజును ఆశ్ర యించినట్లు 
అంధకారములొ అలమటిమ్చేవాడు దీపాన్ని ఆశ్ర యించినట్లు
మంచుతో ఉన్న చలికి వనికేవాడు అగ్నిని సమీపిమ్చి నట్లు  
సర్వభయాలు పోగొట్టి సమస్త సుఖాలు చెకూర్చె శివపార్వతుల 
పాదపద్మాలు కడిగి ఆశ్ర యించి ప్రార్దిమ్చుతున్నాను.
                                               

భగవంతుడు, గుణరహితుడు, దయామయుడు, పసిబిడ్డ ఏడుపుకు తల్లి ఏవిధముగా తల్లడిల్లి పోతుందో అదేవిధముగా కలియుగాన్ని భక్తులను రక్షించుటకు పార్వతీ పరమేశ్వరులు తల్లడిల్లి పొతూ ఉంటారు.
ప్రార్ధన చేసినవారిని ఆదుకొని ఆనందాన్ని ప్రసాదిమ్చుతారు.

సుఖ:దుఖాలు కల్పించేది సర్వేశ్వరుడని గమనించాలి. ప్రకృతిని జీవరాసిని అనుక్షణం రక్షించేది పరమేశ్వరుడని గ్రహించాలి. మానవులు సుఖం వచ్చినప్పుడు ఆనందం పెరుగుతుంది అది భగవంతుడు కల్పిమ్చాడని గ్రహించలేరు ద:ఖం వచ్చినప్పుడు కుమిలిపొతూ కష్టాలు తొలగించమని పరమేశ్వరుడిని ప్రర్ధిమ్చటం మానవులకు సహజం.

హ్రుదయ శాంతి పొందాలంటే అరిషడ్వర్గాలను దూరమ్గా ఉంచాలి. దైవం మానవుల వెన్నంటి ఉమ్టుందని  గమనించాలి. సూర్యుడు సంచరిస్తున్నప్పుడు నీడ మారుతుమ్దిది. అదేవిధముగా మనమనస్సు కూడా  మరుతూ ఉంటుంది. చంద్రుడు సమ్చరిస్తు న్నప్పుడు చీకటిలొ వెన్నల కురిపిస్తూ ఆనందసుఖాలు అనుభవించమని, ఉదయమున చేసినవన్నీ మరచి హాయిగా నిద్రపొమ్మని ఆ భగవమ్తుడు మానవులకు  కల్పించాడు.దెవునియొక్క లీలలు ధర్మమార్గమున నడిచే భాకులు గమనించగలరు.
తనలోని జ్ఞానముతో ప్రాపంచిక సుఖాలకు అతీతముగా దైవ ప్రేరణకు కృషి చేయాలి. మనుషుల్లో దేవుడున్నాడని గుర్తించి, సమస్త సృష్టి దైవము వళ్ళ జరిగిందని గ్రహించి,  ప్రతిది దైవము వళ్ళ ఏర్పడినదని అమ్దరూ గుర్తించాలి.
మానవులయొక్క ఉన్నత స్తితిని పెంచేది, ఆరోగ్యముగా ఉంచేది, మనసు పరి పరి విధాలుగా మదన పడ కుండా ప్రతిఒక్కరిని, (కన్న బిడ్డలను కాపాడే తల్లి తండ్రులు లాగా) కాపాడే వారు ప్రార్వతి పరమేశ్వరులు ఒక్కరే .
ఈ శివరాత్రి సందర్భముగా (27-02-2014) ప్రతిఒక్కరు    ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ అని జపం చేస్తారని ఆశిస్తున్నాను.       

అనగనగా ఒక అడవిలో ఒక ఆశ్రమము ఉన్నది, దానిలో విద్యార్ధులు ధర్మము గురించి తెలుసుకుంటున్నారు.  
ఒక నాడు గురువగారు ప్రక్క గ్రామములో ఉన్న దేవాలయమునకు వెళ్ళవలసి వచ్చి అక్కడకు శిష్యులతో బయలుదేరారు. వెళ్ళేటప్పుడు జ్ఞాన భోధ శిష్యులకు చేసేవాడు.
                                                   


ప్రతిరోజూ సూర్య భగవానును చూసి ఈవిధముగ ప్రార్ధన చేసేవారు గురువుగారు " దేవా నీ అనురాగము సాటిలేనిది. మమ్మల్ని ఎప్పుడు కనిపెట్టి వుంటావు. నీ దగ్గర కృతజ్ఞత ప్రకటించటానికి నాదగ్గర మాటల్లేవు, కానీ నా మనసును నువ్వు అర్ధం చేసుకుంటావని నాకు తెలుసు అనేవాడు.

గ్ర్రామమునకు పోతున్నప్పుడు మద్యలో ఉన్న గ్రామం వారివల్ల  ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. వాళ్లకు తిండి, నీల్లు ఇవ్వకు పోగా తమ గ్రామంలో  విశ్రాంతి తీసు కోవటానికి  కూడా  వాళ్ళు అనుమతివ్వలేదు. దానివల్ల గురువు, శిష్యులు  చాలా ఇబ్బంది పడ్డారు.తిండి తినక, నీరుత్రాగక, మూడు రోజులు విశ్రాంతి లేక అమ్దరూ నీరసిమ్చి పోయారు.

గురువుగారు ఈ గ్రామములో వారు మనకి నీరు కుడా ఇవ్వకు పోవటానికి కారణమేమిటి. మనమేమి తప్పు చేసాము అడిగారు శిష్యులు.

ఇక్కడ ఎక్కువమంది బ్రాహ్మణులు నివసిమ్చుతున్నారు. వీరిలొ కొందరు శివ భక్తులు, మరికొందరు విష్ణు భక్తులు ఉన్నారు. వాదనకు దిగారు మాదేవుడు గొప్ప మాదేవుడు గొప్ప అని  వాదిమ్చు కుంటున్నారు. మనం సర్వాతర్యామి భక్తులన్న వారు నమ్మక ఆకడకు పొతే మీరు విష్ణు భక్తులు కాదు అన్నారు. ఇక్కడకు వస్తే వీరు శివభక్తులు కాదు అన్నారు. అందువల్లే మనకు మూడు రోజులనుంచి ఈకద వారు తిండి, నీరు ఆశ్రయమియ్య లేదు.

ఇక్కడ మంచివారు లేరా.

ఉన్నారు కాని వారి మంచిని గౌరవిమ్చె వారు లేరు.

మనము ఉపవాసముతో ప్రాణాలు విడుచుట ఏ కాని మరొమార్గము కానరావటము లేదు అన్నారు శిష్యులు.

ఆ పరమాత్ముడు మనల్ని ఉపవాసము చెయమన్నాడు అను కోవటం తప్ప ఏమి చేయలేము.
మరలా ఆకాశము వైపు చూసి "దేవా నీ అనురాగము సాద్తిలెనిది. మాపట్ల నీకు ఎంతో శ్రద్ధ మమ్మల్ని కనిపెట్టి ఉండటంలో  నీలొ కరుణ కదలాడుతుంది.మేము మీదయకు తగినవాల్లము కాము. నిజానికి నీపట్ల కృతజ్ఞత ప్రకటించ టానికి  నాదగ్గార మాటల్లేవు. కాని కృతజ్ఞత నిండిన నా మనసును అర్ధం చేసుకుంటావని ఆశిస్తాను.

గురువుగారి మాటలకు శిష్యులు ఆశ్చర్యము చెంది మూదు రోజులనుంచి తిండి లేక అల్లాడుతుంన్నాం, గ్రామస్తులు మనల్ని అవమానపరిచి తరిమి కొడుతున్నారు. ఈన్ని జరిగిన " దేవా మీరు దయగల వాడవని "  అన్న మాటలు ఉపసహరిమ్చు కుంటే  బాగుండు నన్నారు.

మీరట్లా అనకూడదు, నా విశ్వాసం నాది, మీ విశ్వాసం మీది.  నా విశ్వాసానికి నియమ నిభందనలు లేవు . నా కృతజ్ఞత ఎ ప్రయోజనాలను ఉద్దెసిమ్చిమ్ది కాదు. దేవుడేదో ఇచ్చాడని అయన పట్ల కృతజ్ఞత ప్రకటిస్తున్నానని  అనుకోవద్దు. నా అలవాట్లు నావి అన్నారు గురువుగారు.

దేవుడు మనకు ఈ భూమిపై ఉనికిని కల్పించాడు.  ఆయన పట్ల కృతజ్ఞత ప్రకటించ టానికి అదిచాలు.  ఎందు కంటే ఆ ఉనికి నేను కష్టపడి సాధించుకున్నది కాదు.  ఆయచితముగా వచ్చిన అదృష్టము అది.   

మనం గడిపిన ఈ మూడు రోజులు గొప్ప భక్తితో ధర్మమార్గమున ఉన్నాము, మనలో ఎటువంటి కోపము రాలేదు. ముఖ్యముగా నాలో కోపము రాలదు. ఫలితముగా నా ఉద్దేశ్యములో ఎటువంటి వ్యతిరేకత లేదు.
నా క్రుతజ్ఞతలొ ఎటువంటి మార్పు లేదు. అందలో ఈ రోజు మహాశివరాత్రి ఈ రోజు ఉపవాసముతో శివుని ఆరాధిస్తే పుణ్యము వస్తుందని పురాణాలు చెపుతున్నాయి కనుక మీరు కోపము తెచ్చుకోకుండా ఉండండి. ఆ దేవుని క్రుపకు పాత్రులు కండి అన్నడు గురువుగారు.

ఇదొక అగ్ని పరీక్ష దాన్నించి ఎట్లాంటి ఆటంకం లేకుండా నేను బయట పడ్డాను అంతకు మించి నాకేం కావాలి.
జననం లోను మరణంలోను నేను ఉనికిని సన్దర్సిస్తాను. ఇది ఆ దేవునిపై ఉన్న నాకు నమ్మకము.
ఇది పూర్తిగా వ్యక్తి గత విషయమని తలంచాలి. యదార్ధముతొ నాకున్న సన్నిహిత సంబంధం ఇక్కడ ఒక మహాసమన్వయ ముంది. మహా శాంతి ఉంది. నీను చాలా విశ్రాంతిగా ప్రశాంతముగా ఉన్నను.

దేవుడు నాకు ఇది ఇచ్చాడని ఇది ఇవ్వలేదని ఆయన పట్ల నిర్లక్ష భావముతో ఉండ కూడదు.లేచిన తర్వాత , పడుకొనేముందు కనీసము ఆ రుద్ర మూర్తిని తలుచు కొంటే మనము తెలిసి చేసిన పాపాలు తెలియకుండా చేసినపాపాలు పోతాయని నా అనుభవపూర్వకముగా చెపుతున్నాను.
ఆ మాటలకు శిష్యులు అమ్దరూ నిర్ఘాంతపోయారు.

అంతలో కొందరు మనష్యులు వచ్చి మాతప్పు తెలుసుకున్నాము " శివకేశవులు ఒక్కరే ". మా ఆతిధ్యము స్వీకరిమ్చి ఈ గ్రామంలో ఉన్న శివాలయములో పంచాక్షరి మంత్ర జపము చేస్తున్నాము మీరు మాతో కలవండి మాతప్పులు క్షమించండి.

కొందరి హృదయాలలో ఆ సర్వాంతర్యామి, అనుగ్రహమూర్తిగా, ఉగ్ర రౌద్ర మూర్తిగా,సంహార మూర్తిగా,  తాండవ మూర్తిగా, దక్షినామూర్తిగా, లింగోద్భవ మూర్తిగా,  భిక్షాటన మూర్తిగా,  అర్ధనారీస్వర మూర్తిగా, సరభ మూర్తిగా, కాలారి మూర్తిగా, కామాన్ని జైమ్చిన కామాంతక మూర్తిగా భక్తులహృదయాలలోస్తిరనివాసముగాఉన్నాడు.                                                                                              


ఓం నమ: శివాయ, ఓం నమ: శివాయ , ఓం నమ: శివాయ , ఓం నమ: శివాయ  , ఓం నమ: శివాయ .