రంజాన్ శుభా కాంక్షలు
రంజాన్ నెలలో ఉపవాస వ్రతం పాటిస్తారు, మంచి ఆలోచనలతో మంచి పనులు చేసే మాసమిది, పృథ్వి శ్రేయోదాయకముగా ఉండెందుకు, దుష్టుల ఘాటుకత్వం లేని నెలకోసం, దైవకృప దృష్టికోసం ముస్లిం మతస్తులందరు తపించే మాసమిది. సానుభూతి, త్యాగం, పరస్పర విశ్వాసం, సంఘీభావం ప్రతివొక్కరు వీడరాదని ఉద్బోదించె మాసమిది. ఉపవాసం పాటిసున్నవారు ధర్మపదం నుండి ఎప్పుడూ ఏ సమయం లోనూ తప్పుకోరాదని నియమము, నీతి మంతమైన, న్యాయ వంతమైన, ధర్మ వంతమైన ఆలోచనలతో, హృదయాన్ని ప్రకాశింప చేసి జ్ఞాణం పొందడం ప్రధానం. ఏ విషయం లో కోపం ప్రవర్తించ కుండ శాంతం వహించి ఉపవాస వ్రతం పాటిస్తున్నామని మృదువుగా చెప్పాలి కాని ప్రతిఘటించడం దోషం, ఓర్పుతో చెప్పిన విషయాన్ని విని తగిన సంమధానము చెప్పి పంపాలి.
దైవం దివ్య ఖురాన్ గ్రంధాన్ని ఈ మాసంలో అవతరింప జేశాడని చెపుతారు. మనుష్యు లందరు అన్నీ విధాల, అన్నీ కోణాలలో, సాదు స్వభావానికి, సహన గుణానికి ప్రతి రూపంగా రూపొందుతారు, అందుకే మహాప్రవక్త ముహమ్మద్ రమజాన్ సహన మాసం అన్నారు.
షాబాన్ మాసంలో అమావాస్య తరవాత కనిపించే నెలవంకను చూసిన పిమ్మట వేకువఝామున నుంచి రంజాన్ మాసం సందడి మొదలవుతుంది. నెలరోజులు గడచినా అనంతరం "షవ్వాల్ " మాసపు నెలవంకను చూడ గానె పర్వదినం జరుపు కుంటారు. ఈ పండుగను షవ్వాల్ మాసం అంటారు .
ఈ నెలరోజులు భక్తి భావాలతో, ఆనందం విరసిన హృదయాలతో జరుపుకొనే పండుగ. దైవారాధన, దానధర్మాలు, ఉపవాస వ్రతాలు, పుణ్యకార్యాలు చేస్తారు. ఉషోదయ కాలమునకు ముందే మేల్కొని నాలుగు ఇదు గంటల మధ్య అన్న పానీయాలు సేవనం పూర్తి చేస్తారు, దీనినే సహెరి అంటారు. ఇక సూర్యాస్తమయం వరకు మంచి నీరు కుడా ముట్టరు, ఇది ఒక ఖఠిన నియమం . సూర్యాస్తమయమ్ కాగానే ఉపవాస విరమణ చేస్తారు. దీన్ని "ఇస్తార్" అంటారు. ఉపవాస మాసములో రొజూ ఇదు వేళల నమాజు కాకా రాత్రి అదనంగా "తరావీ" నమాజ్ ఉంటుంది. పవిత్ర ఖురాన్ పారాయణంలో భక్తులు తన్మయులవుతారు, ప్రతి ఇల్లు సహేరి, ఇఫ్తార్ ల కొత్త శోభతో అలరారుతుంది, అందరిలోనూ సేవద్రుక్పధం, అత్మీయతా భావాలు తొణికిసలాడుతాయి.
అల్లాహుమ్మ ఇన్ని అస్తఖీరుక, బి ఇల్మిక, వ అస్తఖ్ దిరుక, బిఖుద్రతిక, వ అస్అలుక, మిన్ ఫద్లికల్ అజీమి, ఫ ఇన్నక తఖ్ దిరు వలా అఖ్ దిరు, వతఅఁలము వలా ఆలము వ అంత అల్లాముల్ గుయూబి అల్ హుమ్మ ఇన్ కుంత తఅఁలము అన్న హాదల్ అమ్రఖైరుల్ లి ఫీదీని వ మఆషీ వఆఖిబతి అమ్రీ (అవ్ ఖాల ఫీ ఆజిలి అమ్రీ, వ ఆజిలిహి) ఫఅఖ్ దుర్ హులీ, వఇన్ కుంత తఅఁలహు అన్న హాదల్ అమ్ర షర్రుల్ లి ఫీ దీని వ మఆషీ వఆఖిబతి అమ్రీ (అవ్ ఖాల ఫీ ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ) ఫస్ రిఫ్ హు అన్ని వస్ రిఫ్ నీ అన్ హు వఖ్ దుర్ లి అల్ ఖైర హైథు కాన తుమ్మ రద్దినీ బిహీ .
ఓ అల్లాహ్! నేను నీతో నీ జ్ఞానము ద్వారా మేలు కోరుకొనుచున్నాను. నీ శక్తి (ఖుదరత్) ద్వారా నేను నీతోబలం కోరుకుంటున్నాను. మరియు నేను నీ నుండి దయాదాక్షిణ్యాలు కోరుకుంటున్నాను. నీవే సర్వశక్తిగలవాడవు. నేను శక్తిహీనుణ్ణి నీవు అన్నీ తెలిసినవాడవు. నేను ఏమీ తెలియనివాడను. నీవు సకల జ్ఞానము కలవాడవు. ఓ అల్లాహ్! ఈ కార్యం ఇహపర లోకములలో సన్మార్గము మరియు మంచి ఫలితము కలుగజేయునదై ఉంటే నా కొరకు సునాయాసం చేయి. ఈ పనిలో నాకు శుభం ప్రసాదించు. ఒకవేళ ఈ పని అపమార్గము మరియు దుష్ఫలితము కలుగజేయునదైతే ఈపని నుండి నన్ను దూరం చేయి మరియు నేను ఎక్కడ ఉన్నా నా కొరకు మంచిని ప్రసాదించు మరియు నన్ను ఆ మంచిని ఇష్టపడునట్లు చేయి .
రంజాన్ మాసమంతా పవిత్ర హృదయాలతో ఖురాన్ పారాయణం చెస్తారు. దైవాన్ని స్మరిస్తారు. దీక్షగా ఉపవాసం పాటిస్తారు. ఇరవైనాలుగు గంటలు దైవంతో సాన్నిహిత్యం కలిగి త్రికరణ శుద్ధిగా ఉపవాసం చేయడం వల్ల ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. దైవాదేశం అనుసరించి దయానురాగాలు నిండిన మనసులతో పెదలకు ఫిత్రా పేరిట నిర్ణీత దానాన్ని భక్తి పూర్వకముగా అంద జెస్తారు. దీన్ని జకాత్ అంటారు. ఇది సంపన్నులకే నిర్దేశిత మైంది. దీనివల్ల బతుకులు ఛిద్రమైన పేదలకు సాంత్వన లభిస్తుంది.
ప్రతిఒక్కరు దైవభక్తితో జ్ఞాన విభవంతో తరుగులేని పుణ్యసాధనకు ఉపవాస వ్రతాన్ని రంజాన్ లో విధిగా పాటించడం ఉత్తమ సంప్రదాయం పరస్పర సౌహార్దం పెంచుకోవాలని, శాంతి విలసిల్లే జగతిని నిర్మించుకోవాలని శిక్షణ ఇవ్వడమే - రంజాన్ మాస ఉద్దేశం.
జీవితాల్ని సద్భావనలతో సహకారం, సహజీవనం వంటి ఉన్నత గుణాలతో సఫలీకృతం చేసుకొన్నప్పుడే ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయన్నది రంజాన్ సందేశం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి