7, జులై 2013, ఆదివారం

67. Gnanaamrutam-4(daily update) బుద్ధం శరణం గచ్ఛామి

                            
                                      బుద్ధం శరణం గచ్ఛామి

                శాంతంతో కోపాన్ని,సాత్వికతతో హింసను, దానంతో లోభాన్ని, ప్రేమతో ద్వేషాన్ని,సత్యంతో అనత్వాన్ని జయించండి. సర్వప్రాణులపట్ల సానుభూతి కలిగి ఉండాలి.           
              గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్దార్ధుడు.  క్రీస్తుకు పూర్వము 563లో సుద్దోదనుడు మాహామాయదేవి దంపతులకు కపిలవస్తు  సమీపంలోని లుంబిని గ్రామంలో జన్మించాడు. రాజకుటుంబములో ఉండి  కొన్ని సంవత్సరములు సకల సుఖములు అనుభవించాడు. యశోదను వివాహమాడాడు . వారికి రాహులడు అనే కుమారు డున్నాడు .    
                  ఒక సారి గౌతమ బుద్ధుడు విహారానికి వెళ్ళినప్పుడు మొదటిసారిగా వృద్ధుడిని, రోగిని, మృతదేహాన్ని చూసాడు.  మనస్సు చలించింది. వృద్ధులుగా అమ్దరూ మారుతార, అమ్దరూ రోగులుగా మారుతారా, అమ్దరూ మృత్యువులవుతారా అనే విషయాలను పదె పదె  ఆలోచించాడు. దుఖానికి కారనాన్ని వెతకాలని, ఈతిభాధలు తొలగించాలని సకల సుఖాలను, రాజ్యాన్ని, కుటుంబాన్ని త్యజించి సన్యాసిగా మారాడు.  బోధివృక్షం క్రింద కొన్ని సంవత్సరములు ధ్యానములో ఉండి శరీరము శుష్కిమ్చిన ఆస్య సిద్ధివరకు ఉంది జ్ఞానోదయంపొందాడు. ఇదే నా చివరి జన్మ అని చెప్పాడు.  సారనాద్ చేరుకొని శిష్యు లకు ధర్మభోధ చెసాడు. ఆనాటి నుండి వివిధ దేశాలు తిరిగి భౌద్ధ ధర్మ సూత్రాలు భోదించాడు. 
          ముఖ్యముగా ప్రపంచవ్యాప్తముగా ప్రతిఒక్కరు జీవిమ్చటానికి  త్రి రత్నాలు భోదించాడు.
1. బుద్ధం శరణం గచ్ఛామి  (బుద్ధి మనస్సుకు దారి చూపె  చుక్కాని)
2. ధర్మం  శరణం గచ్ఛామి (ధర్మ అనేది  మనం నడవాల్సిన మార్గం)
3. సంఘం శరణం గచ్ఛామి (మనతో పాటు జీవించే మానవ సమాజంతో కలసి మనం నడవాలి)
              బుద్ధ భగవానుడు మూదు సూత్రాలను అనుసరించాలని హితవు చెప్పాడు .
              మంచి జరిగినా పొంగి పోకుండా, చెడు జరిగినా కుంగి పోకుండా తామరాకుపై ఉండే నీటి  బొట్టులాగా ఉండాలని భోదించాడు . 
     కోరికలే ద:ఖానికి, అనర్ధానికి మూలమని, సుఖ దుఖాలు జీవితములో వస్తు పోతూ ఉంటాయని సృష్టిలో ఎదీ శాస్వితము కాదని, మనము నడిచిన  మార్గమే మనల్నిబ్రతికిమ్చునని,  ఎ జీవిని హింసించొద్దని, మనస్సును పూర్తిగా శ్వాసమీద లగ్నం చేసి  నిగ్రహ శక్తిని సంపాయించాలన్నాడు. నేను తెలుసుకొన్న కొన్ని నియమాలను ఇందు  క్లుప్తముగా పొందు పరిచాను.
       పాళీ  భాషలో బౌద్ధులు ఆచరించాల్సిన నియమాలు, విధానాలను పోమ్డుప
రిచాడు
              1. జీవహింస చేయరాదు
              2. అభద్ధం ఆడరాదు
              3. ఇతరుల ఆస్తిని ఆసిమ్చకూడదు
              4. మత్తు పానీ యాలను సేవించ రాదు
              5. అవినీతి పనులు చేయ కూడదు
              అనే పంచశీల సూత్రాలను భోదించాడు.
             నీతి నియమాలతో కూడిన అష్టాంగ మార్గాన్ని సూచిమ్చాడు.
           1. దృష్టి,  2.  సత్య సంకల్పం, 3.  సత్య వాక్కు,  4. సత్కర్మ,       

          5.సత్యజీవనం   6. సత్యయత్నం,   7. సత్య చింతనం   8. సత్య 
          లక్షణం టిని అనుసరిస్తే మనస్సు శాంతి ,ప్రేమ, బుద్ధి,  
          వివేకం పెరుగు తుందని బోధించాడు.   
              ముఖ్యముగా ఇందు వ్రాయుటకు కారణము గౌతమభుద్ధుడు జ్ఞానోదయమము పొందిన చోట ముష్కరులు బాంబులు 07-07-2013 నాడు పెట్టారు దానివలన ఎవరు చనిపోలేదు, ఇద్దరు గాయపడ్డారు, బుద్ధుని విగ్రహమునకు ఎటువంటి హాని కలుగలేదు. ప్రశాంతముగా కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో ఉన్న  బోధిసత్వుడి నిర్మల రూపమ్ మనకు గుర్తుకు వస్తుంది. క్రీస్తుకు పూర్వము 483లో కుశి  నగరంలో కాకుస్థ నదీతీరములొ బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు.
         " సంయోగాద్రవ్యమంతా నశిస్తుంది. జ్ఞానం పొందడానికి తీవ్రముగా ప్రయత్నించండి "  
                                                   
         

   17.  నువ్వు ఎక్కడ ఎలా బ్రతుకుతున్నావని ఆలోచించవద్దు.

         కర్తవ్యము స్వీకరిమ్చుము.  దీక్షతో  ధర్మమము  నిలుపు.  కర్మము కాలానికి విడువుము.  
మనము ఉదయము లేచి సాయంత్రముదాకా  శ్రమించి రాత్రికి కొంత విశ్రాంతి తీసుకొని ఉదయము యధావిధిగా విధులకు పోతూ కాలమంతా సంపాదనకు, సుఖమునకు ఖర్చు చేయు చున్నాము.
ఇసుకలో బాలలు గుజ్జనగూళ్ళు కట్టుకొని శ్రమించినంత  ఆనందం క్షణాలలో పొంది అ తదుపరి నాశనం చేసినట్లు, ఆ పరమాత్మ ఈ సృష్టిని ఇచ్చా మాత్రముగా జరుపుచూ లీలా మాత్రముగా అనంద మొందుచు అ తదుపరి ముగింప చేయును.  ఈ లోకంలో స్థిరము, శాశ్వతము, నిత్యమన్నది కన బడదు.  
               గురుభోధనలద్వారా, శ్రవణ నాడులద్వార విషయ వివర మేరిగి,  సమర్ధుల ద్వారా సందేహ నివారణ మొంది, అపార శాస్త్ర విజ్ఞానాభిలాషతో  శక్తి కొలదీ జ్ఞానమును పొంది,  అజ్ఞాణనము నుండి  బయటపడి సర్వజ్ఞు డివై  ప్రకాశించాలని,   సర్వము తెలుసుకొనుటకు కృషి చేయుటయే మానవుల లక్ష్యముగా తీసుకోవాలని నా ఆకాంక్ష.  

                  "ప్రతిభ" అనేది ఎవరి సొత్తు కాదు.  ప్రజల హృదయాలలో ఉండేవారే నిజమైన ప్రతిభావంతులు.
                 తమ అనుభవాలను, మంచి విషయములను, తోటివారితో పంచుకున్నవారు, తమ కున్నంతలో,   ఇతరులకు సహాయ పడువారు ధన్యులు అంటారు .
                 " మంచిని, సంచిని, పంచినవాడే పంచినవాడు"
  

17.  ఎ మాత్రం అవసరములేని వస్తువులను నీవిగా దాచి ఉమ్చకు
        మీ  పిల్లలను, పెంచి,  విద్యాబివృద్ధి చేయించి, కొత్త ఉపాధి కల్పించి, వివాహము చేసిన తర్వాత 
వారునీ వారు కారు.  వారిని వుండమని బలవంతము చేసిన ఫలితము తక్కువ ఉండును.
మారుతున్న కాలాననుసరించి మనము మారాలి కాని మొండి పట్టు పట్టి ఈ " రోలు రోకలి " మాతాత గారి కాలము నుండి  నుండి మాఇంటిలో ఉంది మీరు అమెరికాకు వెళ్ళేటపుడు తీసుకెల్లండి  అంటే
ఆధునిక పరికరములువఛక పాట వస్తువులు ఎవరు తీసు కేల్తారు. ఇతర దేశాల్లో ఒక దేశము నుండి  వేరొక దేశము మారేటప్పుడు అక్కడ ఉన్న వస్తువులన్నీ అక్కడే వదిలి రావాలే తప్ప విమానములో ఎక్కిమ్చుకొచ్చిన ఖర్చు,   మనం ఉన్న దేశంలో కొత్తవస్తువునే కొనవచ్చును.  
               వయసు మల్లిని వారిని పాత వస్తువుగా గుర్తిస్తూ వారిని  పోషించటానికి భాద పడుతున్నారు. వయసు మల్లిని వారిని భాద్యతగా గుర్తించి వారికి అన్ని సదుపాయాలూ చేయాలి  ఒకనాటికి వారి స్థితికి పోతామని మరువకండి. 

        ఎంతటి  మహా గ్రంధమైన చదవకపోతే, దానిలో ఉన్న జ్ఞాన సంపదను గ్రహ్మిచక  పొతే ఉన్న ఒకటే లేకున్నా ఓకటే, అది పాత పుస్తకమైపోతుంది.  చదవని వారికి ఎంత పాత దైనా అది కొత్తగా ఉంటుంది, అది గ్రహించలేక పాత వస్తువుగా గుర్తిమ్చి  బయట పారేస్తున్నారు.           కొందరు ఎంతో సంపద ఉండి ఎమీ అనుభవిమ్చరు.  ఎన్నో పుస్తకాలు ఉండి  ఒక్కటీ  చదవరు.  పూజలు చేస్తారు మనసు దైవము మీద ఉండదు.  గంధపు చెక్కల వాసన మోసిన గాడిదకు  తెలియనట్లు కొందరికి పాత వస్తువులు విలువ తెలుసికొని ఉంచుతారు,  తెలియక కొందరు పారవేస్తారు                                                                               " గంధపు చెక్కలు మోసినంత మాత్రాన గాడిదకు సుగంధము రాదు "     

18.  ఆచారములు, నమ్మకాలు అంటు అర్ధములేని పనులు చేయుకు
        మడి, ఆచారము అంటు దేవుని పూజ మేమే చేయాలంటూ కొందరు వాదనలు జరుపుతుంటారు.  వేదం చదివినవారు, వాక్ చాతుర్యము ఉన్నవారు దేవునికి పూజార్హులు అని అమ్దరూ అటు ఉంటారు.   అమ్మవారికి పూజలంటూ జంతు బలులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ప్రజల బలహీనతలను అధారము చెసుకొని కొందరు సన్యాసులు ప్రజల ధనము దొచుకొనెవిధముగా ఆచారాలు సృష్టించి ఇవే అనాదిగా ఉన్నాయి అని వాదన చేస్తున్నారు. 
               మానవునికి కష్ట సుఖాలలో, సుఖ ధుఖాలలో సుఖమే కావాలి అందరికి.  శ్రమలేకుండా ధనం రావాలి,  క్రుషి లేకుండా సుఖ సంతోషాలు అమర్చినట్లుగ జరగాలి.  అన్ని జీవితములొ వడ్డించిన విస్తరిలా ఉండాలని దేవుణ్ణి  ప్రార్దిమ్చుతారు.  మూదనమ్మకముగా రక్త తర్పణాలు, జంతు బలులు చేస్తున్నారు.   మూడ నమ్మకాలతొ, ఆచారాలతో,  కాలం  వ్యర్ధ చేస్తున్నారు.  కష్ట పడకుండా గాలిలో దీపమ్ పేట్టి  దేవుడా  నివే నాకు దీక్కు  అని మోర పెట్టు కుంటున్నారు.
               మనుష్యులు ముఖ్యముగా తన స్వీయ భాద్యతలు  నెరిగి, మంచి ప్రవర్తనలు ద్వారా ఇతరరుల దు:ఖాలలో విచారాన్ని , సుఖాలలోసుఖాన్ని, పంచుకోనేటట్లుగా ఉండాలి.  ధర్మా దర్మాలు తెలుసుకొని  స్త్రీ పురుషులు మధ్య ఎటువంటి వివాదములు లేకుండా సమ్మన ప్రతిపత్తితో చూస్తూ,  ప్రతిఒక్కరు అన్ని విషయాలలో తృప్తి పడితే అందరూ సుఖ శాంతులతో ఉండగలరు.      
 
కొందరు ప్రతిదీ  ఇట్టే  మంత్రం చదివితే అంతా అయిపోతుందని  ఎ ప్రయత్నము   చేయకుండా అంతా దేవుడి మీద భారమేసి కూర్చుంటారు.  ఆ మంత్రాల శక్తి కుడా మానవ ప్రయత్నం చెసిన వానికే  ఫలిస్తుమ్దిది.  కనుక ఎట్టి  సందర్భములో మానవ ప్రయత్నము  మానకూడదు, అందుకే  అంటారు                                                                            " మత్రాలకు చింతకాయలు రాలుతాయా?"
                                                      


  19.   అనవసరముగా ఆయుధాలను ప్రోగు చేయకు శిక్షణ ఇవ్వకు
        పొటీ  ప్రభుత్వమును నడుపుటకు తమ సొంత బలగమును పెంచుకొనుటకు, ధనవంతుల గుండెలో నిద్ర పోవుటకు, అక్రమం ఎక్కడ జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమగుటకు, వృద్దులను, స్త్రిలను అవమానిమ్చినవార్కి  ఖతిన దండన విధించుటకు, కడు బీదవారికి ఆర్ధికముగా ఆడుకొనుటకు, ఇళ్ళ యందు జరిగే ప్రతి వేడుకకు భాహుమతులిచ్చేందుకు, దేవాలయములో జర్గే పూజలకు తమవంతు సహాయముగా పండ్లు, పూలు, అందించి, అక్కడ వచ్చిన వారి రక్షణగా ఉమ్డెందుకు, అనాడు  ఆయుధాలు  ఉపయోగిమ్చారు.
             ఈ నాడు కొందరు తమ రాజకీయ స్వలాభాము కోరకు బాంబులను  తయారుచేసి  అన్యం పుణ్యం ఎరుగని అమాయకులను బలికొంటున్నారు. ఆధునిక పరికరములద్వార రిమోట్ బాంబులను తయారుచేసి అధిక జనాభా ఉన్న కూడలి యందు, ప్రజలు ఎక్కువగా సంచరించు మార్కట్ యందు, చివరికి దేవాలయములందు,  బాంబులు పెట్టి అవి పేల్చి ప్రజల భయందోలన సృష్టించి, అధికార పీఠములు కదిలించాలని కొదరు విదేశీ  శక్తులతో చేతులు కలిపి పోయేది నేనుకాదు అమాయక ప్రజల ప్రాణాలు, వారు అసలే పిరికివారు  " వారు ఒక గొఱ్ఱే  ఎటుపోతే అన్ని గొఱ్ఱేలు ఆటే పోతాయి " అన్నట్లు 
            మారణాయుధములు తయారు చేసే కమ్పెనీలు మనకు వసరమా, అణుబాంబు విస్పోట నము జరిగితే జరుగు అనర్ధము మనం గుర్తించాలి, ముక్యముగాగా గూడాచారి వ్యవస్థ చక్కగా పనిచేస్తే ఏ  ఆయుధములుతొ పనిలేదు, ఇన్ని ఎంకొంటర్లు జరుగ నవసరములేదు.
"గిడిని, గుడిలోని లింగాన్ని మింగే నాయకులకు రక్షణగా  ఆయుధాలతో  రక్షక భటులను ఉంచుతున్న ప్రభుత్వాలు ఉంటే ప్రజల్లో తిరుగుబాటుకు ఆయుధాలు సేకరించి కొన్ని దళాలుగా మారి గ్రామ రక్షణకు ముందుకు వస్తున్నారు ఇది అవసరమా?
           ధైర్యమున్నవారికి  ఎటువంటి ఆయుధముతో పనిలేదు, నీ యొక్క శ్రద్ధ, స్వయక్రుషి, నీ ఆత్మ  రక్షణకు ఆయధము అవుతుంది. మనం చేసిన మంచే అధర్మాన్ని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది " భగవత్ గీతలొ చెప్పినట్లుగా మీరు కష్ట పడండి రక్షించెవాడిని నేనున్నాను "     


20.  అనవసరమైన మాటలకన్న మౌనమే మేలు
        ఎక్కువగా మాట్లాడేవారు అభాద్దాలు చెపుతారు, శాంతి కొరకు ఎంతవరకు అవసరమో అంతవరకే కొద్దిగా మట్లాడాలి.  ఒక మనిషి యొక్క శక్తులన్నీ కూడా  వాని ఏకాగ్రత మీద ఉంటాయి. ఏకాగ్రతలో ఉన్న వ్యక్తికీ ఎమీకనబడవు, వినబడవు. అమ్తూ స్వామీ వివేకానందుడు చెప్పేవాడు.
ఒక జాలరి గాలం వేసి ఒడ్డున కూర్చొని ఉండగా అతని వద్దకు ఓకే మనిషి వచ్చి ఇదారి రామాపురం పోతుందా మరొక్కసారి రామాపురం పోతుందా అని గట్టిగా అడిగాడు, ఉలుకు పలుకు లేకుండా ఉమ్డుటవల్ల  ముందుకు నడిచాడు, గాళానికి చాప చిక్కగానే కొత్తవ్య్క్తిని బిగ్గరగా ఏమయ్యా ఇక్కడికి రా నిన్నే పిలిచేది , బిగ్గర పిలువగా ఆటను దగరకు రాగా నేను ఏకాగ్రతలో ఉన్నప్పుడు మీరు చెప్పినవ నాకు వినబడవు అని మర్యాదపూర్వకముగా చెప్పి దారివివరాలు చెప్పి పపిమ్చాడు.
             కొందరు మాటలతో కాలాన్ని తినెస్తారు. వారు చెప్పా మాటలో నితి  నిజాయితీ ఉండవు, డబ్బాలో రాయి వేసి ఊపితె వచ్చే శబ్దం లాగా చెప్పుకుమ్తూ పోతుంటారు.  అలాంటి వారితో స్నేహము చేయుట తప్పు. చేసేది శివ పూజలు దూరెది దొమ్మరి గుడిసెలు అంటారు. మాట కట్టు బడి వుండి హరిశ్చంద్రుడు, సిబి చక్రవర్తి, ధదీచి మహా పురుషులైనారు.
              పొరపాటున మాట తూలి మనకు మనమే ఆపద తెచ్చి పెట్టుకుంటాం, ఆపదను తప్పుకోలేక క్రిందా మీద పడతాం అందుకే " కొరివితో తల గోక్కున్నట్లు " అంటారు.
              మన మాట మంచి తనము, ధనము,  ఉన్నప్పుడే మనచుట్టూ చుట్టాలు స్నెహీతులు చేరుతారు, మాట తప్పిన వారి ఇంట ఎవ్వరు ఉండరు  అందుకే  " నీళ్ళున్నప్పుడే కప్పలు చెరువులో చేరతాయి "       అంటారు .    
 

21. గురువు ఇచ్చిన ఉపదేశమును మనసుతో విని పాటించాలి
      త్రిమూర్తులకన్నా, తల్లితండ్రులకన్నా గురువే గొప్ప అన్నది శాస్త్రవచనం, అందుకే గురువుకి మించి నవారు లేరని అందురు.   ఒక శిల్పి దారి వెంబడి ఉన్న రాయిని తోలచి  అందమైన దేవుని విగ్రహము చేసి శిష్యులకు తెలియ పరిచారు.  శిష్యులు ఊరి పెద్దలు కలసి దేవాలయము కట్టారు.
తల్లితండ్రుల నుండి జన్మ లభిస్తుంది, అది కేవలము భౌతిక శరీరము, గురువు వళ్ళ విద్యాభివృద్ధి కలిగి గొప్పవారగు తున్నారు.
              సుదర్సను
నె రాజుకు పుట్టిన కుమారులు దుర్మార్గులు, దుష్టులు, అట్టివారిని విష్ణుశర్మ అనే పండితుడు రాజ కుమారులకు మిత్రలాభము, మిత్ర భేదము, మరికొన్ని నీతి కధలు చెప్పి రాజనీతి పారంగాతులుగా మార్చారు.                                                                    
22. ప్రేమ ఉంటే ప్రతిదీ జయించ గాలుగుతారు
       ప్రేమద్వారా  క్రోధమును  జయించు
       శుభముద్వారా  అశుభమును జయించు
       నిస్వార్ధత ద్వారా స్వార్ధతను  జయించు
       సత్యము ద్వారా అసత్యము  జయించు

       ప్రతి మనిషి మనో చిత్త  బుద్ధులను ప్రకాశింప చేసి, ఆనంద రూపుడవటములోని అంతరార్ధాన్ని గ్రహిస్తే  ఈ నిరాశ,  నిస్పృహలు, నిర్వేదం నిన్నేడు అంటావు.   కాని మానవులు మనో భుద్ధి చిత్తాం హ కారాలు అంత రామ్తరాలలో  నిలిపే గూఢచార చర్యకు, కూలి క్రుంగి పోతున్నాడే తప్ప  సద్ధర్మ  నిరతుడు కావటములేదు.  పెడమార్గాల, నీచకృత్యాలకు  నిలయుడౌ తున్నాడే  తప్ప సద్ధర్మ నిరతుడు కావటములేదు, ప్రకాశింప లేక పోతున్నాడు .
                ప్రతి విషయము బొమ్మ బొరుసు వంటిది. కాలాను గునముఆ మన మనస్సును ఆధీనములొ ఉంచుకొని, ప్రేమించడం మొదట నేర్చు కోవాలి,  ప్రేమించటం వళ్ళ మనిషిలో ఉన్న కోపము, అహంకారము, గర్వము, పోయి భుద్ధ్మంతులుగా మారుతారు.
               వయసు పెరిగిన కొద్ది దేహములో మార్పులు వస్తూ ఉంటాయి, రోగాలు పెరుగు తుంటాయి, ఓపిక తగ్గుతుంది, చూపు తగ్గు తుంది, ఆలోచించే శక్తి తగ్గు తుంది, జ్ఞాపక శక్తి తగ్గు తుంది .
                ప్రతిఒక్కరు సత్య శోధనము, తత్వ శోధనములు, ఆనందాను భూతులను అలవోకగా ప్రేమద్వారా జయించగలరు. 
                 దరిదావులు లేనిది, చెప్పలేనిది, ఊహకందనిది, పరమ రహస్యమైనది, దీనిని నిత్యా, సత్యా, సాస్వతాన్వేషికులు "మిధ్య" అంటారు. స్త్రీ సహాయముతో పురుష ప్రయత్నము జరుగ కుండా  ఉండదు.  ఒకరికొకరు శాంత చిత్తులై, బుద్ధులు ఏకంచేసి, ఎకాగ్రతనొంది, త్రికరున శుద్ధిగా అర్ధం చేసుకొని బ్రతికేవారు నిత్య ప్రకాశ వంతులు.         
 
22.  తరుముకు వచ్చే కాష్టాలలాగా ప్రకోపించే కోపాన్ని అదుపు చేయగల వాడే నిజమైన సారధి.
        మానవులలో కోపము రాని వారు,  పౌరుషము లేనివారు,  అలుక చేయనివారు, పట్టు  పట్టని వారు, వాదనలు చేయనివారు, మూర్ఖులుగా వాదించే వారు, కామానికి లొంగని వారు ఎవరూ కానరారు . అందరు లక్షణాలు  కలవారే ఉందురు,  కేవలము కాంతి కిరణాలను పట్టు కోవాలని ప్రయత్నిమ్చేవారే,  నీడను చూసి భయపడేవారే, ఎమీ లెకపోయిన గౌరవ ప్రాతిష్టలు అంటూ గొప్పలు చెప్పేవారు.  వీరిని అదుపులో పెట్టె సారధి కావాలి. 

          మానవ సంబంధాలలో సహనానికి ముఖ్య స్థానం ఇవ్వాలి,   ప్రతికుటుంబములో కొన్ని విషయాలలో భార్య భర్తలమద్య  కోప తాపాలు పొడ సూపు తాయి,  ప్రతి ఒక్కరు ఆగ్రహం వదిలి నిగ్రహం పెంచు కోనవలెను, సమస్యలు రాకుండా కలసి మెలసి ఉండాలి.
         " ఓర్పు కలవాడు ఓరుగల్లును ఏలగడు "  అనే వాడుకలో  సామెత ఉన్నది
            ఓర్పు శాంతికి విజయానికి ఒక చక్కని బాట
            ద:ఖం వస్తే ఇంట్లో  మనసు    చికాకుల బాట
            కోపం వస్తే శాపనార్ధాలు,  బూతులు    బాట
            మొహం పెరిగితే ముందు వెనుక చూడక ఆట

   
23.  పాప పుణ్యములు మనము చేసుకొన్నవే, ఒక వ్యక్తి  రెండవ వ్యక్తిని పవిత్రునిగా చేయలేడు
        శక్తి మంతుడిలో అభిమానం, అహంకారం పాలు ఎక్కువైనపుడు కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశాన్ని కూడా ముక్కలు చేయటానికి వెనుకాడడు.  శక్తికి తో ధనము కుడా తోడైతే అతనికి ఆశకు అంతే  ఉండదు. తను చేసేదే పుణ్యమని, అడ్డు వచ్చిన వారిని తొలగిమ్చుటే న్యాయమని వాదిస్తాడు.  అటువంటి మూర్ఖునికి కాలమే చెప్పాలి  తప్ప ఎవరూ తప్పును తప్పని చెప్పలేరు.  అతనితో పాటు వుంటే కొంత ధనము వస్తుందని " నందిని పంది  అన్న, పందిని నంది అన్న" ఒప్పు కుంటారు అది లోక సహజంగా మారింది.
                
                దారిద్ర్యంలో సంతోషము అనుభవించుట ఎంత కష్టమో
                 పిసినారిలో దాన శీలత్వమ్ కలిగించడం ఎంత కష్టమో
                 రామాయణంలో రావణుని అహం తొలగించట ఎంత కష్టమో   
          శక్తి, ధనం ఉన్నవానిలో క్షమాగుణాన్ని కలిగించడం ఇంకా కష్టం

          మనసులో ఉన్న మాటను ఆ బ్రహ్మాకూడ అర్ధ చేసుకోలేడని సామెత, మూర్ఖుని పవిత్రునిగా మర్చడం కూడా  కష్టమే,  నాలుగు గోడల మధ్య నేను చీకటి వ్యాపారము చేస్తున్నాను అనుకుంటే, ఎవ్వరూ చూడ లేదనుకుంటే పొరపాటు, ఊరకనే  అన్నారా " గోడకు చేవులున్నాయని" , కొన్ని విషయాలు మనము బయటకు చెప్పక ముందె కాకమ్మ కధలు అల్లి ప్రజలను నమ్మిస్తారు, అవి కొత్త చిక్కులు తెచ్చి పెడతాయి.  అందుకే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి, దేవుడనే వాడున్నాడు అని మరువ కూడదు.  అందుకే ప్రతిఒక్కరు అంటారు " దుర్యోధనునిలో ఉన్న దురాలోచన, తన ప్రాణంతో పాటు  ఎవ్వరి ప్రాణాలు నిలుపలేదు" కాబట్టి మనం చేసే పనిలో పాపపుణ్యాలు ఉన్నాయా అని అలోచిమ్చిచి పున్య కార్యాలు చేస్తే లోకం కుటుంబం సుఖముగా ఉంటుంది