27, జులై 2013, శనివారం

71. Parent's Day (Premaamrutam-3, )

జూలై - 28 - 2013 (పేరెంట్స్ డే) తల్లి  తండ్రులకు శుభాకాంక్షలు

 
చేతులు పట్టుకొని తోలి నడక నేర్పినవారు
కంటిలో నలుక పడ్డ నాలుకతో తీసినవారు
అడిగిన వాటికి లేదన కుండా   కొన్నవారు
నాకోసం సర్వస్వం అర్పించిన జనకులు మీరే

 నాకుగుర్తుంది మా అమ్మ ఎప్పుడు అనేది కన్నయ్యా
మానాన్న ఎప్ప్పుడే అనేవాడు ముద్దుగా బడుద్ధాయి
నాన్న వీపు పెక్కి ఏనుగు ఆట ఆడిన ఆనందమాయ్
అమ్మ నాన్న నన్ను పార్కులో ఆడించిన రోజులున్నాయి   

జీవితములో ఎలా బ్రతకాలో నేర్పింది నాన్న
అనారోగ్యంలో ఉన్నప్పుడు మందు తెచ్చింది నాన్న
బ్రతుకు పాఠాలు నేర్పి మనిషిగా చేసింది నాన్న
 బంగారు బాటలో నడిచే మార్గం చూపిమ్ది నాన్న

మా అమ్మ పాడిన జోలపాట నాకు గుర్తున్నది ఇందు పొందు పరుస్తున్నాను


రావోయి రావోయి రతనాల పాపాయి, మాఇంట దీపమొయీ
మాటలొచ్చిన వేల ఈ తల్లి తండ్రులను మరువకోయీ
చిట్టి కధలు, పోట్టికధలు, వింటూ ఊకొడుతూ చిన్నారి ఓయీ
బుడి బుడి నడకల బోసి నవ్వుల గారాల బిడ్డ ఓయీ  

గోరంత నవ్వులతో కొండంత వెలుగును పంచా ఓయీ
మాయింట పుట్టి మమతలు పంచిన అపరంజి ఓయీ
అల్లరిచెస్తూ, చిరునవ్వులు నవ్వించే చిద్విలాసుడ ఓయీ
ముసిముసినవ్వులతో మనసును దోచే మొహనరూపుడ ఓయీ

ఆదిత్య హృదయానంద సత్య వ్రత ధర్మ భద్ధుడ  ఓయీ
సురులు మునులు భూసురులు దీవెనలు ఉన్నఓయీ 
కాటుకకన్నులలో వెలుగును పంచే భాను చంద్రుడఓయీ
చిరంజీవివి, జితేంద్రుడవు, అందరికి అభయ ప్రదాత ఓయీ

చిలకల గుంపును చూసి చిన్న  చిన్న పలుకులు నేర్చినా ఓయీ
పాదాలకు  కనకపు మువ్వలతో తిరుగు తుంటే ఆనంద మొయీ
చింతకాయలు వంటి జడలు గలిగి, చెవులకు జూకాల సబ్ధమొయీ
    పలు నటనలతో ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచిన బాలుడ ఓయీ   


అల్లరి చేష్టలతో, అలసి పోయి, ఆద మరచి నిద్రించ ఓయీ
ఒక్కమారు హర్షముతో, ఒక్క మారు ఏడ్పుతో ఉన్నాఓయీ
ఉదయ కిరణాలతో మేలు కొలిపే ప్రభాసుడ ఓయీ  
అందరి ఆశలు తీర్చి, ఆదు కొనే అభయుడ ఓయీ 

 
నవ జీవన కళలు తెలిపే నందుడ ఓయీ
చిత్ర విచిత్ర సంఘటనలతో కాలం గడప ఓయీ
మా మనస్సులో పరిమళాలు వెదజల్ల  ఓయీ
నీవు మా ఆశల అనురాగ ఆనంద జ్యోతి ఓయీ


అమ్మ సేవ ఇంతని చెప్పే స్తోమత నాకు లేదు
అమ్మను  వేలెత్తి  చూపిన వారు  బ్రతక లేదు
అమ్మను పూజించినవారు సంతోషము తరగదు
జనకులను పూజించినవారికి మనసు మారదు

 
ఆడకుండా అన్నీ సమకూర్చేది అమ్మ
సహనం తో సహయము చేసేది అమ్మ
తన కొచ్చిన  విద్యను  పంచేది  అమ్మ
కష్టపడి కుటుంబాన్ని సరిదిద్దేది అమ్మ  

   
అమ్మ మాకోసం నిద్రపోని రోజులెన్నో
తిండి తినక మా కోసం ఉప వాలెన్నో
మా ఆరోగ్యంకోసం దేవునికి  పూజలెన్నో  
 మా పిల్లకు కుడా ఓర్పుతో చేసిన సేవలెన్నో


అమ్మలగన్న అమ్మను కొలిచేది మా   అమ్మ
అడిగినవారికి లేదనకుండా ఇచ్చేది      అమ్మ
ఆత్మీయులను అవసరానికి ఆదుకొనేది అమ్మ
అర మరికలు లేకుండా  పలకరించేది     అమ్మ

 
అవని యందు అత్యంత పవిత్ర  మైనది     అమ్మ
అనురాగము పంచి ఆత్మీయతను పెంచేది అమ్మ
మా అందరి విద్యా, పేరు ప్రతిష్టలు, పెంచేది అమ్మ
మనిషిని బట్టి, మనసును బట్టి, మాట్లాడేది అమ్మ
 

 
మా అమ్మను అందరూ అనుకొనే వారు ఈ విధముగా

 
ఇంటి కొచ్చిన అతిధులను ఆరగింపనిదే అడుగు వేయనిచ్చేది కాదు
పండుగలలో మా అమ్మ సలహా అడగందే పొయిలోనిప్పు వెలిగేదికాదు
క్రొత్తగా పెళ్ళైన వారు మా అమ్మఆశీర్వాదం పొందందే కదిలేవారుకాదు
అమ్మొమ్మ, తాతయ్యకు, మందు లిచ్చి భర్తకు  సేవచేయని రోజు లేదు

 
అమ్మ మడికట్టు కట్టి పూజ చేస్తే దేవుడే దిగి వచ్చు నట
అమ్మ ఎంకికట్టుతో పొలం పనిచేస్తే సిరిలక్ష్మి దిగివచ్చనట
అమ్మ పడకటింట చేరితే శ్రుంగార లక్ష్మిగా మారేనట  
అమ్మ పట్టు చీరతో నడిచివెల్తే  సంతాన లక్ష్మి దిగి వచ్చెనట తల్లి తండ్రులు ఫలానా తప్పులు చేసారనే భావాన ఉండకూడదు
తల్లి తండ్రులు అదేపనిగా తిడుతున్నారని మాట అన  కూడదు
అమ్మన్నాన్నలు ఏమ్మిచ్చారని ఎప్పుడూప్రశ్నలు వేయకూడదు 
      అంతామాకు తెలుసని తల్లి తండ్రులను తక్కువ చేయ కూడదు 
అమ్మలో అందరూ అష్టలక్ష్మిలు ఉంటారని గమనించగలరు
 
ధర్మమార్గమున నడిపించి ఆదిన అక్షరమును దిద్దించిన ఆదిలక్ష్మి
అన్నార్తులకు లేదన కుండా ధాన్యమును పంచిన ధాన్య లక్ష్మి 
ప్రతివిషయమును అర్ధం చేసుకొని ధైర్యమను కల్పించే ధైర్య లక్ష్మి
కొండంత బలముగా నేనున్నానని  అందరిని ఆదు కొనే గజ లక్ష్మి

 
కొడుకులను, కూతుర్లను, సక్రమ మార్గమున పెంచిన సంతాన లక్ష్మి 
వెనుకడుగువేయకు విజయము మనదే అనిప్రోశ్చహించే  విజయలక్ష్మి
తల్లి తండ్రి గురువు అన్నీతానై మంచి బుద్ధినిచ్చి విద్యలు నేర్పేవిద్యలక్ష్మి
కుటుంబము సక్రమముగా ఉండే విధముగా  సిరులు పంచె  ధన లక్ష్మి   
   

    
 

    మా అమ్మ పాడిన జోలపాట నాకు గుర్తున్నది ఇందు పొందు పరుస్తున్నాను
 
కలత పడ వద్దు, కన్నీరు కార్చవద్దు బాబు
కమనీయమైన కలువ పూలవలె ఉండాలి బాబు
చంచల బుద్ధి వద్దు,  చపలత్వం వద్దుబాబు
చామంతి పూలవలె ఉపయోగ పడుతుండు బాబు
సత్యం లేదనివద్దు, సహాయము చేయలేదని కోవద్దుబాబు
సువాసనలు వెదజల్లే సంపెంగ పూల వలే
ఉండాలి బాబు
ఉన్నది సొంతమనుకోవద్దు, లేనిదానికోసం ఆరాట పడవద్దుబాబు
దేవునికి అలంకరించే దండలో దారం వలే ఉం
డాలి బాబు
టక్కరి బుద్ధి వద్దు, టక్కుటమారి విద్య వద్దు బాబు
పక్షులవలె సమ్చారముచెస్తూ, ధర్మాన్ని భోధిస్తూ ఉండాలి బాబు
వగల మారి వద్దకు పోవద్దు, విచ్చల విడిగా తిరగొద్దు బాబు
వరి బియ్యం దానం చేసి బీదలను ఆదు కోవాలిబాబు
రవ్వంత ఆశ వద్దు, రంకులు పెట్టే తనం వద్దు బాబు
ఆరాధనతో,  శ్రవణానందముతోరంజిల్లుతు ఉండు బాబు
సందేహము వద్దు, సమరము వద్దు, మనకు బాబు
          సమస్యలను పరిష్కరిస్తూ సమయస్పూర్తిగా ఉండాలి బాబు 

నవనీతపు మాటలు నమ్మోద్దు, నాయకుల వద్ద చేరోద్దు బాబు
నమ్ముకున్న వారిని నయవంచకులనుండి రక్షించాలి బాబు
పగలబడి నవ్వొద్దు, పగ సాధించాలని అనుకోవద్దు బాబు
పనసపండులా భార్య  పిల్లలను కాపాడు కోవాలి బాబు
ముద్దే సాస్వితమను కోవద్దు,ముందరికాళ్ళభందంఅని మరువొద్దు
బాబు ముసి ముసి నవ్వులకు మోసపోక, ప్రకృతి ననుసరించి బ్రతకాలి బాబు
తన్నవద్దు,ఎవ్వరితో తన్నులుతినవద్దు, తన్మయత్వంతోఉండ్డోద్దు
బాబు తపనతో తపించ వద్దు, తరుణి కోసం తాపత్రయ పడవద్దు బాబు
తప్పులు చేయక, తప్పులు ఎంచ కుండా, తెలివగా బ్రతకాలి బాబు
ఎక్కువ నిద్ర పొతూ, తక్కువ మాట్లాడుతూ ఉండాలి బాబు
మనసు ప్రశాంతముగా ఉంటే,  సాధించలేనిది లేనేలేదు బాబు
మన వారెవరో పరాయి వారెవరో గమనించి లోకంలో బ్రతకాలి బాబు మనసెరిగి మనిషినిబట్టి మనుగడ సాగిస్తూ శాంతముగా ఉండాలి
బాబు