4, జూన్ 2017, ఆదివారం

*విశ్వములో జీవితం -13


ॐ श्री राम - श्री मात्रेनम:




ప్రాంజలి ప్రభ - ఋణం

అర్ధం పరమార్ధం కొరకు ప్రతి ఒక్కరు కలియుగంలో తమవంతు సహాయా సహకారములు అందించుటే మానవ జన్మ సార్ధకం. దీనికి ప్రకృతి సహాయ సహకారములు అందిస్తున్నది. కాలముల బట్టి మన ప్రవర్త మార్చుకుంటూ సమయమును బట్టి ధర్మాన్ని విశదీకరించుటే మానవుల ముఖ్య లక్షణం.

ధనము, యవ్వనము, పుత్రులు, బంధువులు ఎవ్వరూ, స్థిరము గా ఉండ లేరు. స్థిరముగా ఉండేది  మనం నేర్చుకున్న విద్య మాత్రమే, మనల్ని కన్న తల్లి తండ్రులే.

ఇంద్రియ భోగ వాంఛలు మనస్సు చేసే సంకల్పాలు, వాటిని అనుసరించటం తప్ప అదుపు ప్రయత్నం చేయలేము. ఆయినప్పటికీ భగవంతునిపై ప్రేమ ఉన్నట్లయితే మన:శాంతి కలుగు తుంది. భగవంతునిపై ఒక తపన భావంతో ఉండాలి. ఎట్లాగంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు స్వదేశానికి వెళ్లాలని తపన లాగా, పెళ్లైన అమ్మాయి అత్తారింటికి వెళ్లిన పుట్టింటికి వెల్లాలని కోరిక లాగా, సముద్రము వడ్డును దాటే ప్రవహించాలని పొంగులాగా, దేవునిపై నిరంతరమూ నమ్మకంతో ముందుకు సాగాలి. జననము, మృత్యువు, ముసలి తనము రోగము తప్పవు అని తెలుసుకోవాలి.

భక్తి సాంగత్యానికి ఏడూ రకాల వ్యక్తులు మన:శాంతికి అడ్డు పడతారు.
1 . మాయావాదులు, నాస్తికులు,
2 . ఇంద్రియ భోగాలు,
3 . ఇంద్రియభోగాలంటే ఇష్టాపడేవారు,
4 . స్త్రీలు,
5 . స్త్రీలంపటులు
6 . కుహనాభక్తులు
7 . అసభ్యవ్యవహారము కలిగిన మూర్ఖులు.

మానవులుగా ఉన్న ప్రతిఒక్కరు మూడు రుణాలు తీర్చాలి.

1 . దేవతా ఋణం : యజ్ఞాలు యాగాలు, నిత్యపూజలు దేవునికి నైవేద్యాలు అభిషేకాలు చేయాలి.

2 .ఋషి ఋణం : వేదాధ్యనం, విద్యాదానం, ప్రతి ఒక్కరు చేయాలి,

3 . పితృఋణం : తల్లి తండ్రుల ఋణం తీర్చుట ప్రతి ఒక్కరి లక్ష్యం గా మారాలి 

--((*))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి