14, జూన్ 2017, బుధవారం

విశ్వములో జీవితం -25

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 
గీతా జ్ఞానం -1
మనిషి మనిషికి మధ్య తేడా ఉంటుంది, ఆ తేడా కేవలము రూపములో గాని, గుణములో గాని మాత్రమే కాదు అనేక పద్దతులలో ఉండటంవల్ల మనుషులమధ్య పోలిక గుర్తు పట్టలేము  ఒకే రూపంలో ఉండేవారు, చాలా తక్కువ కానీ భగవంతుఁడు మనుష్యులకు "26 " లక్షణాలు చూపించారు, వాటిని  బట్టి అనుకరించ మన్నారు.

1. ప్రతిఒక్కరు మొదట నిర్భయత్వం తో ఉండాలి అనగా " ఇష్టవస్తువు వియోగము, అనిష్టవస్తువు సంయోగం కలుగునని సంకట మనస్సు నందు సంభవించు పిరికితనముతో కూడిన వికారమునే "భయము"   ఆ భయము లేకుండా ప్రతిఒక్కరు బ్రతకాలి అలాగే ప్రతిష్ఠా భంగము, అవమానము, నింద, రోగము, రాజా దండనము, భూత ప్రేతములు, మరణము మొదలగు వానివలన కలుగు భయాందోళనలు ఏమాత్రము లేకుండటనే అభయం అందురు.సన్మార్గాచరణముతో భయము లేకుండా ప్రతిఒక్కరు జీవితం సాగించాలి

2. శుద్ధ సాత్విక వృత్తి అనగా "మన మనసును పాడు చేసే త్రిగుణాలలో సాత్వికగుణ పద్దతిలో నమ్ముకున్న వృత్తిని అనుకరించుట వలనే" మనసు ప్రశాంతముగా మారును.

3. సత్త్వసంశుద్ది అనగా:అంత:హకరణము నందు రాగ ద్వేషములు, హర్ష శోకములు, మమతా హంకారములు, మొహమత్సరములు, మొదలగు వికారములను నానా రకములైన కలుషిత పాపాత్మక భావములను ఏ మాత్రము లేకుండుటను అంత:కరణమూ పూర్తిగా నిర్మలమై పరిశుద్ధముగా ఉంచుటకు క్రమ పద్ధతిగా సమయాను కూలంగా నడుచు కొనవలెను. 
                     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి