15, జూన్ 2017, గురువారం

విశ్వములో జీవితం - 27

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

గీతా జ్ణానము- 3 

గురువుగారు మనం  అనేక   పుణ్యకార్యక్రమాలు ప్రత్యక్షంగా, మరికొన్ని తెలిసో తెలియకో  పాప కార్యాలు (పరోక్షంగా చీకటిలో)  చేస్తూ ఉన్నాము ఎవ్వరు  గమనించరు  కదా

అదే తప్పు నాయనా
మన కంటి చూపులో మెరుపును వేరేవారు చెపితేగాని నీవు గమనించలేవు, కంటిలోని నలక తీయాలన్నా ఒక అద్ధముకాని, మరో మనిషి గాని కావాలి, చివరికి తడి గుడ్డకాని కావాలి.,
     నీ వైపు నీవు చూడలేవు , నీ వెనుక ఏమి జరుగుతుందో తెలుపలేవు, నీ నీడను నీవు తాకలేవు కానీ మనం చేసే అన్నీ పనులకు సాక్షాలు లేరనుకోకు "14 "  మంది ఉన్నారు వారెవరంటే విను

శ్లో: ఆదిత్య చంద్రౌ అనిలో నాలాశ్చ దౌయ్రుభూమి రాపో హృదయం యమశ్చ !
     ఆహాశ్చ రారిశ్చ ఉకే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం !!

ఆ సాక్షులు ఎవరనగా 1 .సూర్యుడు 2 . చంద్రుడు, 3 .వాయువు, 4 . అగ్ని, 5 . శ్శబ్దము, 6 . భూమి, 7. ఉదకము 8 . తన హృదయము 9. యమధర్మరాజు 10. రాత్రి. 11. పగలు 12. 13. రెండు సంధ్యాకాలములు 14. ధర్మదేవత.

వీరు మానవులయొక్క మానసిక ప్రవృత్తులన్నింటిని ప్రతి క్షణ మందును పూర్తిగా పరిశీలించి తమ పుస్తకములో వ్రాసు కొందురు. సత్యము ఇలా ఉండగా కొందరు ప్రభుద్దులు చీకటిలో ఎవ్వరు లేని సమయాన చేసిన పనులను గమనించ లేదను కుంటారు, దాని ఫలితము ఈజన్మలో కాకపోయినా   మరోజన్మలో నైనా తప్పక తగ్గ శిక్ష అనుభవంచ వలసి ఉంటుంది.

కనుక ప్రతిఒక్కరు  మీ పనులను త్రికరణ శుద్ధిగా చేసుకుంటే మీపేరు సులభంగానే మహాత్ముల వరుసలో ఉంటుంది.         
            
చూడు నాయనా అన్నీ విద్యలు అందరికి అబ్బవు, ఎదుకంటే ఎవరు చేసిన పాప పుణ్యాల ఫలితము వళ్ళ భూమి మీద పుడతారు. కులవృత్తి వదలకుండా ధర్మకార్యములు చేస్తూ జీవితం గడపాలి. 
నేను చెప్పే ఈ నాలుగు మాటలు గుర్తుపెట్టుకొని అనుసరించు.      

"ఎంత బరువైనను  మోయగల  వానికి  బరువనేది  ఉండదు,   శ్రద్దగా భూమి వ్యవసాయం చేసుకొనే వానికి దూర మనేది ఉండదు,  ఇట్లే మంచి విద్య గలవానికి విదేశ మనేది ఉండదు, ప్రియంగా మాటలాడు వానికి పరుడు అనే మాట ఉండదు".

మంచి పనిని గాని, చెడ్డ పనిని గాని,  చేసేవాడును, ఆ పనిని చేయిన్చేవాడును,  ఆపనిని చేయుటకై ప్రేరేపించే వాడును, ఆపనిని అంగీకరించు వాడును ఈ నలుగురు ఆపని వలన గలిగిన పుణ్య పాపములలో సమాన వాటా దారులగుదురు. కనుక మనం మనపూర్వీకులు తల్లితండ్రులు నేర్పిన విద్య ఆధారముగా బ్రతికి బ్రతికించుట అనే ఉద్దేశ్యంగా ఉండాలనేది నాకోరిక
ధర్మానికి ఖర్చుపెట్టా లంటూ
న్యాయాన్ని నిలబెట్టా లంటూ
సత్యాన్ని బతికించా లంటూ
తన చుట్టూ తిప్పు కుంటూ
లోకాలన్నీ తిరుగుతూ ఉంటూ
బ్రతికి బ్రతికించాలనేది పచ్చనోటు       
అలాగే గురువుగారు మీరు చెప్పినవి అనుకరిస్తాము అని లేచారు శిష్యులు.  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి