ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
గీతాజ్ఞానం
స్పృహ అనేది మానవాభ్యుదయానికి అవసరమ్, సమయ సందర్భాలను గమనించి కాలమాన ప్రకారముగా కలియుగంలో జీవించాలంటే మొక్క ఎదిగినట్లుగా ఎదుగుతూ నలుగురికి సహాయపడే గుణముతో జీవించాలనే లక్షణం ప్రతి ఒక్కరిలో జీవం పోసుకోవాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ విని ధర్మ మార్గాన నడుచు కోవటం వళ్ళనే అసలైన జీవితం కనబడుతుంది.
శ్రద్ధ అనేది పుట్టుకతోనే వస్తుంది, తల్లి తండ్రుల లక్షణాల బట్టి కొంత మారుతుంది. దానికి తోడు స్నేహభావం మనలో ఏర్పడి తెలుసు కోవలసిన కొన్ని విషయాలు తెలుసు కొనుటలో కూడా శ్రద్ధ వహించ గలరు, ఇది ఒకరు నేర్పరు, స్వయంగా తెలుసుకొని అందులో ఉన్న మంచిని గ్రహించుటకు నిగ్రహ శక్తి ఉపయోగించి ముందుకు పొతే, జరగబోయే విషయాలు కూడా శ్రద్ద వళ్ల గ్రహించ గల శక్తి ఏర్పడుతుంది.
అందుకే ఆనాడు రామచంద్రుడు భార్యాన్వేషణకు హనుమంతునిలో ఉన్న శ్రద్ధను గ్రహించి అంగులీకము ఇవ్వడమ్, తగు విధముగా హనుమంతుడు సహకరించటం మనం తెలుసుకోగలిగాము.
ఒక సర్కస్ కంపెనీ వాడు జంతువులను ఆడించాలంటే ఎంతో శ్రద్ద, ఓర్పు వహిస్తేనే అవి వినటం జరుగుతుంది, మత్సకారుడు సముద్రముమీద వేట సాగించాలంటే శ్రద్ధతో కెరటాల బట్టి పడవను నడుపుతూ వేట సాగించగలడు, ఇదేవిధముగా ఎంతో మంది శ్రద్ధగా చదివి దేశ సేవకోసం ప్రాణాలు అర్పించినవారు, సహకారం అందిస్తున్నవారు ఉన్నారు. నాలుగు దశలు మారిన తరవాతే సీతాకోక చిలుకగా మారుతుంది. అట్లే శ్రద్ధ వహించిన వానికి జ్ఞానాభివృద్ది కలుగుతుంది.
శ్రద్దగా చదువుకున్న విద్యార్థికి విద్య వినయమును ఇచ్చును,ఆ వినయము వలన అతడు మంచి యోగ్యత అనగా అర్హత గలవాడు అగును, ఇట్టి పాత్రత వలన ధనము లభించును, ఆధనము వలన బుద్ధియును ఆవిద్యార్దికి కలుగును. దీనికి సరిఅయిన తెలుగు పద్యమిది
విద్యయొసగును వినయంబు వినయమునను
బడయ పాత్రత పాత్రతవలన ధనము
ధనము వలనను ధర్మంబు దానివలన
ఐహికాముష్మికసుఖంబు లందు నరుడు
శ్రద్ధ కలవాడు, ముసలితనము లేనివానివలెను, చావులేని వానివలెను భావించి క్రమంగా విద్యా ధనములను ఉన్నట్లు మలచి వీలున్నంత తొందర్లో తన ధర్మకార్యములను అనగా తనకు శ్రేయస్సును కలిగించే మంచి పనులను పూర్తి చేసుకొనగలడు. శ్రద్ధకు మించిన మరో ఆభరణము లేదు, సమయాన్ని సద్విని యోగం చేసుకొనే శక్తి శ్రద్దకే ఉన్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి