7, జూన్ 2017, బుధవారం

విశ్వం లో జీవితం -17


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

వృద్ధాప్యం.

వయసుకు వస్తుంది వుద్ధాప్యం మనసుకు మాత్రం రాదు, మనసు మమతలను పంచుకోమంటుంది, అనుభవాలను తెలపాలని ఉబలాట పడుతుంది. బాబు బాగున్నావా అని మనవడిని అడిగితె, ఎం తాత ఎం క్కావాలి.     

కళ్ళు కనబడుట లేదా కళ్ళ జోడు తెచ్చి ఇవ్వమంటావా, కాళ్లకు చెప్పులు తెచ్చి ఇవ్వమంటావా, చేతికి కర్ర తెచ్చి ఇవ్వమంటావా, గొడుగు కూడా తెచ్చి ఇవ్వమంటావా, మంచినీళ్ల మరిచెంబు తెచ్చి ఇవ్వమంటావా, ఏమీ వద్దంటే పడక కుర్చీ తెచ్చి ఇస్తా, దానిపై బల్ల కూడా తెచ్చి ఇస్తా, పాపరు, పుస్తకము, కలము తెచ్చి ఇస్తా మమ్మల్ని మాత్రం ఇంకేమి అడుగుకు తాతా అంటాడు కొంటె మనవడు.           

నిండా పది నిండా లేదు వయసు, ఎంతో పెద్ద మాటలు చిన్న పిల్లల నుండి వినవలసి వయసు
ఇదా.

వృద్ధాప్యం ఒక మజిలీ. స్నేహితులతో కాలక్షేపం చేసి లోకాభిరామాయణము విని, కొంత సేపు కూర్చొని, నడిచి నెమ్మదిగా మనసులోని భావాలను పంచుకొని భార్యవద్దకు చేరి ఈరోజు అంతా  ప్రసాన్తముగా జరిగి పోయింది కాళ్లు కడుక్కుంటు ఒక నిట్టుర్పు విడిచి, చెప్పులు మూల విడిచి, కాఫీ ఇస్తావా ఓ శ్రీమతి అని పిలిచి, నాకు నీవు నీకు నేను, అంటూ సంబరపడటమే వృద్ధాప్యం.

మనవుడు తాత వద్దకు వచ్చి నాకు మంచి మాటలు చెపుతావా అని అడిగాడు. మన మనసు మంచిగా ఉంచుకుంటే ప్రతి మాట మంచిగా వినబడుతుంది. మన మనసు ఆలోచనలతో తిరుగుతూ ఉంటె ఎవరు ఏమి చె ప్పిన బుర్రకు ఎక్కదు, అయినా చెపుతాను విను అన్నాడు తాత.

అభయం అందుకో - ఆదుర్దా తగ్గించుకో
అహాన్ని  వదులుకో - ఆశయం నిలుపుకో
ఇష్టాన్ని పంచుకో  - ఈశ్వరుని తలచుకో
ఉదయాన్ని వేడుకో - ఊహల్లో కలుసుకో

ఋణమే టిఇర్చుకో - ఏకమై ఏలుకో
ఒక్కడై తెలుసుకో - ఓర్పుతో మసలుకో  
కళనే నమ్ముకో - గళాన్ని వాడుకో
చపలం వదులుకో - జగడం మానుకో

టక్కరి మానుకో - డబ్బాశ వదులుకో
నడక నేర్చుకో  - నమ్మకాన్ని పెంచుకో 
తప్పులు దిద్దుకో - ధర్మాలు తెలుసుకో
మనసు పంచుకో - బలం పెంచుకో

అట్లాగే తాతయ్య అంటూ వెళ్లి పోయాడు.
             
వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు వృద్ధాప్యం..