ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ఒకప్పుడు - ఇప్పుడు
ఒకప్పుడు చదవని వారిని గుంజిళ్ళు తీయించేవారు, గోడ కుర్చీలు వేయించేవారు, పేను బెత్తాలతో ,వీపులు వాచేవి,
గురువులతో ఇంకా కొట్టండి మా పిల్లలకు చదువు రావాలి అనేవారు తల్లి తండ్రులు.
ఇప్పుడు
చదువును కొనుక్కొనే పద్దతి వచ్చింది, డబ్బు కడుతున్నాము కదా దెబ్బ పడకుండా
చదువు రావాలి అనే తల్లి తండ్రులు ఉన్నారు, చదువు రాకపోయినా పర్వాలేదు
ట్యూషన్ క్లాసుల్లో కూర్చోబెట్టండి అంటున్నారు. ఇప్పుడు గురువులు పరిస్థితి
అగమ్య గోచరంగా మారింది, ఎందు కనగా దృశ్య, శ్రవణాల ద్వారా చూపించటం
జరుగుతున్నది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు పంగనామా పెట్టె పరిస్థితి వచ్చింది.
ఇటువంటి విద్యా భోధన అవసరమా ?
ఒకప్పుడు
నిస్సహాయునకు సహాయము చేసేవారు, ఇప్పుడు ఎవరికన్నా సహాయము చేద్దామంటే
అడిగేవారు కనిపించుటలేదు, అందరు మేధావులుగా మారుతున్నారు, సహాయం పొందినవారు
మరచిపోతున్నారు, చేసినవారు అడగలేక నోరు మూసుకుంటున్నారు ఈ పరిస్థితి ఎందు కొచ్చిందంటే ధన ప్రభావము పెరుగుట వలన అనేది నిజమేనా ?
ఒకప్పుడు
తెలివికి బలానికి వచ్చేది గెలుపు, ఇప్పుడు ప్రక్కవాడిని మోసం చేసో,
అధికారులు డబ్బు ఆశకు లొంగి పోయి, అనర్హతలను అందలం ఎక్కించే పరిస్థితి
ఉన్నది ఎందుకో చెప్పగలరా ?
ఒకప్పుడు పిల్లలకు చెప్పే పాఠం మనకన్నా పెద్దవారివద్ద నేర్చుకోండి అనే పాఠం అనేవారు, ఇప్పుడు పిల్లలకు చెప్పే పాఠం నీ పక్క పిల్లవాడు జాగర్త, ఆ పక్క వాడు బాగా తెలివి మీరాడు జాగ్రత్త అని చెప్పే గుణ పాఠం. పిల్లలు పాఠాలు వినక సెల్ ల్లో ఆడినా, పిల్లలను ఏమీ అన కూడని పరిస్థితి ఉపాద్యాలకు ఏర్పడినది.
ఒకప్పుడు
లేనివాడు ఉన్నవాడిని దోచుకొనేవాడు, ఉన్నవాడిగా బ్రతకాలని కష్టపడేవాడు.
ఇపుడు ఉన్నవాడు లేనివాడ్ని చులకన చేయటం, నేనే ఇంత వాడ్ని అగుటకు ఎంతో
కష్టపడ్డాను కడుఁ కధలుగా చెపుతాడు, వాడు ఎలా సంపాదించాడో అందరికీ తెలుసు
కానీ నోరువిప్పలేని పరిస్థితి అది ఎందుకో మీరేచెప్పగలరా?
,
ఒకప్పుడు మనం అనే భావన ఏర్పడి ప్రేమ పరిగేది, ఇప్పుడు ప్రేమగా పిలిస్తే నాకేంటి లాభం, లాభం లేనిచోట ప్రేమ కురిపించటం వ్యర్థం, సమయం వ్యర్ధపరచడం అనవసరం. డబ్బు ఉన్నచోట ఒకరకమైన ప్రేమ, డబ్బు లేని చోట మరో రకమైన ప్రేమ ఇదేమి లోకం ?
ఒకప్పుడు నులక మంచమే సుఖ నిద్రకు తార్కాణం ఎందుకంటే ఒకరిమీద ఒకరికి నమ్మకమైన ప్రేమ ఉండేది, ఇప్పుడు రకరకాల పరుపులు మీద శయనించిన నిద్రరాని పరిస్థితి ఎందుకంటే శారీరానికి కష్టం కలుగట లేదు, సాధ్యముకాని, నమ్మకము లేని ఆలోచనలతో ఉండటం వల్లనే, కాలం మారుతున్న ఆశలు పెరుగుటవల్లా సంపాదన పెరుగుటవల్లా అప్పులు పెరుగుటవల్లా జీవితం దుర్భరంగా మారుతున్నది.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే బీదవాడు బీదవాడే, ధనవంతుడు ధనవంతుడే , ఎవరి స్నేహం వారిది, ఎవరి ప్రేమ వారిది తారతమ్యం మారేదెప్పుడు, వారు వీరయ్యేదెప్పుడు వీరు వారయ్యేదెప్పుడు లోకంలో మార్పుకోసం వేచి ఉండేటంతప్ప ఏమీ చేయలేని మధ్యతరగతి మానవులం ఒకప్పుడు ఇప్పుడు మారలేదు ఎందుకు ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి