8, జూన్ 2017, గురువారం

విశ్వములో జీవితం-18

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
 
మహిళ

మహిళలు మహారాణులన్నారు ఒక కవి, మహిళలు మంద మతిని కూడా మహాన్నత వ్యకిగ మార్చే శక్తి మహిళల కున్నదని అంటాడు ఈ కవి. పుడమి తల్లికి ఉన్న ఓర్పు ప్రతి మహిళ యందు అంతర్గతముగా ఉంటుంది, బ్రహ్మాండ లోకాన్ని ఎలే శక్తి ఆదిపరాశక్తికి ఉన్నట్లు సంసారాలను సక్రమ మార్గంలో పెట్టే శక్తి మహిళా మనులకే ఉన్నది.

వీణాది సాధనముల యొక్క రూప సౌందర్యములను తంతువులను మీటుచూ పాడెడి  నైపుణ్యమున్న పాటను వినునట్టి ప్రజలను రంజింప చేయును.
పుష్పము వికసించి పరిమళాలను వెదజల్లగా వాటిని ఆస్వాదించి ఆనంద సౌరభాలల్లో ప్రజలు మునిగి పోయెదరు.
చిరు జళ్లుల్లో తడిసి, తెలియని తన్మయత్వం పొంది, అగ్ని కోసం తపించి ప్రకృతిలో నివసించే ప్రజలు ఆనందంలో మునిగి పోయెదరు.            
మహిళళ యొక్క  మనస్సు దేహాది సర్వవిషయములందును అనురాగము కల్పించి, తాడుచే  పశువులను భంధించినట్లుగా రాగమని పాశముతో భందించి వేయును.
వాయువుచే రప్పించ బడిన మేఘము మరలా వాయువుచే నెట్టవేయబడి నట్లుగా మనస్సుతో బంధించిన మహిళలు మరలా ఆ మహిళలే మనస్సును కించపరిచే విధముగా ప్రవర్తించుదురు.
దానిని ప్రేమ అనుకోన వలెణా ? మగవారిపై అనుమానం అను కోవలెణా?, మగవాని బుద్దిని బట్టి అలా ప్రవర్తించుట వల్లనా ? సంసారము చక్కబెట్టుటకు మహిళలకు పూర్తి స్వాత్రంత్రము ఇవ్వటం జరుగుతున్నందువల్లానా? .   

నూతిలో కప్పు నీలల్లో ఉన్న నాచును తిని ఇదే ఆహారము అని సంతృప్తి పడేది. అట్లాగే భర్త సంపాదనమీద భార్యలు ఆధారపడేవారు ఒకనాడు, ఈనాడు మహిళలు విద్యనభ్యసించి ఉన్నత పదవులను స్వీకరించి మగవాళ్లతో సమానముగా కష్టబడు తున్నారు. కానీ ఇంటి యందు ఉద్యోగము నందు మహిళలే ఎక్కవ కష్ట బడాల్సిన పరిస్థితి వస్తున్నది ఇది అవసరమా ?
          
ప్రతిఒక్కరు లోకవాసనకు, దేహ వాసనకు, శాస్త్ర వాసనకు కట్టు బడి ఉంటారు. "ధన వనితాది విషయము లందు రాగము, స్వగుణ ప్రకటన మందు ప్రీతి, పరగుణ విషయమున ద్వేషము నను నీ మొదలగునవి లోకవాసన యనబడును. దేహము నందు రాగ పూర్వకమగు పోషణాసక్తి దేహవాసన యగును. శాస్త్రాలను పఠించి అదేవిధముగా ప్రవర్తించి, అనుకరించి, మసలు కొనేదే శాస్త్ర వాసన అనబడును. సంసారము చక్క బరుచుటకు మహిళలు లోకాన్ని గ్రహించుట, దేహాన్ని అర్పించుట  శాస్త్రాన్ని అనుకరించుట, సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని రక్షించుటకు మహిళలు ఉన్నతోన్నతులు గా వెలసిల్లి మగవానికి చేదోడుగా ఉండుట భారతీయులకు వెన్నతో నేర్పిన విద్య.