2, జూన్ 2017, శుక్రవారం

విశ్వములో జీవితం -10



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 

కాలం మారుతున్నదా ?

కాలం మారుతున్నది, తెలివిగల వారు ఎక్కువగా కనబడు తున్నారు, అసలు తెలివి లేని వారెవరో తెలియుట లేదు, ఎవరిని కదిలించిన అందరు సలహా లిచ్చే వారే.

మౌన ముని అని ప్రచారం పొందిన ఒక స్వామీజీ ఒక ఉరి కొచ్చాడు అతని అందరితో చేతులు ఊపుతూ, కాగితము మీద వ్రాసి మరీ ఇస్తున్నాడు, ఆ ప్రకారముగా నడుచుకో మంటున్నాడు.
శిష్యుడు వచ్చి పందెం కాసాను " మిమ్మల్ని మాట్లాస్తానని" పలికాడు.          
దానికి ఆయన సమాధానం -
“ఓడిపోయావు!” అన్నాడు.

శిష్యుడు నేను ఎందుకు బ్రతికున్నానో  తెలుసా , మీరు నోరు విప్పి మాట్లాడుట  వళ్ళ .....      
బహు మానం గెలవటం వళ్ళ ......

అదే  రాష్టం లో కరువొచ్చింది అప్పడు శిష్యులతో గురువు చెప్పాడు, ఈ మూడు నెలలు మనం దేశాటన చేసి వద్దాం అన్నాడు. శిష్యులందరు కలసి భిక్షాటనకు బయలు దేరారు. అప్పుడే ఒకతను మీరు భిక్ష తిచ్చేదాకా కరువు ఆగుతుందా అని అడిగాడు.
అందరితో పాటు మేము బాధ పడకుండా, మరెవ్వరు బాధపడ కుండా ఉండేందుకే యజ్ఞాలు చేసేందుకు ప్రయాణ మవుతున్నాము ప్రక్క రాష్టాలకు,  స్వామీజీ మాటలకూ నోరు ఎత్త లేక పోయారు
ఇది కలి మాయ అని గొణుక్కున్నారు.   
       
“కర్త, కర్మ, క్రియ’లకు ఏదైనా మంచి ఉదాహరణ చెప్పండి?” అనడిగాడు గురువు శిష్యులతో.
 దానికి ఒక గడుగ్గాయి శిష్యుడు ఇలా చెప్పాడు సమాధానం:

“మీరు పాఠం సరిగా చెప్పడం లేదు.“ - ఇందులో “మీరు” కర్త.
“చెప్పకపోవడం” మా ‘ఖర్మ.’
సరైన గురువు మరొకర్ని వెతుక్కోవడం అనేది మేం చేసుకోవలసిన క్రియ.”

స్వామీజీ తో శిష్యుడు ఇప్పుడు పులి వస్తే మీరు ఏమి చేస్తారు? అని అడిగాడు. మీకు నమ్మకం కలగాలంటే ఏమి చేయాలి? అని అడిగాడు గురువు . 
ఆ పులి నోట్లో మీరు తల పెట్టాలి అన్నాడు.
పులి ఎక్కడ నుండి పట్టుకొస్తావు ? అని అడిగాడు గురువు.   
ఇప్పుడే సర్కస్ నుండి పులి తెస్తాను ? అని అన్నాడు, 
చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను
సమాధానము చెప్పండి ? 
పులి నోట్లో తలపెడితే ఏమైనా అయితే ఎలా ? 
 
చెప్పఁద విను మనెను 
నేను ఏమి అయినను నీవు మాత్రం గురువు కాలేవు అన్నాడు.
గురువుగారిని పరీక్ష పెట్టేందు ప్రయత్నం చేయకు, నీలో ఉన్నది నలుగురికి భోదించుము. ఆశకు పోయి ఉన్న విద్యను దుర్వినియోగము చేసావనుకో సర్వ నాశనమై పోతావు అన్నాడు.          
ఒక్క మాట ఆటో ఇటో అయినా మన బతుకు ప్రస్నార్ధకముగా మారుతుంది అన్నాడు గురువు .
శిష్యుడు గురువు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరాడు.
ఇది కలియుగం "స్వామీజీలకు లోటులేదు, భక్తులకు స్వామీజీలే తోడు".  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి